6, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఐ పాడ్ లో సినిమాలు చూడాలంటే



కొన్ని రోజులుగా, ఐ పాడ్-2 లో సినిమాలు చూడాలని ప్రయత్నం. కాని ఎంతో సమయం వెచ్చించి వీడియో ఫైళ్ళను ఐ పాడ్ కు సరిపొయ్యే పద్ధతిలో కి మారిస్తే కాని సినిమా చూడనివ్వని పద్ధతిలో యాపిల్  వాళ్ళు కట్టడి చేసారు. చివరకు ఇవ్వాళ శలవ అవ్వటంతో, యాపిల్  వాళ్ళ దుకాణం అంతా వెతకటం మొదలు పెట్టి చివరకు కొండను తవ్విన శ్రమ కలిగినా ఎలిక  కాకుండా, నాకు కావలిసిన మంచి ప్లేయర్ దొరికింది. ఆ ప్లేయర్ పేరు, ఫ్లేక్స్ ప్లేయర్ (Flex Player). ఈ ప్లేయర్ యాపిల్ వాళ్ళ దుకాణం నుంచి సీదాగా మన ఐ పాడ్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాపెల్ పద్ధతి ప్రకారం, దానంతట అదే ఇన్స్టాల్ కూడా అయిపోతుంది. 

తరువాతి కార్యక్రమం అందరికీ తెలిసినదే(పై స్క్రీన్ షాట్లో చూపినట్టుగా) 
  1. ఐ పాడ్  మన పి సి కి అనుసంధించి, మన ఐ పాడ్ ఐ ట్యూన్స్ లో కనపడగానే, మన  ఐ పాడ్ పేరు (ఏదో ఒక పేరు పెడతాము కదా) మీద క్లిక్ చెయ్యాలి. 
  2. వెంటనే మరొక స్క్రీన్ తెరుచుకుని, పైన ఒక "పేన్ " కనపడుతుంది . అందులో 'APPS' అని ఉంటుంది, దాని మీద క్లిక్ చెయ్యాలి. 
  3. కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే  మనం  ఇన్స్టాల్ చేసిన ఫ్లేక్స్ ప్లేయర్ ప్రత్యక్ష్యం అవుతుంది. ఆ ఐకాన్ క్లిక్ చెయ్యాలి.
  4. అప్పుడు   వీడియో ఫైలు కాపీ చెయ్యటానికి "ADD"  కనపడుతుంది. 

మన దగ్గర ఉన్న AVI, DivX, Xvid, VOB, MP4, MOV (plus many more) ఫైళ్ళన్నీ కూడా ఈ ప్లేయర్లో ఐ పాడ్  లో హాయిగా చూడవచ్చు. గంటలకి గంటలు ప్రయాణాలప్పుడు  కాలక్షేపానికి ఎంతగానో ఉపకరిస్తుంది ఈ ఫ్లేక్స్ ప్లేయర్.

ప్లేయర్ సినిమాలను ప్లే చేస్తున్న పద్ధతి కాని, సౌండ్, సినిమాని ముందుకు వెనక్కు తోయ్యాటానికి స్క్రోలర్  కాని చక్కగా అమర్చారు. ఐ పాడ్లో సౌండ్ నియంత్రించటానికి, మీటను తడిమి తడిమి కాని మనం కదల్చలేము. అందుకని, సినిమా చూస్తూ స్క్రీన్ ఒక్కసారి అలా ముట్టుకుంటే  చాలు, సౌండ్ నియంత్రించే స్క్రోలర్ తెర మీద కనిపిస్తుంది. సినిమా కూడా చాలా చక్కటి క్వాలిటీతో కనపడుతున్నది.

ఈ మాత్రం దానికి గూగుల్లో వెతికి వెతికి విసుగెత్తాను  . చివరకు, ఏదో సామెత చెప్పినట్టుగా, ఉయ్యాలలో బిడ్డను పెట్టుకు ఊరంతా వెతికినట్టుగా, కావలిసినది యాపిల్ వాళ్ళ దుకాణం లోనే దొరికింది. 

యాపిల్ వాళ్ళు ఈ అప్లికేషన్ న్ని ప్రస్తుతానికి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోనిస్తున్నారు. కాబట్టి, దీనికి కూడా ఒక ధర (అర డాలరో, డాలరో పలకచ్చు) వాళ్ళు పెట్టచ్చు అని వాళ్ళు నిర్ణయించే   లోపల వెంటనే ప్లేయర్ ని డౌన్లోడ్ చేసుకోవటం మంచిది.   













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.