సంక్రాంతి సందర్భంగా అందరికీ శుబాకాంక్షలు
పై చిత్రం తెలుగు పండుగలు, దేవుళ్ళు బ్లాగ్ నుండి తీసుకొనబడింది |
రామాయణ భారతాలు జరిగాయా నిజంగా! అని కొంతమంది తెలిసో తెలియకో లేక వారి వారి రాజకీయ ప్రయోజనాలకో వితండ వాదానికి దిగుతారు. ఈ విషయంలో నాకు ఒక్కటే గుర్తుకొస్తుంది. గాంధీ సినిమా చూస్తుంటే, మొదటి సీనులోనే, గాంధీ అంత్యక్రియలు జరుగుతుండగా విదేశీ విలేఖరులు, రేడియోలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, గాంధీ గారి గురించి ప్రముఖ సైంటిస్టు ఐన్‌స్టీన్ గాంధీ గారి 70 వ పుట్టినరోజు సందర్భంగా అన్న మాటలను ఉదహరిస్తారు. ఐన్‌స్టీన్ ఏమన్నారో చూడండి:
"Generations to come, it may well be, will scarce believe that such a man as this one ever in flesh and blood walked upon this Earth.”"ఇలాంటి మహా వ్యక్తి మనలాగే మనిషి రూపాన ఈ ప్రపంచంలోనే జీవించాడు అంటే రాబొయ్యే తరాల్లో నమ్మలేరు"
మరొక 50 సంవత్సరాల తరువాత (వేల సంవత్సరాల తరువాత కాదు) గాంధీ గారు ఎవరు అంటే, గాంధీ సినిమా చూడండి అనీ సమాధానం వచ్చి, అదేదో గాంధీ "కథ" అనుకునే అవకాశం లేకపోలేదు! ఐన్‌స్టీన్ గారు భవిష్య దృష్టితో చెప్పినది అదే. ఈ మధ్యనే కోయంబత్తూర్ లో అనుకుంటాను నెల్సన్ మండేలా కు
నివాళిగా ఏర్పాటు చేసిన ప్లేక్సీలో ఆయనే మండేలా అనుకుని మోర్గాన్ ఫ్రీమన్ (ఇన్‌వెక్టస్ సినిమాలో నెల్సన్ మండేలా పాత్ర ధరించిన నటుడు) ఫోటో ఉంచిన ఉదంతం మనకు తెలిసినదే. తమ టార్గెట్ వర్గాన్ని ఆకట్టుకోవటానికి చేసిన నటనా నివాళి అది! లేకపోతె అలాంటి ఘోర తప్పిదం జరిగే అవకాశం ఉన్నదా! "ఇన్‌వెక్టస్" అనేది ఒక ఆంగ్ల పద్యపు శీర్షిక. అర్ధం ఓటమి లేనిది అని, నెల్సన్ మండేలా దశాబ్దాలపాటు జైల్లో ఒంటిరి జీవితం గడిపినప్పుడు, ఆ పద్యం పదే పదే చదువుకుంటూ స్వాంతన పొందారు. అందుకని మండేలా మీద తీసిన సినిమాకు ఆ పేరు పెట్టారు.
మనకు ప్రస్తుతానికి కాల నిర్ణయం అంటే, క్రిస్టియన్ లెక్క ప్రకారమే కాని, మన హిందూ కాలమానం ఉన్నా కూడా తెలియని పరిస్థితి. హిందూ కాలమానం అనుసరిచాలంటే, కుదరని సాంఘిక పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా ఎవరి కాల గణనం దేశానికి ఒక విధంగా చేసుకుంటూ ఉంటే జరిగే గందరగోళ పరిస్థితి. అందుకని ప్రపంచంలో ప్రస్తుతానికి అందరూ వాడుతున్న రోమన్ కాలెండరే అంతర్జాతీయంగా వాడుకలో ఉన్నది. మనకు ప్రస్తుతం తెలిసిన తేదీల పద్దతితోబాటుగా హిందూ కాలమానాన్ని ప్రభుత్వం వారు వారి అధికారిక ప్రకటనల్లో ప్రచురిస్తున్నా, ఆ పద్దతిన సామాన్య ప్రజలు ముఖ్యంగా పట్టణాల్లో ఉదహరించటం అనేది జరగటం అరుదు.
కాబట్టి మన ఇతిహాసాలకు కూడా కాల నిర్ణయం చెయ్యాలంటే, ఫలానా యుగంలో రామాయణం జరిగింది అంటే తెలుసుకోగల శక్తి ఉన్నవారు తక్కువ.
ఏదో మాకు తెలిసినప్పటి నుంచి లెక్కెపెట్టుకుంటూ వస్తున్నాము, మా పురాణాల్లో జరిగిన ఒక సంఘటన తరువాత ముందు అంతే! అంతకంటే మరేమున్నది! ఆ పురాణ సంఘటనే కాలగమనానికి పునాది అని నిర్ణయించేశారు. వారి పురాణ సంఘటనకు తరువాత లెక్క మామూలుగా 1,2,3.... అని జరిగితే ఆ సంఘటనకు పూర్వం లెక్క వెయ్యాలంటే సంవత్సరాలు వెనక్కు లెక్క వెయ్యాలిసిందే, అన్నది ప్రస్తుతానికి (ఇదే కాల గణనా పధ్ధతి ఎప్పటికీ ఉండి తీరుతుంది అనుకోలేము) అప్రస్తుతం కాదని మనని 200 ఏళ్ళు పరిపాలించి మనకు వారి కాల నిర్ణయ పద్ధతిని అందించి వెళ్ళారు ఆంగ్లేయులు. మనకే కాదు, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆక్రమించిన ఆంగ్లేయులు, తమ సామ్రాజ్యంలో ఉన్న ఆయా సామాజిక ఆచార వ్యవహారాలూ, భాషలను దాదాపుగా ధ్వంసం చేసి వారి భాష మాత్రమె భాష అనే భావన కలిగించటంలో విజయం సాధించారని చెప్పక తప్పదు. స్వాతంత్ర్యం వచ్చిందని, అలా వచ్చి ఆరు దశాబ్దాలు పైగా జరిగిపొయ్యాయని అని నమ్మిన తరువాత కూడా, అచ్చ తెలుగు పదాలు వాడుకలోకి తేవాలంటే కొన్ని కొన్ని పదాలకు ఆంగ్ల పదాలనే ఆకారమో ఉకారమో తగిలించి తెలుగు చెసుకొగలమే కాని, అసలు తెలుగు పదాలు కూర్చుకోలేని స్థితి మనది. సరే అది వేరొక చర్చ.
ఏదో మాకు తెలిసినప్పటి నుంచి లెక్కెపెట్టుకుంటూ వస్తున్నాము, మా పురాణాల్లో జరిగిన ఒక సంఘటన తరువాత ముందు అంతే! అంతకంటే మరేమున్నది! ఆ పురాణ సంఘటనే కాలగమనానికి పునాది అని నిర్ణయించేశారు. వారి పురాణ సంఘటనకు తరువాత లెక్క మామూలుగా 1,2,3.... అని జరిగితే ఆ సంఘటనకు పూర్వం లెక్క వెయ్యాలంటే సంవత్సరాలు వెనక్కు లెక్క వెయ్యాలిసిందే, అన్నది ప్రస్తుతానికి (ఇదే కాల గణనా పధ్ధతి ఎప్పటికీ ఉండి తీరుతుంది అనుకోలేము) అప్రస్తుతం కాదని మనని 200 ఏళ్ళు పరిపాలించి మనకు వారి కాల నిర్ణయ పద్ధతిని అందించి వెళ్ళారు ఆంగ్లేయులు. మనకే కాదు, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆక్రమించిన ఆంగ్లేయులు, తమ సామ్రాజ్యంలో ఉన్న ఆయా సామాజిక ఆచార వ్యవహారాలూ, భాషలను దాదాపుగా ధ్వంసం చేసి వారి భాష మాత్రమె భాష అనే భావన కలిగించటంలో విజయం సాధించారని చెప్పక తప్పదు. స్వాతంత్ర్యం వచ్చిందని, అలా వచ్చి ఆరు దశాబ్దాలు పైగా జరిగిపొయ్యాయని అని నమ్మిన తరువాత కూడా, అచ్చ తెలుగు పదాలు వాడుకలోకి తేవాలంటే కొన్ని కొన్ని పదాలకు ఆంగ్ల పదాలనే ఆకారమో ఉకారమో తగిలించి తెలుగు చెసుకొగలమే కాని, అసలు తెలుగు పదాలు కూర్చుకోలేని స్థితి మనది. సరే అది వేరొక చర్చ.
ఈ విధంగా ఆలోచిస్తూ రామాయణ కాల నిర్ణయం చెయ్యగలమా అని డాక్టర్ పి వి వర్తక్ అనే ఆయన కొంత అధ్యయనం చేసారుట. వారి అధ్యయన వివరాలు సెప్టెంబరు 15, 1981 లో ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం అయినట్టుగా తెలుస్తున్నది.
మాకు దగ్గిర బంధువు ఐన శ్రీ రాళ్ళబండి మురళీ కృష్ణ గారు తమ తాతగారైన రాళ్ళబండి వెంకట శాస్త్రి గారు ఈ విషయం మీద ఎంతో ఆసక్తిగా పరిశీలించేవారని, అప్పట్లో వచ్చిన వార్త ఆయన వ్రాసుకున్న కాయితాలు దొరికి నాకు పంపారు. ఈ కింది ఇమేజ్ ఫైళ్ళను క్లిక్ చేసి చదువుకోవచ్చు.
అప్పట్లో ఈ వార్త గురించిన చర్చ జరిగే ఉంటుంది. నాదగ్గర పాత వార్తా పత్రికల సాఫ్ట్ కాపీలు ఆయా పత్రికలు మొదలు పెట్టినప్పటి నుండి ఉన్నాయి (శ్రీ శ్యాం నారాయణ సౌజన్యం). కాని అటు ఆంధ్ర పత్రిక దినపత్రిక కాని, ఇటు ఆంధ్ర ప్రభ దినపత్రిక కాని, ఆ భాండారంలో సరిగ్గా సెప్టెంబరు 1981 పత్రికలే లేవు. కాబట్టి ఆ వార్త మీద అప్పట్లో చర్చ జరిగినదా లేదా, జరిగితే ఆ జరిగిన చర్చా వివరాలు తెలియటం లేదు.
మురళీ కృష్ణ గారు ఈ వార్త మీద ఇప్పుడు చర్చ జరిగితే తెలియవలసిన విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందుకని, ఇక్కడ పైవిధంగా స్వర్గీయ వెంకటశాస్త్రి గారు వ్రాసుకుని భద్రపరిచిన అలనాటి వార్తా విశేషాన్ని అందించటం జరిగింది. ఆసక్తి కలవారు, విషయం తెలిసి చర్చలో పాల్గొంటే సంతోషం.
oooOooo
అసలు ఈ వర్తక్ అనే ఆయన ఎవరు అని గూగులమ్మని అడిగితె, ఆయన పేరు మీద ఒక వెబ్ సైటే ఉన్నదని చెప్పింది.
డాక్టర్ పి వి వర్తక్ |
వర్తక్ గారి గురించి తెలుసుకునే జిజ్ఞాసువులకు ఈ కింది లింకు ఉపకరిస్తుంది. ఆ లింకు నొక్కి వారి వెబ్ సైటు చూసి ఆయన చేసిన కృషి అవలొకించి అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు.
దీనిలో చాలా సందేహాలు ఉన్నాయి.
రిప్లయితొలగించండిమొదటిగా రామాయణంలో వారాల ప్రసక్తి లేదు. మీరు ఎక్కడైనా గమనించండి రామాయణం లో వారాల ప్రసక్తి లేదు.
రామాయణంలో రాముని జనన కాలంలో కూడా నవమి అని తిథి చెప్పారు. అదితి దైవత్యే అని నక్షత్రం చెప్పారు. ఐదు గ్రహాలు ఉచ్ఛ స్తితి లో ఉన్నాయని చెప్పరు. ఎక్కడా వారాల ప్రసక్తి లేదు.(బాలకాండ సర్గ 18)
తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |౧-౧౮-౮|
నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు |
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |౧-౧౮-౯|
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం |
కౌసల్యా అజనయత్ రామం సర్వ లక్షణ సంయుతం |౧-౧౮-౧౦|
పట్టాభిషేకం సమయంలో కూడా వారాల ప్రసక్తి లేదు. పూజ్య గురువులు చాగంటి వారు కూడా రామాయణ కాలంనాటికి వారాల ప్రసక్తి లేదని చాలా సార్లు చెప్పారు.11000 సంవత్సరాలు అతిశయోక్తి అని భావించడాన్ని కూడా సందేహించ వచ్చు. ఎందుకంటే యుద్ధకాండలోనూ, బాలకాండలోనూ ఈ మాట చెప్పారు. దశరధుడు 60000 సంవత్సరాలు రాజ్యపాలన చేసాడని చెప్పారు. యుగ ధర్మం ప్రకారం సాధ్యం అయ్యి ఉండవచ్చు.
7292 లో రాముడు అయోధ్యకి తిరిగి వస్తే, 110 సంవత్సరాలు రాజ్యం చేస్తే 7192 నాటికి త్రేతాయుగం అంతిమ కాలంలో ఉండాలి. 5561 లో భారత యుద్ధం జరిగినదని వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ద్వాపరయుగం మొత్తం కూడా పదిహేను వందల సంవత్సరాల్లో అయిపోవాలి. కాని ద్వాపరం పరిమాణం 4,32,000 సంవత్సరాలు. సరే వారన్నట్టు 1000 సంవత్సరాలను పది అనుకున్నా 4320 సంవత్సరాలు ద్వాపరం పరిమాణం కావాలి. కానీ రెండు వేల సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి.
కొంచెం నిశితంగా పరిశీలించ వలసిన విషయం ఇది.
మనోహర్ గారూ,
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు చెప్పినది నిజమే. రామాయణంలో ఎక్కడా వారాల ప్రసక్తి లేదు. మనకు ఆదివారం లేదా రవి వార్ అనేది ఆంగ్లంలో ఉన్న సన్‌డే కు సరిపోలుతున్నది. అలాగే దాదాపుగా ఇతర వారాలు. అంటె, ఈ వారాలు మన సంస్కృతి యూరోపియన్ సంస్కృతితో సంపర్కం ఏర్పడినతరువాత వచ్చి ఉండవచ్చు. మనం తిథుల ప్రకారం రోజును విడగొట్టి వ్యవహారాలు నడుపుకోవటం కష్టం కాబట్టి, అంటే తిథులు రోజు మధ్యలో మొదలవుతాయి అలాగే రోజులో ఏదో ఒక టైములో అంతం అవుతాయి, కాబట్టి సౌకర్యానికి వారాలు యూరోపియన్ వారి నుండి తీసుకుని భారతీయ భాషల్లోకి అనువదింపబడి ఉండి ఉంటాయంటారా. ఏమో మరి అయ్యి ఉండవచ్చు అనిపిస్తున్నది.పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఈ మధ్యవరకూ కూడా అంటె 20 శతాబ్దపు మొదటి 30-35 ఏళ్ళల్లో అమావశ్య, పౌర్ణమిలకు శలవ ఉండెది, ఆదివారానికి కాదు అని. రాను రాను మనం యూరోపియన్ సంస్కృతిలోకి ఇంటిగ్రేట్ అయిపోయ్యి ఉంటాము. యూరోపియన్లు, మనలాగా సూర్యోదయం, సూర్యాస్తమయమాలను తీసుకుని రోజును నిర్ణయించరు. వాళ్ళకి రాత్రి పన్నెండు తరువాత రోజు మారుతుంది. మనకు తెల్లవారుఝామున, అంటె సూర్యోదయానికి మారుతుంది. అంటె సూర్యుని వెలుగు కనపడితేనే రోజు మోదలయ్యినట్టు. మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళల్లో కొందరు ఆకాశం మేఘావృతమై సూర్యుదు కనపడకపోతే ఆరోజు భోజనం చేసేవాళ్ళు కాదు. సూర్యుడు కనపడి, సూర్యుణ్ణి ప్రార్ధిస్తేనే అన్నం తినటం.
యూరోపియన్లు ఋతువును బట్టి వాళ్ళ వాళ్ళ టైమును కూడా ఒక గంట పెంచటం తగ్గించటం చేస్తూ ఉంటారు. మన దేశంలో కూడా పశ్చిమానికి వచ్చేప్పటికి సాయంత్రాలు దాదాపుగా 7 గంటలవరకూ ఉండటం, తూర్పుకు వెళ్ళిన కొద్దీ, సూర్యోదయం 4-4.30 కే అవ్వటం, సాయంత్రాలు 5 కల్లా చీకటిపడటం గమనిస్తాము. కాని దేశం మొత్తానికి ఒక్కటే టైం జోన్. ఈ మధ్యనే అస్సాం ముఖ్య మంత్రి అనుకుంటాను, తూర్పు రాష్ట్రాలకు విడిగా టైం జోన్ పెట్టాలని అడిగారు (వాళ్ళు ఇప్పటికె అన్అఫీషియల్‌గా ఒక గంట ముందుకు నడిపి కాల నిర్ణయం చేసుకుంటున్నారుట).