5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

మీకు బాపు గారు ఉత్తరం వ్రాశారా!

బాపు గారి ఉత్తరం,  వారి అద్భుత చేతి వ్రాతతో వ్రాయబడిన ఉత్తరం, అందుకున్న అదృష్టవంతుల్లో  మీరు కూడా  ఒకరా! ఐతే మీ అదృష్టాన్ని అందరితో పంచుకునే అవకాశం  మనకున్న ఏకైక సాహిత్య పత్రిక "రచన" ఇవ్వనున్నది. మీ దగ్గర బాపు గారు మీకు గాని మీ ఇంట్లో ఎవరికన్నా కాని ఉత్తరాలు వ్రాసి ఉంటే, ఆ ఉత్తరం స్కాన్ చేసి రచన పత్రికు పంపితే అక్టోబర్ మాసపు సంచికలో అలా వారి వద్దకు వచ్చినవి అన్నీ గుదిగుచ్చి ప్రత్యేక సంచికగా వేస్తారుట. ఎంతటి అద్భుత అవకాశం ! 

ఆలశ్యం  దేనికి? ఈ కింది ఇమేజి ఫైలు క్లిక్ చేసి వివరాలు తెలుసుకోగలరు. 
 పెద్దదిగా చూడటానికి ఇమేజి మీద క్లిక్ చెయ్యండి 

1 వ్యాఖ్య:

  1. మంచి ప్రయత్నం చేస్తున్నారు. రచన పత్రిక వారికి, ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా పోస్టు వ్రాసిన మీకు అభినందనలు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.