మనకు రేడియోలు అంటే ట్రాన్సిస్టర్లు, కొంచెం ఎభైలు దాటినా వారైతే వాల్వు రేడియోలు, 1970 లలో పుట్టిన వారైతే టూ ఇన్ వన్ స్మగుల్డ్ వస్తువులు తెలుసు. కాని 2000 లో పుట్టిన వాళ్లకు తెలిసినది మహా ఐతే ఎఫ్ ఎం రేడియో అదేనండి పెట్టంగానే దరువులు, అరుపులు కేకలు వినిపిస్తాయే అదే!
ఇప్పటి తరానికి బాగా తెలిసినది ఇంటర్నెట్ రేడియో. వీటిల్లో నాకు బాగా నచ్చినది అక్యు రేడియో. ఈ రేడియోతో పరిచయం ఐ పాడ్ వల్లనే. ఆ తరువాత పి సి లో కూడా వింటూ ఉంటాను.
ఈ ఇంటర్నెట్ రేడియో గురించి కొద్దిగావివరించే ప్రయత్నం చేస్తాను.
- 2000 సంవత్సరంలో అనేక చానెళ్ళు కలిగి, ఎవరికి వారు, వారికి కావలిసిన సంగీతాన్ని ఎంచుకుని వినే విధంగా డిజైన్ చేశారు.ఇంటర్నెట్ మీడియం లో సంగీతాన్ని ఎలా వినిపించవచ్చో చూపించటానికి ఏర్పరిచన సంగీతపు రేడియో
- సంగీతంలో అత్యంత చక్కటి అభిరుచి ఉన్నవాళ్ళకు తమకు నచ్చినట్టుగా ఒక చానెల్ ఏర్పరుచుకునే విధంగా అవకాశం ఇచ్చిన మొట్ట మొదటి ఇంటర్నెట్ రేడియో అక్యు రేడియో.
- శ్రోతలమైన మనకు కావాలిసిన సంగీతాన్ని ఎంచుకునే సౌకర్యం ఇవ్వటానికి ఈ రేడియోను ఎంతో జాగ్రత్త తీసుకుని డిజైన్ చేసారుట.
- ప్రస్తుతానికి ఏభై వేలమంది మంది శ్రోతలు తమ తమ ఇష్టాలను ఇందులో పొందుపరిచి తమకు ఇష్టమైన సంగీతాన్ని వీనుల విందుగా వింటున్నారుట.
- క్రిస్టమస్ సమయంలో ఐతే ఈ సంఖ్య లక్షకు మించుతుందట!
- అందరూ ఎక్కువగా ఈ రేడియోను వినే సమయంలో దాదాపు 25,000 మంది ఏకకాలం లో వింటూ ఉంటారుట.
- రకరకాల సంగీతాలు (Genres) క్లాసికల్, జాజ్, క్లాసిక్ రాక్, బ్రాడ్వె(సంగీత ప్రధాన నాటకాలు), కంట్రీ(జానపద), ఆపైన ప్రపంచ సంగీతం ఇలా ఎన్నో రకరకాల సంగీతాలను అందిస్తున్నది అక్యు రేడియో.
- ఈ రేడియో శ్రోతలను వయస్సుల వారిగా చూస్తె 25-34, 35-44, 45-54, 55-64 వయస్సుల వారు దాదాపు సమానంగా ఈ రేడియోని వింటున్నారుట.
- మామూలు రేడియోల్లో ఎప్పటికీ మనం వినలేని సంగీత కళాకారులకు అక్యు రేడియోలో ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటారు.
- పాట వస్తున్నప్పుడు, దాదాపుగా అన్ని పాటలకు, ఆ పాటా పాడిన గాయకుడు, పాట పేరు, ఆల్బం పేరు ఇస్తూ ఉంటారు.
- కొత్తగా వచ్చే సంగీత సిడి లను ఈ రేడియోలో ప్రమోట్ చేస్తారు. సోనీ మ్యూజిక్, WB రికార్డ్స్, EMI రికార్డ్స్ వారు ఈ రేడియో ద్వారా తమ కొత్త సిడిలను పరిచయం చేస్తూ ఉంటారు.
- అక్యు రేడియో మెయిల్ జాబితాలో ఉన్న చిరునామాలు మూడు లక్షల పై మాటే (నా మెయిల్ కూడా కలుపుకుని)
ఇంతగా చెబుతున్నారు, ఈ ఇంటర్నెట్ రేడియో ఎలా వినాలి అనే కదా మీ ప్రశ్న. ఈ కింద ఇవ్వబడ్డ లింకును నొక్కి అక్యు రేడియోను వినవచ్చు:
మీ స్వంత చానెల్ ఏర్పాటు చేసుకోవాలి అంటే మీరు లాగ్ ఇన్ కావాలి, లాగ్ ఇన్ కావాలి అంటే రిజిస్టర్ చేసుకోవాలి. డబ్బులు కట్టాలా ! లేదు, రిజిస్ట్రేషన్ ఉచితం.
ఇంతా చేసి అక్యు రేడియో వింటూ ఉంటే ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు వినిపించాలి కదా, అందుకోసం ఈ కింది ప్లేయర్ను క్లిక్ చెయ్యండి.
పన్నెండు అక్టోబరు 2014 లో ఒక అరగంట సేపు చేసిన రికార్డింగ్
- మనకు ఏదన్నా పాట నచ్చక పోతే "నెక్స్ట్" క్లిక్ చెస్తే మనకు నచ్చని పాట పోయి తరువాతి పాట వచ్చేస్తుంది.
- వ్యాపార ప్రకటనలు లేకపోవటం ఒక గొప్పతనం అందుకే బ్లాగులో వ్రాసి పరిచయం చేస్తున్నాను. మహా ఐతే అప్పుడప్పుడూ తమ రేడియో గురించిన ప్రకటన మాత్రం వస్తూ ఉంటుంది.
మరి కొన్ని :
రిప్లయితొలగించండిtunein.com
This is really a huge site across globe
There are also certain 'physical' internet radios !
SAGEMCOM RM 50 Model is a good one of them
carnaticradio ; This is a superb Carnatic radio station 24 hours streaming;
(can be found in tunein.com
cheers
zilebi
Thank you for introducing a new radio channel.
రిప్లయితొలగించండిI normally use Tune in app for internet radio.
Thank you Suresh. Accu Radio is highlighted to introduce a good radio available among scores and scores of Internet Radios available in Tune in and other such Internet aggregators.
రిప్లయితొలగించండి