4, నవంబర్ 2013, సోమవారం

మన స్వంత రాక్ కళాకారుడు - రేమో ఫెర్నాండెస్

అసలు ఈ రెమో ఎవరు ఈయన పాటలు ఏమిటి! రెమో గురించి ఎప్పుడో దూరదర్శన్ లో (వాళ్ళను భగవంతుడు  చల్లగా  చూచు గాక -God Bless them) ఒక చక్కటి కార్యక్రమం లో ఈయన గురించి చూపించారు. నిజంగా చెప్పాలంటే మన భారత దేశంలో ఒక పక్క ఉష ఉథుప్ మరొక పక్క రెమో ఫెర్నాండెస్ రాక్ సంగీతానికి పునాదులు వేశారు. 

  • రెమో ఫెర్నాండెస్ గోవా రాష్ట్రానికి చెందిన అద్భుత కళాకారుడు. 
  • వృత్తి రిత్యా ఆర్ఖిటెక్ట్, స్వతహాగా గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు అనేకమైన వాయిద్య పరికరాలను పలికించగల  ప్రతిభాశాలి. 
  • తన పాటలను తానే వ్రాసుకుంటాడు, తనే స్వర పరుచుకుంటాడు, సహజంగా తనే పాడతాడు, అంతేనా అంటే  ఇంకా ఉన్నది. తన పాటల్లో వచ్చే మొత్తం సంగీతాన్ని తనే కూర్చుకుని, ప్రతి సగీత వాయిద్యాన్ని తనే పలికించి మొత్తం పాట మొత్తం తనే మిక్స్ చేసుకుని, చివరకు ఆ కాసెట్, సి డి కవర్ కూడా  తనే డిజైన్ చేసుకుని ప్రజల్లోకి వదులుతాడు రెమో.  ఈ విషయం  అద్భుతమైన విషయం. కాని ఆయనకు ప్రచారం లేదు  వెనుక పడిపోయాడు. "మీడియా సావీ"(Media savvy) కాదట. అంటే  వాళ్ళను మచ్చిక చేసుకోవటం తెలిసి ఉంటే, ఆయన్ను బాగా పెకెత్తేశేవాళ్ళేమో  మరి!  కాని ఆ "సావి" కాదట రేమో.  అది సంగతి.
  •  తన యవ్వనపు తోలి రోజుల్లో యూరోపులో పాద యాత్ర లేదా ఎవరన్నా లిప్ట్ ఇస్తే కార్లల్లో ఎక్కుతూ (హిచ్ హైకింగ్) తన సంగీతంతో తనకు కావలిసిన నాలుగు రాళ్ళు సంపాయించుకుంటూ యూరోప్ లో రెండున్నరేళ్ళు ,  గడిపాడు రెమో. ప్రస్తుతం వయస్సు  సరిగగా  అరవై (1953  జననం)
  • హిందీ పెద్దగా రాదు. కాని చాలా హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. హిందీ పాటలు  విచిత్ర ఉచ్చారణతో పాడుతూ తన శ్రోతలను అలరిస్తాడు. 
  • రెమో పాటల్లో సామాన్యంగా మంచి సూచనలు, సందేశాలు ఉంటాయి. ఈ కింది వీడియో లో చూడండి వోట్,  టిట్ ఫర్ టాట్  (Vote Tit for Tat) అని అందరినీ వోటు హక్కు వినియోగించుకుని ఒక మంచి వాడికి వోటు వెయ్యమని ప్రబోధిస్తున్నాడు రెమో.




1992 లో అనుకుంటాను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు ఒక కొలీగ్ తో కలిసి,  ఆఫీసు కు కావాలిసిన రిజిష్టర్లు కొనటానికి వెళ్ళినప్పుడు(అప్పట్లో ఇంకా కంప్యూటర్ల వాడకం ఇంతగా లేదు) అక్కడ రెమో  ఫెర్నాండెస్ కాసేట్ Politicians Do not know Rock n Roll కనపడి,  కొని చాలా సార్లు విని ఆనందించాను. సంగీతం కంటే ఆ పాటల్లో ఉన్న సాహిత్యం శ్రోతలను ఆలోచింప చేసేట్టుగా ఉండి అన్ని పాటలూ బాగున్నాయి. ఈ కింది లింకు నొక్కి "అమెజాన్ " వారి వెబ్ సైటులో వినవచ్చు. 



మన "ఈ టివి" వారు తమ "మార్గదర్శి" కార్యక్రమం లో రెమో ఫెర్నాండెస్ గురించి  ఒక చక్కటి కార్యక్రమం రూపొందించారు. రెమో గురించి హాయిగా తెలుగులో చూడండి:

 

రేమో తో మరింకేమన్నా  ఇంటర్వ్యూ లు ఉన్నాయా అని చూస్తె  ఒక మంచి ఇంటర్వ్యూ "Day & Night" News Channel వాళ్ళు ప్రసారం చేసిన ఇంటర్వ్యూ దొరికింది. ఆ ఇంటర్వ్యూలో (ఆగష్టు 23) రెమో చాలా విషయాలు విశేషాలు చెప్పారు. ఇంటర్వ్యూ  చాలా బాగున్నది. ఇంటర్వ్యూ చేసినావిడకు మంచి అనుభవం ఉన్నట్టున్నది, రెమో ను కోర్టులో క్రాస్ ఎక్షామిన్ చేస్తున్నట్టుగా (కరణ్ థాపర్ స్టైల్) కాకుండా, ప్రేక్షకులకు రెమో కు మధ్య అడ్డు కాకుండానే కావలిసిన విషయాలు చక్కగా రాబట్టి ఇంటర్వ్యూను రక్తి కట్టించారు.



 మరిన్ని విషయాల కోసం ఇంకా ఇంటర్వ్యూ కోసం యు ట్యూబ్ లో వెతుకుతుంటే (Think of the Devil...) మన మీడియా లో (ఆంగ్ల మీడియా లెండి. కొంత ప్రయత్నాలు  చేశారు కాని, తెలుగు మీడియా  ఇంతవరకూ ఇలాంటి వాడిని, మన అదృష్టం బాగుండి, కనిపెట్ట లేకపొయ్యారు) అరివీర యాంఖర్ కరణ్ థాపర్ బి బి సి తరఫున రెమో ఫెర్నాండెస్ ను మే 2001 లో ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కొట్టొచ్చినట్టుగా కనపడేది ధాపర్ దాదాపుగా అదపులో ఉండటం! వెర్రి మొర్రి వేషాలు వెయ్యలేదు. ఏమైనా ప్రొఫెషనల్ మీడియాకు మూలం బి బి సి కదా మరి! వాళ్ళ యాంఖర్లను తగినంతగా అదుపులో ఉంచుతారల్లె ఉంది.  



పైనున్న వీడియో ఇంటర్వ్యూలు రెమో గురించి ఎంతో సమాచారంతో సుసంపన్నమైనవి, కరణ్ ధాపర్ ఇంటర్వ్యూతో సహా! అందులో ఉన్న విషయాలు నేను వ్యాసంలో వ్రాయలేదు. అవన్నీ నేను మళ్ళీ  వ్రాస్తే , నాకూ ఇవ్వాళ్టి టి వి న్యూస్ ఎంఖర్లకు తేడా లేకుండా పోతుంది. వాళ్ళు ఏదో న్యూస్ వీడియో చూపిస్తారు. అందులో మినిస్టరో మరింకెవరో ఒక విషయం చెబుతారు. మనం అది చూస్తాము, వింటాము కూడా. కానీ విచిత్రంగా మన 24 గంటల న్యూస్ మీడియా వాళ్ళు ఆ వీడియో చూపించి, వాళ్ళు ఇలా అన్నారు అని తమ గొంతు ద్వారా మళ్ళి ఆ విషయం అంతా చెప్పి వినిపించి మన టైము వృధా చేసి తమ టైము మటుకు 24 గంటల న్యూస్ చానెల్ కదా గడిపేస్తారు. అటువంటి  తప్పు నేను చెయ్యదలుచుకో లేదు  వీడియోలు  చూసి రెమో చెప్పిన అద్భుత విషయాలు మీరే హాయిగా ఆనందించండి.
ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ అనే అద్భుతమైన పాట రెమో పాడిన పాట   యూ ట్యూబ్ నుంచి చూడవచ్చు:


రెమో బయట స్టేజీ మీద ప్రేక్షకుల ముందు పాడిన పాట "మున్నీ మున్నీ" చూడండి.  


 



కాని మొత్తం మీద చూస్తె రెమో ఫెర్నాండెస్ కు రావలిసిన కీర్తి ప్రతిష్టలు రాలేదనిపిస్తుంది. ఆయన సంగీత కళాకారునిగా పైకి వస్తున్న కాలంలో మీడియా గురించి తన పాటల్లో విమర్శించారుట. కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడటం రెమో  గుణం. అందువల్ల సహజంగా గోవాలో ఆయన మీద దుష్పచారం. ఒక దశలో అప్పటి ప్రధాని రాజీవ్ కలుగచేసుకుని రేమో పక్షాన మాట్లాడి ఆదుకోవలిసి వచ్చినదట. విచిత్రం, మీడియా ఫ్రీడం అని గోల చేసే మీడియానే అతని మీద కత్తి కట్టటం, దుష్ప్రచారం చెయ్యటం చూస్తుంటే, మీడియాకు తనకు స్వాతంత్ర్యం కావాలి కాని, తమను విమర్శిచే స్వతంత్రం ప్రజలకు ఉండకూడదని వాళ్ళ భావన. ఈ విషయం మన బ్లాగుల్లో కూడా అనేకసార్లు నిరూపించబడింది. 

రెమో కు పద్మశ్రీ బహుమతి ఇవ్వచూపారు కాని, ఆ వచ్చిన పద్మశ్రీ అవార్డును తిరస్కరించాడు రెమో. 

చివరగా, రేమోను ఎలెక్షన్ కమీషన్ వారు "ఎలెక్షన్ ఐకాన్" గా నియమించినప్పుడు,    రాజకీయ విషయాల మీద ప్రమోద్ ఆచార్య కు ఇచ్చిన అద్భుత ఇంటర్వ్యూలు ఈ కింది లింకులు నొక్కి చూడవచ్చు:
 
మీడియా ఆత్మవిమార్శ చేసుకోవాలని తన ఇంటర్వ్యూ లో నొక్కి చెప్పాడు రెమో ఫెర్నాండెస్. ఇంకా అనేక విషయాల మీద, తన అభిప్రాయాలను చెబుతూ  చాలా కుండలే పగలగొట్టాడు రెమో. 







1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.