12, జూన్ 2011, ఆదివారం

వపాగారు వేసిన చిత్రా చిత్రం

అపురూప చిత్రకారుడు శ్రీ చిత్రా
తెలుగు చందమామకు అంత పేరు తెచ్చిపెట్టినది ఎవరు? కథా రచయితలా, సంపాదకులా, చిత్రకారులా. మనం మంచి తనంగా, "అందరూ" అని అన్నాకూడా, నిజానికి కొత్తవారిని ఆకర్షించి చందమామను చూసేట్టుగా చేసినది మొదట పుస్తకంలోని బొమ్మలే కదా. చూడటం అంటూ జరిగితే కదా పుస్తకంలో ఏమున్నది అని తరచి చూసేది. అసలు పుస్తకానికి బాహ్య రూపం బొమ్మలే.

తెలుగు చందమామ స్వర్ణ యుగంలో అద్భుత చిత్రకారులు వడ్డాది పాపయ్య గారు అట్ట మీద బొమ్మ, చివరి అట్ట మీద బొమ్మ, లోపల కొన్ని ధారావాహికలకు బొమ్మలు వేస్తె, లోపల ఉన్న ముఖ్య ధారావాహికకు బొమ్మలు వేసి ప్రాణం పోసేది "చిత్రా" గా పేరొందిన శ్రీ టి వి వీర రాఘవులు గారు . ఆయన గురించి ఇంటర్నెట్ లో వ్రాయబడిన మొట్టమొదటి వ్యాసం కింది లింకు నొక్కి చూడవచ్చుఇప్పటికి కూడా చందమామ పేరుతొ బతుకీడుస్తున్న పత్రికలో బొమ్మలు వేస్తున్న శంకర్ గారు పురాణ పాత్రలకు ప్రాణం పోసేవారు.

ఒకే పత్రికలో పనిచేస్తున్న ముగ్గురు అద్భుత చిత్రకారులు పోటాపోటీగా బొమ్మలు వేసి పిల్లలను పెద్దలను అలరించి, కొడవటిగంటి సంపాదకీయంలో వచ్చిన కథలకు ప్రాణం పోసి దశాబ్దాలపాటు పిల్లల మానసిక పరిణతికి పాటుపడినది అలనాటి చందమామ.

చిత్రాగారు ముందుగా వెళ్ళిపోయారు, చందమామలో ధారావాహికల వన్నె తగ్గిపోయింది. మళ్ళి పాత దారావాహికలనే మళ్ళి మళ్ళి వేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. చిత్రా వంటి చిత్రకారుడు చందమామకు దొరకనేలేదు.


అలా అందరికంటే ముందుగా వెళ్ళిపోయినా తోటి చిత్రకారుడు శ్రీ చిత్రా గారి బొమ్మను వడ్డాది పాపయ్య గారు  చిత్రించి యువ పత్రికలో అట్ట మీద ప్రచురింపచేసారు అన్న విషయం మధ్యవరకూ తెలియదు . చందమామ అభిమానులందరినీ అలరించే అద్భుతాన్ని చూడండి .

వపా వేసిన చిత్రా చిత్రం
పై చిత్రం సేకరణ శ్రీ సత్యం, మనకు అందించిన వారు శ్రీ శ్యాం నారాయణ
తాను వేసిన తోటి చిత్రకారుని బొమ్మకు  చక్కటి వ్యాఖ్య వ్రాశారు శ్రీ వపా. పిన్నలకూ పెద్దలకూ "ఇష్టంగా " బొమ్మలను "చదవడం " నేర్పిన చిత్రాగారు. నిజమే, చిత్రాగారి బొమ్మలు చూస్తే చాలు, కథ చదవాల్సిన పనే లేదు. కథ మొత్తం అర్ధం అయిపోతుంది మరి.
చిత్రాగారి మరికొన్ని అరుదైన చిత్రాలు

కుడిపక్కన శ్రీ చిత్రా,  మధ్యలో ఆయన  తోటి చిత్రకారుడు శ్రీ శంకర్ గారు,   పూర్తిగా ఎడమపక్కన మూడవ వ్యక్తీ ఎవరో  తెలియదు   
చిత్రాగారి క్లోజప్
 చిత్రాగారు చందమామ సిబ్బందితో కూర్చున్న వారిలో చిత్రాగారి పక్క శ్రీ ముద్దా విశ్వనాథం గారు అనుకుంటాను 
చందమామ అపురూప చిత్రకారులు శ్రీ శంకర్, శ్రీ చిత్రా
పైనున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను మనకు అందచేసిన వారు శ్రీ రాజశేఖర రాజు


 

5 వ్యాఖ్యలు:

 1. My elder brother Mr. Ramachandra Rao used to go out with M/s Chitra and Sankar but he is not in the above photo.
  Rohiniprasad

  ప్రత్యుత్తరంతొలగించు
 2. స్పర్థయా వర్ధతే విద్యా.. అన్నారు. ముగ్గురు సమకాలీన కళాకారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుండడంతోనే చందమామ చదువరులకందరికీ ప్రతీ సంచికా కన్నులపండుగే అయింది. పోటీ తోపాటూ ఎంతటి సౌభ్రాతృత్వం ఉండేదో చూపే నిదర్శనమే ఈ వపాగారి 'చిత్ర'ము. ఇలాంటి అపురూప చిత్రాన్ని అందించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అలాగే బాగ్రౌండ్ లో వేసిన చిన్నవృత్తాలు, వాటి పైన నిలువుగా గీసిన కోలగా వున్న రెండేసి దీర్ఘ వృత్తాలు..చందమామ లోగో లోని కుందేళ్ళ ముఖాలను తలపిస్తున్నాయి (abstract గా). వపా గారు అవి అదే ఉద్దేశంతో గీసారో లేక మరేమైనా అంతరార్ధం వుందో..!!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చిత్రా గారి రూప చిత్రాన్ని వపా గారు చక్కగా, అర్థవంతమైన నేపథ్యంతో వేశారు. ఈ బొమ్మ చిత్రా గారు సజీవంగా ఉన్నపుడు వేసిందో, చనిపోయాక వేసిందో.. ఆ సమాచారం కూడా శ్యామ్ నారాయణ గారూ, సత్యం గారూ అందజేస్తే బాగుంటుంది. (ఈ ‘యువ’ సంచిక నెల, సంవత్సరాన్ని బట్టి దీన్ని తేలిగ్గానే తెలుసుకోవచ్చు.)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @Venu, I think it was drawn by Shri Vapa in commemoration of Shri Chitra after he passed away. I do not think Vapa would have drawn picture of Chitra when he was alive with such caption.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.