8, డిసెంబర్ 2013, ఆదివారం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి


నాకు అభిమాన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు.  దూరదర్శన్ లో ఆనందోబ్రహ్మ ధారావాహికతో ఆయన నటనతో పరిచయం కలిగింది.  ఈ  రోజున పొద్దున్నే కూడలి చూస్తుండగా భండారు శ్రీనివాస రావుగారి బ్లాగులో సుబ్రహ్మణ్యం గారి మరణ వార్త చూసి నిర్ఘాంతపొయ్యాను.ఆయన చెప్పినట్టుగా నిజంగానే  నవ్వుకు దిష్టి తగిలింది. 

ఎంత చక్కటి నటన చెయ్యగలరు, ఎంతటి ఈజ్ (ఈ మాటకు తెలుగు తెలియటంలేదు). ఆయన డైలాగులు చెప్పే పద్ధతే ముఖ్య ఆకర్షణ. మహా నటులు,   కొమ్ములు తిరిగిపోయ్యాయని అనుకునే వారు కూడా,   ఈయన దగ్గర నటనలో నేర్చుకోవాల్సిన విషయాలు  ఉన్నాయి. 

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో గంటకు పైగా ఇంటర్వ్యూ ఉన్నది. ఈ ఇంటర్వ్యూ లో సుబ్రహ్మణ్యం గారు  జీవితంలోని అనేక విషయాలు చెప్పారు.ఆయన గురించి పెద్దగా తెలియని, పౌరాణిక పద్య పఠనం, ఒకటి రెండు  పాటలు పాడటం కూడా  ఉన్నది. ఒక చక్కటి నటుడితో అద్భుతమైన ఇంటర్వ్యూ  అందించిన  ఎ బి ఎన్ వారికి కృతజ్ఞతలు. 



సుబ్రహ్మణ్యం గారి  సినీ హాస్యంలో కొన్ని


ధర్మవరపు సుబ్రహ్మణ్యం - స్పెషల్ తెలుగు కామెడీ సెంట్రల్ 

 



ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలుగుగాక


ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి చివరి ఫొటో  గుండే దిటవుచేసుకుని చూడాలి 

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి  చివరి ఫొటో 


రాజేంద్ర ప్రసాద్ సతాపం





 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.