1, నవంబర్ 2013, శుక్రవారం

మనవరాలి శుభాకాంక్షలు

పెళ్ళయ్యి  మూడు దశాబ్దాల మీద, దశాబ్దంలో  ఐదో వంతు అయ్యింది. ఏమిటీ అతి తెలివి లెక్కలు అంటారా! నిజమే సావాస దోషం.   ఈ  మధ్యనే పేద్ద ఫ్లాట్   టి వి అదేదో ఎల్ యి డి ట,   అది కొని మళ్ళీ  (కొత్తొక వింతే కదా మరి)  మీడియా వాళ్ళ  సర్కస్ మూడు  భాషల్లోనూ చూడటం మొదలుపెట్టాను. అది కారణం, అతి సామాన్య విషయాన్ని కొత్తగా చెప్పబోయి అర్ధం  కాకుండా చేసే ప్రయత్నం. 

సరే! విషయానికి వస్తే, ఇవ్వాళ్టికి (నవంబరు 1) మా వివాహం జరిగి 32 సంవత్సరాలు జరిగిపొయినాయి. అలా కాలం ఎంత వేగంగా వెళ్ళిపోయిందో, నిన్నకాక మొన్ననే జరిగినట్టుగా అనిపిస్తుంది. 

  తాతయ్య, నాయినమ్మ - మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు  
 ప్రతి సంవత్సరం పెళ్ళి రోజున శలవ పెట్టేసి కాలక్షేపం చెయ్యటం అలవాటు. కాని , మూడు దశాబ్దాలు దాటిపోయి,  పాతబడిపోయింది ఇంకేమిటి అని, "తెగించి" ఇవ్వాళ ఆఫీసుకు వెళ్ళిపొయ్యాను. ఈ  నాలుగు మాటలూ వ్రాయక పోను, మా మనవరాలు సహస్ర  దీప్తి వాళ్ళ నాన్న చేత మాకు శుభాకాంక్షలు ఫోటో కాలేజి ద్వారా పంపి ఉండకపోతే. మనవరాలు పుట్టిన తరువాత జరుపుకుంటున్న  పెళ్లిరోజు ఇదే మరి.  మా అబ్బాయి, వాళ్ళ అమ్మాయి తరఫున మాకు శుభాకాంక్షలు పంపటంతో, మీ అందరితోనూ ఈ ఆనందం పంచుకునే అవకాశం కలిగింది.   


3 కామెంట్‌లు:

  1. మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ. మీకు మీ కుటుంబానికి సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.