ఇంటర్నెట్లో వేల రేడియోలు ఉన్నాయి. కానీ అన్నీ మనం వినలేము, వినలేము అంటే
నిజంగా వినలేము అని కాదు, వినగలిగే శక్తి ఉండదు. కారణం ఇంటర్ నెట్
రేడియోల్లో ఎక్కువ భాగం చెత్త కంటెంట్ మాత్రమే ఉంటుంది, లేదంటే ఎక్కడో ఉన్న
ఎఫ్ ఎం రేడియో లో వచ్చే లైవ్ కంటెంట్ మనకు వినిపిస్తారు. సరదాగా
న్యూజీలాండ్ లో ఎఫ్ ఎం రేడియో ఎలా ఉంటుంది, లేదంటే, వెస్ట్ ఇండీస్ లో ఎఫ్
ఎం రేడియో ఎలా వినిపిస్తుంది అన్న ఆసక్తి కోసం వినాలి తప్ప, అలాంటి తామర తంపర రేడియోలను మనం రోజూ వినలేము.
అందుకని తెలుగులో ఉన్న ఒక అద్భుత ఇంటర్నెట్ రేడియో ఈరోజు మీకు పరిచయం చెయ్యాలని ఈ నాలుగు మాటలో వ్రాసే ప్రయత్నం చేస్తున్నాను.
అందుకని తెలుగులో ఉన్న ఒక అద్భుత ఇంటర్నెట్ రేడియో ఈరోజు మీకు పరిచయం చెయ్యాలని ఈ నాలుగు మాటలో వ్రాసే ప్రయత్నం చేస్తున్నాను.
నిన్న అక్యు రేడియో పరిచయం చేసినాక, కొన్ని సంవత్సరాల నుంచీ నేను వింటున్న
"అన్నమయ్య అంతర్వాణి " ఇంటర్నెట్ రేడియో గురించి వ్రాయకపోతే, తెలుగు వాడు తోటి తెలుగు వాణ్ణి మెచ్చుకోడు అన్న అపప్రధకు నేను మినహాయింపు అనుకునే అవకాశం లేదు కదా అన్న ఆలోచనతో వెంటనే, ఈ రేడియో గురించి వ్రాయటం మొదలు పెట్టాను. నాకు కూడా చూడండి ఆంగ్ల రేడియోని పరిచయం చేసిన అనంతరమే తెలుగు రేడియో పరిచయం చెయ్యాలని ఆలోచన వచ్చింది! ఏమి చేస్తాం, మన తెలుగు గాలిలోనే ఏదో ఉన్నది. మనవాళ్ళ గొప్పతనం మనకు ముందుగా గుర్తుకు రాదు.
రేడియోలో భక్తిరంజని వింటూ పెరిగిన తరంవారు, ఆ భక్తిరంజని వినపడని దూరప్రాంతాల్లో నివసిస్తూ ఉంటే, ఆ హాయైన పాత రోజులు జ్ఞాపకానికి తెచ్చుకుని ఆనందించాలి తప్ప మరొక అవకాశం లేదు అనుకుని, ఆ భక్తి రంజని ఇప్పుడు వినలేముకదా అని కొంత బాధ కలగటం సహజం.
అలా భక్తిరంజని తలుచుకునే నాలాంటి మునుపటి తరం వాళ్ళకు, అన్నమాచార్య సంకీర్తనం విందామన్న ఆసక్తి ఉన్నవాళ్ళ కోసం ఈ పరిచయం
ఈ రేడియో ఏమిటి, అందులో ఎలాంటి పాటలు వస్తాయి అనే విషయం తెలుసుకోవటానికి ముందుగా ఈ తెలుగు ఇంటర్నెట్ రేడియోలో వచ్చే పాటలు ఎంత అద్భుతమైన క్వాలిటీ తో వినపడతాయో, వినెదముగాక. అడాసిటీ లో రికార్డ్ చేసి, ఎంపి-3 ను వీడియోగా మార్చి, యు ట్యూబ్ లోకి ఎక్కించాను.
అన్నమయ్యఅంతర్వాణి రేడియో వినటం ఎలా! ఐ పాడ్ కాని అండ్రాయిడ్ సెల్ ఫోనుల్లో కాని, అలాంటి మరే ఇతర పాడ్లల్లో కాని, ఈ రేడియో "యాప్" ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలా! యాపిల్ స్టోర్ కు వెళ్ళి Samkeertana అని టైపు చెయ్యాలి, అంతే ఈ యాప్ కనపడుతుంది. ఆ తరువాత ఏమి చెయ్యాలో తెలియని వాళ్ళు కాదుకదా మీరు! కాకపొతే, ఒక చిన్న విషయం, ఐ పాడ్లో ios-7 కాని ఆ తరువాత వెర్షన్ కాని ఉండాలి
నాకు ఐ పాడ్ లేదు, అలాంటి సేల్లూ లేదు అనుకునేవాళ్ళకు వీలుగా పి సి లో కూడా ఈ రెడియో వచ్చును అని తెలియచెయ్యటానికి సంతోషిస్తున్నాను. పిసి లో ఐతే, ఈ కింది లింకు నొక్కితే చాలు ఈ రేడియో కనపడుతుంది.
పైన ఉన్న లింకు నొక్కంగానే రేడియో కనపడుతుంది కాని పాట వినపడదు. ఇదేమిటి అని కంగారు పడకండి. మీకు ఒక ప్లేయర్ కనపడుతుంది. అందులో ఉన్న "Play" టాబ్ నొక్కంగానే పాట మొదలవుతుంది.
పాటలు విన్న తరువాత ఇష్టమైతే "ఫేవరెట్స్" లో సేవ్ చేసుకుంటే కావాలిసినప్పుడు మళ్ళీ మళ్ళీ వినవచ్చు. పి సి లో ఇంటర్నెట్ ఎక్ష్ప్లొరర్ లో ఈ రేడియో రాదు. మరెలా అంటే మీ పిసి లో ఫైర్ ఫాక్స్ (మొజిల్లా) కాని, గూగుల్ క్రోమ్ కానీ లేదా యాపిల్ సఫారీ కాని ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రేడియోని వినగలరు. ఫైర్ ఫాక్స్, క్రోమ్, సఫారీ ఇవన్నీ మీ కంప్యూటర్ ను ఇంటర్నెట్ కు అనుసంధించే సాఫ్ట్వేర్లు.
ఇవ్వేమిటో మాకు తెలియదు అని చేతులు దులిపెసుకునే ప్రయత్నం చేసే నిరక్షరాస్యులు (చాలా మంది ఆ నిరక్షరాస్యతే గొప్ప అర్హతగా చెప్పేసుకుంటూ ఉండటం విన్న బాధితుల్లో నేనొకణ్ణి మరి! ఇంతకంటే ఘోరం, తెలుగును తెలుగు లిపిలో వ్రాయలేని నిరక్ష్యరాస్యులను కూడా పళ్ళ బిగువున బలవంతానా భరిస్తున్నాము), ఇంట్లోకాని పక్కింట్లో కాని ఉండే ఎల్ కే జీ చదివే పిల్లవాణ్ణి కేకేస్తే వాడు మీకు కావలిసినది క్షణాల్లో తెప్పించి ఇవ్వగలడు. మనకు తెలియనప్పుడు మనకంటే చిన్న వాళ్ళ దగ్గరనుంచి చిన్న సహాయం కోరటంలో, వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకోవటం లో తప్పేమీ లేదు అని నా అభిప్రాయం

ఈ రేడియోలో ఉన్న ప్రత్యేకతలు:
- రేడియో పేరు అన్నమయ్య అంతర్వాణి అని ఉన్నా కూడా రామదాసు రేడియో కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నది. ఇదే రేడియోలో పై భాగంలో చూస్తె "Sree Ramadasu" అని కనిపిస్తుంది. అక్కడ మౌస్ కర్సర్ ఉంచితే "Radio" అని కనిపిస్తుంది. రేడియో ను క్లిక్ చేస్తే, రామదాసు కీర్తనలు వినవస్తాయి. కాని రామదాసు కీర్తనలకు ప్రస్తుతం సాహిత్యం కనపడటంలేదు. ఐ పాడ్లో రామదాసు రేడియో నాకు కనపడలేదు.
- మనం ఎంతసేపు వినాలంటే అంతసేపూ వింటూనే ఉండవచ్చు.
- అయిపోయిన పాట మళ్ళీ వినాలంటే "బాక్" టాబ్ నొక్కి వినవచ్చు.
- ఈ పాట కాదు తరువాత పాత విందాము అనుకుంటే, "నెక్స్ట్" టాబ్ నొక్కితే తరువాత పాట వచ్చేస్తుంది.
- అనమచార్య కీర్తనలు వస్తున్నప్పుడు ఆ కీర్తన సాహిత్యం మనకు తెలుగులో కనిపించే సౌకర్యం కలిపించారు. ఇది పి సి లో సీదాగా కనపదుతుంది, ఐపాడ్లో ఐతే కొంత ప్రయత్నం చెయ్యాలి.
- పాట వస్తుండగా, పాడిన గాయకీ గాయకుల పేర్లు "స్క్రోల్" అవుతూ కనిపిస్తాయి.
- ఐ పాడ్లో పాట వస్తుండగా సాహిత్యం కనపడాలంటే "Lyrics" టాబ్ నొక్కాలి. సాహిత్యం అందుబాటులో ఉంటే కనపడుతుంది. ఇదే పి సి లో ఐతే పాట వస్తుండగా ఆ కిందనే సాహిత్యం కనపడుతుంది.
- సాహిత్యాన్ని ప్రింట్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది.
ఆసక్తి ఉన్నవారు ఈ రేడియో ను విని తమకు తెలిసిన వారికి కూడా పరిచయం చేస్తే మన తెలుగు రేడియో, అందులో చక్కటి అన్నమయ్య, రామదాసు కీర్తనలు నిరంతరం వినిపించే అద్భుతమైన రేడియో ఆదరణ పొంది, ఈ రేడియో నిర్వాహకులకు మరింత ప్రోత్సాహిన్నిస్తుంది అనటంలో సందేహం లేదు కదా!
నాకు ఒక పెద్ద ఆశ ఉన్నది, మరి అది తీరుతుందో లేదో! తెలుగులో ఇంటర్నెట్ లో మనకు కావలిసిన అపాటలన్నీ కూడా ఒకటే రేడియోలో వచ్చేట్టుగా అంటే, జానపద సంగీతం, భక్తీ పాటలు, కర్ణాటక సంగీతం, పాత సినిమా పాటలు, ఒక్కొక్క గాయకుడి పాటలు ఇలా రకరకాలుగా మనం కావలిసినవి ఒకే రేడియోలో (అక్యు రేడియో లో లాగా) క్లిక్ చేసుకుని వినగలిగే అవకాశం వస్తే బాగుండును. ఈ ఆశ తీరుతుందో లేదో మరి. మనకు ప్రస్తుతం ఉన్న మంచి ఎఫ్ ఎం రేడియోలను ఆదరిస్తే, పైన చెప్పిన కోరిక తీరేట్టుగా ఆయా నిర్వాహకులను మనం ప్రోత్సాహించినట్టే!

thank you sir
రిప్లయితొలగించండి