ఈ ఈనాడు రోజున పేపరు తియ్యగానే, ఆకర్షించిన వార్త, రిజర్వ్ బాంక్ గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు కాలినడకన తిరుపతి చేరుకొని సామాన్య భక్తునిగా అందరితోపాటుగా లైనులో నుంచుని దైవ దర్శనం చేసుకున్నారని. చాలా సంతోషం వేసింది.
ఈయన్ను ఆదర్శంగా తీసుకుని, ఇతర పెద్దలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, తాము తిరుమల సందర్శించినప్పుడు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలిగించకుండా తమను తాము నియంత్రించుకుంటే, ఎంతయినా బాగుంటుంది.
ఈయన్ను ఆదర్శంగా తీసుకుని, ఇతర పెద్దలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, తాము తిరుమల సందర్శించినప్పుడు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలిగించకుండా తమను తాము నియంత్రించుకుంటే, ఎంతయినా బాగుంటుంది.
శభాష్ దువ్వూరి సుబ్బారావు గారూ. ఒక మంచి ఆదర్శంగా నిలిచారు
తిరుమల తిరుపతిలో సామాన్య భక్తులు పడుతున్న పాట్లు గురించి మునుపు వ్రాసిన వ్యాసం ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు:
ఆ బూట్లు తీసేశి ఉంటే ఇంకా బాగుండేది.
రిప్లయితొలగించండిఆర్ బి ఐ గవర్నర్ అయ్యి ఉండి, సెంట్రల్ మినిస్టర్ హోదా కలిగి ఉండి కూడా, మామూలు మనలాంటి సామాన్యుడిలాగ దువ్వూరి వారు తిరుమలలో ప్రవర్తించిన తీరు నాకు ఎంతో నచ్చింది.అందుకనే శభాష్ అని అభినందించాను. మెట్లు బూట్లతో ఎక్కారు వంటి అతి చిన్న విషయం నేను పట్టించుకోలేదు.
రిప్లయితొలగించండి------------------------------------------------
బీన్ సినిమాలో, అతనికి ఒక బొమ్మ చూపిస్తారు. అతను ఆ బొమ్మ దగ్గరకు వెళ్ళి, ఆ బొమ్మ ఫ్రేం మీద గోటితో మీటి, "నైస్ ఫ్రేం" అంటాడు. బొమ్మ గొప్పతనం గురించి మాట్టాడడు.
Very much appreciable act of the Governor of Reserve Bank!
రిప్లయితొలగించండిMay not be feesible for other central ministers with heavy బాడీస్, and bodygaurds!
cheers
zilebi.
శివ రామ ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిఈ వార్త చూసి నాకూ సంతోషం వేసిందండి! కొండ మీద జరిగే శతకోటి అపభ్రంశపు పనుల కంటే షూలు వేసుకుని రావడం పెద్ద నేరమేమీ కాదనిపిస్తుంది నాకు!
సామాన్యుడి లా క్యూలో నిల్చుకుని మరీ దర్శనం చేసుకోవడం ఆయన స్థాయి వ్యక్తి చేయడం అద్భుతమే! కొండ ఎక్కి రావడమే కాక, తిరిగి అలీరికి కూడా కాలి నడకనే వెళ్లారట. గ్రేట్!
శ్రవణ్ కుమార్ గారితో ఏకీభవిస్తూ సాధారణంగా ఇది చిన్న విషయమే అనిపించినా ఏడుకొండలన్నీ సాలగ్రామమయమని పెద్దలు చెబుతారు కాబట్టి ఆయన పాదరక్షలు తీసి కొండ ఎక్కి ఉంటే ఇంకా చాలా బాగా ఉండేది.అయినా అంత పెద్ద పదవిలో ఉండి ఆయన సాధారణ భక్తుని మాదిరిగా స్వామి దర్శనం చేసుకోవడం చాలా ఆనందదాయకం.ఇది అందరికీ ఆదర్శప్రాయం.
రిప్లయితొలగించండిఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకొంటే బాగుంటుందనేది నిస్సంశయం.
రిప్లయితొలగించండిఇంక, పిడకల గోలలా ఈ బూట్లగోల యెందుకు?
చెప్పులని “పాదరక్షలు” అన్నారు. పాదాలకి గాయాలు కాకుండా రక్షించేవి అని. మరి దేవుడెవడైనా, జనాన్ని “అరక్షిత పాదాలతో” దర్శనం చేసుకోవాలని శాశించాడా? దృష్టాంతాలు యేవీ?
“గుడి ఆవరణ దుమ్ము అయిపోకుండా….” అని కొంతమందంటారు. మరి పారిశుధ్య పనివారు ఆవరణంతా తుడుస్తూనే వుంటారే? కోటీశ్వరులు కట్టించిన గుళ్లలో, మెషీన్లతో తుడవడం, వొత్తడం చేస్తున్నారే? ఆ దుమ్ము యెక్కణ్ణించి వచ్చింది?
చనిపోయిన జంతువుల చర్మాలతో పాదరక్షలు తయారు చేసే రోజుల్లో, అది అశౌచమని నిషేధించారు. అంతే.
ఇప్పుడు తాజ్ మహల్ లాంటి చోట్లా, కొన్ని గుళ్లలోనూ, చెప్పులకీ, బూట్లకీ విప్పనవసరం లేకుండానే, పైన ఒక ప్లాస్టిక్ దో, వల లాంటిదో సంచీ తగిలించేసి, పంపించేస్తున్నారు. మరి ఈ ప్రత్యామ్నాయం మాటేమిటి?
ఆలోచించండి.
స్పందించిన వారందరికీ ధన్యవాదాలు. సామాన్యంగా ఆంగ్లంలో అన్నట్టుగా (Missing the big picture)బీన్ సినిమాలో "నైస్ ఫ్రేం' అన్న ఒక చిట్టి డైలాగు పెట్టి ఈ విషయాన్ని అద్భుతంగా చూపించారు. అదే ఇక్కడా నిరూపితం అవుతున్నది.
రిప్లయితొలగించండి@Zilebi
రిప్లయితొలగించండిNobody is expecting the burly Politicians and Business Tycoons to walk up the Tirumala Hill to have a Darshan of Lord Venkateswara.
We just expect them to behave whenever they visit Tirumala.
Let them emulate Shri Duvvuri in behaviour.
"nice frame"!!