16, ఏప్రిల్ 2010, శుక్రవారం

దాసరి స్మృతి సంచిక

అనేక రోజుల క్రితం ఎదురు చూడండి దాసరి సుబ్రహ్మణ్యం గారిమీద ప్రత్యెక సంచిక అని ఊరించానే కాని అసలు విషయం చెప్పలేదుకదూ. ఇప్పుడు చెబుతున్నాను, వినండి.

మనకున్న ఏకైక సాహిత్య పత్రిక "రచన". పత్రికను నెలకొల్పి ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఒక ఉద్యమం లాగ ప్రచురిస్తున్న వారు వై, వి ఎస్ ఆర్ ఎస్ తల్ప శాయిగారు, సాహిత్య అభిమానులందరికీ "రచన" శాయిగా సుపరిచితులు.

రచన పత్రిక గురించి వివరాలు చూడాలంటే వారి వెబ్ సైటు చూడాల్సిందే. ఈ కింది లింకు నొక్కండి.

రచన పత్రిక

ఈయన కూడ మన "పాత" చందమామకు ఉన్న అనేకానేక వేల అభిమానులలో ఒకరని మధ్యనే తెలిసింది. ఆయన దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి ప్రత్యెక సంచిక వెబోతున్నట్టుగా నాకు మన "సురేఖ" అప్పారావుగారు ( రేఖా చిత్రం బ్లాగ్) చెప్పారు. అప్పుడు మిమ్మల్ని అందరినీ "ఎదురు చూడండి" అని ఊరిస్తూ ఇదే బ్లాగులో దాసరి వారి బొమ్మాక్షరాలు కూడ జతపరుస్తూ ప్రకటించాను.

కాని
నేను కలలో కూడ అనుకోలేదు, ప్రత్యెక సంచికలో నా సమీక్షా వ్యాసం, మరికొన్ని "చిత్రాలూ" కూడ ప్రచురించబడతాయని.

"
మన తెలుగు చందమామ" రచయితలందరినీ పేరు పేరునా మైళ్ళు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద వ్రాయమని చెప్పారు. అంతకంటే ఆనందం ఏమున్నది, వేయబోతున్న ప్రత్యెక సంచిక మన అభిమాన జానపద కథా బ్రహ్మ, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి. వెనువెంటనే అందరం నడుం బిగించి, మాకు చేతనైనంత వరకూ వ్రాసి పంపాము. ఇలా బ్లాగు రచయితలే కాకుండా మొత్తం ౩౦ మంది అభిమానులు దాసరి వారి గురంచి వ్రాసారుట.

నాకు తెలిసి ఒక రచయితకు నివాళిగా ఒక ప్రత్యెక సంచిక రచయిత అభిమానులు వ్రాసిన రచనలతో నింపి వేయటం ఇదే ప్రధమం అనుకుంటాను.అందుకే ఆనందం. మీ అందరితో పంచుకోవాలని.
షరా మామూలే!! పైనున్న అక్షరాలను "క్లిక్" చేసి చూడండి గమ్మత్తుగా!!

కాబట్టి, ఇక వేచి చూడాల్సిన సమయం ఎంతో లేదు. మరో కొన్ని రోజులేనట , శాయిగారు ఈరోజే మెయిలు ఇచ్చి మరీ హెచ్చరించారు. కాబట్టి..........

త్వరలో ............... అతి త్వరలో..............

మన అభిమాన రచయిత దాసరి సుబ్రహ్మణ్యంగారి ప్రత్యెక సంచిక విడుదల మే రెండవ తారీకుకల్లా టపాలో వేస్తారుట.

అదే!! తగిన పైకం ముందుగా పంపినవారికి మాత్రమె.... మిగిలిన వారు కోట్లల్లో "దొరికితే" కొనుక్కోవలసిందే.... లేకపోతె మిగిలేది ఆశాభంగమే కదా మరి!!!!

వివరాలకు కింది బొమ్మ నొక్కి తెలుసుకోగలరు


7 కామెంట్‌లు:

  1. లేటుగా చూసాను శివరాం గారూ. అప్పుటికే మీరు ఆఫ్ లైన్ లో ఉన్నారు. 8 నెలల తీవ్ర శ్రమ, సేకరణ అన్నీ పోగొట్టుకుని షాక్ లో ఉండటంతో నేనివ్వాళ శాయి గారి ప్రకటనను ప్రచురించలేకపోయాను. మీరు మంచి పనిచేసారు. చందమామ బ్లాగు ఇక చరిత్రలో కలిసిపోయినట్లే. కనీసం దాంట్లోని సగం ఆర్టికల్స్ కూడా మళ్లీ దొరుకుతాయని ఆశలేదు. ఎందుకంటే ఎలెక్ట్రానిక్ రూపంలో ఉన్నాయి కదా ఇక సిస్టమ్‌లో ఎందుకులే అని నా కథనాలు, సేకరణ విషయాలను క్రమానుగతంగా భద్రపర్చటంలో నిర్లక్ష్యం చేశాను. కాని బ్లాగు.కామ్ వారు ఇంత పని చేస్తారని అనుకోలేదు. ఏదీ శాశ్వతం కాదని తెలుసు. కానీ 8 నెలల కష్టం ఒకే ఒక క్షణంలో కళ్లముందే మాయమవుతుందని కల్లో కూడా అనుకోలేదు. మీరు మొదట్లో చేసినట్లుగా నా బ్లాగ్ మొత్తాన్ని అప్పుడప్పడూ మీరే బ్యాకప్ తీసిపెట్టి ఉంటే బాగుండేది. మీరు మనతెలుగు చందమామలో తిరిగి ప్రచురించిన నా కథనాలు మినహా చందమామ బ్లాగు కథనాలు చరిత్రలో కలిసిపోయినట్లే. నాకు చాలా బాధగా ఉంది. ఎంత ఘోరమైన సంస్థ బ్లాగ్ సైట్‌లో నేను బ్లాగ్ రూపొందించుకున్నానా అని ఇప్పుడనిపిస్తోంది. పోనివ్వండి జీవితంలో ఇదీ ఓక చేదు అనుబవం అనుకుంటాను. తీవ్రమైన వేదనలో ఉండి మీకు ఈ సమాచారం పంపుతున్నాను. ఏమీ అనుకోకండి.

    రిప్లయితొలగించండి
  2. చందమామ గారు,
    పైన శివగారు ఇచ్చిన మంచిసమాచారాన్ని ఆస్వాదించేలోపు కింద మీ వ్యాఖ్య చదివి కడుపురగిలిపోయింది,సదరు బ్లాగు డాట్ కాం వాడిమీద,మీరు పోగొట్టుకున్న సమాచారాన్ని తిరిగిపొందే అవకాశమే లేదంటారా?
    మీ బ్లాగులో కామెంట్లు రాసానో లేదో నాకు గుర్తులేదు కానీ క్రమంగా చదివేవాడిని.ఈ విషయాన్ని తెలుగుబ్లాగర్ల గుంపులో కూడా పోస్టుచేసి అక్కడ మనవాళ్లందరి సలహాలు,సూచనలూ తీసుకుందాం.మీకు జరిగిన దారుణమైన అన్యాయం భవిష్యత్తులో మరెవరికీ జరగకుండా ఊండే విధంగా చర్యలు తీసుకోవాలి మనం.

    రిప్లయితొలగించండి
  3. జరిగిన షయం ఏమంటే, రాజుగారు నిర్వహించే "చందమామ చరిత్ర" బ్లాగు హఠాత్తుగా కనపడటం మానేసింది. ఈ వ్యాఖ్య చదివిన మిత్రులు, దయచేసి మీకు వర్డ్ ప్రెస్స్ విధానలు తెలిసి ఉంటె, ఇలా ఎందుకు జరిగిందో తెలుపగలరు.

    రాజుగారూ, విచారించకండి. జరిగిపోయినదాన్ని మనం ఏమీ చెయ్యలేం. మీ "చందమామలు" బ్లాగు చందమామ చరిత్రకు దర్పణంగా ఉండి మాలాంటి అభిమానులకు ఎన్నో విషయాలు తెలియచేసింది. మీరు వెంటనే వర్డ్ ప్రెస్స్ వాళ్ళకి ఒక మైలు ఇవ్వండి. ఇలా ఎందుకు జరిగిందో. పూర్తి వివరాలు పొందు పరచండి. నెను ఇక్కడ ఒక ప్రత్యేక వ్యాసంగా ప్రచురిస్తాను, మన తోటి బ్లాగర్లందరినీ కూడ కోరదాము వాళ్ళు కూడ ఈ వర్డ్.కాం వాళ్ళకు మైలు ఇచ్చి మీ బ్లాగును పునరుద్ధరించమని. ఎందుకంటె ఇవ్వాళ మీ బ్లాగుకు అయ్యింది రేపు మరొకరికి అవ్వచ్చు. ఇంత కష్టపడి తయారు చేసుకున్న బ్లాగు మాయమైపోతే ఎవరికైనా బాధే కదా. నేను అనుకోవటం, బ్లాగ్.కాం వాళ్ళకి కూడ బాక్ అప్ ఉండే ఉంటుంది, ఆ బాకప్ నుండి మీ బ్లాగు ఫైళ్ళను బయటకు లాగి మీకు పంపమని అడుగుదాం. ముందు వాళ్ళకు తక్షణమే మైలు పంపండి, నాకు కాపీ పంపండి. ఈలోగా నెట్లో ఇలా జరిగితే ఏమి చెయ్యాలి అన్న విషయానికి ఎమన్నా క్లూ ఉందేమో చూస్తాను .

    రిప్లయితొలగించండి
  4. పై వాఖ్యలు చూశాక నాదో సందేహం.
    బ్లాగు కనపడకుండా పోయింది బ్లాగు.కామ్ నుంచా లేదా వర్డ్‌ప్రెస్.కాం నుంచా?
    ఒక వేళ వర్డ్‌ప్రెస్.కాం లో అయితే చెప్పండి నేను కూడా నా టపాలు భద్రపరుచుకుంటాను.

    రిప్లయితొలగించండి
  5. ఇంతకు మునుపు వ్యాఖ్య రాసేసినాక ప్రయత్నించాను. ఇది వర్డ్‌ప్రెస్.కాం వాళ్ళ సమస్య కాదు. వర్డ్‌ప్రెస్ వాళ్ళు బ్లాగులు/వెబ్‌సైటులు సృష్టించడానికి ఒక సాఫ్ట్‌వేర్ ప్యాకేజీని విడుదల చేస్తారు. దాన్ని వర్డ్‌ప్రెస్.ఆర్గ్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్లాగు.కాం వాళ్ళు ఇలాంటి సాఫ్ట్‌వేర్ ను తీసుకుని బ్లాగు.కాం సృష్టించుకున్నారు. ఇప్పుడు సమస్య కేవలం చందమామ చరిత్ర బ్లాగుదే కాదు. మొత్తం బ్లాగు.కాం సైటే పనిచేయడం లేదు. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైటు అడ్మినిస్ట్రేషన్ సరిగా తెలియనివారు పొరపాటున డెలీట్ దిస్ బ్లాగ్ లాంటి కమాండ్స్ రన్ చేయడం వల్ల ఏదో సమస్య వచ్చినట్లుంది.
    కానీ ఒక్కోసారి ఏదైనా కాన్ఫిగరేషన్ సమస్య వల్ల కూడా ఇలాంటి సమస్య రావచ్చు. డేటాబేస్ లో ఉంటే మాత్రం కొన్ని స్క్రిప్ట్ ల ద్వారా కంటెంటును తిరిగి పొందవచ్చు.
    ఏమైనా బ్లాగు.కాం వాళ్ళు సమస్య ఎక్కడుందో చెబితే దాన్ని బట్టి మిగతా ప్రయత్నాలు చేద్దాం. సాధ్యమైనంతవరకు రాజు గారి కంటెంటు తిరిగి దొరుకుతుందనే ఆశిస్తున్నా. ఎందుకంటే డెలీట్ అయిపోయిన కంటెంటును తిరిగి తీసుకువచ్చే ఎన్నో ఉపకరణాలు మనకు అందుబాటులో ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  6. Internetలో వున్న చాలా website pagesని goole వారు cache చేస్తారు (అంటే వారి local machinesలో store చేస్తారు). ఆ cache నుంచి కొన్ని పేజీలు రాబట్టవచ్చు.
    http://blaagu.com/chandamamalu లో
    నావల్ల ఏ పనీ ఆగకూడదు: చందమామ శంకర్
    April 12th, 2010 టపా రాబట్టగలిగాను.

    రిప్లయితొలగించండి
  7. గత రెండురోజులుగా నా -చందమామ- బ్లాగు కనిపించకుండా పోయిందన్న వార్తపై స్పందనలకు, పరామర్శలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చందమామ బ్లాగు పోయిందనే వార్త వినగానే స్పందించిన వారు శివరాంగారు. మనతెలుగుచందమామ బ్లాగులో నా వ్యాఖ్య చదివి బ్లాగు.కాం వారిని సంప్రదించి, తెలుగు బ్లాగర్ల సముదాయంలో ఈ వార్త పెట్టి నా బ్లాగు సురక్షితంగా ఉందనే వార్తను బ్లాగు.కాం జాలయ్య గారి ద్వారా వినిపించిన వారు ఇనగంటి రవిచంద్రగారు. విషయం తెలియగానే ప్రయత్నించి Google cache నుంచి నా బ్లాగ్ సమాచారాన్ని -బొమ్మలు మినహా- పైళ్ల రూపంలో రాబట్టి పంపిన విజయ్ వర్థన్ గారు, అమెరికా నుంచి ఫోన్ చేసి మరీ బ్లాగు.కాం వారికి ఈ విషయం తెలియజేసి వారినుంచి సమాచారం అందించిన పెద్దలు సీబీరావు గారు.. సహానుభూతి తెలుపుతూ సత్వర స్పందనలు పంపిన సర్వశ్రీ రాజేంద్ర కుమార్, సుజాత, వంశీ, జెబీ గార్లకు అందరికీ కృతజ్ఞతలు. డేటాను భద్రపర్చుకోవడంలో నా తాత్సారానికి గాను మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు గాను క్షమాపణలు.
    రాజు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.