కిషోర్ కుమార్ మన హిందీ సినిమాలకు దొరికిన ఒక అద్భుత గాయకుడు. ఆయనకు సంగీతం వచ్చా, ఏ ఘరానా కు చెందిన వాడు, ఆయన సంగీత గురువు ఎవరు అన్న ప్రశ్నలకు తావు లేదు. ఆయన పాడిన పాటలకు ఉన్న జనాదరణే పెద్ద కొలమానం.
సామాన్యంగా కిషోర్ కుమార్ ఇంటర్వ్యూలు ఇవ్వటం వంటి పనులు చెయ్యటం చాలా తక్కువ, ఆయనకు మీడియా అంతగా ఇష్టం ఉన్నట్టుగా లేదు! ఆయనకు ఉన్న ఏకైక వీడియో ఇంటర్వ్యూ గురించి మునుపు వ్రాసిన గుర్తు. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదువుకోవచ్చు.
పైన చెప్పిన వ్యాసం చివర నా దగ్గర ఉన్న ఒక అపురూప ఆడియో ఇంటర్వ్యూ గురించి చెప్పటం జరిగింది. ఇప్పటికి ఈ ఆడియో ఫైలు నాకు దొరికింది. ఆ ఇంటర్వ్యూ వివిధభారతి వారు ప్రసారం చేశారు . ఇంటర్వ్యూ చేసినది ప్రముఖ రేడియో వ్యాఖ్యాత శ్రీ అమీన్ సయానీ (బినాకా గీత మాలా ఫేం). ఆ ఇంటర్వ్యూ అంటే నిజానికి కిషోర్ కుమార్ కుమార్ తన గురించి చెప్పుకున్నది కాదు. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ సచిన్ దేవ్ బర్మన్ మరణించినప్పుడు, ఆయనకు నివాళి అర్పిస్తూ కిషోర్ తన జ్ఞాపకాలకు నెమరు వేసుకోవటమే ఇందులో మనకు వినిపిస్తుంది.
సినిమా సంగీతం లో తనకు గురువు, హిందీ సినిమాల్లో తనకు మొట్ట మొదటి "బ్రేక్" ఇచ్చిన సచిన్ దేవ్ బర్మన్ గురించి, కిషోర్ ఏంతో హృద్యంగా, నిష్కపటం గా తన జ్ఞాపకాలను శ్రోతలతో పంచుకున్నారు. అలా పంచుకుంటూ, అక్కడక్కడా సచిన్ దేవ్ గొంతును, బెంగాలీ యాసతో ఉన్న ఆయన మాటలను అనుకరిస్తూ చెప్పటం జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో మధ్య మధ్యలో ఇంటర్వ్యూ చేసిన అమీన్ సయాని
ప్రశ్నలు, అక్కడక్కడా నవ్వులు (సంతాప కార్యక్రమంలో నవ్వులు రావటం ఏమిటీ!),
పాటల ముక్కలు తీసేసి, మొత్తం కిశోర్ కుమార్ మనతో మాట్లాడుతున్నట్టుగా తయారు చేశాను. నాకు చేతనైనంత వరకూ ఆడాసిటీ సాఫ్ట్వేర్ వాడి ఎక్కడా సౌండ్ ఎక్కువ తక్కువలు కాకుండా చేశాననే అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం దేనికి ఈ కింది ప్లేయర్ లో కిషోర్ జ్ఞాపకాల ను వినండి:
సచిన్ దేవ్ బర్మన్, కిషోర్ కుమార్ ఒకే నెలలో, అంటే అక్టోబరులో సచిన్ దేవ్ బర్మన్ 1975 లో, కిశోర్ కుమార్ పుష్కరం తరువాత 1987 లో, మరణించటం యాదృశ్చికం.
సిరిమువ్వల సింహనాదం అనే సినిమా 1990 లో అనుకుంటాను మొదలు పెట్టారు. దర్శకత్వం శ్రీ విశ్వనాథ్. కాని ఎందుచేతనో ఆ సినిమా పూర్తికాలేదు. అప్పట్లో అక్కడక్కడా పోస్టర్లు కూడా వెలిశాయి, కాసెట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అందులో ఒకటి ఇవ్వాళ మా హరప్పా తవ్వకాలలో లో దొరికింది. ఆ కాసెట్లో ఉన్న పాటల్లో అన్నిటికన్నా కూడా నాకు బాగా నచ్చినది "నరకాసుర వధ" గురించిన తొమ్మిది నిమిషాల పాట ఉన్నది. పాట వింటూ ఉంటే, అది నృత్య ప్రధానం అయినట్టుగా అనిపిస్తుంది.
కాని సినిమానే పూర్తికాలేదు. సినిమా పూర్తయ్యి విడుదలయ్యి ఉంటే, విశ్వనాథ్ సినిమా కాబట్టి ఆ మార్క్ లో ఎంత అద్భుతంగా ఉండి ఉండేదో కదా అనిపిస్తుంది. ఈ దీపావళి సందర్భంగా ఈ పాట వినండి.
ఎక్కడెక్కడి చెత్త సినిమాలు వివాదాలే పెట్టుబడి, ప్రేక్షకుల వేలంవేర్రే ఆధారంగా నడిచిపోతుంటే, కళాతపస్వి గా పేరొందిన శ్రీ విశ్వనాథ్ సినిమా సిరిమువ్వల సింహనాదం సినిమా పూర్తవ్వకుండా ఆగిపోవటం శోచనీయం.
వెంకటేశ్వర సుప్రభాతం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రతి శనివారం ప్రసారమయ్యే వెర్షన్ అందరికీ చిరపరిచితం. అలాగే ప్రముఖ గాయకురాలు శ్రీమతి ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన కాసేట్ కాని సి డి కాని అందరి దగ్గరా ఉండి ఉంటుంది. అటు రేడియోలో కాని, ఇటు ఈ కాసేట్/సిడి లోకాని సుప్రభాతం పాడే పద్ధతి ఒక్కటే విధం. సంగీతం జ్ఞానం ఏమాత్రం లేని నాలాంటి వాడికి ఎవరో తరుముకొస్తున్నట్టు, ఒక పరిమిత సమయంలో పాడి తీరాలి అన్నట్టుగా (బ్రెత్-లెస్ గా) అనిపిస్తుంది. స్వామి వారిని అలాగే ప్రార్ధించాలా, మరొక రకమైన గమకంలో ఈ సుప్రభాతాన్ని పాడకూడదా అని అనేక సార్లు నాకేకాదు అనేకమందికి అనిపించి ఉండాలి.
మనకి అనిపించి ఏమి లాభం! అనిపించాల్సిన వారికి అనిపించాలి. ఇది ఇవ్వాల్టి విషయం కాదు రెండు దశాబ్దాల క్రితమే అలా ఆలోచించినవారు లేకపోలేదు. ఎవరు! ఇరవై ఏళ్ళ క్రితం ఒక అద్భుత గాయక శిఖామణికి అనిపించింది. ఆయన మరెవరో కాదు, తెలుగు వారు గర్వించతగ్గ అద్భుత సంగీతజ్ఞుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.
1992 సంవత్సరం లో మంగళంపల్లి వారు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని వారికి మాత్రమె సాధ్యమైన పద్ధతిలో కొత్తగా సంగీత పరిచి అద్భుతంగా పాడారు. "శేషాద్రి శేఖర విభో తవ సుప్రబాతం" అంటూ ప్రతి చరణం తరువాత వచ్చే కోరస్ చాల అద్భుతంగా ఉన్నది. విని ఆనందించండి.
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం
శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి
శ్రీ వెంకటెశ్వర స్తోత్రం
శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో ఒక చక్కటి ఇంటర్వ్యూ కూడా యు-ట్యూబులో ఆంధ్ర జ్యోతి టి వి వారు నిర్వహించినది ఉన్నది ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి.
రేడియో కార్యక్రమాలను పదిల పరచవలసిన ఆవశ్యకత గురించి ఎక్కువగా సామాన్య శ్రోతలకున్న శ్రద్ధ ఎనలేనిదని బి ఎన్ మూర్తిగారు చేసి చూపించారు ఎప్పుడో వాల్వ్ రేడియో లో వస్తున్న కార్యక్రమాలను స్పూల్ రికార్డర్ లో రికార్డ్ చేసి పదిల పరిచారు వారబ్బాయి స్పూల్ టేపుల్లో ఉన్న రికార్డింగులు ఎం పి 3 చేసి అందరి కోసం ఒక వెబ్ సైటులో ఉంచారు ఈ కింది లింకు నొక్కి అక్కడ ఇరవై పైగా ఉన్న లలిత గీతాలను విని ఆనందించవచ్చు:
(10 ఆగస్ట్ 2014న చూస్తెఈ లింకు ఇప్పుడు పనిచెయ్యటం లేదు సారీ!)
మూర్తి గారూ అందుకోండి నా శతకోటి అభినందనలు. అలాగే వారబ్బాయికి (ఆ వెబ్ సైటులో పేరు వ్రాయలేదు) ధన్యవాదాలు. ఇలా శ్రోతల్లో ఇంకా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా రేడియో రికార్డింగ్ లు, ఉన్న వారు వివరాలు తెలియచేస్తే, ఆ రికార్డింగ్ లను ఎం పి 3 చేసి పదిల పరిచి అందరికీ ఈ బ్లాగుద్వారా అందించే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను. రికార్డింగ్ లు ఉన్న వారు వారికి వారే అందరికోసం ఇంటర్నెట్ లో అందించ గలిగితే అంతకంటే అద్భుత కార్యం మరొకటి లేదు.
మూర్తిగారు చూపిన శ్రద్ధలో వెయ్యో వంతు ఆకాశవాణి వారు చూపి ఉంటే ఎన్నెన్నో అపురూపమైన కార్యక్రమాలు ఈనాడు లభ్యమయ్యేవి. ఆకాశవాణి వారు వారి పాత బీరువాల్లో పడి ఉన్న టేపులు ఏమన్నా ఉంటే(మిగిలి ఉన్నాయా అని అనుమానం, ఈ అనుమానం నిజం కాకపొతే బాగుండును) అవి దుమ్ము దులిపి అందులో ఏమున్నాయో చూసే బృహత్ కార్యక్రమం చేపట్టి ఆ దొరికిన కార్యక్రమాలను శ్రోతలకు వారి వెబ్ సైటు ద్వారా అందచేస్తే ఎంతో బాగుంటుంది.
ఫోటో లో ఉన్నాయన క్షమించాలి, ఆయనేమీ తప్పు చెయ్యలేదు. ఫోటో బాగుందని వాడాను అంతే ఆయన చాలా మంచివాడు.
ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అన్న సామెతను నిజం చెయ్యాలని కంకణం
కట్టుకున్నారల్లే ఉన్నది కుమార్ రాజావారు! అక్కడేమో పెద్ద అయ్యవారు, పెద్ద పెద్ద మంత్రిత్వ శాఖలు ఒక శాఖ మీద నుంచి
మరొక శాఖకు లంఘిస్తూ నిర్వహిస్తూఉంటారుట,
ఇక్కడ కుమార్ రాజావారు ఏమి చేస్తారో తెలియదు
కాని డబ్బులు అలా వచ్చి పడుతూ ఉంటాయట. అదే అడుగుతూ ఒకాయన ట్విట్టాడుట. అంతే కుమార్
రాజా వారికి ఖోపం వచ్చేసి పోలీసులకి ఈ మైలు ఇచ్చారుట. వెనువెంటనే, టోపీలు కూడ సరిగ్గా పెట్టుకున్నారో లేదో,మన
సర్వసమర్ధ పోలీసులు, ఆ ట్విట్టుణ్ణి (విటుణ్ణి కూడా ఇంత త్వరగా అరెస్టు చెయ్యరేమో) తెల్లవారు
ఝామున అరెస్ట్ చేసి జైలో పారేశారుట. పాపం
ఆయన చచ్చీ చెడి బైయిల్ సంపాయించి (ఎంత ఖర్చు అయ్యిందో పాపం) బయటపడ్డాడుట.
ఇవ్వాళ ఏ టి వి (ఆంగ్లంలో) చానెల్
పెట్టినా కూడా హోరెత్తిపోతున్నది ఈ సెల్ఫ్ గోల్ కథనంతో.
సెల్ఫ్ గోలా? ఇదేమిటి అనడక్కండి. అయినా సరే చెప్తాను. ఈ ట్వీట్టటంలో, కుమార్ రాజా మీద ఈ పిల్ల కాకి ఏమి ట్విట్టాడో
ఎవ్వరికీ తెలియదు ఇవ్వాళ్టివరకూ. కాని కుమార్ రాజా వారి కండ కావరం వల్ల, ప్రపంచం మొత్తం ఇప్పుడు ట్విట్టుడు, ఏమి ట్విట్టాడో తెలిసిపోయింది. నిన్నటి వరకూ
పదహారు మంది స్నేహితులు (అందులో ఐదుగురు చుట్టాలేనుట) ఉంటే, ఇవ్వాళ పదిన్నర ప్రాంతానికి, కుమార్ రాజా వారు చేసిన గోల వల్ల, పదకొండు వందల పైగా
జనం విరగపడి ఆ ట్విట్టుడికి స్నేహితులుగా చేరిపొయ్యారుట, రాత్రికి రాత్రి సెలబ్రటీ అయిపోయి, టి వి చానెల్ వాళ్ళు, ఆ ట్విట్టుణ్ణి,
తమ తమ చానెళ్లకు తీస్కు వెళ్ళటానికి చొక్కాలు చింపుకుంటూ ముష్టా-ముష్టి,
కచా-కచి యుద్ధాలు చేసేసుకుంటున్నారని, చొక్కాలు చింపుకోవటానికి కుదరని
చానెళ్ళు బ్రేకింగ్ న్యూస్ అంటూ స్క్రోల్ చేస్తున్నాయి. ఇదే
మరి సెల్ఫ్ గోల్ అంటే. ఏమయినా వీళ్ళకి మట్టికొట్టుకుపొయ్యే రోజులు వచ్చాయి,
అందుకనే ఇలాంటి వెర్రి మొర్రి ఆలోచనలతో,
అధికారం చేతులో ఉన్నది కదా అని
పిచిపిచ్చి పనులు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ, మనిషా మోహన్ బాబా అనే సామెత నూట ఒక్కోసారి
నిరూపించబడటం, పైగా అది వంశపారంపర్యం అనే విషయం గురించిన ఉదంతం ఇంకా రగులుతుండగానే, ఈ సెల్ఫ్ గోల్ ఉదంతం బ్రేకింగ్ న్యూస్ అయ్యి, ఇంకా బ్రేకుతూనే ఉన్నది.
ఈ విషయంలో నాకు ఎంత వద్దనుకున్నా కొన్ని ఆలోచనలు వస్తున్నాయి.
సెల్లు ఫోను పోయిదిరా నాయనా కేసు బుక్
చేసి పెట్టండ్రా, వెతికి
ఇవ్వక్కర్లేదు, జస్ట్ కేసు
వ్రాసుకుని ఎఫ్ ఐ ఆర్ కాపి ఇవ్వండ్రా, నా ఏడుపు నేను ఏడ్చుకుంటాను అని ఎదురుగా నుంచుని ఉండే వాళ్ళను పురుగులకింద విదిలించేసి
పారేసే ఈ పోలీసులు, ఎక్కడినించో,
ఎవరిచ్చారో తెలియకుండా వచ్చిన ఈ
మైల్ పట్టుకుని, టెర్రరిస్టులను
వెతికేప్పుడు కూడా చూపని సాహసం, నైపుణ్యత చూపించీ, పాపం
ఆ ట్విట్టుణ్ణి ఎంతో వేగంతో అరెస్ట్ చేసి జైల్లో పారేసి, అప్పుడు గుర్తుకు
వచ్చి ఆయాస పడటం మొదలెట్టి, ఆ
వగర్పును వాళ్ళ స్వామి భక్తికి
నిరూపణగా చూపెట్టారు. ఈ విషయం ఎక్కడా ఏ టి వి చానెల్లోనూ పానెల్ డిస్కషన్లలో
రాలేదు. ఎంతసేపూ, ట్విట్టర్లో
వ్రాసినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అనే కాని, ఈమైల్ ఇచ్చెస్తే పోలీసులు అరెస్ట్ ఎందుకు
చెయ్యాలి అని ఎవ్వరూ అడగరే!!! అలా వ్రాయకూడదు అని లా ఏమన్నా ఉంటే గింటే,
స్టేషన్ కి పిలిపించి విషయం
కనుక్కుని, ఇంతకు ముందు
ఇలాంటి పనులేమన్నా చేశాడా అని వాకబు చేసి, మొదటి సారైతే జాగ్రత్త చెప్పి పంపించెయ్యాలి
కాని, అరెస్టు,జైలు.
ఏమి అంత తొందర? మనమేమన్న
కమ్యూనిస్టు పాలనలో ఉన్నామా! ఇదే తొందర మరి ఈ అవినీతి కేసుల్లో చూపించరేమి?
అదేదో ఐ టి యాక్టుట, అందులో 60A సెక్షన్ ట దాని ప్రకారం, కప్యూటర్ పరికరాన్ని ఉపయోగించి. ఒక వ్యక్తి, మరొక వ్యక్తికి తరచూ సందేశాలు పంపుతూ,
విసిగిస్తూ,వేధిస్తే,
అలా పంపే వ్యక్తిని అరెస్టు
చెయ్యచ్చుట, అలాంటి నేరం
నిరూపణ అయితే, శిక్ష
మూడెళ్ళుట. అబ్బ ఎంతటి న్యాయ దృష్టి.
ఏదైనా వాహనం, ఇష్టం
వచ్చినట్టుగా,నిర్లక్ష్యంగా నడుపుతూ, ప్రమాదానికి
కారణం అయ్యి, ఆ ప్రమాదం లో
ఎవరైనా మరణిస్తే, ఈ
ప్రమాదానికి కారణం అయిన ఆ వ్యక్తి అదే నేరస్తుడికి వేసే శిక్ష ఎంతో తెలుసా,
ఎక్కువలో ఎక్కువ రెండేళ్ళుట. ఈ
రెండిటిలో ఏది పెద్ద నేరం?? ఒకవేళ
ఆ మొదటిది నేరమని అనుకున్నా కూడా? ఎంతటి అద్భుతమైన న్యాయ దృష్టి ఈ లా మేకర్స్ కి, అదే
మనచేత (?) ఎన్నుకోబడ్డ్ ఈ
............. వద్దులెండి(ఎందుకోచ్చిన గోల!!), ఈ
మానవ మాత్రులకి (వాళ్ళు మటుకు ఎక్కడినుంచో దిగి వచ్చామనే అనుకుంటున్నారు).
TIMES NOW చానెల్లో, ఒక వెర్రి కుట్టె
వచ్చాడు. వాడు ఈ సైబర్ చట్టాలకు సంబంధించి నిపుణుడుట, అందుకనే కాబోలు గుప్పెట్లో ఎంత ఇసకుందిరా అంటే,
ట్రిగ్నామిటరీ లెక్కలు వెయ్యటం
మొదలు పెట్టి అంటాడూ, కుమార్
రాజావారికి ఈ ట్విట్టుడు తన సందేశాల ద్వారా అవమానం కలిగించాడు, పరువుట
పొయ్యేట్టుగా చేశాడుట, ఆయనేమో
పరువు నష్టం కేసు పెట్టాలి, కాని
ఆ లాయర్ నోటీసు ఏ చిరునామాకి పంపాలి, ట్విట్టర్
లో చిరునామా లేదుకదా అని ఉన్నాయి కదా అని కళ్ళను పెద్దవిగా చేసి చూపిస్తూ
మరీ తన "కాంగ్రెస్ చంచాతనం" అంతా చూపించాడు. ఇదుకే వాణ్ణి వెర్రి కుట్టె
అన్నది. తెల్లవారు ఝామున
వచ్చి ఆ ట్విట్టుడి చిరునామా చట్టుక్కున పట్టేసి పోలీసులు అరెస్టు
చెయ్యగా లేనిది, పరువు నష్టం నోటీసు పోలీసులు ఎక్కడికి వచ్చి
అరెస్టు చేశారో అక్కడే ఇవ్వలేరా.
తరువాత, జస్ట్ మూడుసార్లు అదీ పదేసి నెలల అంతరంతో
ట్విట్టితేనే, అది
వేధించటం అయిపోతే, అరగంట
వ్యవధిలో చూపించినదే చూపిస్తూ చెప్పిందే చెప్తూ వేసే వ్యాపార ప్రకటనల
మాటేమిటి? అది వేధింపు కాక మరేమిటి!అవ్వి చూపించే చానెళ్ళను ఏమి చెయ్యాలి, ఆ ప్రకటనలు ఇచ్చే కంపెనీలను ఏమి
చెయ్యాలి, ఆ వ్యాపార
ప్రకటనా కాలుష్యాన్ని వందల వేల
సార్లు చూపించే పథక రచన ఎల్లకాలం చేస్తూ ఉండే యాడ్ మాఫియాని ఏమి చెయ్యాలి.
వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అండమాన్సులో పారెయ్యద్దూ. ఒక్క
ట్విట్టినందుకేనా అరెస్టు చెయ్యటం. ఎంతటి నిస్పక్షపాత వైఖరి!
పేపరు వాళ్ళు, టి వి ల వాళ్ళు నిరంతరాయం ఈ రాజకీయ నాయకులను
ఉన్నవి లేనివీ కూడ వ్రాస్తూ, చూపిస్తూ
తెగ విమర్శిస్తూ ఉంటారు కదా, మారి
వాళ్ళ మీద పెట్టరేమి ఈ కేసులు. సామాన్యుడే దొరికాడా ఈ ఐ టి యాక్ట్ సెక్షన్ 60A అమలు చెయ్యటానికి. బాబూ బ్లాగర్లూ,
ఇక మనం కూడా జాగ్రత్తగా ఉండి,
ఆచి తూచి వ్రాయాలల్లే ఉన్నది.
లేదా సదా అత్యవసర వస్తువులు షేవింగ్ కిట్ లాంటివి, ఒకటి రెండు గుడ్డలు మొత్తం ఒక మూటగా తయారు చెసి తలకింద పెట్టుకు పడుకోవాలో
ఏమో,ఎప్పుడు వచ్చి ఏమి వ్రాశావని అరెస్టు చేస్తారో,
ఆ ట్విట్టుడి కి ఉన్న పరపతి,
డబ్బు మన దగ్గర ఉండద్దూ బైయిల్ తీసుకు బయట పడటానికి?
ఇప్పుడే అందిన వార్త
అసలు విషయం తెలుసా, ఆ ట్విట్టినాయన ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ సభ్యుడటా!
చెప్పారు కారేమి, మరంతే అరెస్టు
చేసిపారెయ్యటమే. కరప్షనుట కరప్షను ఎక్కడుందీ!!
ఇక మిష్టరీ విచ్చిపోయింది. హమ్మయ్య హాయిగా పడుకోవచ్చు తెల్లవారు ఝామున ఎవ్వరూ లేపరు, నేను ఆ ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ సభ్యుణ్ణి కాదు కదా మరి.
మేము
కాలేజీలో చదువుకునే రోజుల్లో అంటే 1970 ల చివర్లో పుస్సీ కాట్" అనే డచ్
పాప్ బృందం బాగా బజాయిస్తూ ఉండేది. వాళ్ళు నెదర్ లాండ్స్ కు చెందిన
వాళ్లవటం వల్ల ఆంగ్ల ఉచ్చారణ గమ్మత్తుగా ఉండి, అదొక కొత్త ఆకర్షణగా
ఉండేది. అన్ని పాటలూ కాకపోయినా కొన్ని పాటలు బాగుండేవి అప్పట్లో చాలా
సార్లు విన్న పాటలలో "It's the same Old Song ఒకటి. ఇవ్వాళ శలవు పెట్టి
ఇంట్లో ఉండటంతో అవ్వి ఇవ్వి వెతుకుతూ ఉంటే ఈ బృందం పాడిన పాటలు ఉన్న సి
డి కనపడింది. ఆ డీవ్ షేర్లో కి ఎక్కిద్దామంటే ఎందుకనో రెండ్రోజుల నుంచి
వరసగా ఎర్రర్ మేసేజీలే వస్తున్నాయి. ఒకటికాకపోతే మరొకటి. యు ట్యూబ్ లోకి
వెళితే పాట వాళ్ళు పాడటం కూడా చూడవచ్చు.
సరే ఈ పాట సాహిత్యం ముందు చూడండి. ఆతరువాత ఈ పాటని యు ట్యూబ్ ద్వారా వినవచ్చు.
You're sweet (You're sweet) as a honey bee (As a honey bee)
But like a honey bee stings you've gone and left my heart in pain
All you left (All you left) is our favorite song
The one we danced to all night long
It used to bring (Used to bring) sweet memories (Sweet memories)
Of a tender love that used to be
Now it's the same old song
But with a different meaning
Since you been gone
Now, it's the same old song
But with a different meaning
Since you been gone, my
Oh, my
A sentimental fool am I
To hear an old love song and wanna cry
But the melody keeps haunting me
Reminding me how in love we used to be
Keep hearing the part that used to touch our heart
Staying together forever, breaking up never
It's the same, same old song
But with a different meaning
Since you been gone
Now, it's the same, same old song
But with a different meaning
Since you been gone, my
My, my
Precious memories keep lingering on
Everytime I hear our favorite song
Now you're gone, left this emptiness
I only reminisce the happiness we spent
We used to dance to the music (Dance to the music)
Make romance through the music (Romance through the music)
It's the same, same old song
But with a different meaning
Since you been gone
Now, it's the same, same old song
But with a different meaning
Since you been gone, my
My, my
Well, it's the same, same old song
But with a different meaning
Since you been gone
Now, it's the same, same old song
But with a different meaning
Since you been gone
It's the same, same old song
But with a different meaning
Since you been gone
అలాగే ఈ బృందం
పాడిన మరో పాట "మిసిసిపి" అనే పాట, ఈ పాటలో డ్రమ్స్ గిటార్ కలిఫై చక్కటి
గమకం సృష్టించారు. మిసిసిపి అనేది అమెరికా లో ఉన్న ఒక నది పేరు. వీళ్ళు
యూరోపియన్స్. ఆ అమెరికన్ నది పేరుతొ పాట ఎందుకు పాడాలి! ఇంగ్లీషులో పాటలు
పాడే పాప్ బృందానికి, పెద్ద మార్కెట్ అమెరికానే కదా. వాళ్ళను ఆకర్షించటానికి ఇలా వాళ్ళ
పేరు వాడి ఉంటారు. కాని పాట చివరలో అమెరికన్లను ఒక ఎత్తిపొడుపు పొడుస్తారు.
వాళ్ళ కంట్రీ సాంగ్స్(జానపద సంగీతం) కనుమరు గవుతున్నాయని, కంట్రీ సాంగ్
గిటారిస్టు లు ఇప్పుడు రాక్ అండ్ రోల్ వైపు వెళ్ళిపోతున్నారని ఉన్న విషయం
పాటలో చెప్పేశారు. ఇప్పుడు వినండి, చూడండి, పాట సాహిత్యం కూడా స్క్రోల్
అవుతూ కనిపిస్తుంది:
ముచ్చటగా
మూడో పాట "BROKEN SOUVENIRS", ఈ పాట భీ అప్పట్లో మంచి హిట్. ఈ పాట కు
కూడా పాట ఆడియో సాహిత్యం అన్నీ కలిపి ఓకే పాక్ లో ఉన్నాయి చూస్తూ వింటూ
చదువుకోవచ్చు
వీళ్ళు
పాడిన పాటల్లో మరొక మంచి పాట "On the Radio" అనుకుంటాను అప్పట్లో
వినేవాళ్ళం. కాని ప్రస్తుతం ఎక్కడా దొరకటం లేదు ఈ బృందం లో పాటలు ఎక్కువగా
మహిళలు బృందగానం చేస్తూ ఉంటే, మగవాళ్ళు సంగీత సహకారం అందిస్తూ ఉంటారు.
కాని "On the Radio" పాట మాత్రం మగవాళ్ళే పాడినట్టు గా గుర్తు ఉన్నది.
ఏమైనా
పాప్ సంగీతంలో హాలెండ్ వాళ్ళు కూడా మంచి పాటలను అందించారు. అటువంటి
డచ్ సంగీతపు బృందాలలో పుస్సీ కాట్, జార్జ్ బెకర్ సెలెక్షన్ ముఖ్యమైనవి.
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
=====================================
UPDATE ON 03 11 2012
=====================================
పైన మరొక మంచి పాట "On the Radio" అని కదా.కాని ఆ టైటిల్ తప్పు. ఆ పాట పేరు "The Story of W Dummy" అందులో ఒక రేడియో కార్యక్రమం గురించి ఉన్నది అలా గుర్తుకొచ్చినట్టున్నది. చివరికి ఆ పాటను ఇవ్వాళ యు ట్యూబ్ లో పట్టుకున్నాను. వినటానికే ఉన్నది కాని చూడటానికి లేదు అందులో. నాలాగే ఆ పాట నచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారన్న సంగతి సంతోషానిచ్చింది.
ఈ పాట సాహిత్యం దొరకటం లేదు. ఒకసారి మార్క్ ట్వైన్ విసుక్కున్నాడుట, తన దగ్గర కుప్ప-తెప్పలుగా ఉన్న పుస్తకాలు చూసి. "ఈ పుస్తకాలన్నీ అరువిచ్చిన వాళ్ళు, అవి పెట్టుకోవటానికి బీరువా ఇచ్చారు కాదు" అని. అలాగే ఈ పాట యు ట్యూబ్ లో పెట్టిన వాళ్ళు లేరిక్ ఉంచారు కాదని చాలా చీకాకుగా ఉన్నది. వెతికితే దొరకనిది లేదంటారు, చూద్దాం దొరికితే మరొక అప్డేట్!
ప్రముఖ రచయిత శ్రీ గుడిపాటి వెంకట చలం గారు వ్రాసిన నవలలు/కథలు ఒక ఎత్తైతే ఆయన వ్రాసిన "మ్యూజింగ్స్" ఒక ఎత్తు. గాంధీ గారి గురించి ఆ మ్యూజింగ్స్ లో చలం గారు అనేక సార్లు రకరకాలుగా తన అభిప్రాయాలు వెలిబుచ్చారు అందులో నాకు నచ్చిన అభిప్రాయం, ఈ కింద ఇవ్వబడింది.
గాంధీ గారు చచ్చిపోక పూర్వమే, చాలాసార్లు అనుకునే వాణ్ణి; ఆయన స్వయంగా రాసుకున్న కొద్ది సంగతులు తప్ప ఆయన్ని ఊరికే పొగడడమేగాని, ఆయన్ని గురించి, జీవితంలో చిన్న చిన్న సంఘటనల్ని గురించి ఎవరూ ఏమీ రాయరేమని. స్థలంలో, కాలంలో కోట్ల కొలది మనుషులతో సన్నిహిత సంబంధం ఉన్న ఒక మహావ్యక్తిని గురించి ఇంతేనా-మిత్రులూ, భక్తులూ మనుషులూ, రిపోర్టర్లూ, గంధకర్తలూ చెప్పగలిగింది? అని. అంతకన్నా ఒక సినిమా స్టార్ విషయాలు ఎక్కువ తెలుస్తాయి. చచ్చిపోయింతరువాత ఇంకా జాగ్రత్తగా వెతుకుతున్నాను, నాకు పత్రికలు చిక్కినంతవరకు; ఆయన ఆశయాలూ, అభిప్రాయాలూ తప్ప-అసలు ఆయన్ని గట్టిగా బొమ్మ కట్టి నుంచోపెట్టగలిగిన సంగతులు బైటికి రాలేదు. ఆయనది గొప్ప 'సెన్సు ఆఫ్ హ్యూమర్ అంటారు ప్రతివారూ-ప్రతి నిమిషం నవ్వు ఊరికే పొంగిపొరలి వచ్చేదంటారు. కాని మనకి ఆ సంతోషం, నవ్వూ దగ్గిరిగా కలిగేట్టు చూపలేరు.
ఏ సందర్భంలో, ఏమి చూసి, విని ఆయన నవ్వేవారు? ఏ మాటలు చెప్పి ఆయన నవ్వించగలిగారు? వాటి సంగతి మనకి తెలీదు. చివరికి డి కే రాయ్ వంటి వారైనా; ఒక గొప్ప వాతావరణంలో మనని ముంచి గాంధీగారి ఔన్నత్యాన్నీ ఫీల్ అయ్యేట్టు చెయ్యగలిగారు గాని, అంతకన్నా ఏమీ స్పష్టంగా చెప్పలేకపోయినారు. గాంధీగారు మమ్మల్ని ఇట్లా నవ్వించారు అని రాస్తే మనకి నవ్వురాదు. ఆయన్ని చూస్తే అంత భమేమంటే మనకి భయం కలగదు; ఆయన మీద దేనికి మాకు ప్రేమ కలిగందంటే మనకి ప్రేమ కలగదు. అంటే ముందు తరంవారు గాంధీని గురించి చదివితే, , ఆయన సాధించిన దానివల్ల పైగా ఆయన్ని గురించి చెప్పే సంగతులు, ఇంకో మనిషి విషయమై చెపితే, చాదస్తమూ, కపట నమ్రతలో కప్పుకున్న డాంబికమూ, మూర్ఖమూ, సిల్లీ, హస్యాస్పదమనిపిస్తాయి. తెలుగు వాళ్ళకి మూడు గొప్ప విశేషాలు దొరికాయి,. గాంధీగారిని గొప్పవారనేందుకు. అంగోస్త్రమూ, బోసితనమూ, పిలకా.
ప్రకాశ రాయుడు ఆయన హృదయాన్ని వజ్రాలపొడిలో పొదిగిన గులాబి రేక అన్నాట్ట. నాకేం తోస్తొంది అంటే,ఆయన గొప్పతనం ఆయన సాధించి తెచ్చుకున్నది. కాని ఆయన చేసే సాధనాక్రమం, మనకి కనపడేది, చాలా సామాన్యం. ఆయన తనలోపల సాధించిన విషయం రంగులేని ఆత్మ వికాసం - అత్తరు నించి పరిమళం వస్తేం, ఆ! ఎంత విలవైన అత్తరు అని ఆశ్చర్యపోతాంగాని, పువ్వునించి వొస్తే,దాంట్లో ఏమీ ఆశ్చర్యం లేదు. కనుకనే కారణం లేని ఆకర్షణ, ప్రతి వ్యక్తిలో ఉండే గోడల్ని తనలో చాలావరకు పగలకొట్టుకుని ఇతరులు తమకి తాము నిర్మించుకున్న గోడల్ని బేధించి, వారితో ఐక్యాన్ని సాధించారు, ఆయన. అందుకనే ఆయన కళ్ళెర్రచేస్తే, దేశం కూడా కోపం లోకి ఉరికింది; నవ్వితే నవ్వింది; భయంలేదంటే ధైర్యపడ్డది. ఆయన నవ్విస్తే నవ్వాం గాని ఎందుకు నవ్వామో ఇవాళ చెప్పలేము. ప్రోత్సహిస్తే ఉరికాము, కాని ఏం చెప్పి ప్రోత్సహించాడో మనకి తెలియదు.
చలం గారి మ్యూజింగ్స్ అధ్యాయం 48, [పుటలు 263,264, ఐదవ ప్రచురణ 2005] నుంచి గ్రహింపబడినది
ప్రియమైన బాలసుబ్రహ్మణ్యం గారూ, పాడుతా తీయగా కార్యక్రమపు ఇతర నిర్వాహకులారా,
మీకు ఇవే నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా వీక్షిస్తున్న ప్రేక్షకుడిగా, ఆ కార్యక్రమపు అభిమానిగా నాలుగు మాటలు మీకు అందచేద్దామని ఈ చిన్ని ప్రయత్నం. మీకే నా మాటలు సూటిగా పంపకుండా, ఇక్కడ బ్లాగులో ఎందుకు వ్రాయటం అని మీకు అనిపించవచ్చు. ఒకటి, మీకు పంపాల్సిన చిరునామా నాకు తెలియదు. పంపినా మీకు వచ్చే అసంఖ్యాకమైన ఉత్తరాల్లో నాదొకటి అయిపోతుంది. రెండు, నాలాగా అనుకుంటున్న వాళ్ళు, నేను అనుకుంటున్నది బాగుంది అనుకున్న వాళ్ళల్లో ఎవరన్న మీ చెవిన నేను వ్రాసిన నాలుగు మాటలు వెయ్యకపోతారా అని ఒక ఆశ. అంతే.
పాడుతా తీయగా కార్యక్రమం సంగీత ప్రియులకు, ముఖ్యంగా సినిమా పాటల ప్రియులకు ఎంతో అభిమానమైన కార్యక్రమంగా మారింది. ఈ కార్యక్రమంలో సంగీతం నేర్చుకుంటూ చక్కగా పాడగలిగిన చిన్నారులెందరినో వయస్సులవారీగా పోటీలు ఏర్పరిచి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండటం ఎంతో ఆనందాన్నిస్తున్నది. ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులుగా సుబ్రహ్మణ్యం గారూ, మీదైనా ఒక ప్రత్యెక ముద్ర ఈ కార్యక్రమం మీద ఎంతగానో కనబడుతూ ఉంటుంది. కార్యక్రమం మధ్యమధ్య మీరు చెప్పే "అప్పటి" విశేషాలకోసమే నేను ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాను. పాటలు మొదటి రౌండ్లల్లో కొంత విసుగెత్తించినా, దాదాపు ప్రేక్షకులు అందరూ గుర్తించిన గాయనీ గాయకులే సెమి ఫైనల్ దాకా రావటం ఇక అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రతిభ మరింత పదును పెట్టుకుని ఫైనల్స్ లో నెగ్గటం ఇప్పటి దాకా అనేక సార్లు చూడటం జరిగింది.
నేను ఈ లేఖ వ్రాద్దామని మొదలు పెట్టినది ఒకే ఒక్క విషయం చెప్పటానికి. ఇప్పటి దాకా పాడుతా తీయగా కార్యక్రమం మొత్తం ఫోకస్ సినిమా పాటలమీదే ఉన్నది. సినిమా పాటల మీదుగా ప్రేక్షక ఆదరణ, వాళ్లకు సంగీతం మీద అభిరుచి కలిగించటంలో ఈ కార్యక్రమం ఎంతగానో విజయం సాధించింది. ప్రేక్షక ఆదరణే ఏ కార్యక్రమానికైనా పట్టుకొమ్మ. మీ కార్యక్రామానికి ఉన్న ఆదరణ దృష్ట్యా, మీరు కొత్తగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ విషయంలో ఈ కింది సూచనలు మీ ముందు ఉంచుతున్నాను.
ఇప్పటి వరకూ బాల బాలికలకు సంవత్సరాలుగా ఆవకాశం ఇచ్చి వాళ్ళల్లో నిజమైన ప్రతిభ కలిగిన వాళ్ళను గాయకులుగా చేయటం జరిగింది. ఇప్పుడు, కొంచెం పెద్ద వాళ్ళను అంటే ముఫ్ఫై-నలభై పైబడి పాడగలిగి ఉన్న వాళ్ళను, ముఖ్యంగా మహిళలకు ఆవకాశం ఇచ్చి, సినిమా పాటలు కాకుండా లలిత సంగీతం, పెళ్లి పాటలు, మంగళ హారతులు వాళ్ళ చేత పాడించి, ఆ పోటీలో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తే ఎంతైనా బాగుంటుంది.
ఇలా చెయ్యటం వల్ల, మన సాంప్రదాయం లో ఉన్న అనేకానేక అద్భుతమైన పాటలు ఇప్పటికి దాదాపుగా కనుమరుగయ్యి పోతున్న వాటిని మళ్ళి ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చి, ఆ పాత పాటలను పునరుద్ధరించిన వారు అవుతారు.
అనేకానేక పెళ్లి పాటలు, మంగళహారతులు మొదలైన వాటి సాహిత్యం కూడా ఇప్పుడు పెద్దగా దొరకటం లేదు. మరికొంత కాలం జరిగితే, అసలు కనపడకుండా పొయ్యే ప్రమాదం ఉన్నది. మీరు ఈ కార్యక్రమం ద్వారా మన సాంప్రదాయక పాటలను ప్రోత్సహిస్తే, ఆ విధమైన సంగీతాన్ని పెంచి పోషించిన వారు అవుతారు, ఈ పాటలు ఆ సంస్కృతీ మళ్ళి పునరుద్ధరించిన వారు అవుతారు.
పై సూచనల వంటివి ఇప్పటికే మీకు వచ్చి ఉంటాయి ఆపైన మీకే ఆ ఆలోచన ఉండి ఉండవచ్చు. ఒక్కసారి ఆలోచించి వీలయితే పాడుతా తీయగా కార్యక్రమానికి కొంత కాలం పైన సూచించిన విధంగా కొత్త రూపు ఇచ్చి ప్రేక్షకులను అలరించమని నా కోరిక, నా ఆకాంక్ష ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియచేస్తున్నాను.
పాటలు పాడటం ఆ పాటల్లో కొన్ని బహుళ ప్రజాదరణ పొందటం, వాటిని హిట్ సాంగ్స్ అన్న పేరుతొ శ్రోతలు ముచ్చట పడటం మనకు తెలిసినదే. ఆయా హిట్ సాంగ్స్ ని పాట లేకుండా కేవలం సంగీతం తో ఆ పాటలో ఉన్న గమకం పోకుండా తీసుకు రావటం సులభమైన పని కాదు. అసలు పాటతో సమానంగా తమ ఇన్స్ట్రుమెంటల్ సంగీతానికి ప్రజాదరణ తీసుకు వచ్చిన వారిలో ఎనోఖ్ డేనియల్స్ ప్రధముడు. పూర్వ కాలంలో, అంటే ఎప్పుడో రాజుల కాలం అనుకోకండి. 1972 ప్రాంతాల్లో వివిధ భారతి రెండో ప్రసారం (విజయవాడలో) పొద్దున్న పది గంటలకు గుంజన్ అనే కార్యక్రమం తో ప్రారంభం అయ్యేది. ఈ కార్యక్రమం పదిహేను నిమిషాలు. అందులో ఒక హిట్ సాంగ్ ఆ పాట ఇన్స్ట్రుమెంటల్ వెర్షన్ ఉండేవి. సామాన్యంగా ఆ టైములో ఇంట్లో ఉండే వాళ్ళం కాదు. స్కూల్లోనో, కాలేజీలోనో ఉండే వాళ్ళం. కాని ఇంట్లో ఉన్న సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని తప్పని సరిగా వినే వాళ్ళం. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఎనోఖ్ డేనియల్స్ సంగీతమే ఎక్కువగా వినవచ్చేది. ఆయన సంగీతానికి అంతటి ప్రఖ్యాతి. ఇప్పటికి కూడా ఆయన ఇన్స్ట్రుమెంటల్ సంగీతం అంత సులభంగా దొరకదు.
యు ట్యూబ్ వెతికితే ఈ కింది వీడియో దొరికింది. ఆయన స్వంతంగా ఎకార్డియన్ మీద పాటలు పలికించటం ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ సంగీత కళాకారుడు అసలు పాటలు పాడిన కళాకారులతో సమానమైన ప్రఖ్యాతి పొందారు. సామాన్యంగా వివిధభారతి వంటి ఆరోగ్యకరమైన రేడియో స్టేషన్లలో ఎక్కువగా ఈయన సంగీతమే వినపడేది. ఇప్పటి పరిస్థితి తెలియదు.
ఎనోఖ్ డేనియల్స్ గారికి స్వంతంగా ఒక వెబ్ సైట్ ఉన్నది. ఆ వెబ్సైటులో ఆయన జీవిత వివరాలు, ఫోటోలు, ఆయన సంగీతపు సి డి ల వివరాలు. కొద్దిగా సాంపిల్ సంగీతం ఉన్నాయి. ఈ కింది లింకు నొక్కి పూర్తి వివరాలు హాయిగా చూడవచ్చు.
నిన్న సాయంత్రం, ఎప్పుడూ మనం వినే అమెరికన్ పాప్ లేదా బ్రిటిష్ పాప్ సంగీతమేనా ఇతర దేశాల్లో మనం వినగలిగే మచి పాటలు లేవా, ఇంతా చేస్తే ఈ ఇంగ్లీష్ పాప్ పాటలు పూర్తిగా మనకి అర్ధం అవుతున్నాయి కనుకనా, వాటిల్లో ఉండే ట్యూన్, గమకాన్ని ఇష్టపడి కదా వినేది, మనం యూరోప్ లో ఉన్న ఇతర భాషల పాటలు ఎందుకు వినకూడదు అనిపించింది. 1970 - 80 లలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గ్రూప్ "అబ్బా" స్వీడన్ దేశానికి చెందిన వాళ్ళు కాదా అన్నా ఆలోచనలు ముసిరి. చూద్దాం మిగిలిన పాటలు ఎలా ఉంటాయో అని యూరోవిజన్ పాటల పోటీ కి చెందిన వెబ్ సైట్ వెతికాను. అందులో 2008 సంవత్సరంలో జరిగిన పోటీకి సంబంధించిన 40 + పాటలను విన్నాను. నాకు రెండు పాటలు నచ్చినాయి. ఒక బెల్జియం దేశానికి చెందినది, సెమి ఫైనల్స్ దాకా వచ్చినది, రెండోది స్పైన్ దేశానికి చెందినది ఫైనల్స్ దాకా వచ్చినది.
ఆ పాటల వీడియో యూ ట్యూబ్ నుంచి మీ కోసం.
పై పాట బెల్జియం దేశానికి చెందినది, సెమి ఫైనల్స్ దాకా వచ్చింది
పాట స్పైన్ దేశానికి చెందినది ఫైనల్స్ వరకూ వచ్చింది
మొదటి పాట బెల్జియం దేశానికి చెందినది, చూడటానికి వినటానికి బాగున్నది. ముఖ్యంగా ఆ గాయని, తనకు రకరకాల వాయిద్యాల మీద సహకరిస్తున్న వారితో వారిని ఉత్తేజ పరుస్తూ వాళ్ళ మధ్య తిరుగుతూ పాట పాడటం నాకు బాగా నచ్చింది.
రెండో పాట వినటానికే కాని, చూడటానికి చిరాకు పుట్టించింది.
యూరో విజయన్ సాంగ్ పోటీలకు చెందిన వెబ్ సైట్ ఈ కింది లింకు నొక్కి చూడండి. ఇలాంటి పాటలు అనేకం ఉన్నాయి.
పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్రిస్మస్ పండుగను ఎంత సరదాగా జరుపుకుంటారో వాళ్ళ సినిమాలు చూసి ఎంతైనా సరదా పడుతూ ఉంటాము. అలాగే రష్యాలో కూడా "చుక్ గెక్" అన్నదమ్ములు కథ వంటి పిల్లల పుస్తకాలు చదివి అక్కడ కూడా ఈ పండుగ జరుపుకునే వారు (జరుపుకోనిచ్చేవారు) అని తెలుసుకుని సంతోషించటం జరిగింది.ఈ పండుగలో క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టటం ఆ చెట్టు అలంకరణ, క్రిస్మస్ బహుమతులు ముఖ్య ఆకర్షణలు. పిల్లలకు ఈ పండుగ ఒక పెద్ద సరదా, అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలు తమకేమి బహుమతులు ఇస్తారా అని ఎదురు చూడటం సంవత్సరం పోడుగున్నా జరుగుతూ ఉంటుందని అనేక కథలు చదివి, సినిమాలు చూసి తెలుసుకున్నాం. క్రిస్మస్ కు సంబంధింనదే శాంటాక్లాస్ కథ. ఈ శాంటాక్లాస్ ముసలి తాత లాగ కనపడుతూ, క్రిస్మస్ బహుమతుల సంచీ భుజాన వేసుకుని, రైన్ డీర్ లాగుతున్న స్లెడ్జ్ బండీ (క్రిస్మస్ సమయంలో మంచు కురుస్తూ ఉంటుంది మరి) ఎక్కి వస్తాడని కథ. ఈ శాంటాక్లాస్ తమ ఇంటి చిమ్నీ నుండి (వంటింటికి ఒకప్పుడు ఉండే పోగ్గూడు) దిగి తమ బహుమతులను క్రిస్మస్ చెట్టుకు కట్టి వెళ్లి పోతాడని, తెల్లారంగానే తీసుకోవచ్చు అని పిల్లల ను సరదా పరుస్తారు.
ఇదే కథను అనుసరిస్తూ పిల్లలు గొడవ చెయ్యకుండా, అల్లరి పెట్టకుండా ఉండాలని వాళ్లకు ఒక పాట పాడారు ఎడ్డీ ఆర్నాల్డ్. క్రిస్మస్ పాట అనంగానే తమ మతం గొప్పతనం చెప్పుకోవటం కాకుండా, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళెలా ఉంటే శాంటాక్లాస్ వచ్చి వాళ్లకి బహుమతులు ఇస్తాడు అని అల్లరి పిల్లల్ని ఏమార్చటానికి ఈ పాటా చాలా బాగుంటుంది.
నాకు అభిమాన గాయకుడు అయిన ఎడ్డీ ఆర్నాల్డ్ పాడిన క్రిస్మస్ పాట మీకోసం అందిస్తున్నాను.
ఈ పాట సాహిత్యం మామూలు మాటలతో అనవసర పద గాంభీర్యం చూపకుండా పిల్లలకు హాయిగా అర్ధం అయ్యే రీతిలో ఉన్నది.
Oh you better watch out you better not cryYou better not pout I'm telling you whySanta Claus is comin' to town He's a making a list checking in twiceGonna find out who's naughty and niceSanta Claus is comin' to town He sees you when you're sleeping he knows when you're awakeHe knows when you've been bad or good so be good for goodness sake Oh you better watch out you better not cryYou better not pout I'm telling you whySanta Claus is comin' to town With a little tin horn and a little toy drumsA root a toot toot and a rum a tum tums And curly head dolls that cuddle and cooElephants boats and kiddie cars tooSanta Claus is comin' to town The kids and girls in boyland will have a jubileeThey're gonna build a toyland town all around the Christmas tree Oh you better watch out you better not cryYou better not pout I'm telling you whySanta Claus is comin' to townSanta Claus is comin' to town
ఈ కింది లింకు నొక్కి 25 12 2011 మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఒక శాంతా క్లాస్ వాల్ పేపర్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవచ్చు
మా తమ్ముడు రాధా కృష్ణ (క్లిక్) ఒక పాట నాకు తెలుసేమో అని పంపాడు. మెయిలు లో తెలుగులో ఇంగ్లీష్ పాట అని చెప్పటం జరిగింది. తెలుగులో ఇంగ్లీష్ పాటా! ఆశ్చర్యంగా ఉన్నదే అని విన్నాను. చూస్తె పాటంతా ఇంగ్లీషే. కాని తెలుగు/అరవ యాసలో ఉన్నది. నాకు గుర్తున్నంత వరకూ ఇది మన విలక్షణ నటుడు నాగభూషణం తీసిన సినిమా నాటకాల రాయుడులో అని అనుకుంటున్నాను.
సరే ఆకాశవాణి వాళ్లకి కూడా అనుమాన నివృత్తి చేసే శ్యాం ఉన్నారు అని ఆయనకీ ఈ పాట పంపాను. కాని శ్యాంనారాయణ కి కూడా ఈ పాట వివరాలు తెలియదు.
ఈ కింది ఇచ్చిన ప్లేయర్లో తెలుగులో ఇంగ్లీష్ పాట వినండి.
సరే పాట విన్నారుకదా! ఈ పాట ఏ సినిమాలోది, ఎవరు పాడారు, ఆ సినిమాలో ఇంగ్లీష్ పాట పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది. ఈ విశేషాలన్నీ ఇలా బ్లాగులో అందరితో పంచుకుంటే తెలిసే అవకాశం ఉన్నదని ఇక్కడ ఇచ్చాను.
మనకొచ్చిన సమస్యే మరేవరికన్నా వచ్చిందా? అని చూస్తె ఒక బ్లాగ్ దొరికింది టెక్ లవర్స్ బ్లాగ్ అందులో ఇలా తెలియని పాటలను చూసి పాట వివరాలు తెలిపే ఒక వెబ్ సైట్ గురించి వివరించారు. ఆ వెబ్ లోకి మనకు తెలియని ఒక పాటను అప్లోడ్ (నిమిషానికి మించి పాటను తీసుకోదు)ఆ వెబ్ సైటులో ఉన్న ఇతర సభ్యులు విని పాట వివరాలు తెలుపుతారట. ఆ వెబ్ లోకి కూడా అప్లోడ్ చేసాను.
మొత్తానికి పైన ఇచ్చిన పాట ఎక్కడిదో తెలిస్తే సంతోషం!
మనకు తెలియని పాటల గురించి తెలుసుకోవాలంటే ఈ కింది లింకు నొక్కి ఆ వెబ్ సైటు చూడటం తప్పనిసరి.
ఆ పాత రోజులు మళ్ళీ రాకూడదూ అని నిట్టూరుస్తూనే అప్పటి సంగీతం తలుచుకుని పరవసించే వారికోసం ఒక చిరు కానుక. యు ట్యూబ్ మనకు తెలిసినదే. అందులో అనేక వీడియో పాటలు ఉన్నాయి. మనకు అభిమానం ఉన్న గాయనీ గాయకులూ పాడిన పాటలు ఒక్కసారే వరుసగా చూద్దామంటే వెతుక్కోవాలి. అటువంటి గాలింపు చర్యలకు మనం పాల్పడకుండా మనకోసం పాత పాటల వీడియోలు అన్ని ఒకే చోట చూసే ఏర్పాటు చేసారు. ఇక మీ ఇంటర్నెట్ కనెక్షన్ శక్తి మీ ఓపిక.
గాయకుల ఫోటో కింద గాయనీ గాయకుల పేరు క్లిక్ చేస్తే చాలు పైన చెప్పిన చోటుకు వెళ్ళిపోతారు.
అద్భుతమైన గళం, ఎప్పటికీ మరువలేని గొప్ప పాటలు. నాకు అందరి కంటే అత్యంత అభిమాన గాయకుడు శ్రీ తలత్ మెహమూద్. ముంబాయిలో ఉన్నప్పుడు, ఆయన సమాధి చూద్దామని ప్రయత్నించాను కాని కుదరలేదు. తరువాత తెలిసింది, వారి మత సంప్రదాయం ప్రకారం, సమాధి కట్టటం వంటివి ఏమీ చేయలేదని.
నాకు సంగీతం వినటమే కాని, ఆ సంగీతపు విషయాలు తెలియవు.
కాని పాట ఎత్తుగడ అంటే హేమంత్ కుమార్ తరువాతే మరింకేవరినన్నా చెప్పుకోవాలి. ఏ స్థాయిలో మొదలుపెడితే అదే స్థాయిలో పాట మొత్తం పాడేసి శ్రోతలను ఎంతో అలరిస్తారు ఈయన.
కిషోర్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటారా! ఎన్నెన్ని పాటలు, ఎన్ని రకాల పాటలు. కొతి పాటలు, అల్లరి పాటలు , సరదా పాటలు దగ్గరనుంచి వింటుంటే కళ్ళంబడి నీళ్ళు తిరిగే పాటలు కూడా ఎన్నో పాడారు కిషోర్.
మనకున్న ఒకే ఒక్క పట్టు వంటి మెత్తటి గొంతు మన మొహమ్మద్ రపీది. రఫీ పాటలు లేని హిందీ సినీ రంగాన్ని ఊహించలేము. షమ్మీ కపూర్ కి అంత పేరు రావటానికి మొహమ్మద్ రఫీ పాటలే కదా కారణం.
దేశ భక్తి గీతాలు పాడాలంటే మహేంద్ర కపూరే పాడాలి. ఇంకెవరు పాడినా ఆ శక్తి రాదు ఆ పాటలో. ఆయన పాడిన పాటలన్నీ ఒక ఎత్తైతే, మహేంద్ర కపూర్ మహా భారత్ టి వి సీరియల్ కు పాడిన టైటిల్ సాంగ్ ఒక్కటే ఒక ఎత్తు. మరింకేవరన్నా పాడగలరా ఆ పాటను!
రాజ్ కపూర్ కి పాటలు పాడటం రాదు అంటే ప్రేక్షకులు నమ్మలేనంతగా,
ఆ నటుడికి సరిపోయిన అద్భుతమైన గొంతు మన ముఖేష్ ది. ముఖ్యంగా శోకసముద్రంలో మునిగిపోయి పాడే పాటలు, మనసును పిండి పారేస్తూ పాడతారు ఈయన. అందుకనే ఈయన పాడిన పాటలు కొన్ని వినే శక్తి లేదు నాకు.
మరొక విలక్షణమైన గొంతు మన మన్నాడే ది . కొంతమంది నటులకు మాత్రమె సరిపొయ్యే గొంతు ఆయనది. ఆయన గొంతు లో ఉండే సొగసు గమనించి, రాజ్ కపూర్, తానూ ఎంతో ప్రేస్టీజియస్ తీసిన సినిమా मेरे नाम जोकर (మేరె నాం జోకర్ ) సినిమాలో తనకు ఎప్పుడూ పాడే ముఖేష్ తో కాకుండా, ఆ సినిమాకు తలమానికమైన ఒక పాట మన్నాడే చేత పాడించారు.