17, డిసెంబర్ 2011, శనివారం

తెలుగులో ఇంగ్లీష్ పాట

మా తమ్ముడు రాధా కృష్ణ (క్లిక్) ఒక పాట నాకు తెలుసేమో అని పంపాడు. మెయిలు లో తెలుగులో ఇంగ్లీష్ పాట అని  చెప్పటం జరిగింది. తెలుగులో ఇంగ్లీష్ పాటా! ఆశ్చర్యంగా ఉన్నదే అని విన్నాను. చూస్తె పాటంతా ఇంగ్లీషే. కాని  తెలుగు/అరవ యాసలో ఉన్నది. నాకు గుర్తున్నంత వరకూ ఇది మన విలక్షణ నటుడు నాగభూషణం  తీసిన సినిమా నాటకాల రాయుడులో అని అనుకుంటున్నాను.

సరే ఆకాశవాణి వాళ్లకి కూడా అనుమాన నివృత్తి చేసే శ్యాం ఉన్నారు అని ఆయనకీ ఈ పాట పంపాను. కాని శ్యాంనారాయణ  కి కూడా ఈ పాట వివరాలు తెలియదు.

ఈ కింది ఇచ్చిన ప్లేయర్లో తెలుగులో  ఇంగ్లీష్ పాట వినండి.


సరే పాట విన్నారుకదా!  ఈ పాట ఏ సినిమాలోది, ఎవరు పాడారు, ఆ సినిమాలో ఇంగ్లీష్ పాట పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది. ఈ విశేషాలన్నీ ఇలా బ్లాగులో అందరితో పంచుకుంటే తెలిసే అవకాశం ఉన్నదని ఇక్కడ ఇచ్చాను. 

మనకొచ్చిన సమస్యే మరేవరికన్నా వచ్చిందా? అని చూస్తె ఒక బ్లాగ్ దొరికింది టెక్ లవర్స్ బ్లాగ్  అందులో ఇలా తెలియని పాటలను చూసి పాట వివరాలు తెలిపే ఒక వెబ్ సైట్ గురించి వివరించారు. ఆ వెబ్ లోకి మనకు తెలియని ఒక పాటను అప్లోడ్ (నిమిషానికి మించి పాటను తీసుకోదు)ఆ వెబ్ సైటులో ఉన్న ఇతర సభ్యులు విని  పాట వివరాలు తెలుపుతారట. ఆ వెబ్ లోకి కూడా అప్లోడ్ చేసాను. 

మొత్తానికి పైన  ఇచ్చిన పాట ఎక్కడిదో తెలిస్తే సంతోషం! 

మనకు తెలియని పాటల గురించి తెలుసుకోవాలంటే ఈ కింది లింకు నొక్కి ఆ వెబ్ సైటు చూడటం తప్పనిసరి. 

4 వ్యాఖ్యలు:

 1. శివ గారు,
  అక్కినేని నాగేశ్వరరావు,వైజయంతిమాల నటించిన అరవ సినిమా ఒకటుంది. దాని పేరు 'అతిశయపెణ్' అని గుర్తు. ఈ (తెలుగు?) పాట అందులోదేమోననిపిస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. దుర్గాప్రసాద్ గారూ,

  మీ సమాచారానికి ధన్యవాదాలు. మీరు చెప్పిన సినిమాకి మాతృక హిందీ సినిమా. అందులో కిషోర్ పాడిన కోతిపాట ఒకటి "ఇన-బిన-డిక....." లోకప్రసిధ్ధం. మీరు చెప్పిన అరవ సినిమా వివరాలు చూశాను కాని, ఆ సినిమా పాటల్లో మనం వెతికె పాట లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. గాయకుని గొంతు దివంగత హాస్యనటుడు కె.వి.చలందిలా వుంది. బాణీ కూడా 'వివాహ భొజనంబు ' ను తలపిస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ లింకు లో ఆ పాట వినండి. ఇదే అనుకుంటా. On a hot summer morning A girl went to walking-SPB- the song was featured in SOTD earlier (Raani Yaar Kuzhandai,Music by TV Raju, 1972)

  ఈ విషయం ఈ లంకె http://tfmpage.com/forum/29038.6859.02.29.28.html లో చెప్పారు చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.