తెలుగు వాడుక పదాలు అనంగానే మనకు తెలుగులో పద గుంపులు గుర్తుకు వస్తాయి. ఈ మధ్య వీళ్ళ ఉధృతం తగ్గింది కాని, ఈ మధ్యవరకూ కూడా ఇదేదో ఇప్పుడు చెయ్యకపోతే ప్రళయం వచ్చేస్తుంది అన్నంత విపరీతంగా కనిపించిన ప్రతి పదానికీ వాళ్లకు తోచిన, వాళ్ళ బుర్రలకు అందిన పదాలు సృష్టించి పారేశారు ఈ డ్రాయింగ్ రూం భాషావేత్తలు . వీళ్ళు తయారుచేసిన అనేకానేక పదాలు వెర్రి మొర్రిగా ఉండి వాడుకకు నోచుకోలేదు, కారణం పదం అనేది సామాన్య జనం నుండి వాడుకలో పుట్టాలి కాని డ్రాయింగ్ రూముల్లోంచి కాదు. పైగా ఆ తయారు చెయ్యబడిన పదాలన్నీ కూడా ఆంగ్ల పదాలకు అనువాద పదాలే! అనువాద పదాలు వాడుక పదాలు కావటం అసాధ్యం.
ఈరోజు (10 02 2014) అనుకోని శలవు కారణాన ఇంటర్నెట్ లో అలా విహరిస్తూ ఉండగా సుజనరంజని మాసపత్రిక కనపడింది. అందులో మే,2013 సంచికలో రావూరి భరద్వాజ గారితో, వారికి జ్ఞానపీఠ్ బహుమతి వచ్చిన సందర్భంగా చెయ్యబడ్డ ఇంటర్వ్యూ కూడా ఉన్నది. ఆ ఇంటర్వ్యూలో, ఒక ప్రశ్నకు జవాబు చెబుతూ తెలుగులో ఇంగ్లీషు పదాల గురించి చక్కటి జవాబు చెప్పారు. ఈ కింది వీడియో ఆ ఇంటర్వ్యూ నుండి గ్రహింపబడినది. చూడండి.
పై ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలంటే రెండు భాగాలుగా సుజన రంజని నెట్ పత్రికలో ఉన్నది. ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.
జ్ఞానపీఠ్ బహుమతి అందుకున్న రావూరి భరద్వాజ గారి మీద గౌరవం తో అన్నా అనవసరపు అనువాదపు పదాలు తయారు చెయ్యకుండా ఉండాలని నా భావన.
===============================================
మునుపు ఇదే బ్లాగులో ఈ విషయం మీద వ్రాసిన వ్యాసాలను ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు
===============================================
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.