నాకు రేడియో కార్యక్రమాలంటే చాలా అభిమానం. కాని నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఇచ్చిన ఒక ఆంగ్ల ప్రసంగం గురించి పూర్తిగా మర్చిపోవటం ఆశ్చరం.
గత వారంరోజుల్లో పల్లె ప్రపంచం కొండల రావుగారు తన బ్లాగులో నా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పటం, ప్రశ్నలు సంధించటం, పాత ఫోటోలు విశేషాలు అడగటం జరిగింది.ఆఫోటోలు,పాత విశేషాలు వెతుకుతూ ఉంటే,నా రేడియో ప్రసంగం గుర్తుకు వచ్చి నా కాసెట్లు వెతకటం మొదలు పెట్టాను. మీకు తెలియనిది ఏమున్నది, రికార్డు చేసేప్పుడు ఉన్న శ్రద్ధ వాటికి ఇండెక్స్ చెయ్యటంలో ఉండదు కదా! అలా లాటరీ వేసి వెతుకుతూ ఉంటే, ఆ పాత కాసేట్ దొరికింది.
గత వారంరోజుల్లో పల్లె ప్రపంచం కొండల రావుగారు తన బ్లాగులో నా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పటం, ప్రశ్నలు సంధించటం, పాత ఫోటోలు విశేషాలు అడగటం జరిగింది.ఆఫోటోలు,పాత విశేషాలు వెతుకుతూ ఉంటే,నా రేడియో ప్రసంగం గుర్తుకు వచ్చి నా కాసెట్లు వెతకటం మొదలు పెట్టాను. మీకు తెలియనిది ఏమున్నది, రికార్డు చేసేప్పుడు ఉన్న శ్రద్ధ వాటికి ఇండెక్స్ చెయ్యటంలో ఉండదు కదా! అలా లాటరీ వేసి వెతుకుతూ ఉంటే, ఆ పాత కాసేట్ దొరికింది.
దొరికిన కాసెట్ అదృష్ట వశాన పనిచేస్తున్నది. వెంటనే ఆ కాసెట్లో ఉన్న ఆడియో ఎంపి-3 గా మార్చి (డివ్ షేర్ పనిచెయ్యటం లేదు అందుకని, ఆ ఎంపి-3 ని వీడియోగా మార్చి-ఆడియో యు ట్యూబ్లోకి అప్లోడ్ చెయ్యలేము అందుకు వాడిన ఆన్ లైన్ వెబ్ సైట్ కొద్ది క్లిక్కుల్లో ఆడియో వీడియోగా మార్పు క్లిక్ చెయ్యండి)- యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేశాను.
ఈ రేడియో ప్రసంగం గురించిన జ్ఞాపకాలు.
అప్పుడు అంటే 1989 లో విజయవాడలో పనిచేస్తున్నాను. మా బ్రాంచి సీనియర్ మానేజరు శ్రీ డి ఆర్ పి సుందరం గారు (ఆయన డిప్యూటీ జనరల్ మానేజరుగా మూడు నాలుగేళ్ళ క్రితం రిటైర్ అయ్యారు) ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ఆహ్వానంతో పొదుపు చెయ్యటం గురించి అనుకుంటాను ఒక ఆంగ్ల ప్రసంగం చేశారు. ఆ ప్రసంగా రికార్డింగ్ కు వెళుతూ నన్ను కూడా వెంట తోడు తీసుకుని వెళ్ళారు. సరే, ఆయన రికార్డింగు పూర్తి అయ్యింది, నేనుకూడా ఆయనతోనే నిశ్శబ్దంగా కూచున్నాను. పక్కన ఉన్న మరో స్టుడియోలో ప్రముఖ సినీ నటుడు ధూళిపాళ గారి ఇంటర్వ్యూ జరుగుతున్నది. ఆయన్ని అదే చూడటం.
అసలు రేడియోలో రికార్డింగ్ ఎలా జరుగుతుంది, స్టూడియో ఎలా ఉంటుంది వగైరా విషయాలు ఆసక్తిగా గమనిస్తున్నాను. రికార్డింగ్ పూర్తి అయినాక, ఆంగ్ల కార్యక్రమాలు చూస్తున్న ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ రవీంద్రనాథ్ గారికి నన్ను మా మానేజరు పరిచయం చేశారు. ఆయన "మీరు కూడా ఒక ప్రసగం ఇస్తారా" అని అడిగారు. నేను ఆశ్చర్యపోయి సరే అని తలాడించాను. ఇంటికి వచ్చాక కొంత ఆలోచించి, అప్పట్లో నేను ఎక్కువగా చదివే రీడర్స్ డైజెస్టులు కొన్ని ముందేసుకుని, నాకు నచ్చిన ఐదారు కొటేషన్లు సేకరించి, ప్రసంగం వ్రాసేశాను. ఇక ఆకాశవాణి వారికి పంపెశాను. కొద్దిరోజుల తరువాత వారి దగ్గర నుండి, "రికార్డింగుకు రండి" అని పిలుపు. అప్పటికి నాకు ఈ ఆఫర్ ఇచ్చినాయన వెళ్ళిపోయి, బాబూరావు గారు ప్రోగ్రామ్ ఎక్జిక్యూటివ్ గా ఉన్నారు. సరే, ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రేడియో స్టేషన్ కు వెళ్ళి రికార్డింగ్ చేశాను. బాబూరావు గారు, ఒక చిన్న సూచన ఇచ్చారు. ఎక్కడన్నా చదవటంలో నట్టు పడినా, పొరబాటు చదివినా, కాసేపు ఆగి, మళ్ళీ అదే చదవమని చెప్పారు. వారు తరువాత తప్పు వచ్చినది ఎడిటింగ్ లో సరిచేసుకోవటాని అది వీలుగా ఉంటుంది. అస్సలు తప్పులు లేకుండా చదివానని చెప్పలేను కాని, బాగానే ప్రసంగం పూర్తి చేశాను.ఈ ప్రసంగం ఇచ్చే "కష్టం" పడినందుకు నాకు ఆకాశవాణి వారు నాకు ఇచ్చిన పారితోషికం అక్షరాలా నూట పాతిక రూపాయలు. అప్పట్లో ఈ మొత్తం పెద్ద మొత్తమే. ఇప్పుడైతే ఎంత ఇస్తున్నారో మరి!
ఈ ప్రసంగం 29 సెప్టెంబరు 1989 న రాత్రి 08:15 కు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అయ్యింది. ఆరోజు పొద్దున్న ప్రసార విశేషాల్లో నా పేరు చదవటం, నా ప్రసగం ముందు వచ్చిన కార్యక్రమం కొద్దిగా, నా ప్రసంగం పూర్తిగా రికార్డ్ చేసి ఉంచాను. ఇక ఆ కాసేట్ రెండు మూడుసార్లు విని ఉంటాను, మర్చిపోయాను.
ఇప్పుడు అలనాటి ఆ ప్రసంగం బ్లాగుద్వారా పునఃప్రసారం .
వీడియో వస్తుండగా కనపడే ఫోటో చాలా కొత్తది, ఈ మధ్యనే తీసినది. ఆడియో మాత్రం 26 సంవత్సరాల క్రితానిది. కాలక్రమేణా నా రూపు మారినట్టే, నా గొంతుకూడా మారింది మరి! సహజం.
నా ప్రసంగం ప్రకటన చేసినది శ్రీ మల్లాది సూరిబాబు గారు అని నిన్ననే ఆ గొంతు గుర్తుపట్టి, ఆకాశవాణిలో పనిచేసి రిటైర్ అయిన శ్రీ సరోజా ప్రసాద్ గారు చెప్పారు.
ఆరోజు రాత్రి ప్రసగం వింటూ ఉంటే, నాపేరు కే శివప్రసాద్ అని ప్రకటించారు. నా పూర్తి పేరు "శివరామప్రసాద్" అని చెప్పక పోవటంతో వెంటనే ప్రసగం ఒక పక్క వస్తుండగా ఆకాశవాణి వారికి ఫోన్ చేసి డ్యూటీ ఆఫీసరుకు విషయం చెప్పి, అనౌన్సర్ కు పేరు సరిచేసి కనీసం ప్రసగం చివరలోనన్నా చెప్పమన్నాను. ఆయన సరే అన్నాడు కాని, చివర్లో కూడా నాపేరు తప్పే చదివారు. తరువాత తెలిసినది ఏమంటే, అనౌన్సర్ వారికి వ్రాసిచ్చిన పేరే చదువుతారు కాని, ఇలా ఫోన్ చేసి సరిచేయమంటే వాళ్ళు చెయ్యటానికి లేదట! అంటే అనౌన్సర్ కు వ్రాసిచ్చినవారే నాపేరు తప్పు వ్రాసిచ్చి ఉంటారు.
ఏమైతేనేమి నేను రేడియో లో మాట్లాడాను, ఆ రికార్డింగ్ నా దగ్గర ఉన్నది (చాలాకాలం మర్చిపోయినా సరే), ఇప్పుడు మీరందరూ వినటానికి వీలుగా వెబ్ ప్రపంచంలోకి వచ్చేసింది. అదీ సంతోషం.
రిప్లయితొలగించండిSooper !
Your patience to bring in such old audio back into live is really appreciable!
Atleast in that program overview your name they have pronounced correctly :
cheers
zilebi
ధన్యవాదాలు జిలేబీ గారూ.
రిప్లయితొలగించండిబాల్యం ఒక అందమైన కల
రిప్లయితొలగించండినలుపు నాణ్యతకి, తెలుపు స్వచ్ఛత కి
చిహ్నాలనుకొంటే
జీవితమనే రంగుల చిత్రంలో
గతించిపోయిన బాల్యం
బ్లాకు & వైట్ ల ఫ్లాష్ బ్యాక్
అని ఎప్పుడో నేను రాసిన కవిత గుర్తుకొచ్చింది.
ధన్యవాదాలు
యమ్కె శర్మ