22, ఏప్రిల్ 2012, ఆదివారం

టి వి కట్ చేస్తే కరెంట్ కట్టెందుకు !





ఎక్కడ చూడండి, ఎప్పుడు చూడండి, టి వి మోగుతూనే ఉంటుంది. ఎవరింట్లో చూసినా, ఎప్పుడు వెళ్ళినా టి వి ఒక పక్కన మోగుతూ ఉండాల్సిందే. పొద్దున్నే వచ్చే రకరకాల గడ్డపాళ్ళ భక్తీ కార్యక్రమాల నుంచి రాత్రి వంటి గంటవరకూ కరెంట్ లాగేస్తూ టివి ల గోల చెలరేగుతూనే  ఉంటుంది. 

సరే, కరెంట్ ఉన్నది వాడుకుంటున్నాం  అనుకుంటే బాగానే ఉన్నది.  కాని కరెంట్ లేనప్పుడు కూడా ఎందుకు ఈ టి వి గోల. నా ఉద్దేశ్యంలో ఏ రాష్ట్రంలో కరెంట్ కొరత ఎక్కువగా ఉన్నదో అక్కడ టి వి ప్రసారాలను నియంత్రించాల్సిన  పని ఉన్నది. పొద్దున్న ఆరు గంటలనుంచి ఎనిమిది గంటల వరకూ, ఆ తరువాత రాత్రి ఏడు గంటల నుంచి పదకొండు గంటలవరకే టి వి ప్రసారాలు చెయ్యాలని కఠినంగా అమలు చెయ్యగలిగితే, కనీసం కరెంటు కొరత ఎక్కువగా ఉండే వేసవి రెండు మూడు నెలలు, అనవసరపు కరెంట్ దుబారా తగ్గి కరెంట్ కట్ చెయ్యాల్సిన పని ఉండదు. సామజిక న్యాయం అంటూ ఎలుగెత్తి క్షణక్షణం గుర్తుచేసే చానెళ్ళు కూడా ఈ కరెంట్ కట్ దృష్టిలో పెట్టుకుని తమ ప్రసారాలను రోజల్లా కాకుండా (ఎలాగూ అసలు కార్యక్రమం ఆరు గంటలు మిగిలిన టైం అంతా అదే అదే వెయ్యటమే కదా!) రోజులో కొన్ని గంటలు మాత్రమే చేస్తే ప్రజలను కొంత వరకైనా కరెంట్ కట్ నుంచి కాపాడిన వారవుతారు.

 ఆ తరువాత, పెద్ద పెద్ద మాల్స్, బట్టల కొట్లకు కరెంటు సరఫరా ఇవ్వటం మానెయ్యాలి. వాళ్ళు, తప్పనిసరిగా సోలార్ పవర్ ను వినియోగించేలా చెయ్యాలి. దీనివల్ల, ఎంతో కరెంటు ఆదా. మనకు సూర్య రశ్మికి ఏ మాత్రం కరువు లేదుకదా.  

మునిసిపాలిటీలు వీధి దీపాలు మొత్తం సోలార్ దీపాలనే వాడాలి. 
మన రాష్ట్రం మొత్తం సంవత్సరంలో ఎప్పుడైనా సరే సూర్యరశ్మి కి లోటు లేదు కదా. కాబట్టి ప్రజలు ప్రభుత్వం సోలార్ పవర్ ను ఆశ్రయించే పద్ధతులను అమలుపరచటం మొదలుపెడితే, కరెంట్ కట్టే కట్ అయిపోతుంది.



మరొక విషయమేమంటే, ఇప్పుడు శాంతి భద్రతలు కూడా సరిగా లేవు.  మా చిన్నాప్పుడు, ఎండాకాలం వచ్చిందంటే అందరం ఆరుబయట హాయిగా పడుకొనేవాళ్ళము....దానివలన పెద్దగా కరెంటు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు కూడా అలా బయట ధైర్యంగా పడుకొనే పరిస్థితులు  ఉంటే  ఎంతోకొంత కరెంటుని  ఆదా చెయ్యవచ్చును.     


                       
                                                                      

3 కామెంట్‌లు:

  1. మంచి ఆలోచన, కానీ సాధ్యం అవుతుందా!? వీధి దీపాలు పట్టపగలు కూడా వెలిగించే విద్యుత్ సేవలు ఉన్న నిర్లక్ష్య సిబ్బంది ఉన్న కాలం ఇది. ఒకవేళ వాళ్ళ భాద్యత లు గుర్తుచేసినా కోపమే!

    ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వాలకు పడతాయా..అండీ! రోజుకు ఎనిమిది గంటల కరంటు కోత.. లో ఇలాంటి ఆలోచనలు ఆచరణ లోకి వస్తే చాలా బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కానీ సాధ్యం అవుతుందా!?"

      సాధ్యాసాధ్యాల గురించి బేరీజు వేస్తూ మనకు వచ్చే మంచి ఆలోచనలను తుంచేసుకోకూడదని నా అభిప్రాయం. చెప్పగా చెప్పగా వినవచ్చు అన్న ఆశావాదం నాది.

      తొలగించండి
  2. ఎవరో ఒకరూ ఎపుడో అపుడూ నడవరా ముందుగా ! మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి !!
    ప్రసాద్ గారూ! మంచి సూచనలు చేశారు. అయితే ఇవి కేవలం విద్యుత్ ఆదానే కాదు .
    కాలుష్యాన్ని ముఖ్యం గా మానసిక కాలుష్యాన్ని చాలావరకూ తగ్గిస్తుంది.
    ముఖ్యం గా సోలార్ దీపాల వాడకం మంచి సూచన ఇది ఎక్కడైనా ప్రభుత్వాలు దృష్టిపెడితే సాధ్యం కానిదేమీ కాదు.
    గతం లో టీ.వీ ప్రోగ్రాం వాళ్లకి మీరు చేసిన సూచన కూడా అలాగే మిగిలి ఉంది. కానీ చాలామందిని ఆలోచింపజేసింది.
    మీరు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే మరిన్ని పోస్టులు వ్రాయాలని కోరుతూ, మీరు సూచించిన విలువైన సూచనలు గురించి అందరూ ఆలోచించాలని ఆచరణకు ప్రభుత్వం పూనుకోవాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.