ఈ ఉపన్యాసం ఎప్పుడు ఎక్కడ చేశారో తెలియదు. పక్కనే శ్రీ సి నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ తెలుగు సాహిత్యం మీద దాదాపుగా అరగంట ఉపన్యాసం. ఆ ఉపన్యాసంలో ఆయన ఎన్నెన్నో విషయాలు విశేషాలు చెప్పటం జరిగింది. ఆ ఉపన్యాసాన్ని యు ట్యూబ్ లోకి ఎక్కించాను, ఈ కింది లింకు సహాయంతో చూడవచ్చు.
భారతం నుంచి మంచి మంచి పద్యాలను ఉదాహరిస్తూ మన తెలుగు సాహిత్యపు మూలాలను స్ప్రుసిస్తూ మంచి ఉపన్యాసం చేశారు శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు. విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రభావంనుంచి, ఇతర ప్రముఖ కవుల ప్రభావం నుంచి బయటపడటానికి దశాబ్దం పట్టిందని శ్రీ శ్రీ చెప్పటం విశేషం.
పూర్తిగా ఆంగ్లేయుల వేషధారణలో ఉండి(మెడలో టై తో సహా), తెలుగు సాహిత్యం గురించి, అస్థిత్వాన్ని గురించి శ్రీ శ్రీ గారు ప్రసంగిస్తుంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నది. కాని, ఆయన సి నారాయణ రెడ్డిగారిలాగా తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ఎప్పుడూ కూడా కనపడినట్టు లేదు.
శ్రీ శ్రీ గారు రష్యా వెళ్ళకుండా ఉండి, ఆ విదేశీ ఇజం మీద మక్కువ పెంచుకోకుండా ఉండి ఉంటే, మనకు ఆయన ఎటువంటి కవిత్వం, రచనలు ఇచ్చి ఉండేవారో, లేక అసలు రచనలే చేసేవారో లేదో ఇప్పుడు చెప్పలేని స్థితి. ఏది ఏమైనా తెలుగులో ఒక ప్రముఖ కవి తెలుగు సాహిత్యం గురించి ఆయన పక్కనుంచి చెప్పిన విశేషాలు వినతగ్గవే అని నా అభిప్రాయం.
మన తెలుగు సాహిత్యం మీద ఈ విదేశీ ఇజపు ప్రభావం విపరీతంగా ఉండి, మరే భాషలోనూ ఆ భాషలో వచ్చిన కథలు, నవలలు, కవిత్వం ప్రభావితం కానంతగా, మన తెలుగు రచనల్లోకి దాదాపుగా ప్రచార ధోరణిలోకి వచ్చి పడింది. మూడు నాలుగు దశాబ్దాల పాటు ఈ విదేశీ ఇజం మన తెలుగు రచయితల/కవులను ప్రభావితం చేసేసిందనే చెప్పాలి. కాని విచిత్రం ఏమంటే, ఈ ఇజపు ప్రభావం తగ్గిపోయినాక (ప్రేమ కథలు, వ్యాపార సరళి రచనలు వచ్చి),సవ్యమైన కథలు ఇప్పుడు వస్తున్నాయా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. పోనీ ఆ కవులు రచయితలూ ఆ విదేశీ ఇజం గురించి తెగ వ్రాశారు కదా, మన ప్రజల మీద ఏమన్నా ప్రభావం చూపిందా అంటే, అది కూడా ప్రశ్నార్ధకమే.
ఈ విషయానికే మరొక పార్శ్వం కూడా ఉన్నది. శ్రీ మధురాంతకం రాజారాం, శ్రీ పాలగుమ్మి పద్మరాజు వంటి రచయితలు ఏ విధమైన ఇజాల ప్రభావం లేకుండా అద్భుతమైన రచనలు చేశారు.
సాహిత్యానికి ఏదో ఒక ఇజం తప్పనిసరిగా ఒక పట్టుకొమ్మగా ఉండి తీరాలిసిందేనా, లేకపోతే సవ్యమైన రచనలు రావా? వినోదం కోసం ప్రజల తీరుబడి కోసం రచనలు చేస్తే అవ్వి సాహిత్యం కిందకు రావా, రచయిత తాను ఇతర ప్రజలకంటే పైన ఉన్నానుకుని, కొంతలో కొంత తన రచనల్లో బోధనా ప్రక్రియ తీసుకురావాలిసిందేనా అనే విషయాలు ఒక పెద్ద సాహిత్య చర్చకు లేదా దారి తీయవచ్చు. సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు ఈ విషయం మీద మరొకసారి వ్రాద్దామని ఉన్నది, కాని ఎప్పటికో!

ఈ వీడియోను అందచేసిన శ్యామ్ నారాయణకు ధన్యవాదములు.
శ్రీశ్రీ ‘ప్రతిజ్క్ష’ కవితను ఆయన గొంతులోనే వినటం ఎంతో ఉత్తేజకరంగా ఉంది. కవిత్రయం గురించీ, ముఖ్యంగా తిక్కన నాటకీయత, ఎర్రాప్రగడ ‘లిటరరీ ఆర్కిటెక్చర్’ గురించి ఆయన చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చారిత్రక ప్రసిద్ధి ఉన్న ఈ వీడియోను అందించినందుకు థాంక్యూ.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిశ్రీకాకుళంలో సి.నా.రె.ఉపన్యాసం గురించి ఇందులో ప్రస్తావన ఉందికాబట్టి ,శ్రీశ్రీ ఈ ప్రసంగాన్ని 1975 ప్రాంతంలో చేసి ఉండవచ్చును.ఆయన వేషధారణలో విచిత్రమేముంది?తెలుగుకవి అంటే పంచె,కండువా విధిగా ఉండాలని రూలేమీ లేదు.అది ఒకప్పటి మాట.నేటి ఆంగ్లకవులు షేక్స్పియర్ లాగ వేషం వేసుకోరుకదా!
శ్రీశ్రీ సంప్రదాయకవిత్వాన్ని అధ్యయనం చేసాకే విప్లవకవిత్వం రాసారు.అందుకే ఆయన శైలి,భాష,లో ఆ ప్రభావం కూడా కనిపిస్తుంది.
ఏదో ఒక 'ఇజం 'ని అనుసరించి రాయాలని ఒకప్పుడు వాదించినా (ఉదా;;మార్క్సిజం) ఇప్పుడు కవులు ఆ వాదనని అనుసరించడం లేదు.శ్రీశ్రీపై పూర్వకవుల ప్రభావం ఒకదశాబ్దంపైగా ఉంటే
శ్రీశ్రీ ప్రభావం ఇతరులపై మూడు నాలుగు దశాబ్దాలు ఉన్నది.
కమనీయం గారూ,
తొలగించండిమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. రూల్సంటూ లేవు కాని, తెలుగు సాహిత్యం గురించి టై కట్టుకుని, యూరోపియన్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉండటం చూడటానికి నాకు చాలా ఎబ్బెట్టుగా ఉన్నది అని నా స్వంత అభిప్రాయమే వ్రాశాను, నా అభిప్రాయంతో మీరు ఏకీభవించి తీరాలన్న రూలు మటుకు తప్పకుండా ఉండదని నా విశ్వాసం. శ్రీ విశ్వనాథ వారి ప్రభావం నుంచి "బయటపడటానికి" శ్రీ శ్రీ గారికి పదేళ్ళు పట్టింది కాని, పదేళ్ళు మాత్రమే శ్రీ విశ్వనాథ వారి ప్రభావం ఉన్నదని కాదు శ్రీ శ్రీ గారు చెప్పటం! ఇక శ్రీ శ్రీ గారి ప్రభావం ఎంత ఉన్నదో ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం కదా, మూడు-నాలుగు దశాబ్దాలెక్కడ అసలు ఆ ప్రభావం ఎన్నడన్నా ఉన్నదా అని నా అనుమానం. మహా ఐతే నలుగురైదుగురు అమాయకపు కుర్రాళ్ళు ఆ పద్యాలు చదివి ఆవేశపడి నక్సలైట్లు అయ్యి ఉంటారు అంతే.
వేణు గారూ, అంతా శ్యాం నారాయణ గారి సౌజన్యం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండి