21, ఏప్రిల్ 2014, సోమవారం

మిష్టర్ బీన్ ఎన్నికల ప్రచారం మనకు ఎన్నికల కార్తె వచ్చేసింది, ఎన్నికల్లో కొన్ని కలలు  పెట్టెల్లో పెట్టి సీలు  వేశేశారు,  మరి కొన్ని కలలు వేళ్ళ చివర్ల వేళ్ళాడుతున్నాయి మరి! ఈ సమయంలో హఠాత్తుగా మనకందరకూ సుపరిచితమైన మిష్టర్ బీన్,  అవును "బీన్" సరిగ్గానే చదివారు, ఎన్నికల ప్రచారపు హడావిడి మొదలుపెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ బ్రేకింగ్ న్యూస్ ఈ కింది వీడియోలో చూసి హాయిగా నవ్వుకొండి. మిష్టర్ బీన్ ఎన్నిక కావటానికి,  ప్రత్యర్ధులకు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా  రాకుండా బీన్ కొత్త దారేమీ తొక్కలేదు. మన భారత దేశంలో (అతి పెద్ద  ప్రజాస్వామ్యం!) అనుసరిస్తున్న దేశవాళీ పద్ధతినే హాయిగా వాడుకున్నాడు. చూసి సరదా పడండి.  రోవాన్ అట్కిన్‌సన్  కు రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నికలప్పుడు   పాల్పడే చౌకబారు "చేష్టలు" అంటే ఎంతటి అసహ్యమో తన హాస్యాన్ని మేళవించి చాలా చక్కగా చెప్పాడు. చివరగా, ఎన్నికల ఫలితాలు ప్రకటించి ఆ రిటర్నింగ్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. కొసమెరుపు అద్భుతం. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.