31, ఆగస్టు 2009, సోమవారం

క్విక్ గన్ మురుగన్ - సినిమాట!!


రాజేంద్ర ప్రసాదు ఉన్నాడు కదా అని సినిమా చూడ్డానికి సాహసించాను. కాని, సినిమాలో చమక్ లేదు. రాజేంద్రప్రసాద్ లొ ఉండే హుషారు నటనలో ఉండే సహజత్వం ఈ సినిమాలో ఎంతమాత్రం లేవు. సినిమా మొదటినుంచి చివరివరకు, రాజేంద్ర ప్రసాద్ ఏదో తెలియని రోగంతో బాధపడుతున్నవాడిలా కనిపించాడు. ఇటువంటి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఎందుకు నటించాడో(!!) ఒక మిస్టరీ. డబ్బుకోసం మాత్రమే అయ్యి ఉంటుంది, పేరు వచ్చే అవకాశం లేనేలేదు.

ఈ సినిమాకి కథ ఉన్నదా? అని పేద్ద అనుమానం వచ్చింది. ఇంగ్లీషు సినిమాలని పారడీ చేస్తూ సినిమా తియ్యాలని ప్రయత్నించింట్టు సూచన మాత్రంగా తెలుసుకోగలిగాను . ఆంగ్ల కౌబాయ్ సినిమాలని ఎద్దేవా చేస్తూ సినిమా తీస్తే మన సోదరులకు అర్థం అవ్వటం కష్టమన్న దురభిప్రాయానికి వచ్చినవాళ్ళై, ఒక అరవ కథ, కొంత గూండాగిరి గోల, కొంత ఫాంటసీ కలిపి ముందు దోశ చేద్దాంలే అని పిండి తయారుచేసి, తరువాత సాంబారుమీదకి మనసుపోయి, ఆ పిండంతా సాంబారులో పోసి మరగ కాచి, మళ్ళీ మనసు మార్చుకుని, ఆ వచ్చిన పదార్థంతో పరోటా చేయబోయినట్టున్నది.

ఈ సినిమాలో నాకు నచ్చిన ఒకేఒక్క డైలాగు "మీ కేబుల్ కనెక్షన్ కట్ చేసేస్తా" అని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఒక పెద్దావిడని రౌడీ ఎంబిఎ బెదిరించటం

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాదు ఉన్నాడని తెలియకపోతే అనేకమంది ఈ సినిమా చూసే సాహసం చేసేవారు కాదు. సినిమా భవితవ్యం మీద విడుదలకి ఒకటి రెండు రోజులముందు అనుమానం పెనుభూతమై, ఒక వివాదాన్ని సృష్టించినట్టు స్పష్టమవుతున్నది. ఈ సినిమా చూసి ఎవరన్నా అవమానపడి గొడవచెయ్యాలంటే, ఎంబిఎ చదివినవాళ్ళు చెయ్యాలి, రౌడీ ఎంబిఎ పాత్ర సృష్టించినందుకు.

ఈ సినిమా తీసిన వాళ్ళు చేసిన మరొక ఘోరం ఏమంటే, టిఫిన్ బాక్సు బాంబులతో ముంబాయిని హడిలిపొయ్యేట్టు చెయ్యచ్చు అన్న ఒక విషపు అలోచనను విపులంగా చూపించటం. సెన్సారువాళ్ళు ఇటువంటి చెత్తను కత్తిరించి పారెయ్యాల్సింది.

మొత్తం మీద ఒక చౌకరకం, థర్డ్ రేటు నేలబారు సినిమాలో నటించాడన్న అపకీర్తి, రాజేద్రప్రసాదు మోసుకుంటూ తిరిగాల్సిన గతి పట్టింది. అదీ నా విచారం. పైగా, చాలా గాప్ తరువాత వచ్చిన సినిమా అతనిది. పూర్తిగా రాంగ్ చాయిస్.

30, ఆగస్టు 2009, ఆదివారం

పాత ఇంగ్లీషు పాటలు




పాశ్చాత్య సంగీతంలో కూడా మన పాటలలో వచ్చినట్టె చాలా మార్పులు వచ్చాయి. ఆధునికం పేరుతొ పాటలు అర్థం కాకుండా పొయ్యాయి. 1950-70 లలో వచ్చిన పాటలకు సాహిత్యమంటూఉంది కొద్దోగొప్పో అర్థం అవుతూ ఉండేవి. సంగీతం, పాటకు వెనుక ఉండేది కాని పాటకు బదులుగా ఉండి అర్థం పర్థం లేని శబ్ద రచనగా ఉండేదికాదు, వాయిద్యాల మధ్య వైవిధ్యం తెలిసేది. అలనాటి పాతపాటలమీద మీద మక్కువ ఉన్నవారికి ఒక మంచి సైటు ఉన్నది. ఈ కింది లంకె నొక్కండి:
పాత ఇంగ్లీషు పాటలు
ఇందులో సంవత్సరాలవారిగా కొన్ని పాత ఇంగ్లీషు పాటలు జూక్ బాక్సులో పెట్టటం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం నొక్కగానే, ఒక జూక్ బాక్సు ప్రత్యక్షమై ఆ సంవత్సరంలోని హిట్ పాటలను వినిపిస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేక చానేల్సు కూడా ఉన్నాయి. ఒక వరవడికి సంబంధించిన పాటలు అంటే కంట్రీ ( జానపద ) పాటలు, డాన్సు పాటలు, జాజ్ సంగీతం, కంట్రీ యుగళగీతాలు ఇలా చాలా ఉన్నాయి. ఆయా చానేళ్ళను నొక్కగానే, ఒక చిన్న ప్లేయర్ అక్కడున్న పాటలను మనకు వినిపిస్తుంది.

ఈ సైటులో పాటలను వినటానికి మాత్రమె వెసులుబాటు ఉన్నది. విని ఆనందించగలరు.

ఓ సారి ఏమయ్యిందంటే

నాకున్న హాబీలలో ముఖ్యమైనది, హామ్ రేడియో . సరే ఒక రోజున (2008లొ)సి క్యు 100 అనేటటువంటి ఇంటెర్నెట్ హాం రేడియోలో రాత్రి బాగా పొద్దుపోయినాక పిలవటం మొదలుపెట్టాను, ఎవరన్న దొరుకుతారేమో మాట్లాడదామని. కాసేపటికి ఇంగ్లాండు నుంచి ఒక పెద్దాయన (88 ఏళ్ళవారు) నా పిలుపు అందుకుని మాట్లాడటానికి వచ్చారు. ముందస్తు నమస్కారాలు అవి అయ్యాక, పిచ్చాపాటిగా సరదాగా అనేక విషయాల మీద చర్చిస్తున్నాము. విషయం ఇకనామిక్స్ మీదకి మళ్ళింది. నేను ఇకనామిక్స్ చదువుకున్నాప్పటికి (నా ప్రాథమిక డిగ్రీలోను, బాంకింగ్ పి జి డిప్లొమాలోనూ), నాకు ఆ సబ్జెక్ట్ మీద అంతగా ఇష్టంలేదు-సరిగ్గా అర్థంకాక అయ్యింటుంది!! ఎకనామిక్సులో నాకు అన్నిటికంటే చిరాకు పుట్టించే విషయం ఏమంటే, ఏదన్నా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేప్పుడు చేసుకునే కొన్ని ఊహలు (Presumptions). అందులో ఒకటి మిగిలిన విషయాలన్ని మారకుండా ఉన్నప్పుడు అనుకోవటం! సరే ఈ విషయం నాకు ఎందుకు నచ్చదో, మిగిలిన విషయాలు మారకుండా ఎలా ఉంటాయి (ఇదేమన్నా ఫిజిక్సా, బయోలజీనా మిగిలిన విషయాలు మారకుండా ఉంచి ప్రయోగాలు చెయ్యటానికి), ఇది మానవ ప్రవర్తనమీద ఆధారబడ్డ విషయం కదా అని నా వాదనను ఆయనకు వినిపించాను (చిత్రం భళారే విచిత్రంలో, బ్రహ్మానందం మారువేషంవేసుకుని ఒక్క లైను చెప్పి నా నటన ఎలా ఉంది అని చూపుల్తో అడిగే భంగిమ పెట్టి). పాపం ఆ ఇంగ్లీషు పెద్దాయన మొదట్లో కొంత నెమ్మదించినా, కాసేపటికి తన వాదన చక్కగా చెప్పటం మొదలు పెట్టారు. ఇలా కొంతసేపు జరిగినాక, నాకు అనుమానం వచ్చింది, ఏమా ఇంత బాగా తర్కిస్తున్నారు ఈయన, ఏమయ్యి ఉంటారు అని. ఆలశ్యమెందుకు అని ఆడిగేశాను. ఆయన కొంతసేపు చెప్పలేదు, కాని చివరకు తాను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆచార్యుడిగా పని చేశానని. నాకు మతి పోయింది. మనమేదో మిడి మిడి జ్ఞానంతో, బ్రతుకు తెరువు కోసమే చదువుకున్న చదువుతో (జ్ఞాన సముపార్జన కోసం కాదుకదా మన చదువులు!!) ఆ సబ్జెక్టుమీద తన జీవిత కాలం పరిశోధించి ప్రపంచ ప్రసిధ్ధిగాంచిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్సులో ఆచార్య పదవిలో ఉన్నాయనతోనా ఈ వాదనంతా అని నాకు బిడియం కలిగింది (Embarassed కి సమానమైన తెలుగు పదం అనుకుంటున్నాను). వెంటనే ఆయనికి హాం రేడియోలో కుదిరినంతవరకు సాష్టాంగ ప్రణామం చేసాను. ఆయన చల్లాగా నేను చెప్పినది అంతా విని, "మీ వాదన మీది, నా వాదన నాది ఇలా వాదనలతోనే కదా సబ్జెక్టు మరింత లోతుగా తయారయ్యేది" అని తాను తన వాదనకు చెప్పవలసిన విషయాలు చెప్పుకొచ్చారు. ఇలా చాలాసేపు మాట్లాడుకున్నక శలవు తీసుకున్నాను. మళ్ళీ ఆయనతో మాట్లాడటం తటస్థించినా, ఇకనామిక్స్ విషయం తీసుకొచ్చే ధైర్యం చెయ్యలేదు . ఒక్కోసారి అనిపిస్తుంది అదంతా కలేమో అని, కాని మాట్టాడినంతసేపు, నా కంప్యూటర్లో అడాసిటీ సాప్టువేర్ సంభాషణ మొత్తం రికార్డు చేసింది. అప్పుడప్పుడూ ఆ రికార్డింగు విని ఆనందిస్తుంటాను, మన్ని ఓడించటానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆచార్యుడంతడి వారు రావలిసి వచ్చింది కదా అని ఫోజు (నాకునేనే) కొట్టుకుంటూ.
ఎకనామిక్సులో జ్ఞాని అయిన ఆయన దగ్గర ఎంత ఒబ్బిడి!(హుమిలిటి), ఆవతలి వ్యక్తి సామాన్య జ్ఞానం మాత్రమే కలవాడయినప్పటికి, అతని వాదనలో కొత్త విషయం ఏమన్న ఉందేమో చూద్దాం అన్న ఉత్సాహమే తప్ప, తన జ్ఞానం అంతా ప్రదర్శించి నోరు మూయించే ప్రయత్నం ఎంతమాత్రం చెయ్యలేదు. మరదే అన్నీ ఉన్న ఆకు అంటే!

ఇంగ్లీషులో ఫుట్ ఇన్ ది మౌత్(Foot in the Mouth) అని ఒక వాడుక ఉన్నది. ఆ వాడుకకి ఇదొక మంచి ఉదాహరణ!

29, ఆగస్టు 2009, శనివారం

అమెరికెన్ నాయకుల 100 గొప్ప ఉపన్యాసాలు

కొన్ని కొన్ని ఉపన్యాసాలు వింటుంటే మంచి ఉత్తేజం కలుగుతుంది. ఆ ఉపన్యాసాల్లో వాడిన పదజాలం, వెలిబుచ్చిన భావాలు,అలోచనలు మనను ప్రభావితం చేస్తాయి. ఈ కింద ఇచ్చిన లంకెతో అమెరికన్ నాయకులు ఇచ్చిన 100 గొప్ప ఉపన్యాసాలు వినవచ్చు.
అమెరికెన్ నాయకుల 100 గొప్ప ఉపన్యాసాలు
ఉపన్యాసాలు వింటుంటే, ఆయా ఉపన్యాసాలు ఇచ్చిన నాయకుల వాక్పటిమ మనకు తెలుస్తుంది (ఊరికే మనవిచేస్తున్నాను, తెలియచేసుకుంటున్నాను అని మనకు విసుగు పుట్టించటం లేకుండా). నలుగురిలో మాట్లాడ్దామనుకుంటున్న వాళ్ళకి, ఇప్పటికే కొంత సాధన చేసిన ఔత్సాహికులకు, ఈ ఉపన్యాసాలు, ఆ ఉపన్యాసాల శైలి ఎంతగానో ఉపకరిస్తాయి.

మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన ఉపన్యాసం అన్నిటికన్న తలమానికమైనది, అందుకనేకాబోలు ఆయన ఉపన్యాసాన్ని మొదటగా ఉంచారు. అల్లాగే, రూజ్వెల్ట్, కెనడీ మరియు తదితరులు ఇచ్చిన ఉపన్యాసాలు వినతగ్గవి. ఆయా ఉపన్యాసాల్లో వాడిన చక్కటి పదాలు, వాటిన వాడిన విధానం మనకు ఎంతగానో ఉపకరిస్తాయి.
మార్టి లూథర్ కింగ్ ఉపన్యాసం వీడియో ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు
మార్టిన్ లూథర్ కింగ్ వీడియో
ఇదే విధంగా, మనను ఉత్తేజ పరచిన బారత నాయకుల ఉపన్యాసాలు, లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్, జై జవాన్ నినాదమిచ్చిన ఉపన్యాసం, సుభాష్‌చంద్ర బోస్, వివేకానందుడు, టంగుటూరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య వంటి మహనీయులు ఇచ్చిన ఉపన్యాసాలు కూడ ఇలా దొరికి మనం వినగలిగిన భాగ్యం కలిగితే ఎంత బాగుండును.

28, ఆగస్టు 2009, శుక్రవారం

కొన్ని మంచి మాటలు

ఈ రోజున నెట్లో వెతుకుతుంటే ఒక చోట మన తెలుగులో సూక్తులు అవీ దొరికాయి. అందులో కొన్ని అందరితో పంచుకోవాలని అనిపించింది. అందుకనే ఈ చిన్న టపా!

విలాసాల మధ్య, ఆనందం తరిగి పోవడమన్నదే ఈ మానవ చరిత్రకు సంబంధించిన గొప్ప బాధ. -చిన్మయానంద

చట్టం అప్పుడప్పుడు నిద్రిస్తుంది, చావదు. -అరవింద యోగి

మన వైఖరి సవరించుకోవడం ద్వారా జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు . -వివేకానంద

దోషరహితమైన దాన్ని నిందించటం, ప్రశంసకు అర్హత లేనిదాన్ని పొగడడం.....మనిషి డబ్బుకోసం ఎం చెయ్యడానికైనా వెనుకాడడు. -పంచతంత్రం

ప్రేమతో నిర్మించబడే దేవాలయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు, మనిషి రాళ్ళను తీసుకురావడం విచిత్రంగా లేదూ! మనసే కదా దేవుని మందిరం. ఆ మాత్రం తెలీదూ? -రవీంద్రనాథ్ టాగూర్



చందమామకు లేఖ

From: SIVARAMAPRASAD KAPPAGANTU
Date: Fri, Aug 28, 2009 at 1:46 AM
Subject: VIEWS OF A OLD READER, HIS ANGUISH AND SUGGESTIONS
To: "abhiprayam@chandamama.com"
Dear Sirs,

I have just seen the Telugu Chandamama on your web. In fact, Chandamama was the first ever magazine I had ever read in my life. I am now 52 years young and in my formative years, I was reading Chandamama magazine in TELUGU language right from 1964-65 onwards, starting with my father presenting me the magazine as a Birthday Gift. Those were the days; a father would think appropriate to give Chandamama as a good gift to his Son. My sons , born two decades later were also avid Chandamama fans (the past tense used is deliberate).

I had continued to read Chandamama till 1990s. After Chandamama was resumed after a break, I found Chandamama as a stranger. I felt as if completely unknown person has come in the guise of a person very dear to me. The only thing that was not changed was size and publishing some old stories albeit with unwarranted changes which you may be thinking as decorations.

In the last few years when I have been seeing Chandamama not so frequently but now and then, I am only saddened seeing the so-called changes. It is my considered opinion that you need not try to popularise Chandamama anymore, it has already reached pinnacle of popularity which any magazine can reach.

If you are thinking that Chandamama requires popularising, you are just misguided. You need not try to popularise Chandamama, just start publishing in the same manner as it was done during 1960s and 1970s and all those people who stopped reading Chandamama (thousands of them) like me would flock back to the magazine and you would be surprised to see the circulation figures.

But you have to do that with some ad campaign in the print media (which people in the age group of 40 and above read) and TV (such channels balanced persons see) so that those who stopped reading Chandamama, disappointed with the changes, would come back seeing their much loved Chandamama in its old form. Because of the thoughtless manner in which Chandamama is run now, some "look alike" magazines are trying to grab the existing vast market.

Many sophomores armed with MBA and such other degrees, out of their lack of business sense, business acumen, and minimum common sense but with lots of greediness schemed to get more profits in Lehman brothers. What was the result?? A respected worldwide organisation of more than a century old has crumbled from within. This was not a plot by its competitors, but by its own Employees who thought themselves to be great geniuses and thought too much of themselves.

I pray God that such a thing is not happening to Chandamama and after sometime, we get the unpleasant news that the magazine is being closed. For those employees in Chandamama, especially in the so-called managerial cadre, it may be just temporary inconvenience till they get another job, but such people may not be realising that CHANDAMAMA is part of Indian Culture and Heritage. You may not know what you are handling and by your unplanned and immature plans how many thousands of people you are hurting and making them distanced from Chandamama.

Still there is time and opportunity to make a turn around by just following the footsteps of great people like Shri Chakarapani (the great Founder of Chandamama, in case you do not know) and Shri Kodavatiganti Kutumba Rao (for your information, he was the longest working Editor for Chandamama from 1950s to 1980s till his death and in whose period only Chandamama got its esteem) and artists like Vaddadi Papaiah, Chitra and Sankar (who I am informed is still working for Chandamama out of nostalgia) and great serial writer Shri Dasari Subrahmanyam who came out of Chandamama I am sure out of sheer fatigue of changes and presently living in Vijayawada. You can invite all the old timers still working with you and those who left your organisation, irrespective of their cadre in Chandamama and get ideas to bring back the by gone glory.

Only the vision, sincere interest in running a world class magazine, honest desire to continue to reflect Indian tradition/culture are required to bring back the glory of Chandamama. And, not repeat NOT, some immature commercial plans, baseless market studies, unwanted figures and ratios above all lack of interest in what the Readers want and need, when it comes to bringing back the Chandamama’s lost fame.

I hope you understand the anguish of a reader who grew reading the magazine for decades and stopped only because of the changes in Chandamama. Please, Please, Please make sure that Chandamama does not lose its Cultural values and its heritage is not defiled.

The main reason why we “were” reading Chandamama was that it gave full satisfaction to experience the old world charm. We lived for some time in the fantasy of yester years, cherishing those days when virtue was still around to see in people. The only modern things that were visible very, very rarely were spectacles and a cycle and never any thing else. Such reference as to how our ancestors lived depicted by excellent pictures was the main attraction of Chandamama. The excellent narrative style and bringing about moral in almost all stories as an under current was another main reason why the stories were popular. Major attraction was the great pictures by Shri Chitra, Shri Sankar and Shri Vaddadi Papaiah. You would be fortunate if you can get such artists.

I here below give a few of my ideas:

1. Start Paropakari Papanna Kathalu. You need not reprint old stories. Publish a few old stories till Papanna gets married so that the new readers get a hang of the famous character of Papanna and start publishing altogher new stories but in the same mileu. For God's sake do not try to write as if Papanna is living now in 21st Century

2. Likewise Gundu Bheemanna Kathalu and Tatayya Kathalu, just use the format and get altogether new stories but with photo like pictures of Chitra and Sankar fame.

3. Encourage famous Magician Circar to send few new tricks he developed and weave stories around them and publish them with the trick revealed.

4. Encourage Shri Dasari Subrahmanyam (may be he is too old now) to write one more Folk Serial to increase the circulation of Chandamama. If you make a sincere effort and convince him that his serial is for the benefit of the Chandamama, I am sure he would write.

5. Just see the old set of story writers like Burle Nageswara Rao, Bommidi Achcharao, Machiraju kameswara Rao etc. (who published dozens of stories in Chandamama much to the delight of all) to send a few stories.

6. Make a Picture Story using all Sankar's pictures and republish all the mythological stories of Ramayana, Bharatam, Bhagavatam, and Hanuman. To suit for the present day kid, put more pictures and less words but without losing the story line. It can be done.

7. Likewise, start publishing Picture stories of all folk serials like Sidhilalayam, Rakasiloya using Shri Chitra's pictures.

8. Start publishing, "Chandamama in my Memories" duly collecting such memories from senior Chandamama readers.

9. Make the magazine to sell more with fewer advertisements. The idea is to charge more for the less number of advertisements and it will bring same income, provided your sales improve. With more advertisements, it’s an irritant for readers and Circulation comes down and in the same proportion ad. Income. Select only such ads. Which are good not those which will spoil children.

10. For those lovers of old Chandamama issues from 1947 onwards (there are a lot out there) please introduce Print on Demand Scheme or alternatively

11. Introduce a Subscription Scheme by which readers shall be subscribing for old issues either year wise or month wise, which in itself would be a unique scheme that no other magazine in the world would have done so far.

12. There were lovely Serials by Shri Dasari Subrahmanyam like Tokachukka, Makaradevata, Kamchukota, Jwaladeepam, Rakasi Loya, Patala Durgam, Sidhilalayam, Rati Ratham, Yakshaparvatam etc. Please bring them as separate books with reasonable price in the same size as that of Chandamama magazine without deleting a single picture.

13. Bring out an album of all pictures of great Artist Shri Vaddadi Papaiah (the Country should be proud of) on art paper, for which there is sizeable market, which would become Collectors’ item in the years to come.

14. Keep the advertisements only in the first and last few pages and not in between which irritate the reader and will spoil beauty of Chandamama.

15. Do not change the format of Picture Story combination with mathematical precision.

I am sure Chandamama would bounce back to greatness again in the near future and all of us who are ignoring Chandamama now would be attracted back to the great magazine.

Wishing all the Chandamama Team a bright future with Chandamama reaching the zenith of popularity again and shall remain there forever.

Regards,

K.SIVARAMAPRASAD

BANGALORE, INDIA

25, ఆగస్టు 2009, మంగళవారం

వారెవ్వా, ఏమి వీడియో భాయి- జెండాను గౌరవించటం ఆయన్ని చూసి నేర్చుకోవాలి

ఒక్కోసారి అనుకోకుండా ఆణిముత్యాలు దొరుకుతాయి. అటువంటి ఆణిముత్యమే ఈ చక్కటి లఘు చిత్రం చూసి ఆనందించండి. సినిమా హాల్లో జాతీయ గీతం వేస్తుంటే గొర్రెల్లాగా వెళ్ళిపొయ్యేవాళ్ళకి లాక్కెళ్ళి చూపించండి వాళ్లు చుట్టాలయినా, స్నేహితులయినా సరే.

పాత కాలంలో అంటె 1970ల వరకూ కూడ సినిమా హాళ్ళల్లో సినిమా అన్ని ఆటలు అయినాక జాతీయ గీతం తప్పనిసరిగా జెండా ఎగురుతూ ఉండగా బాక్ గ్రౌండ్ లొ జాతీయ గీతం శాస్త్రోక్తంగా వస్తూ ఉన్న ఫిల్ము వేసి తీరాలి. కాని రాను రాను , జండా బొమ్మ జాతీయ గీతం వస్తుండగానే గౌరవంగా నుల్చునే వ్యక్తులను వేళ్ళ మీద లెక్కబెట్టవలిసిన పరిస్థితి, మిగిలిన వాళ్ళు గొర్రెలమందలాగ అలా గౌరవంగా నుంచున్న వాళ్ళను తోసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ (అడ్డoగా నుంచున్నందుకు) విసుక్కుంటూ ఉండే పరిస్థితి వచ్చింది. ఇది చూసి ప్రభుత్వం, ఇలా రోజూ మూడు ఆటలు, ఆదివారాలు పండుగలకు నాలుగాటల చొప్పున జాతీయ గీతo, జెండా అవమానించబడటాన్ని చూడలేక, భరించలేక, జెండాను గౌరవించలేని జాతిని శిక్షించలేక, అలా జండా చూపిస్తూ జాతీయ గీతాన్ని వినిపించటం కంపల్సరీ కాదు అని ప్రకటించారు. సినిమా హాళ్ళ వాళ్ళు ఆ జండా రీళ్ళన్ని "హమ్మయ్య" అని ఆవతల పారేశారు.

ఇప్పుడు కూడ చూడండి, జాతీయ గీతన్ని, సినిమా మొదట్లోనే చూపిస్తుంటారు కొన్ని హాళ్ళల్లో. ఎందుకూ? ప్రేక్షకుడు సినిమా చూడాలి కదా, వెళ్ళిపోడు అందుకని. ఇప్పటికి కూడ సినిమా ఐపొయ్యాక జండాను, జాతీయ గీతన్ని చూపిస్తే ఎంతమంది నుంచును ఉంటారు. పైగా ఇప్పుడు వచ్చే బేవార్సు సినిమాలకు వచ్చే ప్రేక్షకులకు జాతీయ గీతమేదో కూడా తెలియదాయె మరి.

ఇదే విధంగా ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని అయిపోయినాక, రాత్రి పదిన్నర కు ప్రసారాలు జాతీయ గీత ఆలాపనతో అంతమయ్యేవి. కాని అక్కడ కూడ ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది, ప్రజలు ఎటువంటి స్థితిలో ఉండి ఈ జాతీయ గీతం వింటున్నారో కదా, అలా వింటూ నుంచుని గౌరవించ గలిగిన స్థితిలో ఉంటారో లేదో , అసలే జనభా తెగ పెరిగి పోతొంది, వాళ్ళను డిస్టర్బ్ చెయ్యటం దేనికి , అని అలా జాతీయ గీతాన్ని రోజూ వీనిపించటాన్ని కూడ 1970లలోనే మానుకున్నారు.

ఈ కింది వీడియో చూసి ఆనందించండి

జెండాను గౌరవించటం ఆయన్ని చూసి నేర్చుకోవాలి


విజయవర్ధన్ మీకు నా ధన్యవాదాలు, ఇటువంటి చక్కటి వీడియోని నాకు చూపించినందుకు.

ఇటువంటి వీడియేలు మరి కొన్ని ఈ కింది బ్లాగులో ఉన్నాయి

భారతీయం

23, ఆగస్టు 2009, ఆదివారం

చిత్ర - చందమామ అద్భుత చిత్రకారుడు

చిత్రా (CHITRA) గా పేరొందిన శ్రీ టి వి రాఘవులు ( T.V.RAGHAVULU )
చందమామ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అందులోని చక్కటి బొమ్మలు. ఎన్ని బొమ్మలు, ఎన్ని బొమ్మలు! ఆ బొమ్మల కోసమే కదా చందమామ చదెవే వాళ్ళం. చందమామలో ముగ్గురు అద్భుత చిత్రకారులు ఉండేవారు.

చిత్రా
శంకర్
వడ్డాది పాపయ్య

వీరిలో చిత్రాగారి గురించి ముచ్చటించుకుందాము.

వ్యక్తిగతం
చిత్రాగా ప్రసిధ్ధికెక్కిన వీరి అసలు పేరు టి.వి రాఘవులు.వీరి జననం మార్చ్ 12, 1912 వీరు తెలుగువారే. కాని మద్రాసు తెలుగు వారు. అప్పట్లో మద్రాసులో, రమారమి తమిళులు ఎంతమంది ఉన్నారో, అంతమంది తెలుగువారు కూడ ఉండేవారట. ఈయన S.S.L.C వరకు చదువుకున్నారు. వీరి వివాహం 1942లో జరిగింది. చందమామలో చేరక ముందు, కొంతకాలం ఆక్ష్‌ఫర్డ్ ప్రెస్సులో సేల్సుమాన్ గాను చిత్రాకారునిగాను పనిచేసారు.చిత్రాగారు స్వతహాగా చాయా గ్రాకులు కూడా. ఫొటోగ్రఫీలో కొన్ని బహుమతులను కూడా సంపాయించారు. అందుకనే కాబోలు, ఆయన వేసిన చిత్రాలు, ఫొటోల్లాగ ఉంటాయి.

చిత్రలేఖన ప్రవేశం
చిత్రాగారిదగ్గర ఉన్న చిత్రం ఏమంటే, ఆయన చిత్ర లేఖనంలో శిక్షణ పొందలేదు, స్వయంకృషితో మంచి ఆసక్తితో అభ్యాసం చేసి నేర్చుకుని చిత్ర కళలో నైపుణ్యం సంపాయించి, భారత దేశం లో ఉన్న బాలలందరినే కాక పెద్దలను కూడ దశాబ్దాలపాటు అలరించారు.
చిత్రకళా నైపుణ్యం
ఒకానొక సందర్భంలో కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు చందమామ గురించి ఇలా అన్నారు:

"చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా"

జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, రాయాయణ కల్పవృక్షం వంటి కావ్యాలను వ్రాసిన మహా రచయిత, చందమామ మీద ఇంతటి ప్రేమ చూపించటంలో, బొమ్మలదే ఎక్కువ పాత్ర అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు.

చిత్రా వేసిన బొమ్మలు, కథను చిత్రాల ద్వార చెప్పటమే కాకుండా, కథలో చెప్పని అనేక విషయాలను వ్యక్త పరిచేవి. బొమ్మ చూడగానే కథను చదివించే శక్తి, మన మనసులను సూదంటు రాయిలాగ ఆకర్షించి, మన ఊహా లోకాలలో ఆ కథా విషయం, కథా కాలం, ఆ కథలలో ఉన్న పాత్రల స్వబావ స్వరూపాలు వెంటనే మన మనసులకు హత్తుకు పొయ్యేట్టుగా ఆయన వేసిన బొమ్మలు చందమామను ఎంతో ప్రసిధ్ధ పత్రికగా నిలబెట్టినాయి.

బొమ్మలను చందమామలో ఎలా, ఎక్కడ వెయ్యలి అన్న విషయంలో చక్కటి కొత్త శైలిని ప్రవేశపెట్టారు, చక్రపాణి గారు. ఆయన ప్రవేశపెట్టిన శైలిని తన చిత్రకళా నైపుణ్యంతో ఒక ఒరవడిగా తీర్చిదిద్దిన ఘనత చాలావరకు చిత్రాగారిదే. ఇప్పటికీ పిల్లల పత్రికలన్ని కూడ, చందమామ వారు ఏర్పరిచిన పంథానే అవలింభిస్తున్నాయి. చివరకు చందమామ "వ్యాపార కంపెనీ" పరమయ్యి, కొత్త పోకడలకు పాకులాడి, చందమామ ముద్రించే పద్దతి మార్చినప్పుడు, తీవ్ర నిరసనను ఎదుర్కుని, మళ్ళీ తమ పాత పద్ధతిలోనే ప్రచురిస్తామని మాట ఇవ్వాల్సి వచ్చింది. అంతగా ప్రాచుర్యం పొందింది, చందమామ ప్రచురణ పద్ధతి.

చిత్రాల ప్రత్యేకత
అసలు బొమ్మలో ఉండవలసిన ముఖ్య లక్షణం ఆ బొమ్మలో ఉన్న పరిసరాలు, వస్తువలు, మనుష్యులు మధ్య ఉండవలసిన నిష్పత్తి. ఒక మనిషి మేడపైనుంచి చూస్తుంటే, కింద వస్తువులు అతనికి ఎలా కనిపిస్తాయి, లేదా, కిందనుండి పై అంతస్తులో ఉన్న వ్యక్తితో మాట్లాడే వ్యక్తి మెడ ఏ కోణంలో వెయ్యాలి, అతనికి మేడమీద వ్యక్తులు ఎలా కనిపిస్తారు లాంటి విషయాలు చక్కగా ఆకళింపు చేసుకుని చిత్రాగారు బొమ్మలను వెయ్యటం వల్ల ఆయన బొమ్మలు ఎంతగానో పేరు తెచ్చుకున్నాయి. కథను క్షుణ్ణంగా చదివిన తరువాతగాని బొమ్మ వెయ్యటం మొదలు పెట్టేవారు కాదన్న విషయం, ఆయన వేసిన ప్రతి బొమ్మలోనూ కనపడుతుంది. ఆయా పాత్రల ముఖ కవళికలు, కథలోని పాత్రల మనస్తత్వాలను సరిగ్గా చిత్రీకరించేవారు.

చిత్రాలన్నీ కూడ బొమ్మలోని కథ ఏ ప్రాంతంలో జరిగిందో, ఆయా ప్రాతాంల భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబించేవి.అక్కడి మనుషులు ఎలా ఉంటారు, ఎటువంటి జంతువులు దర్శనమిస్తాయి, అక్కడ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి పరికరాలు వాడతారు వంటి అనేక విషయాలు అధ్యయనం చేసి తమ బొమ్మలలో వేసి పిల్లలకు కథలో చెప్పని ఎంతో విలువైన సమాచారం ఇచ్చేవారు చిత్రాగారు. మనం ఇంక ఆ ప్రాంతం గురించి పెద్దగా తెలుసుకునే అవసరం ఉండేది కాదు. అలాగే, కథలోని పాత్రల హోదా బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి, కేశాలంకరణలు, దుస్తులు మారిపొయ్యేవి, చక్కగా కథలో వ్రాసిన విషయానికి నప్పేవి.

ధారావాహికలకు బొమ్మలు
కథలకు బొమ్మలు వెయ్యటం ఒక ఎత్తు ఐతే, ధారావాహికలకు చిత్రాగారు వేసిన బొమ్మలు అపూర్వం, నభూతో న భవిష్యతి. ఆయనలాగ దారావాహికలు బొమ్మలు వేయగలవారు లేరు. మొదటి భాగంలో ఒక పాత్ర ఎలా ఉంటుందో, ధారావాహిక చివరి భాగం వరకూ అదేవిధంగా వెయ్యగలిగిన ప్రజ్ఞాశాలి. రచయిత దాసరి సుబ్రహ్మణ్యంగారి కృషి, వారి రచనలకు వన్నె తెచ్చే విధంగా చిత్రా గారి బొమ్మలు, రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, శిధిలాలయం, రాతి రథం మొదలగుగాగల చందమామ ధారావాహికలు ఎంతగానో పాఠకుల మెప్పు పొందటానికి, చందమామ ప్రాచుర్యం పెరగటానికి తోడ్పడినాయి.

కీర్తి ప్రతిష్టలు
చిత్రాగారు దాదాపు 10,000 వేల బొమ్మలు చందమామలో వేశారట. చందమామకు కార్యాలయాన్ని దర్శించిన వేలమందిలో ఎక్కువమంది చిత్రా గారిని చూడటానికే వచ్చేవారట. చందమామలో చిత్రాగారు వేసిన బొమ్మలన్నిటిని మంచి నాణ్యంతో ముధ్రించి భద్రపరచవలసిన అవసరం ఎంతో ఉన్నది. చిత్రకళను అభ్యసించేవారికి వారి బొమ్మలు చూస్తే చాలు, బొమ్మలు ఎలా వేయాలో సులువుగా అర్థమౌతుంది. నాకు దొరికినంతవరకు, శిధిలాలయం ధారావాహికలో, చిత్రాగారు వేసిన కొన్ని బొమ్మలను ఈ కింద అందిస్తున్నాను.ఈ కింద ఇచ్చిన చిత్రాగారి బొమ్మలు ఆయన ప్రతిభను కొంతవరకు చూపిస్తాయి. ఇలాగే ఆయన వేసిన వేల బొమ్మలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ చందమామ కథలను చదవటంలోనే ఉన్నది మజా.

కీర్తిశేషులు
ఇన్ని అద్భుత చిత్రాలు వేసి, దేశవ్యాపతంగా వేల ఏకలవ్య శిష్యులను అభిమానులను సంపాయించుకున్న చిత్రా గారు, మే 6 1978 న స్వర్గస్తులయ్యారు. చిత్రాగారు ఎలా ఉంటారు అన్న విషయం , వారు మరణించిన తరువాత చందమామ వారు జూన్ 1978 సంచికలో ప్రచురించిన ఫొటో చూసే వరకు పాఠకులకు తెలియదు. అది కూడ చాలా పాత ఫొటో. ఆ చిత్రాన్నే ఈ వ్యాసం మొదట్లో పొందుపరచటం జరిగింది. ఆయన నిర్యాణంతో చందమామకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన తరువాత వచ్చిన చిత్రకారులు, తమ బొమ్మలతో (చిత్రా బొమ్మల తీరును అనుసరించినప్పటికీ) పాఠకులను అలరించటంలో విఫలమయ్యారు.



ఈ వ్యాసంలోని వివరాలు జూన్ 1978 సంచికలో చందమామ వారు ప్రచురించిన శ్రధ్ధాంజలి నుండి గ్రహించటమైనది. చిత్రాగారి గురించి ఇంకా అనేక విషయాలు తెలియవలసి ఉన్నది. వారిచిత్రాల మీద అప్పటి పాఠకులు, సమకాలీన కళాకారుల అభిప్రాయాలు, ఆయన బొమ్మలు వేస్తుండగా తీసిన ఫొటో, చందమామకు ఇంతటి పేరు సంపాయించిపెట్టిన చిత్రాగారికి ఎంత ప్రతిఫలం ఉండేది, 1970లలో ఆయన ఎలా ఉండేవారు. ఆయన కుటుంబ జీవనం, పిల్లలు వగైరా, వగైరా.


చిత్రాగారు శిధిలాలయం ధారావాహికకు వేసిన బొమ్మలు కొన్ని

22, ఆగస్టు 2009, శనివారం

వినాయక చవితి - మొక్కల ఊచకోత



వినాయక చవితి శుభాకాంక్షలు
మనం వినాయకుడి పేరున పండుగ చేసుకుంటున్నాము. పూజలో భాగంగా పత్రితో పూజ చేస్తాము. అసలు పత్రితో పూజ ఎందుకు ప్రవేశపెట్టి ఉంటారు? ఇలా అన్నా ప్రజలు తమ తమ ఇళ్ళలో రకరకాలైన చెట్లు పెంచుతారేమో అని అయి ఉంటుందని నా అభిప్రాయం. కాని, మనం ఏమి చేస్తున్నాము! సరిహద్దు గోడకి, ఇంటికి అంగుళం కూడ వదలకుండా ఇళ్ళు కట్టేసుకుని (లేకపోతే అద్దెలు తక్కువవుతాయి మరి), ఇలా పూజలకి అవసరమైన (పూజ చెయ్యకపోతే ఏమి జరుగుతుందో అని "భయం", భక్తి పాలు తక్కువ) పత్రి కోసరం మార్కెట్టుకు ఎగబడటం ఇదే సందని, ఎక్కడేక్కడ చెట్లని విరిచి పత్రి కింద అమ్మటం అది తెచ్చి వినాయకుడికి పూజ!! భగవంతుడు ఇల్లాంటి పూజలను ఒప్పడు.

ఎన్ని అరటి పిలకలండీ విరిచి, కోసి అమ్ముతున్నారు. కనీసం, అవి మొక్కలయ్యి ఎన్ని అరటికాయలు కాస్తాయన్న ఇంగిత జ్ఞానం కూడ లేకుండా(ఈ కరువు రోజులలో). పాపం ఆ అరటి మొక్కలను అలా రోడ్డు మీద వందల సంఖ్యలో పడేసి అమ్ముతుంటే చాలా భాధ వేసింది.

ఇలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే "పుణ్యం"  అన్నమాట పట్టుకుని, ఆ చెట్టు పెంచకపోగా ఒక 20 వీధులకు ఉన్న ఒక్క చెట్టు కొమ్మలను తలా ఒకటి విరిచి పట్టుకుపోయి అది పక్కన పెట్టుకుని భోజనం, పూజ!! ఉన్న ఆ ఒక్క చెట్టు చచ్చిపోవటం. వచ్చే సంవత్సరం మరొక చెట్టుని వధించటానికి మళ్ళీ ఈ పుణ్యమూర్తులు ఎగబడటం!! ఇదా ఈ ఆచారం ఉద్దేశ్యం?? ఉసిరి మొక్క, కాయలు ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి పనికివస్తాయి. అటువంటి చెట్టును అందరూ ఇళ్ళల్లో పెంచుకోవటాన్ని ప్రోత్సహించటానికి పెద్దవాళ్ళు పుణ్యం వస్తుందని ప్రలోభ పెట్టారు. మన ఆరోగ్యం కంటే పుణ్యం ఏముందండీ.

మనం మన పిల్లలు, రాబోయ్యే తరాలు సుఖంగా బతకాలంటే, సమయానికి వానలు పడి పంటలు పండాలంటే, ఇలా ఆచారాల పేరిట చెట్లను సంహరించటం మానితే కొంతన్నా మేలు జరుగుతుంది.ఆచారాల వెనుక ఉన్న ఉద్దేశ్యం సరిగ్గా అర్థం చేసుకోవాలి, చెట్లను పెంచాలి, కాపాడాలి. అంతేకాని, విపరీతార్ధాలు తీసుకుని ఇలా నెగటివ్‌గా(దీనికి సరైన తెలుగు పదం దొరకలేదు) పాటించటం మంచిదికాదు.

స్వైన్ ప్లూ గందరగోళం


నాకనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడున్న ఓవర్ ఏక్షన్ మీడియా లేకుండా ఉంటే మన జీవితాలు ఎంత హాయిగా ఎటువంటి ఉపద్రవాలు లేకుండా ఉంటాయా అని. లేకపోతే, చూడండి, చదువుకున్న వాళ్ళే హాస్పటల్స్ ముందర పెద్ద పెద్ద లైన్లలో పడిగాపులు పడి టెస్ట్ చేయించుకోవటానికి విరగపడి ఎదురుచూస్తున్నారు. పూనేలో మొదలయిన ఈ క్రౌడ్ మెంటాలిటీ, ముంబాయికి, బెంగుళూరికి పాకింది.దీనికి కారణం ఎవరు ?? మన స్వతంత్ర (మనకి మాత్రం స్వాతంత్రం లేదు, అవసరమైన వార్తలు వివరాలు మాత్రమె కోరటానికి/చదువుకోవటానికి)మీడియా కాదూ

ఈ విషయంలో నా అభిప్రాయం ఏమంటే:


1. సరే పెద్ద లైన్లో ఒక రోజంతా నిలబడి టెస్టు చేయించుకున్నాము మనకి ఇంకా స్వైన్ ఫ్లూ అంటలేదన్నారు. మరి రేపటిగురించి, మళ్ళీ టెస్ట్ చేయించుకుందామా!! ఇలా ఎన్నాళ్ళు??


2. అసలు మనకే రోగమూ లేకుండా ఈ టెస్టు కేంద్రాలోకి వెళ్ళి వందల మధ్య కూచుంటే, అక్కడే మనకు అంటే అవకాశాలు ఎక్కువగదా!


అందుకని, మనం డాక్టర్లు చెప్పే మాట విని, మనకు దురదృష్ట వశాన స్వైన్ ప్లూ లక్షణాలు కనపడితే అప్పుడు వెంటనే అలక్ష్యం చెయ్యకుండా డాక్టరు దగ్గరకి వెడితే చాలు. అనవసరంగా ఇలా గందరగోళపడి గుంపులు గుంపులుగా హాస్పటల్సు దగ్గర గుమికూడి వాళ్ళమీద వత్తిడి తేవటం మంచి పని కాదు.


పాపం ఈ హాస్పటల్ సిబ్బందికి, ఈ అక్షరాస్యులు అయిన మూకల్ని అదుపు చెయ్యటమే సరిపోతుంది. నిజంగా స్వైన్ ప్లూ వచ్చినవాళ్ళకు వైద్యం చెయ్యలేక పోవచ్చు.అటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరం

17, ఆగస్టు 2009, సోమవారం

చందమామలో మొదటి కార్టూన్ ధారావాహిక - గలివర్ ట్రావెల్స్

పిల్లల పుస్తకంలో కార్టూన్ ధారావాహిక లేకపోవటమేమిటి అనుకున్నరల్లేఉంది చందమామ వారు, 1960 ఏప్రిల్ నుండి 1960 డిసెంబరువరకు గలివర్ ట్రావెల్స్ ప్రచురించారు. ఈ ధారావాహికకు బొమ్మలు వేసినది ఎవరో తెలుసా? బాపు గారు. ఈ అద్భుతమైన ధారావాహికను దొరికినంతవరకు పోగుచేసి ఒక ఫైలుగా చేసాను. స్కానింగు నాణ్యం అంత బాగా లేదు. అయినా పరవాలేదు చదవచ్చు.

ఈ ధారావాహికతోపాటుగా,మరి రెండు కార్టూన్ కథలను కూడ జతపరిచాను.
1) మంత్రాల మల్లి
2) హనుమంతుడి కథ

ఈ రెండిటికీ బొమ్మలు ఎవరు వేశారో తెలియటంలేదు. బహుశా వడ్డాది పాపయ్య గారనుకుంటాను.ఈ రెండు కార్టూన్ కథలను నవంబరు 1964 మరియు నవంబరు 1962లో దీపావళి ప్రత్యేక సంచికలలో ప్రచురించారు.

చివరలో రెండు పాపయ్య గారి చక్కటి బొమ్మలు కలిపాను. ఈ బొమ్మలు పురాణ సంబంధం కాదు. రెండూ కూడ దేశభక్తి పూరకమైనవి ఒకటి 1965లో మరొకటి 1963లో వేసినవి. ముఖ్యంగా చైనా దాడి నుండి భారత్ ఎలాగోలా బయటపడిన తరువాత వెయ్యబడ్డ చిత్రం, పాపయ్య గారు చైనాను చిత్రించిన విధం అద్భుతం. బారత మాతను, బారత ప్రజలను చూసి బెదిరిపోతున్న డ్రాగన్ లాగ వేశారు. డ్రాగన్ మొహం చైనా వాడిది వేసారు, అందులో మావో పోలికలను తెప్పించారు.

16, ఆగస్టు 2009, ఆదివారం

తాతయ్య కథలు

ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు ఎక్కువగా కనపడరు. వాళ్ళెక్కడో పల్లెలోనో,పట్నంలోనో లేదా ఏ వృధ్యాప్య గృహంలోనో ఒంటరిగా కాలగడుపుతుంటే, పిల్లలు, మనవలు మనవరాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో మనవలకు మనవరాళ్ళకు తాతయ్య ఎవరో తెలియదు, తాతయ్యకు వీళ్ళను చూసే అవకాశం వచ్చి ఉండదు. మరికొన్ని దురదృష్ట సందర్భాలలో మనవలకు మనవరాళ్ళకు తమ తాతయ్య మాట్లాడే భాష అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు విదేశాలలో పెరిగి ఉంటారు. నేటి ఈ కాలంలో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపుగా కనుమరుగయ్యింది.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, పూర్వపు రోజులలో 50-60 దశకాలలో కూడ, మనకున్న చక్కటి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తూ, చందమామ వారు "తాతయ్య కథలు" అన్న శీర్షిక పేరుతో అనేక కథలు ధారావాహికగా ప్రచురించారు. ఈ చక్కటి శీర్షిక 1960 ఆగస్టు నెలలో మొదలయ్యి 1961 మే నెలవరకు వేశారు. ఆ తరువాత మే 1962 నుండి జులై 1963 వరకు ధారావాహికగా ప్రచురించారు. ఆ తరువాత నవంబరు 1968, ఫిబ్రవరి మరియు ఏప్రిల్ 1969 నెలలో కూడ ఈ కథలను పాఠకులకు అందించారు.

ఈ కథలలో మొట్టమొదటి కథ పేరు అదృష్టం, చిట్టచివరి కథ పేరు మట్టి కాళ్ళు.

తాతయ్య కథల రచయితలు

సర్వశ్రీ
సి శేషాద్రి
చల్లా లక్ష్మి గారు
ఆర్ బయవ రెడ్డి
ఎ వ్ శేషాద్రి
మాధవరెడ్డి చంద్రశేఖర్

వీరిలో ఎక్కువ తాతయ్య కథలను వ్రాసినవారు సి శేషాద్రి గారు. ఈ శీర్షికకు బొమ్మలు వేసినది ప్రముఖ చిత్రకారులు చిత్రాగారు. అప్పుడప్పుడు శంకర్ గారు కూడ బొమ్మలు వేశారు.

ముఖ చిత్రం చూడండి తాతయ్య మెల్లిమెల్లిగా ముసలివాడయినట్టుగా వేశారు. చివరి భాగంలో తాతయ్య చాలా ముసలివాడయిపోయాడు. తాతయ్య నోటిద్వారా చక్కటి కథలను అందించిన చందమామవారు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో పాటుబడ్డారు.

ఈ కథలను ఈ కింద ఇచ్చిన లంకె ద్వారా అందుకోండి.

http://rapidshare.com/files/268066551/TATAYYA_KATHALU_CHANDAMAMA_KSRP.ప్ద్ఫ్ (
లింకు నుండి మునుపు డౌన్లోడ్ చేసుకోవటానికి ఆవకాశం ఉండేది. కాని కాపీ రైటు సమస్యలవల్ల సౌకర్యం తొలగించటం జరిగింది. ఇప్పుడు ధారావాహిక చదవాలంటే, చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ వారు ఉంచిన పాత చందమామలను తెరిచి చదువుకోవచ్చు.)

15, ఆగస్టు 2009, శనివారం

తులసీరాం-ప్రముఖ కార్టూనిస్ట్



ఈ వ్యాసం ఇంతకుముందు తెలుగు వికీలో వ్రాశాను. ఇక్కడ మళ్ళీ ప్రచురిస్తున్నాను. అడిగిన వెంటనే తన వివరాలు, కార్టూనులు పంపి వ్యాసం వ్రాయటానికి ప్రోత్సహించిన తులసీరాంగారికి కృతజ్ఞతలు


తెలుగు వ్యంగ్యచిత్ర రంగంలో 1960, 1970 దశకాలలో పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించినవారు తులసీరాం‌. వీరి అసలు పేరు షరాఫ్ తులసీ రామాచారి. తన పేరులోని "తులసి" "రామ" కలిపి 'తులసీరాం' తన కలంపేరును చేసుకుని ఆ పేరుతోనే ప్రఖ్యాతిగాంచారు.

వ్యక్తిగతం
వీరు 1941, ఏప్రిల్ 24న కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని అలువకొండ గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి షరాఫ్ పుల్లయ్య ఆచారి, తల్లి షరాఫ్ సుబ్బమ్మ. ఇద్దరూ కీర్తిశేషులయ్యారు. 1958-59లో ఎస్సెసెల్సీ (Secondary School Leaving Certificate[SSLC]), 1959-60 ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం నుండి పి.యు.సి. (Pre University Course[P.U.C.]) పూర్తి చేశారు. 1968 లో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ (Andhra Pradesh State Electricity Board [APSEB])లో ఎల్డిసీగా చేరి, విజయవాడ, నరసారావుపేట, గుంటూరు ప్రాంతాలలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి జూనియర్ అక్కౌంట్స్ ఆధికారిగా 1998వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. వీరు ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నావీరు. వీరి భార్య షరాఫ్ సత్యవతి, వీరిని ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాక్షిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు-రవీంద్రీశ్వర్‌, సుధాకర్ మరియు కుమార్తె-నాగమణి. వీరి పెద్ద కుమారుడు రవీంద్రీశ్వర్ దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే స్వర్గస్తులయ్యారు. వీరి చిన్న కుమారుడు, సుధాకర్ కూడ మంచి కళాకారుడు. ఏనిమేషన్ లో ప్రవేశం ఉన్నది, స్వంతంగా చక్కటి బొమ్మలు గీస్తూ ఉంటారు.

కార్టూన్ రంగ ప్రవేశం

చిన్నతనం నుండి బొమ్మలు గీయటం మీద ఆసక్తి. ఈ ఆసక్తి మూలంగానే, ప్ర్రాధమిక విద్యాభ్యాసం జరుగుతుండగానే, 1958వ సంవత్సరంలో అంటే 17 సంవత్సరముల వయస్సులో, లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షలు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడైనారు. ప్రకృతి చిత్రాలు, కార్టూన్లు, నలుపు-తెలుపు చిత్రాలు గీయటం, వ్యంగ్య చిత్రాలు, ఛాక్‌పీసులతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రకరకాల బొమ్మలు చెయ్యటం, చెక్కటం చేశేవారు. వీరి మొట్టమొదటి కార్టూన్ 1964వ సంవత్సరంలో ఆంధ్రపత్రిక లో ప్రచురితమయ్యింది. ఆ తరువాత వీరి వ్యంగ్య చిత్రాలు అన్ని ప్రముఖ దిన/వార/మాస పత్రికలలోనూ ప్రచురితమయ్యి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక్క తెలుగు పత్రికలలోనే కాక, వీరి కార్టూన్లు, ఆంగ్ల పత్రికలయిన శంకర్స్ వీక్లీ (Shankar's Weekly), న్యూస్ టైమ్ (News Time)లలో కూడ ప్రచురితమయ్యాయి. స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలలో ప్రధమ, ద్వితీయ బహుమతులు లబించాయి.

రచనా వ్యాసంగం
వీరు కార్టూన్లు వెయ్యటమేకాక, అనేక కథలు, చిన్న కథలు, రకరకాల జోకులు, వ్యాసాలు, కవితలు, హైకూలు, పాటలు, చిన్న పిల్లల కథలు వ్రాశారు. వీరు వ్రాసిన కవితలలో కొన్ని, ఆకాశవాణి విజయవాడ కేద్రం వారు వివిధ భారతిలో ప్రసారం చేశారు. పదశృతి శీర్షికన వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర ప్రభలో ప్రచురితమవుతున్నాయి. వీరు వ్రాసిన కథలు దాదాపు 30 దాకా ఉంటాయి 1960లో వ్రాసిన "ప్రేమ ఫలితం" అనే నాటకం హైదరాబాదులో నిర్వహించబడిన పోటీలలో బహుమతి అందుకున్నది.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు

  • వీరి కార్టూన్‌లు చక్కటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి.
  • మనకు సామాన్యంగా ప్రతిరోజూ తారసపడే సంఘటనల నుండి హాస్యాన్ని అందిస్తారు
  • బొమ్మలు తక్కువ గీతలతో పరిపూర్ణంగా ఉంటాయి.
  • కార్టూన్‌లో ఇతర వివరాలు ఎంతవరకూ అవసరమో అంతే ఉంటాయి.
  • మోతాదుకు మించిన వివరాలు, బొమ్మలమీద గీతలు, పిచ్చి జుట్లు వంటివి వీరి కార్టూన్ల లో కనపడవు.
ప్రదర్శనలు
వీరు వేసిన కార్టూనులు, చిత్రాలు, చెక్కిన ఛాక్‌పీసు బొమ్మలు, లియో క్లబ్, రోటరీ క్లబ్, చిరంజీవి కల్చరల్ అసొసియేషన్ వంటి స్వచ్ఛంధ సంస్థలు తెనాలి, నరసారావుపేట లలో ప్రదర్శనలు నిర్వహించాయి.
అంతేకాక, జిల్లా గ్రంధాలయ సంస్థలు, ప్రెస్ క్లబ్‌లు కూడ వీరి ప్రదర్శనలను ఏర్పరిచి, ప్రజలకు వీరి చిత్రకళా నైపుణ్యాన్ని చూపించారు.


వ్యంగ చిత్ర మాలిక

13, ఆగస్టు 2009, గురువారం

చలం గారి సినిమా సమీక్ష

వ్యాసం చివరి వరకూ చదివిన వారికి ఒక చక్కటి బహుమతి ఉన్నది
ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు(లక్ష్మీ టాకీసు) ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవారు.చలంగారు తన మ్యూజింగ్స్ వ్యాసాల్లో సినిమా హాలు పక్కన ఉన్న ఇంట్లో ఉంటూ తనెంత క్షొభ పడ్డాడో ఈ కింద విధంగా వ్రాశారు:

"మా గోడపక్కన టాకీగృహం. యజమానులు వాళ్ళకి ఏఫిల్ము డబ్బు తీసుకొస్తుందో ఆలోచిస్తారుగాని, పక్కన నివసించే నిర్భాగ్యుల నిద్ర అదృష్టాన్ని గుర్తించరు. ఫిల్ము మారుతోంది అనేప్పటికి గుడెలు దడదడలాడతాయి, ఏ కొత్తరకం ఉపద్రవం రాబోతోందో అని. అర్ధరాత్రులు మెళుకువగా గడిపేవాళ్ళ మనశ్శాంతి ఈ డైరక్టర్ల శ్రవణ సౌకుమార్యం మీద ఆధారపడవలసి వొచ్చింది. తెలుగు ఫిల్ములను చూడనివాళ్ళ అశ్రద్ధ మీద మంచికసి తీర్చుకుంటున్నారు వారాలకి వారాలు వాటి దుస్సహమైన శబ్దాలను వినిపించి. ఏ హీరోయినో పెద్దపులినోట ప్రాణాన్నో, దుర్మార్గుడి హస్తాలమధ్య శీలాన్నో, సముద్రంలో తనవస్త్రాలనో,కోల్పోయే అపాయంలోకి దిగేటప్పుడు, ఇరవై ఇనపతాళ్ళమీద రంపాలుపెట్టి కోస్తున్నట్టు గోలకల్పిస్తే ఊపిరి బిగబట్టి మెడలుచాచి ఆవింత చూసే రెండువందల అణాకానీలకి ఉత్సాహకరంగా ఉంటుందేమో కాని, వినేవాళ్ళు అపాయం తప్పిందని tension సళ్ళిచ్చి ఎప్పుడు ఈలలు కొడతారా అని ఫిల్ము దేవుళ్ళకి మొక్కుకుంటో వుంటారు..........................టిక్కెట్టు కొనలేని వారికి కూడా art పంచాలనే ఉదార ఆశయంతోగావును, దర్శకులు, మాటలూ, పాటలూ చుట్టూ అరమైలు వరకు వినపడేట్టు ఏర్పాటుచేశారు. ఎట్టాగైనా తెలుగువారు చాల generous people. విశ్వదాత అనుగు బిడ్డలు. ఆ పాటల్ని విని, ఆ గంధర్వ కంఠాల ఆకర్షణని నిగ్రహించుకోలేక,ఎట్లాగో అణాకానీలు సంపాయించుకుని, ప్రజలు చిత్రం చూడ్డానికి వస్తారని ఆశ....................నెలలు వాటితో గడిపి ఇంకా బతికి ఉన్నానంటే, నాకు నూరేళ్ళకన్నా ఎక్కువ అయుర్దాయమున్నదని అనుమానంగా ఉంది. నేను దేశానికీ, భాషకీ చేస్తున్న ద్రోహానికి, యముడి పక్కన, ఇటు భారతమాతా, అటు సరస్వతీ నుంచుని తప్పకుండా నరకంలోకి తోయిస్తారని ఆశపడే నీతిసోదరులకి చాలా ఆశాభంగం కలగబోతోంది. ఈ ఫిల్ముపాటలు వినడంతో నా కర్మపరిపాకం ఇక్కడే తీరింది. నాకుకూడా, నరకంలో వేసినా, ఇంతకన్నా ఏంచేస్తారు అనే నిబ్బరం చిక్కింది. ఇంతలో బాలనాగమ్మ ట్రైలరు వినడంతోటే, చాల పొరబడ్డాననీ, దర్శకుల శబ్దకల్పనాశక్తి లోతుల్ని తెలుసుకోలేక, అబద్ధపు ధీమాలో బతుకుతున్నానని వొణుకు పుట్టింది. ఇల్లు మారుద్దామా, ఇల్లు దొరక్కపోతే రైలుస్టేషనులో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అక్కడ మకాం పెడదామా అనుకొంటూ ఉండగా, ఆ ఫిల్ము రాదని అబద్ధపు ధైర్యాన్నిచ్చారు".

1990లలో ఆ సినిమా హాలుతోబాటు చలం పూర్వం ఉన్నఇల్లుకూడా కొని, కూలగొట్టి ఒక వ్యాపార సముదాయం కట్టారు. కూలగొట్టడానికి ముందు, ఆ ఇంటిని చలం ప్రదర్శనశాలగా మార్చడానికి ఆయన అభిమానులు ప్రయత్నించారు,కానీ, ప్రస్తుతపు వ్యాపార వత్తిడులననుసరించి, ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు.

ఇలా తప్పనిసరిగా సినిమాలు వింటూ, అప్పట్లో విడుదలై 56 రోజులు ఆడిన లైలా మజ్ఞు సినిమా మీద చలం గారు తన మ్యూజింగ్సులో(280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ క్రింది విధంగా వ్రాశారు


లైలా మజ్ఞు ప్రపంచ సారస్వతంలోని ప్రేమ కథల్లో ఒకటి. ఆ కథ, నాటకాలై తరువాత హిందీ సినిమాలై, ప్రస్తుతం తెలుగులోకి దిగింది. ఆ ప్రేమగాధని ఏంగా తయారు చేశారో, ప్రతిరాత్రీ రెండుసార్లు వినడం తప్పలేదు నాకు. ఫిల్ము అంతా ఏడుపే. అంతకన్నా ఏడుపు ఇంక కల్పించడ ఎవరికీ అసాధ్యం చేసేశారు. తెలుగు వాళ్ళకి ఏడుపులు ఇష్టం గావును. పల్లెటూళ్ళాలో చెప్పే పాత బుర్ర కథలన్నీ అన్యాయంగా నరుక్కోడాలూ, ఏడుపులూ, భయాలు.

ఒకరంటారూ, ఈ చిత్రంలో ఆడవాళ్ళకి కొన్ని బట్టలు తీసేసి చూపడం ముఖ్యమైన ఆకర్షణ అని. అట్లాంటి అశ్లీలమైన పని చేస్తే సెన్సార్లు ఎట్లా ఒప్పుకున్నారో! ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి అశ్లీలాలు చిత్రాల్లోకి ఎక్కకండా. ఎందుకంటే తెలుగు సినిమా తారలు పూసుకునే రంగులూ, కట్టుకునే బట్టలూ, ఉండలూ, తీసేసి అసలు స్వరూపాల్ని ఒక్కసారి చూపారంటే, ఇంక ఎటువంటి ప్రేక్షకుడూ ఆ సినిమాల వేపు పోడు. మద్యపాన నిషేధంతో అసలే అవస్థపడుతున్న ప్రభుత్వానికి, ఆదాయం మరీ తగ్గుతుంది. అప్పుడు సినిమాలకి వెళ్ళని వారిమీద పన్ను వెయ్యగల పద్దతి అలోచించాల్సి ఉంటుంది.

ఈ కథలో నాయకీ నాయకులు ప్రపంచ సారస్వతంలో గొప్ప ప్రియులు. గాధ అద్వితీయం. ఈ చిత్రాన్ని తయారు చేసిన గుంపులో, కవులు, చిత్రకారులు, గాయకులు, దర్శకులు, నటులు-ఎవరికన్నా, ఎప్పుడన్నా అలోచనలకి వచ్చిందా, మామూలుగా మనుష్యుల హృదయాల్లో కలిగే ప్రేమ స్వబావం-అది వ్యక్తమయ్యే విధం! ఫిల్ము అంతా ప్రేమో, ప్రేమో అని అరుపులు, వూరంతా వినపడేట్టు అరుపులు. వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకోకపోతే ఇంకేమనుకుంటారు?

దీంటో కొత్తరకమైన ప్రియుల్ని కనిపెట్టారు. "పనమయే ప్రేతముల్ని" పాట చివర "పెళ్ళికూతురా!" అంటాడు. కొంచెంసేపు ఆ పాటే ఉంటే మూడోది ఓ తిట్టు వస్తుందనుకుంటాము. ఆ నాయకి "మన ప్రేమలూ ఊ ఊ ఊ" అని ఊరంతా ఊదుతుంది.

ఈశ్వర కటాక్షంవల్ల వాళ్ళిద్దరూ, అంతటితో చచ్చిపొయినారు గాని లేకపొతే ఎట్లానూ వాళ్ళని వెళ్ళగొడుదురు, పురశాంతికోసం. అట్లా ఏడవకపోతే, ఎక్కడికన్నా పారిపోకూడదా అనుకుంటామా, వాళ్ళెందుకు పొతారూ? మరి వాళ్ళ ప్రేమ అరుపుల్ని వినేదెవరు, ఎక్కడి కన్నా పారిపొతే!


ఫిల్ము చివర నీతి సమస్య వచ్చింది. పెళ్ళి అయిన అమెను ప్రెయుడితో కలసి కాపరం ఎట్లానా చెయ్యనీడమని. అందుకని సరే తుఫాను తెప్పించారు. ఆ తుఫానులో ఇద్దరూ చచ్చిపోయినారు. నాయకుడు పటుత్వమైన ఉపన్యాసమిచ్చి, వెంటనే చస్తాడు. 'అమ్మా చచ్చారు. ఇంక నిద్రపోవచ్చు' ననుకుంటామా! వాళ్ళు చావరు. పైకి ఎగిరి ఆకాశంమీద నుంచి మళ్ళీ పాట లంకించుకుంటారు. ఒక వేళ వాళ్ళని సలక్షణంగా కాపరానికి పెట్టినా ఇంత హంగామా రోజూ చేస్తూనే ఉండేవారేమో!

స్వర్గలోక నివాసుల్ని తలుచుకుంటే ఎవరికైనా దిగులు పుట్టకమానదు. ఐనా ఆకాశంలో ఉండరు. దేయ్యాలై దిగివచ్చి, మళ్ళీ పాటలు ప్రాంభించి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా తమ ప్రేమ పాటల్ని, ఇట్లా అర్చుకుంటో తిరెగే వాళ్ళు ఎక్కడన్నా వుంటార అని.

రామాయణాన్ని పుట్టలో ఊదాడుగాని, ఈ లైలా మజ్ఞూలు వస్తున్నారని ఎవరన్నా వాల్మీకి పుట్టలో ఊదితే ఒక్క గంతేసి అంతులేకండా పారిపోయి ఉండును ఆ రుషి. అప్పుడు రామయణం రాయడానికి విశ్వనాధగారు (విశ్వనాధ సత్యనారాయణ) తప్ప ఎవరూ మిగిలేవారు కారు.

ఈ ప్రకారం కథనీ, చిత్రం తీసే పద్దతినీ ధ్వంసం చెయ్యకపోతే ప్రజలు చూడరని చిత్రాలవారికి నిశ్చితాభిప్రాయం. ఈ ఫిల్ములో కొత్త టెక్నిక్ చూపించారు. తుఫాను నాయకుడికి నోట్టోంచి బయలుదేరుతుంది. అతని నోరు మాట్టాడుతున్నప్పుడు ఆగుతుంది. ఆ పని కాగానే నోరు ఖాళీ ఐ, తుఫాను ప్రాంభిస్తుంది. గొంతు కోస్తున్న చీంబోతు మల్లే "లైలా, లైలా" అన్న అతని అరుపూ, పిచ్చి కుక్క తరిమే వెనకకాలు విరిగిన కుందేలు మల్లే "ఓ ఓ ఓ" అనే అమె అరుపూ విన్న తరువాత, ఈ ప్రజలు ఇళ్ళకుపోయి మామూలుగా ఎట్లా బతుకుతున్నారో తెలీదు. కలలు కంటాను-ఇట్లాఇటి ప్రేమగాధ చిత్రం-అసలు చప్పుడు లేకుండా, సగం వినపడే ఒక మాట-ఎప్పుడో స్మూత్ గా పాడిన ఒక్క చరణం-అట్లా నడవకూడదా అని....ప్రేమని ముఖంలో, కళ్ళలో, దేహం ఉనికిలో చూపకూడదా అని.

అసలు కథలో లైలాది గోషాదేశం. బైటికి రావడం ఆమెకి అసాధ్యం. చొట్టూ ఎడారి. పోవడాని వీలెలేదు. ఈ లైలామజ్ఞూలది మద్రాసు. ఒక్క కార్లు లేవుగాని, తక్కిన రాకపోకలకి ఏ అభ్యంతరాలు లేవు. లైలాకి-ఇంటివారిలో ఆడవాళ్ళందరూ మిత్రులే. ఎందుకు పారిపోరో వాళ్ళు! మతం మహ్మదీయ మతం. పునర్జన్మలు వొప్పుకుని మాట్టాడతారు. ఆ తురక దేశాల మధ్య. ఆ ప్రేమ, పెళ్ళి ఐనవాళ్ళకి వొచ్చిందా, ఆ ప్రియులకి ఈ హక్కుల్లో ఒక్కటీ ఒప్పుకోరు. పెళ్ళి అయిన వాళ్ళకి వొచ్చెది అపవిత్ర ప్రేమ అంటే, ఆ దేశాల్లో ఎప్పుడూ విడాకులు ఉన్నాయి.

అంత దయగల ఆ రాజు, పెళ్ళి చేసుకున్న పిల్లని అట్లా పంపకపోతే తాను ఆమెకు విడాకులిచ్చి, ప్రియుల్ని తానే కలపగూడదా? అసలు ఈ లైలా లెక్చర్లూ, గుంజుకోడాలు, అరుస్తో పాటలు విని ఈ పిల్లతో ఎవడు కాపరం చెయ్యగలడని హడలిపోయి, మంచి మాటలు చెప్పి, ఎంత త్వరగా పంపితే, అంత మంచిదనుకుని ఉంటాడు. ఆ తుఫాను కోసమే కాచుకుని ఉన్నారు ఈ ప్రియులు. కాకపోతే ఒక్కచోటే, ఒక్క సమయంలోనే, లైలా,మజ్ఞూ, తుఫానూ కలుసుకోవడం అసంభవం.


ఇలాగే చలంగారు సినిమా ప్రియులు అన్న వ్యాసంలో అప్పటి సినిమాలు అందులో ఉండే అపభ్రంశపు అంశాలను చక్కటి హాస్యం పండిస్తూ ఎండగట్టారు. ఎప్పుడో 50ఏళ్ళ క్రితం వ్రాసిన ఈ వ్యాసంలోని అనేక అంశాలు ఈనాటికి మనం సినిమా పేరుతో చూస్తున్నటువంటి దృశ్య శబ్ద మేళవింపుకు చక్కగా వర్తిస్తాయి. కాని వినేవాళ్ళెవరు!!!
చలం గారు వ్రాసిని "సినిమా ప్రియులు" వ్యాసాన్నీ ఈ కింద ఇచ్చిన లింకు నొక్కి  (డౌన్లోడ్ చేసుకుని) చదువుకుని ఆనందించవచ్చును. 



చలంగారు సినిమాలను చీల్చి చెండాడడం చదివినాక, భమిడిపాటి కామేశ్వరరావుగారు సినిమాలలో కథ గురించి అన్నమాటలు చూద్దాం

.....సరి మరి కథ. అది పురాణం అవాలి. లేకపోతే అంధ(అచ్చు తప్పేమో ఆంధ్ర బదులు అంధ అని ఉన్నదనుకోవటానికి వీలులేదు. రచయిత ఉద్దేశ్యం "అంధ" అంటే "గుడ్డి" అని) జనానికి గణ్యత ఉండదు. అంధ జనం నూటికి తొంభై. వాళ్ళంతా హాజరైనప్పుడుగాని టాకీ వర్తకం కిట్టదు. వాళ్ళకి భక్తి కుదిరేందుకు దేవుళ్ళూ, భయం వేసేందుకు అడివి మృగాలూ, హుషార్ కలిగేందుకు సుందరులూ వాళ్ళ స్నానాలూ, ఆటలకి గంభీరమైన శీర్షికలూ-సర్వంగిలాబా చెయ్యడంకోసం కైంయిమంటూ మంచి పీకవాళ్ళు పాటలూ! దాంతోటి జన బాహుళ్యం మొదట తమాషాకోసమున్నూ తరువాత తోచకానూ ఎగపడడం. 'వార ప్రతిష్ఠతో' డబ్బురావడం, డబ్బొచ్చిన టాకీ గనక గొప్పదని చెప్పడం! అందువల్ల అందులో యంత్రిపబడ్డ నటులు అసమానంగా అభినయించారనిన్నీ, వాళ్ళ కీర్తి మిన్ను ముట్టడం రూఢీ గనకనే వాళ్ళని 'తార' లు అంటున్నారనిన్నీ చెప్పుగోడం.
...బొమ్మకి కన్ను చాలు (టాకీలో మాటలకి గణ్యత తక్కువ గనక) అందుకని, టాకీ పామరుల్ని కూడా అకర్షిస్తుంది. కాదు పామరుల్నే ఆకర్షిస్తుంది....

ఇప్పుడు చెప్పండి మన సినిమలకి సరైన సమీక్షలు అవసరమా కాదా??

12, ఆగస్టు 2009, బుధవారం

హామ్ రేడియో

సాహిత్యానికి హామ్ రేడియోకి సంబంధమేమీ లేదు. నాకున్న ముఖ్య హాబీ హామ్ రేడియో. నా హాబీ గురించి నలుగురికీ తెలియచేద్దామని, మునుపు నేను తెలుగు వికీలో వ్రాసిన వ్యాసాన్ని ఇక్కడ పున:ప్రచురణ చేస్తున్నాను. హామ్ రేడియో అంటే ఏమిటో తెలియని వారికి ఆసక్తికరంగా ఉండే ఈ వ్యాసం, తెలుగు వికీలో ఈవారపు వ్యాసంగా మొదటి పేజీలో ప్రదర్శించబడింది.
===================================
హామ్ రేడియో ఒక అభిరుచి. ఖాళీ సమయాలలో, ఈ హాబీలో ఆసక్తి ఉన్నవారు, తమకున్న ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, తమంతట తామే ఒక రేడియో - సందేశాలు పంపగలిగే, స్వీకరించగలిగే రేడియో ట్రాన్సీవరు - తయారు చేసి, తమలాంటి ఇతరులతో ఆ రేడియో ద్వారా సంభాషించటమే ఈ అభిరుచి. ప్రారంభ కాలంలో, స్వయంగా సెట్ తయారు చేసుకోగలిగేవారు మాత్రమే ఈ అభిరుచి చూపగలిగేవారు. కాలక్రమేణా తమంతట తాము సెట్ తయారు చేసుకోలేకపోయినప్పటికీ ఆసక్తి ఉన్నవారు కూడా ఇతరులు తయారు చేసిన సెట్లు లేదా మార్కెట్‌లో కొనుక్కొని ఈ అభిరుచిని కొనసాగించటం మొదలు పెట్టారు. నిజానికి ఇప్పుడు ఈ హాబీలో ఉన్నవారిలో ఎక్కువమంది (60%-70% వరకు) సెట్లు తమంతట తాము తయారు చేసుకోలేనివారే. కాని, ఏరియల్ కట్టుబాటు, వాతావరణ పరిస్థితిని బట్టి రేడియోను వాడటంలో ప్రయోగాలు చేస్తుంటారు.

హామ్ చరిత్ర
హామ్ (H A M)అనే పదం ఎలా వచ్చిందో, దాని అర్ధమేమిటో అన్న విషయం మీద చాలా రకాల వివరణలు ఉన్నయి గానీ, ఇదమిత్థంగా దీని అర్థం ఇది, ఈ పేరు ఇలా వచ్చింది అని స్పష్టంగా ఎక్కడా లేదు. HOME AMATEUR MECHANIC లో ప్రతి పదం మొదటి అక్షరం అంటే HAM అని ఒక వివరణ. అలాగే సుప్రసిద్ద రేడియో సాంకేతిక నిపుణులు, శాస్త్రజ్ఞులు అయిన HERTZ,ఆర్మ్ స్ట్రాంగ్ (చంద్రుడిమీద దిగిన ఆయన కాదు) మరియు MARCONI ల పేర్లలోంచి ప్రతి పేరులోనూ మొదటి అక్షరం తీసుకొని వారి మీద గౌరవంతో HAM అని వచ్చిందని మరొక వాదన. ఏది ఏమయినా, ఈ హాబీ రేడీయో తయారు చేయటం, తమంతట తామే తయారు చేసుకునే వారిని, అందులో తమవంటి వారితో సంభాషించేవారిని ఇప్పుడు "హామ్" అని పిలుచుకోవటం పరిపాటయింది.


హామ్ రేడీయోలో ఏమి మాట్లాడుకొంటారు?
ముందు హామ్ రేడియోలో ఏమి మాట్లాడకూడదో తెలుసుకుందాము 1)రాజకీయాలు; 2)మత సంబంధ విషయాలు; 3)డబ్బుల గురించి, 4)వ్యాపార సంబంధమయిన విషయాలు 5) అసభ్య విషయాల గురించి మాట్లాడటం పూర్తిగా నిషేధించారు.

హామ్ లు తమ రేడియో తయారి గురించి, తాము ఎలా తయారు చేసుకున్నారో, ఎటువంటి ఏరియల్ వాడుతున్నారో, వారున్న ప్రదేశంలో వాతవరణ పరిస్థితులు ఎలా ఉన్నయో అన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటారు. వారు ఒకరి సాంకేతిక అనుభవాలు ఒకరితో పంచుకుంటూ తమ తమ రేడీయోల శక్తిని, పటిమను పెంచుకొనేందుకు ప్రయత్నిస్తారు


హామ్ రేడియోలో రకాలు
స్థూలంగా, హామ్ రేడియో వాడే ఫ్రీక్వెన్సీ ప్రకారం రెండు రకాలు. ఎక్కువ ఫ్రీక్వెన్సీ( HIGH FREQUENCY{HF}]మరియు అతి ఎక్కువ ఫ్రీక్వెన్సీ (VERY HIGH FREQUENCY (VHF) HF సుదూర ప్రాంతాలతో మాట్లాడేందుకు వాడతారు. VHF స్థానికంగా 20-30 కిలోమీటర్ల పరిధిలో మాట్లాడుకోవటానికి వాడతారు.


హామ్ లైసెన్సు (అనుమతి పత్రం)
హామ్ లైసెన్సుఈ హాబీ ప్రభుత్వ అనుమతి లేకుడా మాత్రం కొనసాగించటం కుదరదు. రేడీయోలో సంభాషించటానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వంలోని కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ (MINISTRY OF COMMUNICATIONS)వారు పరీక్ష నిర్వహించి, అందులో ఉతీర్ణులైన వారికి, పోలీసు వారి దర్యాప్తు తరువాత ఒక లైసెన్సు ఇస్తారు. ఆ లైసెన్సు ఒక నిర్ణీత గడువుకు ఇస్తారు. ఎప్పటికప్పుడు, గడువుకు ముందుగానే పునరుద్ధరించుకోవాలి.


హామ్ లైసెన్సుకొరకు పరీక్ష
పైన చెప్పిన విధంగా కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ వారు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలోని విషయాలు 1) మోర్స్ కోడ్ నుపయోగించి సందేశములు పంపుట-స్వీకరించుట, 2)మౌలిక ఎలక్ట్రానిక్స్ 3) అంతర్జాతీయ రేడియో నిబంధనలు.ఈ పరీక్ష గ్రేడ్-1 మరియు గ్రేడ్-2 కు వ్రాయవచ్చు. గ్రేడ్-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించితే రేడియోలో మోర్స్ కోడ్ లో మాత్రమే సందేశాలు పంపుట/స్వీకరించుట చేయవచ్చు. మాటాలాడటం కుదరదు. గ్రేడ్-1 లో ఉత్తీర్ణత సాధించితే రేడియోలో మాట్లాడటం కూడా(మోర్స్ కోడ్ సందేశాలతోపాటు) చేయవచ్చు.


సంకేత నామము (CALL SIGN)
హామ్ లైసెన్సులో ఆ హామ్ కు ఇవ్వబడ్డ ప్రత్యేక సంకేతనామము ఉంటంది. ఈ సంకేత నామము ఇంకెవరికి ఇవ్వరు. హామ్ రేడియో లో సభాషించునపుడు, ఈ సంకేతనామము, తమను ఇతరులు గుర్తించుట కొరకు, తరచూ చెప్తూ ఉండాలి. ప్రపంచములోని అన్ని దేశాలూ కూడా ఒక ఒప్పందమునకు వచ్చి, దేశములన్నిటికి కూడా ఒక నిర్దిష్ట సంకేత నామమును ఇచ్చుకొన్నారు. కాబట్టి, ఒక హామ్ రేడియో ఆపరేటరుకు వచ్చు సంకేత నామములో మొదటి అక్షరములు అతను ఏ దేశమునకు చెందినవాడో తెలియ చేస్తాయి. మిగిలిన అక్షరములు అతని పేరును తెలియ చేస్తాయి. భారత దేశమునకు VU2, VU3 కెనడాకు VE3, అమెరికాకు W0, W1, W2 కేటాయించినారు. ఉదాహరణకు భారతదేశ హామ్‌కు సంకేతనామము ఈ విధముగా ఉంటుంది- VU2RM లేక VU3KTB. ఇందులో VU2 లేక VU3 సంకేతములు ఆ హామ్ భారతదేశమునకు చెందినవాడని తెలియచేయును. అలాగే, తరువాత ఉన్న RM లేక KTB సంకేతములు ఆ హామ్ యొక్క పేరును తెలియచేయును. ఒక హామ్ మరొక హామ్ తో మాట్లాడుతున్నపుడు, ఆవతలి వారు చెప్పిన సంకేత నామము తమకు తెలియనపుడు, ఒకరికొకరు పరిచయము చేసుకుంటారు. ఆ పరిచయ ప్రకారం వివరాలు సరైనవే అని తెలుసుకోవటం కోసం ఆ సంకేత నామమును వెతుకుటకు ఏ దేశానికి ఆ దేశానికి లేదా ప్రపంచం మొత్తానికి జాబితాలు ఉన్నాయి. అందులో సంకేత నామము, ఆ సంకేత నామము ఎవరిది, వారి చిరునామా తొ అన్ని వివరములు ఉంటాయి. ఎవరయినా హామ్ యొక్క చిరునామా మారినట్లయితే, వెంటనే వారు ప్రభుత్వమునకు తెలియ చేసి కొత్త చిరునామా తమ లైసెన్సునందు వ్రాయించుకొనవలెను.

తనిఖీ
ప్రభుత్వానికి చెందిన తనిఖీ అధికారులు, అప్పుడప్పుడు హామ్ రేడీయో ఔత్సాహికుల రేడీయో గదులను (RADIO SHACK అని అంటారు) తనిఖీ చేసి వారు నిబంధనల ప్రకారం అభిరుచిని కొనసాగిస్తున్నారా లేదా అన్నవిషయం గమనిస్తుంటారు. నిబంధనల ప్రకారం లేకపోతే తగిన చర్యలు తీసుకుంటారు.


లాగ్ పుస్తకం మరియు క్యూ ఎస్ ఎల్ కార్డ్(QSL CARD)

హామ్ లు తమ సంభాషణ వివరాలను (ఏ హామ్ తో, ఏరోజున, ఏ ఫ్రీక్వెన్సీలో,ఎంతసేపు మాట్లాడారు)ఒక పుస్తకంలో తప్పనిసరిగా పొందుపరచాలి. దీనినే, "లాగ్ బుక్(LOG BOOK)" అని అంటారు. అల్లాగే, హామ్ మరొక హామ్ తో మొదటిసారి మాట్లాడినప్పుడు, ఆ సంభాషణకు గుర్తుగా, ఒక కార్డ్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ కార్డ్‌ను "క్యూ.ఎస్.ఎల్" (QSL) కార్డ్ అని అంటారు. ఈ కార్డ్‌లో లాగ్ బుక్ ప్రకారం వివరాలు పొందుపరచాలి. ఈ విధంగా పంపుకునే కార్డ్‌కు కూడా అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాలను అనుసరించి కార్డ్ కొలతలు 89 mm by 140 mm ఉండాలి. ఈ విధమైన క్యూ.ఎస్.ఎల్. (QSL)కార్డ్ లను పోగుచేయుటకూడా ఈ అభిరుచిలొ భాగమే.

మోర్స్ కోడ్
రేడియో విజ్ఞానం బాగా అభివృద్ధి జరగని పూర్వపు రోజులలో, రేడియోలో మాట్లాటం కంటే, కొన్ని శబ్దాలను ప్రసారం చేసి వివరాలను సందేశాలుగా పంపటం సులభంగా ఉండేది. మాట్లాడేటప్పుదు స్పష్టతలేక పోవటం, వాతావరణ పరిస్థితుల వలన మాట సరిగా వినపడక అపార్థాలు ఏర్పడటం నివారించటం కోసం సామ్యూల్ ఎఫ్ బి మోర్స్ ఈ శబ్ద భాషను కనిపేట్టాడు. హామ్ లు మొదట మోర్స్ కోడ్ లోనే సందేశాలు పంపుకొనేవారు.ఇందులో అన్ని అక్షరాలు ఒక చుక్క(.) లేదా డాష్(-) వాటి రకరకాల పొందుపరచటంతో సందేశం పంపుతారు. ఇలా శబ్దాలను పంపటానికి ఒక విద్యుత్ పరికరం రేడీయోకు జతపరుస్తారు.


హామ్ కోడ్
హామ్‌లు మోర్స్ కోడ్లో సంభాషించుకునే రోజులలో,పెద్ద పెద్ద వాక్యాలను సందేశంగా పంపటం కష్టంగా ఉండేది. అందుకని సంభాషణలలో తరచూ దొర్లే ప్రశ్నలను చిన్న చిన్న కోడ్‌లుగా మార్చారు. అవన్నీ కూడా 'క్యూ' అక్షరంతో మొదలవుతాయి, మూడు అక్షరాలు మాత్రమే ఉంటాయి, కాబట్టి వాటిని సందేశంగా పంపటం తేలిక. వీటిని 'క్యూ కూడ్స్' (Q-CODES )అని పిలుస్తారు. ఉదాహరణకు, QRL అంటే "ఈ ప్రీక్వెన్సీ బిజీ" అని, లేదా నేను బిజీ" అని, QSY అంటే "వెరే ప్రీక్వెన్సీ కి వెల్తున్నట్టు".

హామ్ ఫ్రీక్వెన్సీలు
హామ్‌లు కొత్త రోజులలో అంటే, రేడియో కనిపెట్టిన మొదటి రోజులలో ఎక్కడపడితే అక్కడ ఒక పద్దతి లేకుండా అందరూ మాట్లాడుకునేవారు లేదా మోర్స్ సందేశాలు పంపుకొనేవారు. చివరకు, పరిస్తితి గందరగోళంగా మారటంతో, ప్రభుత్వాలు కలగచేసుకొని, ఎవరు (ఓడలు, పోస్టాఫీసు, హామ్‌లు మొదలగు వారు) ఏ ఫ్రీక్వెన్సీ లో మాట్లాడుకోవాలో నిర్ణయించారు. ఇది కూడా పరిస్ఠితిని అదుపు చెయ్యలేక పోయినది. ఎందుకంటే, పక్క పక్క దేశాలు ఒకే ఫ్రీక్వెన్సీని రెండు వేరు వేరు వర్గాల వారికి ఇచ్చేవారు. ఈ పరిస్థితిని అధిగమించటానికి, ప్రపంచ దేశాలన్నీ ఒక వేదిక మీదకు ఒచ్చి, రేడియో ఫ్రీక్వెన్సీలను పంచుకునే విధానాన్ని అమలు పరిచాయి. ప్రస్తుతం ఈ పని అంతర్జాతీయ టేలి కమ్యూనికేషన్స్ యూనియన్(ITU)అనే స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రతి దేశం వారి వారి దేశాలలో మోనిటరింగ్ స్టేషన్లను ఏర్పరిచి, అక్కడ నియోగించబడ్డ సిబ్బంది ద్వారా, వైర్లెస్ ద్వారా జరిగే సంభాషణలను మరియు ఇతర ప్రక్రియలను(హామ్‌ల సంభాషణలతో సహా) నిరంతరం 24 గంటలు అన్ని రేడీయో ఫ్రీక్వెన్సీలలోనూ వింటూ ఉంటాయి. ఎవరయినా నిబంధనలను అతిక్రమించినట్లయితే, తగిన చర్యలు (అవసరమయిన చోట్ల పోలీసులకు తెలియ చెయ్యటంతో సహా) తీసుకుంటారు. 10 Kc/s and 3000000 Mc/s వరకు రేడీయో ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అందులో హామ్ లకు కొన్ని ఫ్రీక్వెన్సీలను ఇచ్చారు. హామ్ లు ప్రస్తుతం ఈ ఫ్రీక్వెన్సీలను మాత్రమే వాడుకోవాలి.



తెలుగు వారిలో హామ్ లు


తెలుగు వారిలో హామ్ లు చాలామంది ఉన్నారు. ఎక్కువగా, హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ లాంటి పట్టణాలలోనే కాకుండా, తెనాలి, కాకినాడ వంటి చిన్న ఊళ్ళలలో కూడా ఉన్నారు. తెలుగు వారిలో చాలా మంది, తమ సొంత సెట్లు తయారు చేసుకొని బాండు (హామ్ పరిభాషలో ఈ హాబీలోకి వచ్చి ఇతరులతో సంభాషణ మొదలుపెట్టటం) లోకి వచ్చినవారే. సొంతంగా సెట్ తయారు చేసుకునేవారి సౌలభ్యంకోసం, RM96 అని ఒక సర్క్యూట్ బోర్డ్ VU2 NJS(శ్రీ సోక్రటీసు-ప్రస్తుతం వీరు కెనడాలో నివాసం) మరియు VU2 RM( శ్రీ రామమోహనరావు, కాకినాడ ఫోటోలో ఉన్నవారు ) ఎంతగానో కృషి జరిపి 1996లో రూపొందించారు. ఈ బోర్డ్ వాడి అనేకమంది తమ తమ సెట్లు సొంతంగా చేసుకొని ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచేకాకుండా, యావత్ దక్షిణ భారత దేశంనుంచి ఔత్సాహిక హామ్ లు బాండ్ మీదకు వచ్చారు.


జనజీవనంలో హామ్ హాబీ
ప్రకృతి వైపరీత్యాలు- తుఫాన్లు, భూకంపాలు మొదలగునవి- సంభవించినప్పుడు, సాధారణ సమాచార సాధనాలు (ఫోన్లు, సెల్ ఫోన్లు)పనిచేయని పరిస్తితులలో హామ్ రేడియో ద్వారా సమాచారం ఒక చోట నుండి మరొకచోటికి పంపటం తేలిక. ఎందుకంటే, హామ్ రేడీయోకి ఒక ఏరియల్, ఒక చిన్న బ్యాటరీ ఉంటేచాలు. గుజరాత్ భూకంపం, ఆంధ్ర, ఒరిస్సాలలో తుపానులు వచ్చినపుడు ఉత్సాహవంతులైన హామ్‌లు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సహాయ కార్యక్రమాలలో ఎంతగానో సహకరించారు. ఇలా అందరు హామ్ లు రాలేరు కాబట్టి, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోస్తా జిల్లా కేద్రాలలో "హామ్ క్లబ్ స్టేషన్" లను ఏర్పరిచి కొంతమంది హామ్ లకు గౌరవ వేతనం ఇచ్చి ప్రొత్సహిస్తున్నది. వారికి జిల్లా కలెక్టరు కార్యాలయంలో కాని, ఆ దగ్గరలో కాని కొంత చోటూ కూడా ఇచ్చి (ఇతర సమయాలలో హామ్ రేడీయో హాబీ గురించి నలుగురికీ తెలియ చెయ్యటానికి మరియు ఆసక్తిగల వారికి హామ్ లైసెన్సు పరీక్షకు తరిఫీదు ఇవ్వటానికి) ప్రోత్సహిస్తున్నది.


ఇంటర్ నెట్ లో హామ్ రేడియో
లైసెన్సు కలిగి ఉన్న హామ్ లు, తమ వద్ద హామ్ సెట్ లేకపోయినా ఇంటర్నెట్ ద్వారా ఇతర హామ్ లతో సంభాషించవచ్చు. CQ-100, ECHO-LINK వంటి వెబ్ సైట్ల ద్వారా ఇది సాధ్య పడుతుంది. ఇందులో CQ-100 లో నిజానికి వైర్ లెస్ ప్రసారం ఏమీ ఉండదు, సంభాషణలు అన్నీ ఇంటర్ నేట్ ద్వారా మాత్రమే ప్రసారమవుతాయు. అంటే, మామూలు హామ్ సెట్ గల వారితో సంభాషణ కుదరదన్న మాట. మరో పక్క ECHO-LINK ద్వారా అయితే సంభాషణలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిపీటర్ల ద్వారా ప్రసారం జరుగుతాయి. మామూలు హామ్ సెట్లు గలవారు కూడా వారి సెట్లకు కొద్దిపాటి మార్పులు చేసుకొని ECHO-LINK ద్వారా ఇంటర్ నెట్ లో ఉన్న హామ్‌లతో సంభాషించవచ్చు.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో, కొత్త కొత్త సమాచార పరికరాలు వస్తునాయి. దీని మూలంగా రోజు రోజుకీ రేడియో ఫ్రీక్వెన్సీలకు గిరాకీ పెరిగిపోతున్నది. ప్రస్తుతం హామ్ ఫ్రీక్వెన్సీలను వారికి ఉచితంగా ఇచ్చి ఉన్నారు. వీటి మీద ఎవరికీ ఆదాయం వచ్చే అవకాశం లేదు. అందువల్ల, ప్రస్తుత వ్యాపార ధోరణుల దృష్ట్యా, సమీప భవిష్యత్తులో, హామ్ రేడీయో ప్రీక్వెన్సీలను వ్యాపారపరంగా పంపకం జరిగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఇంకొన్ని సంవత్సరాల తరువాత చూస్తే, హామ్ రేడియో, ఇంటర్ నెట్లో మాత్రమే ఉంటుంది అని తెలిసినా, ఆశ్చర్యపడకుండా ఉండటానికి మనం సిద్ధమవ్వాలేమో!!

9, ఆగస్టు 2009, ఆదివారం

హరీష్ కు జన్మదిన శుభాకాంక్షలు


HAPPY BIRTHDAY హరీష్
నువ్వు ఇటువంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో, మరెన్నో జరుపుకోవాలని, నువ్వు కోరుకున్న అన్ని కోరికలు తీరాలని ఆకాంక్షిస్తూ
అమ్మ
నాన్న

=====================

Credit Suisse (స్విస్ బాంకు) లో పని చేస్తూ ప్రస్తుతం సింగపూరులో ట్రైనింగు లో ఉన్న మా అబ్బాయి ఇరవై రెండవ జన్మదిన శుభసందర్భంగా.

=====================
హరీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు అందించిన అందరికీ నా ధన్యవాదములు

శివ

8, ఆగస్టు 2009, శనివారం

మార్కోపోలో సాహస యాత్రలు


మనదేశానికి చాలామంది విదేశీయులు వచ్చి వెళ్ళారు. వారిలో మార్కో పోలో చాలా ముఖ్యుడు. ఇతని మూలంగా భారత దేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. భారత చరిత్రలో ప్రసిధ్ధికెక్కిన మర్కోపోలో గురించి చందమామ వారు 1960 ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు తొమ్మిదిభాగాలుగా రంగులలో ధారావాహికను అందించారు.

ఈ ధారావాహికకు బొమ్మలు శ్రీ చిత్రాగారు వేశారు. చిత్రాగారే అట్టమీద బొమ్మలు కూడ వేశారు. అప్పటికి ఇంకా వపా గారు(శ్రీ వడ్డాది పాపయ్య గారు) చందమామలో బొమ్మలు వెయ్యటం మొదలు పెట్టినట్టు లేదు. పాపయ్యగారు చిత్రాలు వెయ్యటం 1961 జనవరి నుండి అనుకుంటాను. దొరికినంతవరకు చిత్రాగారు వేసిన అట్టమీద బొమ్మలను కూడ ఈ ధారావాహికతో పాటు పొందుపరచటం జరిగింది.
ఈ ధారావాహిక సంకలనంలో సహకరించిన రాజుగారికి నా కృతజ్ఞతలు. సహాయ యత్నం చేసిన వేణు గారికి కూడ ధన్యవాదములు. ఈకింద ఇచ్చిన లంకె ద్వారా ఈ చక్కటి ధారావాహికను చదివి ఆనందించండి.
http://rapidshare.com/files/264850473/MARCOPOLO_SAAHASA_YAATRALU_KSRP.pdf

మార్కోపోలో సాహస యాత్రలు  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

7, ఆగస్టు 2009, శుక్రవారం

ఒక చక్కటి వార్త

మనం సామాన్యంగా తెలుగు సినిమాలలో పక్క రాష్ట్రాలనుండి దిగుమతి చెయ్యబడ్డ హీరోయిన్లను చూస్తుంటాము. వాళ్ళకి తెలుగు రాదు. ఏదో ఒకలాగ పెదవులు కదిపితే, మరింకెవరో డబ్బింగు చెప్తారు, వాళ్ళు నటీమణులుగా(బాగా గెంతి, అదే స్టెప్పులు వేసి) పేరు తెచ్చుకుంటారు. కాని ఈమధ్య కూడలి.ఆర్గ్ లో ఒక చక్కటివార్త చూసాను. మహేష్ కుమారుగారు ఒక మూగ చెవిటి అమ్మాయి సినిమాలో హీరోయిన్ అవ్వటం గురించి వ్రాశారు. అటువంటి అమ్మాయికి, కేవలం నటన చూసి అవకాశం ఇచ్చినవారందరినీ అభినందించాలి.

ఈ విషయం గురించి మరింత మహేష్ కుమార్ గారి బ్లాగుకు వెళ్ళి పూర్తిగా చదవండి. అక్కడ ఉన్న వీడియోలు కూడ చూడండి

ఈ వార్త వ్రాసి వివరాలు ఇచ్చిన మహేశ్ కుమార్ కు నా అభినందనలు

నవతరంగం

6, ఆగస్టు 2009, గురువారం

బేతాళ కథల కథా కమామిషు



చందమామలో మనమందరమూ బేతాళ కథలు చదివేఉంటాము. ఆ కథ మొదలు పెట్టటమే విచిత్రంగా ఉంటుంది. ఆ కథ ఆవిధంగా ఎందుకు మొదలవుతుంది తెలియాలంటే మొట్టమొదటి బేతాళకథ చదవాలి. బేతాళకథల మీద మునుపు నేను తెలుగు వికీలో వ్రాసిన వ్యాసం,కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులతో, ఇక్కడ పున: ప్రచురిస్తున్నాను. వ్యాసం చివర మొదటి బేతాళ కథ డౌన్లోడుకు లింకు ఉన్నది చూడండి.
================================================
గుణాఢ్యుడు రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత "కథాసరిత్సాగరం" సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. కాని, బేతాళ కథలలోని చివరి కథ అందుబాటులో ఉన్నప్పటికీ, చందమామలో ఇంతవరకు వెయ్యలేదు. అది కాస్తా వేసేస్తే శీర్షిక ఇన్నాళ్ళు ఉండేది కాదు, ఇంత పేరు ప్రఖ్యాతులు గడించేదికాదు
.
మూలకథగోదావరీ తీరాన, ప్రతిష్ఠానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజూ ఒక పండు లోపల రత్నము పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు. ఆ విషయం తెలిసిన రోజున, విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి, కారణం చెప్తేగాని మర్నాడు పండు తీసుకోనని చెప్తాడు. దానికి బిక్షువు, తను ఒక మంత్రాన్ని సాధించదలచాననీ అందుకు ఒక వీరుడి సహాయం కావాలనీ, విక్రమార్కుని నుండి తానా సహాయం ఆశిస్తున్నాననీ అడుగుతాడు. విక్రమార్కుడు తగిన సహాయం చెయ్యటానికి ఒప్పుకుంటాడు. బిక్షువు, రాబోయే కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే రాజును మహా శ్మశానానికి రమ్మంటాడు.

అలాగే విక్రమార్కుడు వెళ్తాడు. అక్కడే ఉన్న భిక్షువు, రాజును శింశుపా వృక్షం మీద వేళ్ళాడుతున్న పురుషుడి శవం తెచ్చి, తన సమీపంలో ఉంచమంటాడు. రాజు ఆ చెట్టు ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు, పోదాం పద అంటాడు. రాజుకు ఇలా మౌనభంగం అవగానే నేలమీది శవం మాయమై, మళ్ళీ చెట్టు మీద వేళ్ళాడుతూ కనపడుతుంది. విక్రమార్కుడు బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని మళ్ళీ కిందపడేసి, భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవటం మొదలు పెడతాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను" అంటూ ఒక కథ చెప్తాడు. కథ చివర ప్రశ్న వేసి, "ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పొయ్యావో, నీ తల పగిలి పోతుంది" అంటాడు. విక్రమార్కుడు తన మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెపుతాడు. ఆ విధంగా, విక్రమార్కుడికి మౌనభంగం జరగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తెరిగి చెట్టు ఎక్కుతాడు.
చందమామలో ధారావాహిక
మొట్టమొదటగా బేతాళ కథలను చందమామలో మొదలు పెట్టినది సెప్టెంబరు 1955లో. ఈ కథలు ఎంతో కాలం చందమామ పత్రికలో కథా స్రవంతిగా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇదొక చిత్రమైన కథల సంపుటి. ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది. ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని ఓ చక్కటి కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది.

బేతాళ కథ మొదటి కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల అసక్తిని గమనించి గాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 1972 జూలైలో మొదటి బేతాళకథ రంగులలో పునర్ముద్రించారు. ఈ మొట్టమొదటి కథకు, పున:ముద్రణలో పేరు పెట్టలేదు. కాని మొదటి ముద్రణలో ఈ కథ పేరు "మహామంత్రి మనోవ్యాధి". ఆ తరువాత కథలన్నిటికీ కథ మొదటి పుటలో పైన కథ పేరు, కింద "బేతాళ కథలు" అని వేయసాగారు. బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చి వేసారు .

అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబదినది.

శీర్షికగా బేతాళ కథలు
బేతాళ కథలను చందమామలో సెప్టెంబరు 1955 సంచికలో మొదలు పెట్టారు. అసలు, బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం, చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం. తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు(పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం,తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా చందమామ వారు అందచేశారు.

కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు.చిన్న చిన్న ధారావాహికలు మొదలు పెట్టినప్పుడల్లా తమ సంపాదకీయంలో ఆ ధారావాహిక గురించి కొద్దో గొప్పో చందమామలో వ్రాసే వారు. కాని చారిత్రాత్మకమైన బేతాళ కథల ధారావాహిక (శీర్షిక) చడి చప్పుడూ లేకుండా మొదలు పెట్టేశారు. మరి అప్పట్లో ఈ కథలను ఎలా వేయ్యలో ఇంకా నిర్ణయించుకోలేదేమో. చివరికి , ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా మొదలు పెట్టబడినా, చందమామలోని అన్ని ధారావాహికలలోనూ ఎక్కువరోజులు ప్రచురించబడింది, ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. భారత పత్రికా చరిత్రలో ఇది ఒక మైలురాయి (రికార్డు)అని నా అభిప్రాయం. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

బేతాళకథలు ధారావాహిక అనండి లేదా శీర్షిక అనండి, ఏది ఏమైనా కథలను ఏకధాటిగా ఇంత ఆసక్తికరంగా, పిల్లలకు(అనేకసార్లు పెద్దలకే) తెలివితేటలు పెంపొందించే విధంగా ప్రచురించటం నభూతో నభవిష్యతి.

1972లో పున:ముద్రణ జరిగిన కథను ఈ కింది లంకెద్వారా చదువుకోవచ్చును.

http://rapidshare.com/files/264443903/FIRST_BETALA_KATHA.PDF

అస్సలు చందమామలో మొట్టమొదటగా ముద్రించబడిన బేతాళ కథ సెప్టెంబరు 1955 కథను ఈ కింది లంకె ద్వారా చదువవచ్చు. రెండిటికీ పెద్ద భేదం లేదు, ఒక్క రంగులు తప్ప.

http://rapidshare.com/files/264597624/ORIGINAL_BETALA_KATHA_EP_1955.PDF

పైన డౌన్లోడ్ కు ఇచ్చిన లింకులు పనిచేయవు. బేతాళ కథలు   మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

మార్కోపోలో సాహస యాత్రలు




మార్కోపోలో సాహస యాత్రలు చందమామలో 1960లో వేసిన ఒక రంగుల ధారావాహిక. ఇందులో ఒక భాగం నవెంబరు 1960 చందమామలో విషయ సూచిక ప్రకారం మార్కోపోలో ధారావాహిక 25 వపుటలో ఉండాలి. కాని చందమామ వెబ్ సైటులో అప్లోడ్ అయిఉన్న ఫ్లాష్ ఫైలులో అది లేదు. అలాగే మునుపున్నెడో నేను డౌన్లోద్ చెసుకున్న పి డి ఎఫ్ ఫైలులో కూడ మార్కోపోలో సాహస యాత్రలు ధారావాహిక భాగం లేదు. యెవరి దగ్గరన్నా నొవెంబరు 1960 చందమామ హార్డు కాపీ ఉంటే దయచేసి స్చాన్ చేసి షేర్ చెయ్యగలరు. ఈ ఒక్క భాగం నా దగ్గరలేక ఈ ధారావాహికను ఒక ఫైలుగా చెయ్యాలేకపోయినాను. ఇతర చంపిలు సహాయానికి రావాలి అని నా పిలుపు.

4, ఆగస్టు 2009, మంగళవారం

నావికుడు సింద్‌బాద్




సింద్‌బాద్ యాత్రలు అన్న పేరుతో ధారావాహికగా 7 నెలలు ఈ కథలను చందమామవారు 1969-70లలో పున:ముద్రించారు.

మొదటగా నావికుడు సింద్‌బాద్ అన్న పేరుతో 15 భాగాలుగా జులై 1956 నుండి ఆగష్టు 1957 వరకు వేశారు. 1969-70 లలో వేసిన ధారావాహికకు ఈ మొదటి ధారావాహికకు తేడా ఏమిటంటే, యాత్రకి ఒక భాగం కాకుండ కథను బట్టి ఒక్కొక్క యాత్రకు ఒక నెలకన్న ఎక్కువ నెలలు ప్రచురించారు. అందుకనే 15 నెలలు సాగినాయి ఈ 7 యాత్రలు.


చందమామ వారు వారి వెబ్ సైటులో వారి పాట సంచికలు అన్నీ కూడా ఉంచారు. ఆసక్తి కలవారు చందమామ వెబ్ సైటులో ఆ పాత సంచికలు తిరగేసి పైన ఉండహరిమ్చిన సింద్ బాద్ యాత్రలు కూడా చదువుకోవచ్చు.

ఒకప్పుడు ఈ బ్లాగులో సింద్ బాద్ యాత్రల ధారావాహిక మొత్తం ఒకటిగా చేసి అందరికీ అందుబాటులో ఉంచటం జరిగింది. కాని అది కాపీ రైట్ నిబంధనలకు లోబడి లేదని తెలిసి తొలగించటం జరిగింది.



2, ఆగస్టు 2009, ఆదివారం

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ ఊమెన్

1960 దశకం 1970ల మొదటి రోజులలో ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రికలో ఎంతగానో పేరొందిన వ్యంగ్య చిత్రకారుడు శ్రీ ఊమెన్. వీరి గురించి ఇప్పటి తరానికి తెలియాచెప్పాలన్న నా ప్రయత్నఫలితమే ఈ వ్యాసం.



ఊమెన్ (Oomen) ఒక వ్యంగ్య చిత్రకారుడు. వీరి రాజకీయ వ్యంగ్య చిత్రాలు ఎంతగానో ప్రసిద్ధిపొంది, శంకర్ పిళ్ళై (శంకర్స్ వీక్లీ ఆంగ్ల వారపత్రిక-1975లో ప్రచురణ ఆపివేశారు), అబు అబ్రహం (ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒకప్పటి కార్టూనిస్ట్) మరియు ఆర్‌ కే లక్ష్మణ్ (టైమ్స్ ఆఫ్ ఇండియాలో కార్టూనిస్ట్)వంటి ప్రముఖ వ్యంగ చిత్రకారులు వేసిన వ్యంగ్య చిత్రాలతో సమానంగా నిలబడ్డాయి.

తెలుగులో వ్యంగ్య చిత్రాలు వేసేవారిలో ఎక్కువమంది, రాజకీయ వ్యంగ్య చిత్రాలకు దూరంగా ఉంటారు. బహు కొద్దిమందిమాత్రమే రాజకీయ వ్యంగ చిత్రాలు చిత్రించి, వార్తాపత్రికలలోని వార్తలను వినోదాత్మకంగా, సమాజానికి చురకలు అంటించి ప్రచురిస్తూ తమ జర్నలిజం ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటారు. తెలుగులో అటువంటి రాజకీయ వ్యంగ్య చిత్రకారులకు ఆద్యుడు ఊమెన్. నిజానికి, ఊమెన్‌కు తెలుగు రాదు.ఈయన ప్రతిరోజూ, ప్రతి వారం తాను వేసిన వ్యంగ్య చిత్రాలను ఆంగ్ల సంభాషణలను వ్రాసి, పత్రికకు పంపేవారట. అక్కడ పత్రిక సంపాదకులయిన శివలెంక రాధాకృష్ణ ఆ ఆంగ్ల సంభాషణలను తెలుగులోకి అనువదించి బొమ్మకి సరిపొయ్యేట్టుగా చేసి దిన/వార పత్రికలలో ప్రచురించేవారట.

ఊమెన్‌ను తెలుగు వారికి పరిచయం చేసిన ఘనత ఆంధ్ర పత్రిక కు దక్కింది. 1960లలో ఆంధ్ర పత్రిక దినపత్రికలో "లోకం పోకడ" శీర్షికన వీరి రాజకీయ వ్యంగ్య చిత్రాలు ప్రతిరోజూ ప్రచురించబడేవి. ఆ తరువాత ఆంధ్ర పత్రిక వారపత్రికలో కూడ "ఊమెన్ కార్టూన్లు" అని ఒక పూర్తి పేజీ శీర్షికను మొదలు పెట్టి, అంతకు మునుపటి వారంలో జరిగిన దేశీయ, అంతర్జాతీయ రాజకీయ సంఘటనల మీద వ్యంగ్య చిత్రాలు వేయటం మొదలు పెట్టారు. ఈ శీర్షిక ఊమెన్ మరణించేవరకు నిరాఘాటంగా నిర్వహించబడింది..



వ్యక్తిగత జీవితం
ఊమెన్ కేరళీయుడు. ఈయన కేరళలోని తిరువాన్కూరుకు దగ్గరలో ఉన్న కటానం గ్రామంలో, ఒక సంపన్న కుటుంబంలో 1916, ఫిబ్రవరి 20న జన్మించా రు. తిరువనంతపురం సైన్సు కాలేజీ నుండి పట్టభద్రులయినారు. ఆ తరువాత జర్నలిజం మీద ఉన్న ఇష్టంతో లండన్‌ స్కూల్ ఆఫ్ జర్నలిజం లో చేరి జర్నలిజం లో డిప్లొమా పొందారు. 1949లో తన వివాహం అయిన తరువాత మద్రాసు నగరంలో స్థిరపడ్డారు. 1970 దశకం చివరి రోజులలో (1976-77 ప్రాంతాలలో) ఈయన పరమపదించారు.


వృత్తి జీవితం
స్వతహాగా మంచి చిత్రకారుడు ఊమెన్. దానికి తోడు, జర్నలిజంలో డిప్లొమా, వీటన్నిటికి మించి రాజకీయాలమీద అమితమయిన ఆసక్తి, తమ ఊళ్ళోని గ్రంధాలయంలో చేసిన అధ్యయనం, ఇవన్ని ఈయనను రాజకీయ వ్యంగ్య చిత్రకారునిగా మలిచాయి. తన ఇరవై రెండవ ఏట కార్టూనిస్ట్ జీవితం మొదలు పెట్టారు. మొట్టమొదట, వీరి కార్టూన్లు పాట్నా మరియు అలహాబాదు నగరాలనుండి వెలువడుతున్న 'లీడర్ గ్రూపు' కు చెందిన ప్రచురణలలో వేయటం జరిగిందట. 'భారత్' మరియు 'సంగం' పత్రికలలో వేసిన కార్టూన్లకు మంచి ప్రజాదరణ లభించింది. తమిళ భాషలో వెలువడుతున్న 'కల్కి' పత్రికలో కూడ వీరి వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడ్డాయి. భారత దేశంలోనే కాకుండా అమెరికా మరియు కెనడా వంటి దేశాల్లో కూడ ఈయన వ్యంగ్య చిత్రాలు ప్రదర్శించబడ్డాయట. తెలుగులో ఆంధ్ర పత్రికలో మాత్రమే ఈయన వ్యంగ్య చిత్రాలు ప్రచురితమయ్యేవి.


వ్యంగ్య చిత్రాల విశిష్టత
తెలుగు వారిలో ఎంతగానో ప్రజాదరణ పొందిన మొట్టమొదటి రాజకీయ వ్యంగ్య చిత్రకారుడీయన. ఈయన తెలుగు వాడు కాదన్న విషయం కొంత తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే కాని తెలియని విషయమేకాని, ఈయన కార్టూన్లు చూస్తే తెలియదు. వ్యంగ్య చిత్రాలకు తీసుకున్న రాజకీయ విషయం, బొమ్మల కనుముక్కు తీరు ఈయన కార్టూన్లకు మంచి పేరు తెచ్చినాయి, ఎంతోమందికి చక్కటి రాజకీయ స్పూర్తిని అందచేసినాయి. రాజకీయాలను సామాన్యులకు కూడా అర్ధం అయ్యేట్టుగా చెయ్యటంలో ఈయన వ్యంగ్య చిత్రాలు మంచి సాఫల్యం పొందాయని చెప్పవచ్చు. తెలుగులోకి తర్జుమా చేసిన అప్పటి సంపాదకుకుడు శివలెంక రాధాకృష్ణ తెలుగులో రాజకీయ వ్యంగ్య చిత్రాలకు తెర తీసి, మంచి ఒరవడిని ఏర్పరిచి తీర్చిదిద్దారు. అప్పట్లో ఊమెన్ కార్టూన్ల కొరకు ప్రతి రోజూ, ప్రతి వారం ఎదురు చూసేవారట. ఫలానా, ఫలాన రాజకీయ సంఘటన జరిగింది, దీనికి ఊమెన్ తన కార్టూన్లలో ఎలా స్పందిస్తారు, అని పాఠకులు ఆసక్తిగా ఎదురు చూసేవారట. వీరు తమ వ్యంగ్య చిత్రాలలో రాజకీయ నాయకుల బోలుతనాన్ని, నోటితో ఒకటి చెప్పి, ఆచరణలో మరొకటి చేసే తత్వాన్ని హాస్య పూర్వకంగా ఎండకట్టేవారు. ఈ పార్టీ అని, ఆ పార్టీ అని, ఏదో ఒక రాజకీయ గొడుగు కిందకు చేరి, మిగిలిన రాజకీయ పార్టీలను ఎద్దేవా చేసి ఇరుకున పెట్టే జర్నలిజం ప్రక్రియకు దూరంగా ఉండి, సాధ్యమయినంత వరకు నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు, గౌరవం సంపాదించుకున్నారు.


ఊమెన్ చురకలు
వీరి కార్టూన్లలోని కొన్ని చురకలను ఇక్కడ ఉదహరించబడినాయి.

1960లలో ప్రచురించబడ్డ ఒక వ్యంగ్య చిత్రంలో, చూడంగానే రాజకీయనాయకుడు అనిపించే ఒకాయన, తన ఇంట్లో బల్లెక్కి నుంచుని ఉపన్యాసం దంచుతుంటే, అతని కొడుకు తల్లిని అడుగుతుంటాడు, "అమ్మా! నాన్నకేమైనా పిచ్చెక్కిందా" అని. కొడుక్కి సమాధానంగా తల్లి "లేదు బాబూ! ఆయన పార్లమెంటుకు ఎన్నికైతే ఇవ్వదలచిన ఉపన్యాసం రిహార్సల్‌రా ఇది" అని. పార్లమెంటులో సభ్యుల నడవడిక తీరు మీద వ్యంగ్యం.


1960లలోనే ప్రచురించబడ్డ మరొక వ్యంగ్య చిత్రంలో, రాజకీయ నాయకుడు ప్రజలను ఉద్దేసించి మాట్లాడుతూ "మహాజనులారా! ......ఈనాడు విద్యావసతులు వృద్ధి అయ్యాయి కనుకనే, నిరుద్యోగ సమస్య ఎదురైంది; ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టే, ధరవరలు పెరిగాయి; వాడకం ఎక్కువయింది కాబట్టే కాటకం ఏర్పడింది; అవినీతి అంటారా దినదినాభివృద్ధి చెందుతున్న అర్ధిక వ్యవస్థలో, అది ఉండక తప్పదు మరి....."అని అంటూ ఉంటే, నివ్వెరపోయి వింటూ ఉంటారు శ్రోతలు. రాజకీయ నాయకులు తమ వాదనా పటిమతో తప్పులను కప్పి పుచ్చుకోవటానికి చేసే అసమంజస వాదనలను ఎండకడుతుంది ఈ వ్యంగ్య చిత్రం. అమెరికా అద్యక్షుడు, జార్జ్ బుష్ 2008 సంవత్సరంలో వారి దేశంలో ఎర్పడ్డ ఆర్ధిక సంక్షోభ కారణాలు విశ్లేషిస్తూ, ఇటువంటి వితండవాదమే చేసి ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలయ్యాడు.




అభిప్రాయాలు
ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ -రాజకీయాలను కార్టూన్లలో ఇమడ్చటం చాలా కష్టమైన పని. అదొక ప్రత్యేకమైన కళ. ఎంతోమంది ప్రయత్నించినా, ప్రతిభ కొందరికే దక్కింది. శంకర్, లక్ష్మణ్, అబూలకు అంతర్జాతీయ ఖ్యాతి కూడ లబించింది. వీరిని గురించి అందరికీ తెలుసు. ఇంచుమించు అంతే ఖ్యాతిని అర్జించుకునీ, కొందరికి మాత్రమే మిగిలి పోయిన రాజకీయ చిత్రకారుడు ఊమెన్. ఊమెన్ కార్టూన్లలో కొట్టొచ్చిన విశిష్టత కనిపిస్తుంది.

================================================
ఊమెన్ గారి గురించి అనేక వివరాలు ఇంకా తెలియవలసి ఉన్నది

వారి కుటుంబ సబ్యుల పేర్లు-తల్లి తండ్రులు, భార్య, పిల్లల పేర్లు,ఊమెన్ పూర్తి పేరు,
చిత్రాలు వేయటమేనా లేక ఇతర వృత్తి ఏమయినా చేసేవారా? చర్చిలో ఫాదర్‌గా ఉండేవారని ఎక్కడో కొన్ని దశాబ్దాల క్రితం చదివినట్టు గుర్తు.
వారి ఫొటొ, వీరి కార్టూన్ల పై ఇతరుల అభిప్రాయాలు, అప్పట్లో ఏమైనా వివాద కారణమయినాయా (నాకు తెలిసినంతవరకు కాలేదు. నేను దాదాపు 1965 నుండి వారి మరణం వరకు వారి కార్టూన్ల ను చదుతుండేవాడిని),వీరి కార్టూన్లు ఎమైనా సంకలనంగా విడుదలయ్యాయా?(ఏ భాషలోనైనా సరే)

ఇటువంటి వివరాలు తెలిసిన వారెవరైనా నాకు తెలియచేయగలరు, ఈ వ్యాసాన్ని పరిపూర్ణం చేయటంలో తోడ్పడగలరు.
=================================================


అడిగిన వెంటనే తాను ఇంతకుముందు వ్రాసిన వ్యాసం కాపీ వెతికి నాకు పంపి అనేక వివరాలు అందచేసి(తన స్వహస్తాలతో చిత్రీకరించిన ఊమెన్ వ్యంగ్య చిత్రంతో సహా) వ్యాసం వ్రాయటానికి తోడ్పడిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారికి నా కృతజ్ఞతలు. ఈ వ్యాసం లోగడ తెలుగు వికీపీడియాలో నేను వ్రాసినది ఇక్కడ పున:ప్రచురణ