29, జనవరి 2012, ఆదివారం

ఈ రెండు పాటలు వింటూ చూడండి

 నిన్న సాయంత్రం, ఎప్పుడూ మనం వినే అమెరికన్ పాప్ లేదా బ్రిటిష్ పాప్ సంగీతమేనా ఇతర దేశాల్లో మనం  వినగలిగే మచి పాటలు లేవా, ఇంతా చేస్తే ఈ ఇంగ్లీష్ పాప్ పాటలు పూర్తిగా మనకి అర్ధం అవుతున్నాయి కనుకనా, వాటిల్లో ఉండే ట్యూన్, గమకాన్ని ఇష్టపడి కదా వినేది, మనం యూరోప్ లో ఉన్న ఇతర భాషల పాటలు ఎందుకు వినకూడదు అనిపించింది. 1970 - 80 లలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గ్రూప్ "అబ్బా" స్వీడన్ దేశానికి చెందిన వాళ్ళు కాదా అన్నా ఆలోచనలు ముసిరి. చూద్దాం మిగిలిన పాటలు ఎలా ఉంటాయో అని యూరోవిజన్ పాటల పోటీ కి చెందిన వెబ్ సైట్ వెతికాను. అందులో  2008  సంవత్సరంలో జరిగిన పోటీకి సంబంధించిన 40 + పాటలను విన్నాను. నాకు రెండు పాటలు నచ్చినాయి. ఒక బెల్జియం దేశానికి చెందినది, సెమి ఫైనల్స్ దాకా వచ్చినది, రెండోది స్పైన్ దేశానికి చెందినది ఫైనల్స్ దాకా వచ్చినది.

ఆ పాటల వీడియో యూ ట్యూబ్ నుంచి మీ కోసం.   
పై పాట బెల్జియం దేశానికి చెందినది, సెమి ఫైనల్స్ దాకా వచ్చింది
 పాట స్పైన్ దేశానికి చెందినది ఫైనల్స్ వరకూ వచ్చింది

మొదటి పాట బెల్జియం దేశానికి చెందినది, చూడటానికి వినటానికి బాగున్నది. ముఖ్యంగా ఆ గాయని, తనకు రకరకాల వాయిద్యాల మీద సహకరిస్తున్న వారితో వారిని ఉత్తేజ పరుస్తూ వాళ్ళ మధ్య తిరుగుతూ పాట పాడటం నాకు బాగా నచ్చింది. 

రెండో పాట వినటానికే కాని, చూడటానికి చిరాకు పుట్టించింది.

 యూరో విజయన్ సాంగ్ పోటీలకు చెందిన వెబ్ సైట్ ఈ కింది లింకు నొక్కి చూడండి. ఇలాంటి పాటలు అనేకం ఉన్నాయి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.