9, జనవరి 2012, సోమవారం

గవర్నర్ గారి స్పందన

ఆ మధ్య ప్రముఖ  తెలుగు రచయిత గుడిపాటి చలం గారి  సమాధి గురించిన ఒక "అల్లరి" మీడియా లో మొదలయ్యింది. అది చూసి నేను స్పందించి చరిత్రలో (మూడు దశాబ్దాల క్రితపుది) తవ్వి తీసి బ్లాగులో అందిరి ముందు ఉంచాను. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే మీడియాలో వచ్చే వార్తలు పట్టుకుని వాళ్ళు చూపించిందే అసలైన సమాధి అనుకునేంతగా ఈ మీడియా మీద భరోసా లేదు కదా!

ఈ విషయంలో మన తెలుగువాడైన రోశయ్య  గారు  తమిళనాడు గవర్నరుగా ఉండటం వల్ల తొందరగా చర్యలు తీసుకొనబడ్డాయి. కాని నాకు ఉన్న అనుమానాలను ఆయన దృష్టికి తీసుకు వద్దామని, అవన్నీ   గుదిగుచ్చి ఆయనకు పంపాను. ఆయన దగ్గరనుండి జవాబు వస్తుందని అనుకోలేదు. కానీ, ఈ రోజున చక్కటి తెలుగులో ఆయన దగ్గరనుండి జవాబు వచ్చింది. ఫలితం పెద్దగా ఏమీ లేకపోయినా, ఒక గవర్నర్ కు సామాన్యుడు ఉత్తరం వ్రాస్తే జవాబు వచ్చే అవకాశం ఎక్కువ అని తేలింది, కనీసం రోశయ్య గారి వంటి వారు గవర్నరుగా ఉన్నప్పుడు. ఇంత త్వరగా నా ఉత్తరానికి జవాబు ఇచ్చినందుకు ఆయనకు బ్లాగు ముఖంగా కృతజ్ఞతలు తెలిచేస్తున్నాను.

కాని నేను మొదలుపెట్టిన పని రోశయ్యగారు సానుకూలపరచలేదు. నా దగ్గర ఉన్న సమాచారాన్ని, మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి పంపమని సలహా ఇచ్చి చేతులు కడుక్కున్నారు. ఒక పని మొదలుపెట్టినాక అది అయ్యేదాకా చూడాలి. ఇప్పుడు రోశయ్య గారు చొరవ తీసుకుని పరిరక్షించటానికి ఆదేశాలు ఇవ్వగా అక్కడి ప్రభుత్వాధికారులు తమ అధీనంలోకి తీసుకున్నది చలం గారి సమాధి అవునా కాదా అన్నది అనుమానం. కాదని నా దగ్గర ఉన్న ఆధారాలు చెబుతున్నాయి. నా అనుమానం నిజమైతే, ఎవరో అనామకుడి సమాధి చలంగారి సమాధి కింది సంరంక్షించబడి ప్రాచుర్యం చెందుతుంది. చలం  గారి గుర్తులు ఏమన్నా ఇంకా అక్కడ అరుణాచలంలో ఉంటే ఎవ్వరూ పట్టించుకోని కారణాన కాలగర్భాన కలిసిపోతాయి. అలా జరగకూడదని నా తాపత్రయం.

కాబట్టి,  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి చిరునామా  తెలిసినవారు నాకు తెలియచేయగలరు. ఆయనకు రోశయ్య గారి సలహా మేరకు  నా దగ్గర ఉన్న వివరాలు పంపి ఆయన చొరవ తీసుకుని ఈ విషయంలో కృషి చేసినందుకుగాను అసలైన సమాధి సరంక్షించబడితే మొదలెట్టిన పనికి సార్ధకత అని నా ఉద్దేశ్యం.  

చలంగారి సమాధి గురించి  మునుపు వ్రాసిన వ్యాసాలూ ఈ కింది లింకులు నొక్కి చదువుకొనవచ్చు:

 1. చలంగారి సమాధి - వివాదం   
 2. చలంగారి సమాధి వివాదం - మరొక కోణం 

కొసమెరుపు ఏమంటే, గవర్నరు రోశయ్యగారికి ఆధారాలు పంపినప్పుడే నేను ఆ వివరాలు, ఆంధ్ర జ్యోతి సంపాదక వర్గానికి మైలుద్వారా అవన్నీ పంపాను. వారి దగ్గర నుంచి కనీసం మీ జాబు అందినది అని చెప్పే సంస్కారం ఉన్న వాళ్ళు కరువయ్యారు. ఏమి చేస్తాం ఇవ్వాళ  మీడియా వారు   గవర్నర్   కంటే  కూడా ఎక్కువ అని అనేసుకుంటున్నారులా  ఉన్నది మరి!!


ఎతా వాతా చెప్పేది, అడిగేది ఏమంటే, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి చిరునామా గాని, ఆయన యి మెయిలు గానీ ఎవరికన్నా ఈ వ్యాసం చదివిన వారికి తెలిస్తే నాకు తెలియచేయగలరు. ఎలా అంటారా. జస్ట్ ఒక కామెంట్ వ్రాసి!

*****************************************************************


పై  వ్యాసం వ్రాసిన కొద్ది క్షణాల్లోనే "పావని" గారు ఇచ్చిన సమాచారం సహాయంతో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి ఈ కింది మెయిలు ఇవ్వటం జరిగింది. 

లక్ష్మీ ప్రసాద్ గారూ,

నమస్తే. చలం గారి సమాధి గురించి మీరు చేసిన కృషి అసామాన్యం. మీరు చొరవ తీసుకున్నందువల్లె, గవర్నర్ రోశయ్య గారు తగిన చర్యలు చేబట్టమని ఆదేశాలు ఇచ్చారు.

కాని, ఇప్పుడు అక్కడి స్థానికి అధికారుల రక్షణలో ఉన్నది చలం గారి సమాధేనా అని నా అనుమానం. నేను పురాణ సుబ్రహ్మణ్య శర్మగారి పుస్తకం తెలుగు వెలుగు చలం లోని విషయాలు ఆధారంగా, ఆంధ్ర జ్యోతి వారు ప్రచురించినవి తప్పు అన్న అభిప్రాయానికి  వచ్చాను. మొత్తం వివరాలు బ్లాగులో ప్రచురించాను. ఈ కింది లింకులు నొక్కి చదువ గలరు:

http://saahitya-abhimaani.blogspot.com/2011/12/blog-post_19.html

http://saahitya-abhimaani.blogspot.com/2011/12/blog-post_27.html

ఈ విషయంలో గవర్నర్ రోశయ్య గారికి  నేను ఒక ఉత్తరం  వ్రాశాను.   ఆ ఉత్తరానికి రోశయ్య గారి వద్ద నుండి జవాబుగా, విషయం మీకు చెప్పమని ఉన్నది. అందుకని ఈ వివరాలు పై విధంగా అందిస్తున్నాను. రోశయ్య గారి వద్ద నుండి వచ్చిన  జవాబు ఈ కింది లింకు సహాయంతో చూడవచ్చు:

http://saahitya-abhimaani.blogspot.com/2012/01/blog-post_09.html 

చలంగారి సమాధి విషయంలో ఎంతో చొరవ తీసుకున్న మీరు, అసలైన సమాధి మాత్రమె సంరంక్షించబడాలన్న   నా తాపత్రయాన్ని అర్ధం చేసుకుని, తగిన చర్య తీసుకోగలరని నా విన్నపం. ఇట్లు
శివరామప్రసాదు  కప్పగంతు 
బెంగుళూరు
*****************************************************************
THANK YOU MADAM "PAVANI" FROM USA
 
*****************************************************************

10 వ్యాఖ్యలు:

 1. చలం గారి సమాధి గురించి మీరు చేస్తున్న కృషీ, దానికి రోశయ్య గారి నుండి వచ్చిన స్పందనా ప్రశంసనీయమైనవి. కొన్ని నెలల క్రితం నేను యార్లగడ్ద గారిని కలిసినప్పుడు నాకు వారియొక్క విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. అందులో వారి యొక్క ఈమెయిల్, ఫోన్ నంబర్లే కాకుండా వారి నివాసం అడ్రసు కూడా వున్నట్టున్నాయి. ఇప్పుడు నేను ఇంట్లో లేను. ఇంటికి వెళ్ళాక వెతికి ఇస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. యార్లగడ్డవారి అడ్డ్రెస్ నాకూ తెలియదు.కాని ఆయన ఇటీవల ఒక వివాదాస్పద నవల ద్రౌపది మీద రాసారు.దానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.ఆ విధంగా మీరు ఆయన చిరునామా కనుక్కోడానికి వీలు కావచ్చును.రోసయ్యగారు అంతకన్నా ఏమి చేస్తారు ? మీడియా సంగతి తెలిసిందే.ఒక సంచలనం కలిగించి తప్పుకొంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Kudos to you! This is a real service.
  Yarlagada Laxmi Prasad could be this gentleman:

  http://www.yarlagaddalakshmiprasad.com/biography.html

  (I respect your principle to not to publish names w/o profile..so don't really offend if this is not published or removed. thanks)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @Pavani,

  Thank you for valuable information. He is the Gentleman and I got both his address and E mail.

  @Sarat,

  Thank you. Please do inform when you return to your home.

  @Kamaneeyam

  Thank you Sir for your comment. But I expected Shri Rosaiah garu to send this material to the District Collector in Arunachalam and get the matter thoroughly investigated instead of giving a lame advice to me to send it to somebody else.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Sivaramaprasad garu,

  I do not agre with you that the matter should have been referred to the District collector. He is just another bureaucrat in the TN cadre, and God only knows how much telugu he knows and that too about Shri Chalam. Governer Rosaiah's decision is the correct one. Sri Yarlagadda is the correct choice to look into this matter. His love for telugu and his activism for the same are very well known. He is the correct choice.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నాగేశ్వరరావు గారూ,

   మీకు ఈ లక్ష్మీ ప్రసాద్ గారు వ్యక్తిగతంగా తెలిస్తే దయచేసి ఆయన్ను నా బ్లాగు చూడమని చెప్పగలరు. నేను పంపిన మైలు తిరిగి వచ్చింది. ఆయనకు ఫోను చేస్తే తీసుకోవటం లేదు. ఈ మాత్రానికి ఆయన వెబ్ సైటు అని ఒకటి ఉంచి ఈ మైలు, ఫోను వివరాలు ఎందుకు ఉంచటం??

   మీకే ఎందుకు చెబుతున్నాను అంటే మీరు ఆయన ఏక్టివిజం అద్భుతం అని చెప్పారు కదా, మీకు ఆయన గురించిన ఫస్ట్ హాండ్ సమాచారం ఉందని అనుకుంటున్నాను. మీ దగ్గరనుంచి సమాధానం రాకపోతే, మొత్తం హార్డ్ కాపీలు ఆయన ఇచ్చిన చిరునామాకు పంపుతాను. ఆపుడైన చూసి గవర్నర్ గారు చెయ్యలేని పని ఈయన చెయ్యగలరేమో చూడాలి.

   తొలగించు
 6. @NAGESWARA RAO GARU,

  You may be right. I have already sent a mail to Shri Yarlagadda and posted the same in my blog. The above article has since been updated.

  My view is that to verify the antecedents of the structure brought out by Andhra Jyoti, love for Telugu is not the criteria, but the local information is most essential. If that structure is proved to be wrong one, it is the end of the matter.

  Then if anybody is interested, the house where Shri Chalam spent almost 3 decades since 1950 has to be identified, Tamil Nadu Government or A.P. Government has to take steps to acquire that property and develop the same as a monument for Shri Chalam. In this direction, if Shri Yarlagadda works and succeeds, I will agree with you about his activism.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. hahaha.... hhaah..hhahaha... ohhoooohhahhaha..

  Are u guys really working on some identity of a person's Tomb ?... really ?...

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @ Kiran

  What is that guffawing!! It only reflects your unbalanced mental status. You must be highly manner less fellow. Otherwise you would not have been so uncivilised in writing a comment in a serious blog. Get some counseling so that you shall be cured of your malfunctioning.

  Just to tell you this and to show others what kind of people are roaming around in blogs, I posted your comment. Do not ever try to come and comment in any blog until and unless you can understand the basic sense of manners and decency

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.