8, జనవరి 2011, శనివారం

రాగతి పండరి గారికి "కళారత్న" అవార్డ్

తెలుగు నాట పత్రికలూ చదువుతూ మంచి కార్టూన్లను చూసి ఆనందించే వారందరికీ పరిచయమైనా సంతకం పైనున్న రాగతి పండరి గారి సంతకం . ఆవిడకు "కళారత్న" బహుమతి ప్రదానానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ఎన్నిక చేసిన సందర్భంగా ప్రత్యెక వ్యాసం ,

రెండురోజుల క్రిత్రం నాకు జయదేవ్ గారి దగ్గర నుండి వచ్చిన SMS సందేశం విధంగా ఉన్నది:

"రాగతి పండరి గారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం "కళారత్న" బహుమతి ప్రదానం చేయనున్నది"

వెను వెంటనే జయదేవ్ గారికి ఫోన్ చేసాను. శిష్యులు పైకి వస్తుంటే గురువుగారు అనుభవించే ఆనందమంతా ఆయన గొంతులో వినపడింది . రాగతి పండరి గారు విశాఖపట్టణం వాస్తవ్యులు, మన పత్రికా రంగంలో ప్రస్తుతం ఉన్న (నాకు తెలిసి) ఏకైక మహిళా కార్టూనిష్టు . జయదేవ్ గారు మద్రాస్ నివాసి జగమెరిగిన కార్టూనిస్ట్. బొమ్మలు వేసే కొత్తల్లో, రాగతి పండరి గారు జయదేవ్ గారి శైలికి ఏకలవ్య శిష్యురాలు.

ఆవిడ కార్టూన్లు అన్నీ కూడా చూడటానికి కుదురుగా, చక్కటి బొమ్మలతో, ఎంతో అర్ధవంతమైన సంభాషణలతో మనకు హాస్యాన్ని అందించటమేకాక, అనేక సార్లు చురుక్కు మనే వ్యంగ్యం కూడా ఉంటుంది. అటువంటి చక్కటి వ్యంగ్య చిత్రకారిణికి బహుమతి ప్రదానం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు తమ బహుమతికే గౌరవం తెచ్చి పెట్టుకున్నారు.
సందర్భంగా రాగతి పండరి గారికి మన:పూర్వక అభినందనలు. ఆవిడ మరెన్నో కార్టూన్లు వేసి ఇంకా పెద్దపెద్ద అవార్డులు గెలుచుకోవాలని కోరుతున్నాను.

హాలీవుడ్ వారు కార్టూన్ సినిమాలను అనేకం అద్భుతంగా తీసి, వాటిల్లో అక్కడి మేటి నటీ నటుల చేత డబ్బింగు చెప్పించే చక్కటి ఒరవడి ఏర్పరిచారు. ఇక్కడ దాదాపు సంక్షోభంలో పడి హిట్లు లేక కొట్టుకుంటున్న మన సినిమా వారు కూడా నటన/భాష వచ్చీ రాని ఈ హీరో హీరోయిన్లను వదిలి చక్కటి కార్టూన్ సినిమాలు ఏనిమేషన్ ప్రక్రియతో, మనకున్న అద్భుత కార్టూనిస్టులందరి సహకారంతో చక్కటి పాత్రలు గీయించి సినిమాలుగా తీస్తారని ఆశిద్దాం.

బాపు, జయదేవ్, బాబు, రాగతి పండరి, రామకృష్ణ, సత్యమూర్తి, కె,. తులసీ రాం, "సురేఖ" అప్పారావు గార్లందరినీ ఒకచోటకు చేర్చి, మన రామానాయుడుగారో లేకపోతే రామోజీగారో పూనుకుని మంచి ఏనిమేషన్ సినిమాని తీయిస్తే, అందులో పాత్రలకు చిరంజీవి, మహేష్ బాబు, చంద్రమోహన్, సునీల్, బ్రహ్మానందం, ఏమ్వీస్ నారాయణ, రవితేజ, జగపతి బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి నటులు తమ గొంతులు అందిస్తే, అద్భుతమైన సినిమాలను మనం, చూడవచ్చు. ఇటువంటి ఆశ అతి దగ్గరలో తీరాలని, దురాశ కాకూడని కోరుకుంటున్నాను


మరొక్కసారి రాగతి పండరి గారికి అభినందనలు.

ఆవిడ గీసిన మొట్టమొదటి కార్టూన్ చూడండి.

నేను మునుపు ఆవిడ గురించి వ్రాసిన వ్యాసాన్ని ఈ కింది లింకు నొక్కి చదువోవచ్చు.

రాగతి పండరి
బాపు గారు రాగతి పండరి గారికి ఇచ్చిన కితాబు


*
**
***
****
*****
****
***
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*


5 కామెంట్‌లు:

  1. హృదయపూర్వక అభినందనలు
    రాగతి పండరి గారికి...

    రిప్లయితొలగించండి
  2. రాగతి పండరి గారికి అభినందనలు.

    శివగారు, రాగతి పండరి ఆత్మకథ "నా గురించి నేను" పుస్తకం ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పండి.

    రిప్లయితొలగించండి
  3. శిష్యులు పైకి వస్తుంటే గురువుగారు అనుభవించే ఆనందమంతా ఆయన గొంతులో వినపడింది.......
    జయ దేవ్ కార్టూనుల అభిమానిని.
    పరమేశుని గంగా ధారల నుండి చేపలు కూడ పడుతూ...... _ జయదేవ్ గారిగో/బుజ్జాయి గారిదో...
    ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఉండిన కార్టూను.
    The only WOMAN Cartoonist, Ragati, I like her cartoons very much.
    రాగతి పండరి గారికి congratulations.
    మంచి వ్యాసం రు.Thank you!
    సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
    జయ దేవ్ కార్టూను అభిమానిని.
    పరమేశుని గంగా ధారల నుండి చేపలు కూడ పడుతూ...... _ జయదేవ్ గారిదో/
    బుజ్జాయి గారిదో...
    ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఉండిన కార్టూను.
    Very Humourist Cartoonist
    రాగతి పండరి గారికి కంగ్రాచ్యులేషన్స్ !

    రిప్లయితొలగించండి
  5. రాగతి పండరితో ముఖాముఖి ఇక్కడ చూడొచ్చు....

    http://arunapappu.wordpress.com/2011/02/01/%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%82%E0%B0%A1%E0%B0%B0%E0%B0%BF/

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.