17, మే 2014, శనివారం

మోడీకి ముందు మోడీకి తరువాత



గుజరాత్ ముఖ్యమంత్రి అనుకున్నట్టుగానే అద్భుతం సాధించారు. ఇంతవరకూ ఏ రాజకీయ నాయకుడూ దేశం మొత్తం మీద చెయ్యలేని పని, ప్రజాస్వామ్యయుతంగా తన పార్టీకి అద్భుతమైన మెజారిటీ సాధించి చూపించారు.

స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ కాని ఒక పార్టీ,  పూర్తి  మెజారిటీ సాధించట ఒక అద్భుత విషయం. కాంగ్రెస్ కాని, కాంగ్రెస్ తో కలిపిన పిలకలు కానీ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించినాయి. 

జనతా పార్టీ 1977 లో వచ్చినా అది నాలుగు పార్టీల సంకీర్ణమే! పైగా ప్రధాని ఒకప్పటి కాగ్రెస్ పార్టీకి చెందినవారే. వాజపేయ్ గారు పాపం కప్పల తక్కెడ సంకీర్ణంతో  సతమతం అవుతూ ఐదేళ్ళు పాలించి, ఇటు జయలలిత అటు మమత మధ్య నలిగిపోయి, ఆల్ జైమర్స్ వ్యాధి బారిన పడిపొయ్యారు కాని కాంగ్రెస్ కాని ప్రభుత్వం అనుకునే వీలు కలుగలేదు. 

ఇప్పటికి, దేశానికి స్వతంత్రం వచ్చిన 67 సంవత్సరాల తరువాత కాంగ్రెస్ కాని అసలు సిసలైన నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత కాలానికి కాని మన ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ మాయ నుంచి తెరుకోవటం కుదరలేదు. ఏమయితేనేమి ఒక నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిమీదా ఆధార పడకుండా తనంత తాను పరిపాలించ గల సత్తా సాధించుకోవటం సంతోషకరమైన విషయం.

ఈ విషయంలో ముందుగా అభినందనలు తెలియచేయ్యాల్సినది సోదర భారతీయులందరికీ. 2014ఎన్నికల్లో భారతీయ ఓటర్లు చూపించిన సమయోచిత (Presence of Mind) అద్భుతమైనది. 

**********************************

DEAR INDIANS, You have performed a great fete effortlessly, in voting "Right" this time and eradicated the nuisance of coalation Governments. Great!

CONGRATULATIONS TO THE INDIAN MIGHTY VOTERS AND NARENDRA MODI. 

I am sure, post independence History of India has to be written as "Before Narendra Modi" and "After Narendra Modi",  even by those fake commi historians. Another great matter is Communists got barely 2% above NOTA(None of the above) vote share of 1.59%. This is also a notable feature of this Election.

Let's hope Narendra Modi lives up to the expectations and the confidence reposed by the people across the Country.

**********************************












4 కామెంట్‌లు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.