26, నవంబర్ 2012, సోమవారం

ఎన్నాళ్ళు పోయినా ఈ ప్రశ్నకు బదులున్నదా!

నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజు ముంబాయి నగరం అల్లాడిపోయింది. అమాయక ప్రజలను విదేశీ ముష్కరులు విచక్షణారహితంగా కాల్చి చంపేశారు. ఆ మారణ కాండలో తమ దగ్గిర వారిని కోల్పోయిన వారు అనేకం. 

ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్ లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో తన కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న ఈ కుర్రవాడు, దు:ఖాన్ని ఆపుకుంటూ, 

  "మేము చేసిన అపకారం ఏమిటి"  

అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఎవరన్నా చెప్పగలరా?

డాన్  రీడ్ తీసిన డాక్యుమెంటరీ నుండి ఈ వీడియో గ్రహించబడినది. వారికి ధన్యవాదాలు

"మా నాన్న ముంబాయిలో  టాక్సీ డ్రైవర్. నన్ను మా చెల్లెలిని   తీసుకుని ముంబాయి అంతా చూపించేవాడు-దాదర్, చిడియా ఘర్, పార్కులు, హాజి-ఆలి, ఇంకా ఎన్నో - అన్నీ గుర్తు లేవు.............అమ్మా నాన్న నన్ను ఎంతో ప్రేమతో చూసుకునే వాళ్ళు..............అమ్మా నాన్న గుర్తుకు వస్తుంటారు....(ఏడుపు ఆపుకుంటూ)........వాళ్ళు మా అమ్మా నాన్నలను చంపేశారు................నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఇంతమందిని చంపేయ్యటానికి..................వాళ్లకు మేము చేసిన అపకారం ఏమిటి?...........

ఈ చిన్న కుర్రవాడు వేసిన  ఈ  ప్రశ్నకు  ఎవరన్నా  జవాబు  చెప్పగలరా? ఎందుకురా ఇలా చేస్తున్నారు, ఏమిటి మీరు సాధిస్తున్నది? తాడు చివర చావటం,  అంతకంటే ఏమన్నా ఉన్నదా.మీ   మీ  పిచ్చి ఇజాలు,    రాజకీయపు  కక్షలు     మీ   దగ్గరే    ఉంచుకోండి సామాన్యుల   దగ్గరకు   ఎందుకు   వస్తారు.   మీకు వచ్చిన మానసిక రోగం  మీ దగ్గరే ఉంచు కొండి, అందరికీ అంటించకండి. మీ రోగాలకు  మీలో మీరే మందు కనుక్కోండి. ఇది ఈనాటి సామాన్య భారతీయుని  మౌన ఘోష. 

ముంబాయి మారణ కాండలో అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి కలుగు గాక.

5 వ్యాఖ్యలు:

 1. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయినా ముందుకు సాగిపోయే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలమేమో!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వారి ఆత్మకు శాంతి కలగాలి
  ( అలాంటి అనాదలను ప్రభుత్వం ఆదుకోవాలి .. వారి భాద్యత స్వీకరించాలి )

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @పద్మార్పిత

  అంటే ఏమి చెయ్యాలంటారు.

  @ మురళి

  అతను వారి బంధువుల వద్దే పెరుగుతున్నాడు, ప్రభుత్వం తాము ప్రకటించిన సాయం అందిస్తే చాలు, ఆ పైన వారు కలగచేసుకోకపోవటమే పెద్ద మేలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఎవరూ చెప్పలేరు. తీవ్రవాదాన్ని అంతమొందించడమే పరిష్కారం. అందరూ అలోచించాల్సిన అంశమిది. వీడియో సేకరణ బాగుంది. ఆలోచింపజేసేవిధంగా ఉందీ పోస్టు. సంఘటన జరిగినప్పుడు కొంతకాలం గుర్తుంచుకుని తరువాత మరచిపోకుండా అందరూ ఈ సమస్య తీవ్రతపట్ల అప్రమత్తంగా ఉండాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Thank you Kondala Rao garu. To end terrorism is a tall order. We can end Terrorism only by teaching the pepetrators a proper lesson of tit for tat and not by prechings of Budhdha.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.