1, మార్చి 2010, సోమవారం

మనం మరచిన చలం

మీరనుకున్న రచయిత చలం గురంచి కాదు ఇప్పుడు నేను వ్రాసేది. చలం అని ఒక నటుడు ఉండేవాడు అని మనం మరచిపోయినట్టున్నాం. ఎన్నెన్నో చక్కటి సినిమాలలో నటించి, ఆంధ్రా దిలీప్ కుమార్ గా పేరొందిన చలాన్ని చూస్తుంటే లోకం తెలియని మామయ్య గుర్తుకు వస్తాడు. మట్టిలో మాణిక్యం, సత్తెకాలపు సత్తెయ్య వంటి చిత్రాలు ఆయనకీ అటువంటి ముద్రవేసినాయి.

అనేకానేక సినామాలలో నటిస్తూ, తన మార్కు హాస్యాన్ని ఇస్తూ, తాను చెప్పదలుచుకున్న వాటిని సినిమాలుగా తీసి చూపించటానికి చాలా ప్రయత్నాలు చేసి, ఒక్క సినిమా కూడ కలసిరాక హతమారిపోయ్యాడు. సామాన్యంగా సినిమాలో కొంత పేరు, డబ్బు సంపాయించుకున్నాక నిర్మాతగా మారే పొరపాటు అనేక మంది నటులు చేసారు, చేసి చితికిపోయ్యారు. అలనాటి నాగయ్యగారి దగ్గర నుండి చూస్తె నటులు నిర్మాతలుగా మనలేరు (అతి తక్కువ మంది తప్ప), వారికి తగినంత వ్యాపారదృష్టి లేదు అన్న విషయం విశదం అవుతుంది.

చలం సినిమాలలో పాటలు అనేకం ఉన్నాయి. చక్కటి పాటలు చలం సినిమాలకు ఒక ప్రత్యేకత. విలక్షణ నటుడిని గుర్తుకు తెచ్చుకునే విధంగా చిమటా మ్యూజిక్ వెబ్ సైటువారు, చలం పాటలను వినే సౌకర్యం కలుగాచేసారు. కింది లింకు నొక్కి శ్రీ చలం సినిమాలలోని పాటలను హాయిగా వినండి.

చలం సినిమాలలోని పాటలు


4 వ్యాఖ్యలు:

 1. మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవించలేకపొతున్నాను శివ గారు.మీరన్నట్టు మనకున్న అతిచక్కని నటుల్లో చలం ఒకరు.కానీ ఆయన చిత్రాలు కొన్ని చాలా మంచివిజయాలు సాధించాయి,మరికొన్ని మంచిప్రయత్నాలుగా మిగిలాయి.దేవుడమ్మలాంటివి అసలు ఎక్కలేదు.అతని సమకాలీకుల్లో చాలామంది నటులు తీసిన చాలా సినిమాలు దాదాపు ఈతరహా ఫలితాలనే చవిచూశాయి,యన్,టి.ఆర్ తో సహా పలు విఫలచిత్రాలను తీసినవారేగా.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. భలేవారే ప్రసాద్ గారు... మేము అస్సలు మర్చిపోలేదు. చలంగారి సినిమాలు, పాటలు, కుడా... "ఓ బంగారు రంగుల చిలకా... పలకవే"
  "అమ్మ అన్నది ఒక కమ్మని మాట..."
  "మామ.. చందమామ"

  పాటల లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చలం తీసిన సినిమాలు ఒకటో రెండో అంతంత మాత్రపు విజయాలు సాధించి ఉండచ్చు. కాని, ఆయన డబ్బు సంపాయించింది లేదు. వ్యాపార పరంగా దాదాపు అన్ని నష్టాలే చవి చూడాలిసి వచ్చింది పాపం. ఆయనే ఒక సారి ప్రత్యేక జనరంజనిలో అనుకుంటాను (ఆకాశవాణి వారి వివిధభారతిలో) తాను తీసిన తులాభారం తలభారంగా మారిందని వాపొయ్యారు. ఒకదాని తరువాత మరొకటి సినిమాలు తియ్యాలన్న తపన ఆయనకు కలసి రాలేదు. ఆర్ధిక ఇబ్బందులు, ఆ తరువాత భర్యతో విబెధాలు, విడాకులు, ఇలా జీవితం ముళ్ళప్రాయం అయిపోయింది. నా పాయింటు, చలం కనుక సినిమాలు తీద్దామన్న ఆలోచన పెట్టుకోకుండా ఉండి ఉంటే, ఇప్పటికికూడ హాయిగా మన్ని నవ్విస్తూ ఉండేవాడు. చలాన్ని ఎన్ టి ఆర్ తో పోల్చడం ఏమంత న్యాయంకాదు. తీసిన పది సినిమాలు వరుసగా పోయినా ఏమాత్రం తెలియనంత ఆర్థిక స్థోమత ఎన్ టి ఆర్ ది. ఎప్పటికప్పుడు డబ్బులు వెతుక్కుంటూ సినిమాలు తీసిన పధ్ధతి చలానిది.

  ఏది ఏమైనా మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఈ చిన్న వ్యాసం లాంటిది వ్రాయటంలో నా ఉద్దేశ్యం, కొద్ది మందైనా మళ్ళి చలాన్ని ఆయన చక్కటి నటనను, వారు అందించిన హాస్యాన్ని గుర్తు చేసుకోవాలని. పైగా ఆయన సినిమాలలో ఉన్న చక్కటి పాటలను, చిమటా మ్యూజిక్ వారు ఒకేచోట ఇచ్చిన విషయాన్ని మరింత మందికి తెలియ చెప్పాలని. నా ఉద్దేశ్యం కొంతవరకు నెరవేరిందనే అనుకుంటున్నాను,. ఇప్పటికి 60 మందికి పైగా ప్రపంచం నలుమూలలనుండి చూశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. స్వర్ణ మల్లిక! మీరు మరువలేదు కాని, ఈ మధ్య ఎప్పుడైనా చలం గురించి ఎక్కడైనా చదివారా, విన్నారా. లేదు. అందుకనే వ్రాశాను.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.