నేను బ్లాగు ప్రపంచానికి 2009 లో చందమామల మీద అభిమానంతో వచ్చాను. తరువాత కొంతకాలానికి నాకు తెలిసిన మొట్టమొదటి బ్లాగ్ సంకలిని "కూడలి". వెంటనే నా బ్లాగును సంకలినికి సంధాన పరచటానికి వారిని కోరి, నా బ్లాగును అక్కడా కనపడేట్టుగా చేసుకున్నాను. గత నాలుగేళ్ళల్లో దాదాపుగా రోజూ కూడలి వచ్చి చూడకుండా ఏ రోజూ గడవలేదు. నేను వ్రాసేది తక్కువ అయినా, ఇతరులు వ్రాసే విషయాల్లో శీర్షికను బట్టి నాకు ఆసక్తి కలిగించే వ్యాసాలను చదవటం బాగా అలవాటు. కూడలి పుణ్యమా అని బ్లాగు ప్రపంచంలో ఎంతో మంది స్నేహితులు అయ్యారు. వాళ్ళల్లో చాలామందిని వ్యక్తిగతంగా కలవలేదు. ఈ స్నేహాలకు కారణమైన కూడలి అంటే నాకు మక్కువ.
ఈ మధ్య కాలంలో కూడలిలో బ్లాగర్లు వ్రాసే దాని కంటే, వ్యాపార పరంగా వ్రాసే వారి హవా ఎక్కువగా నడుస్తున్నట్టుగా కనపడుతున్నది. ఎక్కడెక్కడో ఉన్న వెబ్ సైట్లు, .నెట్ లకు కూడలి నుంచి లింకులు ఇచ్చుకుంటూ వ్రాసే వ్యాసాల వంటివి ఎక్కువవుతున్నాయి. పాపం కూడలి వారు ఎక్కువగా వ్రాసే వారిని "బ్లాగుడు కాయలు" అని ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. బాగానే ఉన్నది. కానీ, రాజకీయ వెబ్ సైట్లు, బ్లాగుల్లా కనపడుతూ పార్టీ ప్రచారాలు చేసుకునే సంస్థల వ్యాసాలూ, ఎక్కువయి పోతున్నాయని నా అభిప్రాయం. Am I wrong!?
ఇవ్వాళ నా కంటికి కనపడిన రెండు అలాంటి బ్లాగులు (!) చేస్తున్న పని వల్ల ఇతర బ్లాగర్లకు జరుగుతున్న అసౌకర్యం ఆ బ్లాగుల్లో నా వ్యాఖ్యలు వ్రాసి, కూడలి వారికి మెయిలు ద్వారా తెలియచేశాను.
అంతకు ముందు బ్లాగులాగా కనపడే పూర్తిగా వ్యాపార ప్రకటనలు వేస్తున్న ఒక బ్లాగు గురించి కూడలి వారికి తెలియచేసాను. వారు పరిశీలించి ఆ బ్లాగును కూడలి నుండి తొలగించారు.
అంతకు ముందు బ్లాగులాగా కనపడే పూర్తిగా వ్యాపార ప్రకటనలు వేస్తున్న ఒక బ్లాగు గురించి కూడలి వారికి తెలియచేసాను. వారు పరిశీలించి ఆ బ్లాగును కూడలి నుండి తొలగించారు.
=================================
Dear Sirs,
Please click on the following Link and see the Web site or Blog:http://buzzi-bangaram.
--
శివరామప్రసాదు కప్పగంతు
SIVARAMAPARASAD KAPPAGANTU
ముంబాయి భారత్ నుండి
FROM MUMBAI, INDIA
|
2 Jan (5 days ago)
|
Reply
| ||
|
Dear Sir,
Thank you for contacting Koodali Support.
We have removed the blog "http://buzzi-bangaram. blogspot.com" from Koodali.
The posts from that blog will not appear on Koodali from now onwards.
We regret for the inconvenience, if any, caused to you in this regard.
Regards,
Koodali Support Team
|
07:41 (0 minutes ago)
|
Reply
| ||
|
Dear Sirs,
Thank
you for your reply and removing the surrogate blog from Koodali. There
are many surrogate blogs in Koodali misusing or abusing the facility in
Koodali. Especially, political/movie related organisations having
their websites, come and just cut paste their articles from such web
site and give links to their commercial websites from Koodali. This is
blatant violation of the founding principles of Koodali. Kodali I
believe is an aggregator for genuine bloggers and not a place for hire
for commercial websites to point their sites to the unsuspecting
bloggers and other normal readers who flock to Koodali to read genuine
blogger writings....... I hope you understand the situation....... Just now I made the following comments in the blogs appearing in
koodali display, which are self explanatory:
SIVARAMAPRASAD KAPPAGANTU has left a new comment on the
post
ఈ మధ్య ఈ కూడలిలో జెన్యూయిన్ బ్లాగులు తక్కువయ్యిపోయి కమర్షియల్ బ్లాగులు ఎక్కువయ్యిపొయ్యాయి. మీరు మీ వ్యాసానికి (వ్యాపర ప్రకటనకు) టైటిల్ పెట్టకుండా ప్రచురించారు ఆ దెబ్బకి కూడలి డిస్ప్లే ఏరియాలో నాలుగు లైనులు ఆక్రమించి, నాలుగు ఇతర బ్లాగులు కనిపించకుండా చేస్తున్నారు. దయచేసి మీ వ్యాసానికి శీర్షిక పెట్టి, అంతలా చోటు ఆక్రమించకుండా చూడండి. కూడలిలో నిర్వాహకులు ఏమి చేస్తున్నారో తెలియదు. . కూడలి అంతా కమర్ష్యీలైజ్ అయిపోయి, నిజమైన బ్లాగర్లకు ఇక్కడకు వచ్చి చూడాలంటే విసుగ్గా ఉన్నది. సాంకేతికపరంగా శీర్షిక లేని వ్యాసాలను ప్రచురించకుండా చెయ్యచ్చు, కూడలి ఆ దిశగా ఎందుకు ఆలోచించటం లేదో తెలియదు. వీరి పోటీ ఆగ్రిగేటర్ చేసిన పని మనమెందుకు చెయ్యాలన్న పట్టుదల కారణమా!!??
SIVARAMAPRASAD KAPPAGANTU has left a new comment on the
post
మీరు మీ వ్యాసానికి (ప్రెస్ రిలీజ్ కు ) టైటిల్ చాంతాడంత పెట్టి ప్రచురించారు ఆ దెబ్బకి కూడలి డిస్ప్లే ఏరియాలో మూడు లైనులు ఆక్రమించి, రెండు ఇతర బ్లాగులు కనిపించకుండా చేస్తున్నారు. దయచేసి మీ వ్యాసానికి శీర్షిక నాలుగైదు మాటల్లో పెట్టి, అంతలా చోటు ఆక్రమించకుండా చూడండి. కూడలిలో నిర్వాహకులు ఏమి చేస్తున్నారో తెలియదు. అంతంత శీర్షికలు పెట్టి కూడలి డిస్ప్లే ఏరియాలో మూడు లైన్లు ఆక్రమిస్తూ, రెండు ఇతర బ్లాగులు కనపడకుండా చెయ్యటం భావ్యం కాదు. బ్లాగు వ్రాసి ప్రచురిస్తే కనపడేదే కాసేపు, ఆ కాసేపు కూడా కనిపించకుండా ఇలా రెండేసి మూడేసి లైన్లు ఆక్రమించె బ్లాగులు (!!??) వస్తే, సామాన్య బ్లాగుల పరిస్థితి ఏమిటి? ఒక బ్లాగు శీర్షిక బ్లాగుల డిస్ప్లే ఏరియాలో ఒక లైను కంటే ఎక్కువ ఆక్రమించకుండా కట్టడి చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కూడలి వారూ, దయచేసి గమనించండి, శీర్షికలో ఒక లైనుకంటే ఎక్కువ డిస్ప్లే లో ఆక్రమించేట్టుగా టైటిల్ పెడితే ఆ టైటిల్ ను ట్రంకేట్ చేసేట్టుగా చెయ్యండి.
I hope you shall review all the blogs linked to Koodali and weed out those abusing the Koodali facility for commercial purpose.
Regards,
శివరామప్రసాదు కప్పగంతు
SIVARAMAPARASAD KAPPAGANTU
ముంబాయి భారత్ నుండి
FROM MUMBAI, INDIA
=================================
కూడలి వారికి సూచన:
- కూడలి కి అనుసంధానించి ఉన్న అన్ని బ్లాగులను ఒక్కసారి సమీక్షించి వారు ఏమేమి వ్రాస్తున్నారు, వ్రాసేది వ్యాపార/రాజకీయ ప్రచార పరంగానా లేక ఔత్సాహిక బ్లాగార్లా అని చూసి, వ్యాపార/రాజకీయ ప్రచారం చేసుకుంటున్న బ్లాగుల విషయానికి ఒక విధానం ఏర్పాటు చేసుకోవాలి. కావాలంటే ఒక లింకు ఇచ్చి అది నొక్కితే అలాంటి బ్లాగులు కనపడేట్టుగా చెయ్యండి. కూడలి తెరవంగానే ఔత్సాహిక బ్లాగర్లు వ్రాసిన కథనాలు కనపడేట్టు, ఒక లింకు నొక్కితే మీ దృష్టి లో వ్యాపార/రాజకీయ ప్రచారం చేసుకునే బ్లాగులు కనపడేట్టు చేస్తే ఈ బాధ కొంత తప్పుతుంది. ఏ బ్లాగును ఈ విభాగంలోకి తేవాలి అన్న విషయం తేల్చుకోవటానికి ఒక విధానం ఉండాలి ఆ విధానం అందరికి తెలిసేట్టుగా ప్రచురిస్తే ఎంతైనా బాగుంటుంది.
- రోజుకి ఒకటికన్నా ఎక్కువ వ్రాసే వారి వ్యాసాలూ రోజుకొక్కటి చొప్పున మాత్రమే ఒక లైనులో ప్రచురితం అవుతూ ఉంటే బాగుంటుంది. ఎప్పుడన్నా వ్రాసే వారి వ్యాసాలూ కనపడే అవకాశం ఉంటుంది.
కూడలి అనంగానే బ్లాగర్లు, బ్లాగు అభిమానులు వచ్చి చదువుకునే మంచి కూడలి గా ఈ మధ్యవరకూ ఉన్న చక్కటి వ్యవస్థను మళ్ళీ తీసుకువస్తే ఎంతైనా బాగుంటుందని నా ఉద్దేశ్యం.
======================================================
పైన వ్రాసిన విషయాలు, సూచనలు కూడలి సంకలినికే కాదు ఇతర సంకలినులకూ వర్తింస్తుంది.
======================================================
శివరాం ప్రసాద్ గారికి ,
రిప్లయితొలగించండినమస్కారం,
"..ఇతర సంకలినిలకూ వర్తిస్తుంది" అన్నారు కనుక కాస్త చెబుదామని.
1.బ్లాగిల్లులో ఒక బ్లాగర్ రోజులో ఒకటికన్నా ఎక్కువ టపాలు వ్రాసినా తాజా టపా మాత్రమే చూపబడుతుంది.( అన్ని టపాలూ చూడాలంటే మొబైల్ సైట్ లో చూడొచ్చు.)
2.టపాకు టైటిల్ లేని పక్షంలో బ్లాగు పేరు టైటిల్ గా చూపబడుతుంది.
3.ఉత్తమ బ్లాగులకు , సాహిత్య, మహిళ,సాంకేతిక అంశాలకు ప్రత్యెక విభాగాలు. ( మరిన్ని విభాగాలు రాబోతున్నాయి.).బ్లాగు ఏదైనా ఆ అంశాన్ని వ్రాస్తే ఆటోమాటిక్ గా అ విభాగంలో చేరుతుంది.
4.బ్లాగు టైటిల్ ఎన్ని లైన్లు ఆక్రమించినా ముందు పేజీలో 90-100 టపాలు కనపడుతాయి.
త్వరలో రాబోతున్న మార్పులు -
వార్తా బ్లాగులు కేవలం వార్తా విభాగంలోనే కనపడేలా చేయడం.
అన్ని బ్లాగులనూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండడం-స్పామింగ్ బ్లాగులకు ఓ ప్రత్యెక విభాగ ఆలోచన ఉంది.
ప్రతీ విషయంలోనూ మీ సలహాలను ఎల్లప్పుడూ ఆహ్వానిస్తూనే ఉన్నాం.
శ్రీనివాస్ గారూ నమస్తే. మీ స్పందనకు ధన్యవాదలు. విషయాలు తెలిపినందుకు థాంక్స్. నా దృష్టిలో ఏ సంకలిని ఐనా సరే వ్యాసాని ఉన్న శీర్షిక ఒక్క లైనుకే పరిమితమయ్యేలా చేస్తే బాగుంటుంది. ఒక లైనుకంటే ఎక్కువగా ఉంటె, ఒక లైనులో ఎంత కనపడితే అంతే కనపడేట్టుగా చెయ్యాలి. అప్పుడు, చాంతాండంత శీర్షికలు పెట్టే (దుర!)అలవాటు మెల్లిగా తగ్గుతుంది. మరొక పొరబాటు అప్పుడప్పుడూ గమనిస్తున్నాను. ఏ బ్లాగరన్నా శీర్షిక పెట్టకుండా వ్యాసం ప్రచురిస్తే, అ వ్యాసం మొదటి రెండు మూడు లైన్లు శీర్షికగా కనపడుతుంది. ఆ పధ్ధతికి స్వస్థి చెప్పాలని ఇతర సమలినుల నిర్వాహకులకు నా సూచన.
తొలగించండి