6, ఆగస్టు 2015, గురువారం

మీరు తెలుగా! ఐతే మీరు విని తీరవలసిన ఉపన్యాసం


తెలుగువాళ్ళం అని చెప్పుకునే అందరూ విని తీరవలసిన ఉపన్యాసం. రమేష్ గారు చెబుతున్న విషయాలు కొన్ని కొన్ని వింటుంటే అవ్వి వచ్చేవి ఆనంద భాష్పాలా లేక అక్కడి తెలుగువారు పడుతున్న బాధలు వింటుంటే ఆగని కన్నీరా అని ఎవరిని వారు ప్రశ్నించుకోవలిసిన అవసరం కలిగి తీరుతుంది.   

తెలుగు భాషలో ఎంతటి చేవ ఉన్నదో ఆయన చెబుతూ ఉంటే, ఎక్కడో తమిళనాట కేరళా బోర్డర్లో తెలుగు మాటాడేవాళ్ళు ఉన్నారనీ, వాళ్ళు మాట్లాడే తెలుగు గురించి ఆయన ఉదాహరణలు ఇస్తూ ఉంటే, మనమా తెలుగువాళ్ళం, అసలైన తెలుగువాళ్ళు వాళ్ళా అన్న సంశయం కలుగుతుంది. 


  • వస్తాను అనరు, వచ్చెదను అంటారు.    మా అమ్మాయిని తీసుకొని వెళ్లి దింపి వచ్చాను అని  మనం అనే ఈ మాటలను వాళ్ళు ఎలా అంటారు అంటే "మా గూతురిని గొనిపోయి విడిచి వచ్చితి" అని అంటారుట.
  • శ్రీలంకలో బంగారం వ్యాపారాన్ని నిర్వహించేది, నియంత్రించేది తెలుగు వారేనుట. వాళ్ళు ఇళ్ళల్లో తెలుగే మాట్లాడుకుంటారు.   కానీ వాళ్ళకు తెలుగు వారిగా గుర్తింపు లేదు, వాళ్ళను తమిళులు గానే గుర్తిస్తున్నారు. 

ఇంతటి మంచి వీడియోను తన ఫేస్ బుక్ లో  పంచుకున్న నారాయణస్వామి గారికి కృతజ్ఞతలు.



*****************************************************
1911 లో తమిళులు తమకు ప్రత్యేక రాష్ట్రం కావేరికి దక్షిణాన కావాలని తీర్మానం చేస్తే, 1914లో మొట్టమొదటి సారి తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగే తరుణంలో, మదరాసుకు ఉత్తరాన ఉన్న ప్రాతం నుంచి అని తెలుగు వారు తీర్మానం చెయ్యటమే ఒక పెద్ద తప్పు  అన్న విషయం తెలుస్తుంది.
*****************************************************
*********
ఇంకా ఇలా అనేకానేక విశేషాలు ఉన్నాయి వీడియోను పూర్తిగా చూడండి/వినండి. 

సవెం రమేశ్ గారి మరొక ఉపన్యాసం యు ట్యూబ్ లో ఉన్నది. ఆ ఉపన్యాసం కూడా వినవలిసినదే:

తెలుగు వాళ్ళు తమిళనాట ఎంతగా అణచివేతకు గురవ్వుతున్నారో ఈ ఉపన్యాసం వింటే తెలుస్తుంది. 

తాను  కథలు వ్రాసేది   తాము తమిళనాట మాట్లాడుకునే తెలుగు తెలియచెప్పటానికే అని ఆయన చెబుతారు. ఆయన కథల్లో ఉండే పాత్రలు తమ కుటుంబాల్లో ఉండే అవ్వలే అని చెప్తారు. 

సవెం రమేశ్ గారు వ్రాసిన కథ ఒకటి నెట్లో దొరికింది. ఈ కింది లింకు నొక్కి  ఆ కథను చదుకోవచ్చు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.