సామాన్యంగా పిడి వాదాలు, వితండవాదాలు వామపక్షం వాళ్ళు ( వాళ్ళ గుంపు మొత్తం) విచిత్రంగా సాగించటం వింటూ ఉంటాము. కాని సిగ్గుమాలిన, అసలు ఎంతటి పనికి మాలిన వాడుకూడా చెయ్యని, చెయ్యలేని, వితండవాదాలు ఒక్క కాంగ్రెస్ పేరుతొ ప్రస్తుతం ఉన్న గుంపు సొత్తు అని, తమకు తామే తమ దుష్టత్వాన్ని, పూర్తి తెలివి తక్కువతనాన్ని మధ్యప్రదేశ్ లో ఆ గుంపు వాళ్ళు, తామర పూలను ప్రజల కంట పడకుండా "కప్పి పెట్టాలని" ఎలెక్షన్ కమీషన్ కు డిమాండ్ చెయ్యటంతో మరొకసారి బయట పెట్టుకున్నారు. దాదాపుగా కాంగ్రెస్ చెంచా పత్రిక ఐన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ కింది వార్త 29 10 2013 న ప్రచురించబడింది, నెట్ కాపీ ఫోటో లో చూడండి.
టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ "టైమ్స్ నౌ" అనే ఆంగ్ల 24 గంటల వార్తా చానెల్ ఈ విచిత్ర వార్తను ఈ విధంగా ప్రసారం చేసింది:
ఈ కాంగ్రెస్ పేరుతో ఉన్న గుంపు వితండవాదం చూడండి. ఆవతలి పార్టీ వాళ్ళ గుర్తు తామర పువ్వట, ప్రస్తుతం తామర పూల సీజనట, అందుకని ఎక్కడెక్కడ చెరువుల్లో, కాలవల్లో, దొరువుల్లో, నీటి గుంటల్లో ఎక్కడ తామర పువ్వు కనపడినా, అది ప్రజల కంట పడకుండా, ఎలెక్షన్లు ఆయ్యే దాకా కప్పెయ్యాలట. లేకపోతే, ప్రజలు ఈ తామర పూలు చూసి ప్రభావితం అయిపోయి ఆవతలి పార్టీకి ఓటు వేసేస్తారుట!
ఇంకా నయం బి జె పి ఎన్నికల గుర్తు సూర్యుడు కాదు!
ఇలా కనుక నిజంగా చెయ్యాలంటే , ఘనత వహించిన తమ పార్టీ గుర్తు "హస్తం" కదా, మనిషన్న తరువాత, చెయ్యి లేకుండా ఉంటుందా! మరి ప్రజలందరి చేతులు చేతులు వాళ్ళకి కనపడకుండా, ఎదురి వాళ్ళ చేతులు కూడా కనపడకుండా దాచెయ్యాలి కదా అని ఈ గురివింద గాళ్ళకి తెలియదా? లేదా తెలిసి కూడా వాళ్ళ బఠాణీ మాత్రపు బుర్ర మరెవ్వరికీ ఉండదని అహంభావమా?
నాకు తెలుగు అంతగా రాదనీ సిగ్గుపడకుండా చెప్పుకోగలను. కారణం ఈ కాంగ్రెస్ గుంపు చేసిన డిమాండ్ వర్ణించటానికి సరైన తెలుగు పదం నాకు తెలియదు, తట్టటం లేదు, స్పురిమ్చటం లేదు కూడా. అందుకని నాకు తెలుగు రాదని ఒప్పుకోవటానికి వెనుకాడను. కాని, ఆంగ్లంలో బిజార్ (BIZARRE) అనే పదం ఉన్నది. ఆ పదం, కాంగ్రెస్ గుంపు చేసిన డిమాండ్ కు చక్కగా సరిపోతుంది. పాపం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా, అంతటి కాంగ్రెస్ చేమ్చాలకు కూడా, ఈ కాంగ్రెస్ గుంపు చేసిన అసంబద్ధ డిమాండ్ మింగుడు పడక వాళ్ళు కూడా ఈ "బిజార్" అన్న పదాన్నే వాడారు.
కాంగ్రెస్ పేరుతొ నడుస్తున్న "గుంపు" అని మాటికి ఎందుకు వ్రాస్తున్నాను అంటే, నా దృష్టిలో కాంగ్రెస్ అనే పార్టీ 1969 వరకూ ఏదో కోన ఊపిరితో ఉన్నది. కాని ఆ తరువాత జరిగిన చీలికతో, ప్రజలు ప్రేమించిన కాంగ్రెస్, గాంధీ గారి కాంగ్రెస్, ఆనవాళ్ళు లేకుండా పోయింది, అందుకని.
**********************************
ఎంతటి రాజకీయమైనా, హద్దులు ఉంటాయి. ఆవతలి వాళ్లకి ప్రకృతి లో సహజంగా కనపడేవి కూడా, ఏమాత్రం ఉపయోగ పడకూడదు ఆనుకునేప్పుడు, తమ పార్టీ గత 60 ఏళ్ల బట్టి చేసినది ఏమిటి అని బేరీజు వేసుకోవాలిసిన అవసరం ఉన్నది. కాని అలా బేరీజు వేసుకోగలిగిన సమర్ధత ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర లేరు మరి పాపం, వాళ్ళు మటుకు ఏమి చేస్తారు! వాళ్ళకి నాయకత్వ సత్తా ఉన్నవాళ్ళే ఉంటే, విదేశీయుల వెంటపడి వాళ్ళ చేమ్చాలుగా మారుతారా!?
**********************************
ఈ విషయం లో మునుపు ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలప్పుడు ఒక పార్టీ ఎన్నికల గుర్తు ఐన ఏనుగు విగ్రహాల గురించి రగడ జరిగినప్పుడు ఒక వ్యాసం వ్రాశాను. ఆ వ్యాసంలో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఒకే పార్టీ జాతీయ చిహ్నాలను తమ స్వంత రాజకీయ లాభానికి ఎలా వాడుకున్నదో వివరంగా వ్రాశాను. కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదవగలరు.
జాతీయ చిహ్నాలు-ఎన్నికల గుర్తులు
============================================
టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చిన వార్తా పూర్తి పాఠం (ఆంగ్లంలో )
============================================
============================================
టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చిన వార్తా పూర్తి పాఠం (ఆంగ్లంలో )
============================================
Congress asks Election Commission to hide lotus ponds in Madhya Pradesh from voters
JABALPUR:
The Congress is upset about lotuses in full autumn bloom in water
bodies of Mahakaushal, Malwa and Bundelkhand regions in poll-bound Madhya Pradesh. The party on Monday wrote to the Election Commission (EC) to "hide" the national flower from public view so that voters aren't unfairly drawn to the BJP symbol.
Demanding a level-playing field, the MP Congress urged the EC for suitable directions to cover all ponds where the lotus is cultivated to be sold across the country.
BJP spokesperson Vishwas Sarang hit back, saying it showed the "mental bankruptcy and despondency" of Congress. "It means people should start covering their hands because it is the symbol of the party," he said.

If stone elephants (BSP’s symbol) could be seen as having a possible impact on polls in UP so can the lotus in Madhya Pradesh, argued a Congress corporator.
When the Election Commission ordered all elephant statues should be
covered in UP to deny BSP an undue advantage in the last assembly polls,
it had raised eyebrows. But the current demand has taken things to a
bizarre level. Next BJP could demand that everyone be asked to keep
their hands in the pockets lest the Congress symbol gets unfair
prominence during polls. It's time we put an end to such absurdities and
let common sense prevail.
However, the odd request has totally flummoxed Jabalpur election officer
Rajesh Jain. He said he was not authorized to take a call on such an
issue and would refer it to his superiors. If stone elephants
(BSP's symbol) could be seen as having a possible impact on polls in UP
so can the lotus in MP, argued Congress corporator Amar Chand Bawaria.
"We have more than 40 constituencies spanning Dhanpur, Gotegon, Deori, Barela, Bargi, Bhedaghat, Magarmoha, Panagar, Usner, Gosalpur, Sihora, in and around Jabalpur, Hoshangabad, Pipariya and Sohagpur besides Dhar, Dewas belt in Malwa along with pockets in Bundelkhand where lotus farming is undertaken on a large scale," Congress corporator Amar Chand Bawaria.
The EC ordered draping of Mayawati's stone elephants across parks and memorials in Lucknow and other places in UP the run-up to the polls. The elephants were covered with sheets because the poll panel did not want BSP's symbol to unfairly affect the voters.
"Going by the same argument, Congress does not want the lotus crop to influence our chances adversely by making voters think about BJP," Bawaria said.
Another local Congress leader Manmohan Agrawal said district election officer in Dhar, CB Singh, already assured that a pond adjacent to a polling booth in Manawar constituency would be draped with a canvas during the elections. "We are demanding a similar assurance in all constituencies where lotuses abound," he said.
Agarwal recalled how AICC general secretary Digvijaya Singh had led a delegation to the EC in 2008 with a demand that Class VI social sciences textbooks in government schools be taken off as they carried the imprint of lotus. "The CEC had expressed displeasure with the MP government and given it a two-week deadline to carry out the necessary changes. I am sure the commission will take cognizance of this issue as well," he said.
Times view

When
the Election Commission ordered all elephant statues should be covered
in UP to deny BSP an undue advantage in the last assembly polls, it had
raised eyebrows. But the current demand has taken things to a bizarre
level. Next BJP could demand that everyone be asked to keep their hands
in the pockets lest the Congress symbol gets unfair prominence during
polls. It's time we put an end to such absurdities and let common sense
prevail.
కాంగ్రెసు అనేది ఒక గుంపు అని నిర్థారించి మీరు ఒక సరైన అవగాహనకు వచ్చారు.
రిప్లయితొలగించండిఈ కాంగ్రెసు అనేది ఒక దొంగలగుంపు అని మీ అవగాహన విస్తృతం ఐతే మరింత సరిగా ఉండేది.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే గాంధీగారి నేతృత్వం కల కాంగ్రెసు పని ముగిసింది.
అందుకే ఆ కాంగ్రెసుసంస్థను గాంధీగారు రద్దుచేయాలని భావించారు.
ఆయన మాటను వ్యతిరేకించి నిలబడ్డ ఈ కాంగ్రెసు అనేది రాజకీయవాదుల గుంపు మాత్రమే.
కాంగ్రెసును నియోగాంధీలు ఒక బడాదోపిడీదారుల గుంపుగా మార్చారు.
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు శ్యామలీయం గారూ
తొలగించండిఅయ్యా,
రిప్లయితొలగించండికాంగ్రెసువారి కోరిక ప్రకారం కమలం అనేది కనిపించకుండా చేయాలి - అది ఒక ఎన్నికల చిహ్నం కాబట్టి.
ఎన్నికల చిహ్నాలుగా గొడుగులు, టార్చిలైట్లు, నిచ్చెనలు, కుండలు వగైరా ఎన్నో ఎన్నో వస్తువ్లు ఉంటాయి కదా?
వాటినన్నిటినీ కూడా కనిపించకుండా చేయాలి.
అన్నట్లు మనుషుల చేతులూ కనిపించరాదు. - చేతులు నరికించమని ఎలక్షన్ కమీషన్ వారికి విజ్ఞప్తి చేద్దామా?
లేదా కనికరించి, చేతులు దాచుకోవాలీ అని ఆర్డరు వేసి, ఎలక్షన్ నాడు చేయి కనిపించేలా ఉన్న ప్రతివాడినీ అర్రెష్టు చేద్దామా?
అన్నట్లు చేతులు దాచుకుంటే ఎలక్షన్ సిబ్బంది విధులు ఎలా నిర్వహిస్తారండీ?
మరి చేతులు బయటపెడితే కాంగ్రెసుగుంపుకు కాన్వాసింగ్ చేసిన నేరం మీద పడుతుంది కాదా?
ఏదీ దారి?
కాంగ్రెసు గుర్తును తక్షణం మార్చేయాలంతే!
శ్యామలీయం గారూ, మరొక్కసారి ధన్యవాదాలు
తొలగించండికర్మకాలి అవతల పార్టీ వాళ్ళ గుర్తు కళ్ళు అయితే వీళ్ళు జనాలందరినీ గంతలు కట్టుకోమని డిమాండ్ చేసేవాళ్ళేమో..
రిప్లయితొలగించండిఇక కాంగ్రెస్ గురించి చెప్పేదేముంది సార్.. మన ప్రారబ్దం!
కార్తిక్,
తొలగించండిమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఆవతలి పార్టీ గుర్తు సూర్యుడైతే, ఈ బఠాణీ బుర్ర గాళ్ళు ఏమని అడిగే వాళ్ళో కద్దా అని నవ్వొస్తున్నది. ఎంతటి చెత్తంతా ఘనతవహించిన కాంగ్రెస్సులో పోగుపడింది! గాంధీ ఆత్మ ఎంతగా క్షోభిసుతున్నదో కదా.
ఆ ప్రతిపాదన చేసిన పెద్దమనిషిని మూర్ఖాగ్రేసర, మూర్ఖరత్న, మూర్ఖశిరోమణి వంటి బిరుదులతో సత్కరించాల్సిందిగా నా మనవి.
రిప్లయితొలగించండిసూర్య,
తొలగించండిమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఎందుకండీ మూర్ఖుల్ని అలా అవమానిస్తారు. వీళ్ళ ముందు మూర్ఖులు మేధావుల కింద లెక్క.
ఆగండాగండి.
తొలగించండిమూర్ఖులు మేధావుల క్రిందకు లెక్కకు రావటమే కాదు.
నేడు మేధావులుగా చెలామణీ అవుతున్నవారిలో ముర్ఖుల శాతం హెచ్చుగానే ఉన్నది కదా!
దొంగముదిరితే రాజకీయనాయకుడు.
మాటలు నేర్చిన మూర్ఖుడు మేధావి.
అంతే.
శ్యామలీయం గారూ,
తొలగించండిమేదావి అంటే ఎవరు అని కొంతకాలం క్రితం కొంత నిర్వచించే ప్రయత్నం చేశాను. నా నిర్వచనం చాలావరకూ నిజానికి దగ్గిరగానే ఉన్నదని భావిస్తూ ఉన్నాను.
మేదావి అంటే:
1 దేవుణ్ణి నమ్మ కూడదు.
2 కమ్యూనిస్టు అయ్యి ఉండాలి. లేదా అధమం, కమ్యూనిస్టు అభిమాని అయ్యి ఉండాలి.
3 ఏదన్నా పుచ్చు యూనివర్సిటీలో పని చెయ్యని ప్రొఫెసర్ అయ్యి ఉండాలి.
4 పక్క హేటు వాది అయ్యి ఉండాలి.
5 అతితెలివి చూపిస్తూ పిడివాదం చేస్తూ ఉండాలి.
6 ఉరి శిక్ష రద్దు చెయ్యాలి అని అప్పుడప్పుడూ కేకలు వేస్తూ ఉండాలి.
7 హిందూ మతం గురించి దుమ్మెత్తి పోస్తూ ఉండాలి. (మిగితా మతాల జోలికి వెడితే సున్నంలోకి ఎముకలు లేకుండా తంతారు లేకపోతే నరికి ఆవతల పారేస్తారు మరి. హిందూ మతం ఒక్కటే చౌకగా దొరికింది ఈ మేధావులకి వాళ్ళ మేధావితనం చూపించుకోవటానికి)
8. మానవ హక్కుల గురించి గంభీరంగా మాట్లాడ గలగాలి (అవసరమైనప్పుడు, పైనించి వచ్చిన ఆదేశాల ప్రకారం. మళ్ళి అందరి సామాన్య మానవుల గురించిన హక్కుల గురించి మాట్లాడితే మేధావితనం ఎగిరిపోతుందిటా!)
9. అందరూ అవునంటే కాదనాలి. కాదంటే అవుననాలి.
10. శత్రు దేశాల సరిహద్దులకి వెళ్లి ఆ కంచే మీదగా వాళ్లకి గులాబీ పూలు ఇస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ కొవ్వొత్తులు పట్టుకు తిరగాలి, ఎందుకో మరి తెలియదు.
ఇవన్ని ఉన్నవాళ్ళే మేధావులు. ఈ లక్షణాలు లేనివాళ్ళను మేధావులు అనరు.
కాబట్టి మూర్ఖులు తప్పనిసరిగా మేధావులుగా పిలవబడటానికి అర్హులు కాదు. మేధావులుగా పిలవబడేవాళ్ళు, మూర్ఖత్వంలో మూర్ఖులకంటే పైమెట్టులోనే ఉంటారు. అందుకని, తమకి ఉందనుకునే మేధావితనాన్ని త్యజించే అవకాశం లేకపోలేదు.
కాబట్టి మూర్ఖులను మేధావులకంటే కొంచెం ఒక్క పిసరు ఎక్కువగానే మనం గౌరవించుకోవాలి, మేధావులను మూర్ఖులు అని పిలిచి, మూర్ఖులను అవమానించకూడదు.
sahitya abhimaani aalochimpajesedigaa undi. totalgaa post adubutamgaa undi
రిప్లయితొలగించండిhttp://www.googlefacebook.info/
అజయ్ కుమార్ గారూ,
తొలగించండితెలుగును తెలుగు లిపిలో వ్రాయటం అలవాటు చేసుకోండి. పెద్ద కష్టమేమీ కాదు. lekhini.org అనే సైటులోకి వెళ్ళండి, క్షణాల్లో తెలుగును, తెలుగు లిపిలో వ్రాయటం వచ్చేస్తుంది. తెలుగును ఆంగ్ల లిపిలో చదవాలంటె, గోడమీద గోరుపెట్టి గీకుతున్నట్టు ఉంటుంది.
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
రాష్ట్రపతి మరియు ప్రైం మినిస్టర్ల కన్నా ఎక్కువ హోదాని తమ పార్టి నాయకురాలకి ఇచ్చిన వారికి దేశం మీద, దేశ ప్రజల మీద ఏమి గౌరవం ఉంటుంది....ఇలాంటి వాళ్లకి ప్రతిపక్షాలంటే ఇక లక్ష్యం ఏముంటుంది.. మేథావుల దగ్గర నుండి గుడ్డి మీడియా వరకు కాంగ్రెస్సు నాయకురాలని దేశాధినేతగా నమ్మేట్లు చేసి, మసిబూసి మారేడు కాయచేసిన వీరి బుర్ర అంతకన్నా ఏమి పనిచేస్తుంది...బానిస మనస్తత్వం...వీరికి మంచి చెడు తెలిసే అవకాశం ఉన్నదా...!!!
రిప్లయితొలగించండిమీవంటి మేధావులు ఈవిధంగా మాలాంటివారికి అరటిపందుతొక్కతీసి ఇచ్చినట్లు ఇంత విపులముగ విదమర్చి చెప్పదం వల్ల చాలా మేలు జరుగుతున్నదని నా భావం. మీ అందరికీ నా కృతజ్ఞతాభినందనలు.
తొలగించండి