27, అక్టోబర్ 2013, ఆదివారం

శ్రీ రావూరితో



పెద్ద వాళ్ళను కలుసుకోవటం ఒక అదృష్టం. అలాంటి అనేక అదృష్టాల్లో ఒకటి శ్రీ రావూరి  భరద్వాజ గారిని కలవటం. 2010 లో మే 23 న రవీంద్ర భారతిలో ఒక అపూర్వమైన కార్యక్రమం జరిగింది. అదే వినపడె గొంతులు కనిపించిన వేళ.  ఆకాశవాణి కళాకరులందరూ ఒకచోట కనిపించారు. ఈ అద్భుత కార్యక్రమం గురించి మునుపు ఇదే బ్లాగులో వ్రాశాను.

వినబడే గొంతులు కనబడిన వేళ

అదే రోజున  ప్రముఖ రచయిత ఆకాశవాణి కళాకారుడు శ్రీ రావూరి  భరద్వాజ గారిని కలవటమే కాదు, ఆయనతో ఫొటో తీయించుకునే అదృష్టం కలిగింది. అనేక మందిని శ్రీ విశ్వనాధ,శ్రీ వాజపాయ్, జార్జ్ ఫెరాండేజ్, అద్వాని, ఇలా చాలామంది ప్రముఖులను కలిశాను కాని,  ఫొటో తీయించుకునే అదృష్టం మాత్రం  రావూరి  భరద్వాజ గారితో మాత్రమే కలిగింది.  ఈ ఫొటో కోసం చాలా వెతికి ఇవ్వాళ సంపాయించాను.


రావూరి భరద్వాజ గారితో ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి వారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చక్కటి ఇంటర్వ్యూ యు ట్యూబ్ లో ఉన్నది. అవి రెండుభాగాలుగా  ఈ కింద ఇస్తున్నాను. వారిని చూస్తూ, ఆయన  చెప్పిన  మాటలు వినండి.





అలాగే 23 05 2010 న రవీంద్ర భారతిలో జరిగిన ఫొటో ప్రదర్శన వివరాలు కూడా ఈ కింద చూడవచ్చు. నేను ఈ ఫొటోలు నా బ్లాగులో ప్రచురించిన తరువాతే, ఆకాశవాణి కళాకారులను అందరూ చూడగలిగే అవకాశం మొట్టమొదటిసారిగా బ్లాగులోకంలో దొరికింది.  


2 కామెంట్‌లు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.