31, అక్టోబర్ 2014, శుక్రవారం

అక్టోబర్ 31 1984 :: ప్రత్యక్ష సాక్షి కథనం




ఇందిరా గాంధీ హత్య జరిగి, మూడు దశాబ్దాలు.  బి బి సి వారి ఆర్ఖైవ్స్ చూస్తుంటే, వారి కార్యక్రమాలలో  "విట్నెస్ " అనే కార్యక్రమంలో చారిత్రాత్మిక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు తాము చూసినది వివరించే వీడియోలు ఉన్నాయి. అక్టోబరు 31 1984 న అప్పటి ప్రధాని  ఇందిరా గాంధీ గాంధీ హత్య కావించబడినప్పుడు ఆవిడ పక్కనే ఉన్న  సెక్రటరీ ఆర్ కే ధావన్ ఆనాటి సంఘటనలు వివరించిన వీడియో:


ఆ రోజున ఇందిరాగాంధీ పీటర్ ఉస్తినోవ్ అనే  విలేఖరి కి టివి ఇంటర్వ్యూ ఇవ్వటానికి తన ఇంటి పక్కనే ఉన్న ఆఫీసుకు నడిచి వెడుతుండగా ఆవిడ అంగరక్షకులే దాడి చేసి హత్య చేసారు. ఈ ఉదంతం మొత్తం ఆ విలేఖరి వీడియో తీశారని, ఆది ఆరోజే బి బి సి లో చూపించారని అని అంటారు కాని అటువంటి వీడియో ఎక్కడా కనపడదు. ఇప్పటికి కూడా ఆ వీడియో ప్రజలు చూడగాలిగేట్టుగా ఉంచితే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియని పరిస్థితి.

ఏది ఏమైనా సేక్యూలరిజం అనే మూఢనమ్మకానికి బలైపోయిన మరొక గాంధీ ఇందిరా గాంధీ. భద్రతా అధికారులు/నిపుణులు చెప్పిన సలహాలు విని ఉంటే ఇందిరా గాంధీ దాదాపుగా తన మరణాన్ని తానె కొని తెచ్చుకున్న పరిస్థితి వచ్చేది కాదు అనిపిస్తుంది.

07 12 2014 న చేసిన అప్డేట్ 

ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు ఇందిరాగాంధీ మరణించిన సందర్భంగా వ్రాసిన ఎలిజీలో 1966-67 సంవత్సరాల్లో ఇందిరాగాంధీకి ఉన్న  పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల గురించి వివరించి, 1984 వచ్చేసరికి ఆ ఏర్పాట్లల్లో ఎంతటి నిర్లిప్త ధోరణి ప్రబలిందో ఉదాహరణతో వ్రాశారు. ఆ వ్యాసం చివర్లో భధ్రతా అధికార్లకే  కాక నాయకులు కూడా శిరోధార్యంగా ఉంచుకోవాల్సిన మాటలు  వ్రాశారు:

"పాము కాటువేస్తుందన్న నిజం కొత్త కాదు, పాముని దూరంగా ఉంచలేని, పాము నుంచి దూరంగా ఉండలేని, అజ్ఞానమో ఆశక్తతో క్షమార్హం కాదు". 

అక్షర లక్షలు విలువ చేసే మాట. విన్న వాళ్లకు ఉపయోగం, వినని వాళ్ళు మళ్ళీ వినలేని స్థితికి చేరుకోవటం తధ్యం.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.