30, జనవరి 2012, సోమవారం

ఎనోఖ్ డేనియల్స్ - ఇన్స్ట్రుమెంటల్ సంగీత కళాకారుడు


పాటలు  పాడటం ఆ పాటల్లో కొన్ని బహుళ ప్రజాదరణ పొందటం, వాటిని హిట్ సాంగ్స్ అన్న పేరుతొ శ్రోతలు ముచ్చట పడటం మనకు తెలిసినదే. ఆయా హిట్ సాంగ్స్ ని పాట లేకుండా కేవలం సంగీతం తో ఆ పాటలో ఉన్న గమకం పోకుండా తీసుకు రావటం సులభమైన పని కాదు. అసలు పాటతో సమానంగా తమ ఇన్స్ట్రుమెంటల్  సంగీతానికి ప్రజాదరణ తీసుకు వచ్చిన వారిలో ఎనోఖ్ డేనియల్స్ ప్రధముడు.  పూర్వ కాలంలో, అంటే ఎప్పుడో రాజుల కాలం అనుకోకండి. 1972 ప్రాంతాల్లో వివిధ భారతి రెండో ప్రసారం (విజయవాడలో) పొద్దున్న పది గంటలకు గుంజన్ అనే కార్యక్రమం తో ప్రారంభం అయ్యేది. ఈ కార్యక్రమం పదిహేను నిమిషాలు. అందులో ఒక హిట్ సాంగ్ ఆ పాట ఇన్స్ట్రుమెంటల్  వెర్షన్ ఉండేవి. సామాన్యంగా ఆ టైములో ఇంట్లో ఉండే వాళ్ళం కాదు. స్కూల్లోనో, కాలేజీలోనో ఉండే వాళ్ళం. కాని ఇంట్లో ఉన్న సందర్భాల్లో  ఈ కార్యక్రమాన్ని తప్పని సరిగా వినే వాళ్ళం. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఎనోఖ్ డేనియల్స్ సంగీతమే ఎక్కువగా వినవచ్చేది. ఆయన సంగీతానికి అంతటి ప్రఖ్యాతి. ఇప్పటికి కూడా ఆయన ఇన్స్ట్రుమెంటల్ సంగీతం అంత సులభంగా దొరకదు.

యు ట్యూబ్ వెతికితే ఈ కింది వీడియో దొరికింది. ఆయన స్వంతంగా ఎకార్డియన్ మీద పాటలు పలికించటం ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ సంగీత కళాకారుడు అసలు పాటలు పాడిన కళాకారులతో సమానమైన ప్రఖ్యాతి పొందారు. సామాన్యంగా వివిధభారతి వంటి ఆరోగ్యకరమైన రేడియో స్టేషన్లలో ఎక్కువగా ఈయన సంగీతమే  వినపడేది. ఇప్పటి పరిస్థితి  తెలియదు.

ఎనోఖ్ డేనియల్స్ గారికి స్వంతంగా ఒక వెబ్ సైట్ ఉన్నది. ఆ వెబ్సైటులో ఆయన జీవిత వివరాలు, ఫోటోలు, ఆయన సంగీతపు సి డి ల వివరాలు. కొద్దిగా సాంపిల్ సంగీతం ఉన్నాయి. ఈ కింది లింకు నొక్కి పూర్తి వివరాలు హాయిగా చూడవచ్చు.  
ఆ వెబ్ సైటులో ఉన్న ఎనోఖ్ డేనియల్స్ సంగీతం ఈ కింది ప్లేయర్లో వినవచ్చు. 
 
మరి కొన్ని ఫోటోలు 
ప్రముఖ గాయకుడు తలత్ మెహమూద్ తో(మధ్యలో) ఎడమ పక్కన మరొక ఇన్స్ట్రుమెంటల్ సంగీత కారుడు వాన్ షిప్లె
ప్రముఖ సంగీతకారుడు సి రామచంద్రతో (కుడి పక్కన)

మొహమ్మద్ రఫీ తో

మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎవార్డ్ తో

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.