2, నవంబర్ 2012, శుక్రవారం

మూర్తిగారి రేడియో రికార్డింగ్ లు



రేడియో కార్యక్రమాలను పదిల పరచవలసిన ఆవశ్యకత గురించి ఎక్కువగా సామాన్య శ్రోతలకున్న శ్రద్ధ ఎనలేనిదని  బి ఎన్  మూర్తిగారు చేసి చూపించారు ఎప్పుడో వాల్వ్ రేడియో లో వస్తున్న కార్యక్రమాలను స్పూల్ రికార్డర్ లో రికార్డ్ చేసి పదిల పరిచారు వారబ్బాయి స్పూల్ టేపుల్లో ఉన్న రికార్డింగులు ఎం పి  3 చేసి అందరి కోసం ఒక వెబ్ సైటులో ఉంచారు ఈ కింది లింకు నొక్కి అక్కడ  ఇరవై పైగా ఉన్న లలిత గీతాలను విని ఆనందించవచ్చు:
 
  (10 ఆగస్ట్ 2014న చూస్తెఈ లింకు ఇప్పుడు పనిచెయ్యటం లేదు సారీ!)  

మూర్తి గారూ అందుకోండి నా శతకోటి అభినందనలు. అలాగే వారబ్బాయికి (ఆ వెబ్ సైటులో పేరు వ్రాయలేదు)  ధన్యవాదాలు. ఇలా శ్రోతల్లో ఇంకా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా రేడియో రికార్డింగ్ లు, ఉన్న వారు వివరాలు తెలియచేస్తే, ఆ రికార్డింగ్ లను ఎం పి  3 చేసి పదిల పరిచి అందరికీ ఈ బ్లాగుద్వారా అందించే  అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను. రికార్డింగ్ లు ఉన్న వారు వారికి వారే అందరికోసం ఇంటర్నెట్ లో అందించ గలిగితే అంతకంటే అద్భుత కార్యం మరొకటి లేదు. 

మూర్తిగారు చూపిన శ్రద్ధలో వెయ్యో వంతు ఆకాశవాణి  వారు చూపి ఉంటే ఎన్నెన్నో అపురూపమైన కార్యక్రమాలు ఈనాడు  లభ్యమయ్యేవి. ఆకాశవాణి వారు వారి పాత బీరువాల్లో పడి ఉన్న టేపులు ఏమన్నా ఉంటే(మిగిలి ఉన్నాయా అని అనుమానం, ఈ అనుమానం నిజం కాకపొతే బాగుండును) అవి దుమ్ము దులిపి అందులో ఏమున్నాయో చూసే బృహత్ కార్యక్రమం చేపట్టి ఆ దొరికిన కార్యక్రమాలను శ్రోతలకు వారి వెబ్ సైటు ద్వారా అందచేస్తే ఎంతో బాగుంటుంది.

3 కామెంట్‌లు:

  1. వివరాలు అందించినందుకు ధన్యవాదములు.

    పాటలన్నీ వినే ప్రయత్నంలో ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచిప్రయత్నం పాటలు వింటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు అందజేస్తున్నాను శివప్రసాద్ గారు.

    రిప్లయితొలగించండి
  3. Thank you Vanajavanamali garu. Poorva Phalguni, Thank you.

    But you should thank Shri Murtyjee and his Son not me. I just provided the link.

    With regard to Radio Recordings, greatest contribution is by the people who recorded them, preserved them all these decades. When we get a recording putting it on blog is by any standard is not great task. Of course it brings the recording into public domain within the reach of all netizen. Thats all.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.