22, అక్టోబర్ 2010, శుక్రవారం

పురాణం సీత ఇక లేరు


పురాణం సీతగారి ఫోటో కర్టెసీ ఆంధ్ర ప్రభ
(పై లింకు నొక్కి ఆంధ్ర ప్రభ వారు ప్రచు రిం చిన కథనం కూడ చదువ వచ్చు)

పురాణం సీతగారు ఇక లేరన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. పురాణం సీత గారు శ్రీ రవీంద్రనాథ్ టాగోర్ Where the Mind is without Fear పద్యానికి పారడీగా ఒక ప్రార్ధనా పాట వ్రాశారు. అది ఎక్కడన్నా దొరుకుతుందేమో అని వెతుకుతుంటే, ఆవిడ మరణ వార్త ఆంధ్ర ప్రభ దిన పత్రిక వారు ఆమె ఫొటోతో సహా ప్రచురించినది కంటబడింది. చాలా బాధ కలిగింది.

ఇల్లాలి ముచ్చట్లు ఆవిడ వ్రాసినవి కావు, ప్రముఖ రచయిత, అంతకంటె ప్రముఖ సంపాదకుడు, మరంతకంటే ఆవిడ పేరుతోనే గొప్ప పేరు సంపాయించిన ఆవిడ భర్తగారైన శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారని తెలిసినా కూడ, బాధ బాధే. సీత గారు ఎంతటి స్పూర్తినివ్వకపోతే అచ్చం ఆడవాళ్ళు వ్రాసినట్టుగా సుబ్రహ్మణ్యం శర్మగారు ఇల్లాలి ముచ్చట్లు అంతకాల గుట్టుగా వ్రాయగలిగి ఉంటారు.
ఇల్లాలి ముచ్చట్లు ఒక సాహిత్య ప్రక్రియ.

తెలుగులో అంతగా ప్రాచుర్యం కాని స్వగతం లాంటి వ్యాసాలు. ఎప్పుడూ ఉత్తమ పురుష (స్త్రీ!) లోనే ఉంటాయి. (నేను వ్రాసినది సరిగ్గానే ఉన్నదా నా ఉద్దేశ్యం First Person అని) వైవిధ్యమైన ఈ ప్రక్రియను ఎంతగానో ప్రాచుర్యంలోకి తెచ్చి, లోకంలో ఉండే సమస్త విషయాల గురించి వ్రాసినవాళ్ళు లేరు. అటువంటి పత్రికా శీర్షికా లేదు.

పురాణం సీతగారి ఆత్మకు శాంతి కలగాలని నా ప్రార్ధన

================================================
మునుపు ఇదే బ్లాగులో "ఇల్లాలి ముచ్చట్లు గురించి వ్రాసిన వ్యాసాన్ని ఈ కింది లింకు ద్వారా చదువుకో వచ్చు

ఇల్లాలి ముచ్చట్లు
================================================
*

6 వ్యాఖ్యలు:

 1. శివగారూ!
  మీరు ఇల్లాలు ముచ్చట్లు గురించి ఇచ్చిన లింక్ ద్వారా చూసాను. చాలా బాగున్నాయి వారి వాక్బాణాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివరామప్రసాద్ గారికి
  పురాణం సీత గారు స్వయానా రచయిత్రి కాకపోయినా తెలుగుభాషకు గుర్తింపు తెచ్చిన ఒక సాహిత్య ప్రక్రియకు ఆమె సాక్షీభూతురాలు. లోగడ ఆంద్ర జ్యోతిలో పురాణం సుబ్రమణ్య శర్మగారు వార పత్రిక సంపాదకులుగా వున్నప్పుడు కొంతకాలం ఆయన సహచరుడిగా పనిచేసాను. ఆలస్యంగా తెలిసిన వార్త కాబట్టి వారి కుటుంబానికి ఆలస్యంగానే సంతాపం తెలుపుకుంటున్నాను. – భండారు శ్రీనివాసరావు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అయ్యో అవునా ?
  వారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను .

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.