10, జులై 2015, శుక్రవారం

లండన్ ప్రయాణం

ఈరోజు  (అంటే 10 జులై 2015) మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మా ఫ్లైట్ ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి, తొమ్మిది గంటల ప్రయాణం తదుపరి,  లండన్ కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నరకు (మన టైం ప్రకారం రాత్రి పదిగంటలు) లండన్ హీత్రో విమానాశ్రయానికి చేరుకుంటుంది. మళ్ళీ  ఆగష్టు 14 న  భారత్ కు తిరిగి వస్తాము. 

నాకేమో లాప్ టాప్ వాడటం అంత సౌకర్యంగా ఉండదు, అలవాటు లేక. ఇప్పుడు అలవాటవ్వచ్చు. వచ్చే నెలరోజుల్లో వ్రాయబొయ్యే వ్యాసాలు  లండన్ నగరం నుంచి, లాప్ టాప్ మీదే మరి. 

నాకు ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ ఉన్నదో చూసి రావాలి. ఆపైన బి బి సి లోపలి వెళ్ళి చూడాలి, వాళ్ళు పాత కార్యక్రమాల సి డిలు  అమ్ముతుంటే కొన్ని కొనాలి. వాళ్ళు కూడా మన "ఆకాశవాణి గుమాస్తాల్లాగా" పాత కార్యక్రమాలు అన్నీ పారేశారా లేక ఉంచారా  అన్న విషయం వాకబు చెయ్యాలి.  ఇంకా........పైన్ఉడ్ స్టూడియో, ఈలింగ్ స్టూడియో  చూసిరావాలి. గ్రీన్విచ్ గ్రామాన్ని చూసి, అక్కడ టైం లైన్ దగ్గర ఫోటో దిగాలి.  అన్నట్టు, మర్చిపోయ్యాను బిగ్ బెన్ చూసి మధ్యాహ్నం పన్నెండుకు (అర్ధరాత్రి ఐతే ఏ మెక్బెత్ దయ్యమో భయపెట్టవచ్చు కాబట్టి పగలే నయం!) గంటలు కొడుతుంటే వీడియో తియ్యాలి. ఇలా చాలా కోరికలు ఉన్నాయి మరి!

ఇంగ్లాండ్ దేశాధినేత క్వీన్ ఎలిజెబెత్-IIను కలవటం నాకు నా బిజీ వల్ల కలవటం కుదురుతుందో లేదో మరి. నాకు టైము కుదిరి కలిస్తే మాత్రం  మీ అందరి శుభాకాంక్షలు  చెప్పటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎవరికన్నా ఇష్టం లేకపోతె ఇప్పుడే చెప్పెయ్యండి. ఆనక కోపం తెచ్చుకుంటే లాభం లేదు.



**********************************************

ఈ బ్లాగు చూస్తూనే ఉండండి, లండన్/ఇంగ్లాండ్ విశేషాల కోసం. 
మీ ఇష్టం వచ్చిన,మీకు నచ్చిన రంగురాళ్ళు ధరించవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు.
మీ పేరు మీ ఇష్టం, నాకేమిటి అభ్యంతరం!
ఫాక్షన్లు మాత్రం మంచిపని కాదు.

**********************************************

ఈ కింది లింకులో ఉన్న వీడియో చూడండి. నిజమైన రాణీగారేనా!

 జేమ్స్ బాండ్-రాణీ  





















 

1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.