4, అక్టోబర్ 2010, సోమవారం

బజారు పూజలు

వినాయక చవితి జరిపేసుకున్నాము. నిమజ్జనం గొడవలు లెకుండా జరిగిపోయింది. అంతే అదే గొప్ప మనకు. కాని, నిమజ్జనం, తరువాత విగ్రహాలు పడి ఉన్న తీరు తెన్నులు, కొన్ని రోజులు భక్తితో పూజలు చేసి చివరకు, నిమజ్జనం పేరుతొఎక్కడో ఒక చోట పారేసి రావటం, ఆ విగ్రహాల మీదకు అలంకరణ పేరుతొ ఎక్కి తొక్కి, నానా అసహ్యం చేసి, అదే విగ్రహానికి పూజలు, అరకొరగా నిమజ్జనం. ఇదీ బజారు భక్తుల ఆగడాలు. బజారు పూజల గురించి వాటిల్లో జరిగే అపభ్రంశపు పనుల గురించి వ్రాద్దాం అనుకుంటున్నాను. కాని నాకు శ్రమ తగ్గించి, శ్రీ కస్తూరి మురళీ కృష్ణగారు మనందరి మనసుల్లోకి తొంగి చూశారా అన్నట్టుగా చక్కగా ఒక వ్యాసం వ్రాసారు. కింది లింకు నొక్కిచదవండి.

వినాయక నిమజ్జనం


వ్యాసాన్ని రాతలు కోతలు బ్లాగులో చూసి వెంటనే లింకు ఇస్తున్నాను.

ధన్యవాదాలు కస్తూరి మురళీ కృష్ణగారూ. మంచి వ్యాసం వ్రాశారు.

మనకు అనేక మఠాలు, పీఠాలు వాటికి ఎంతో జ్ఞాన సంపన్నులైన మఠాధిపతులు , పీఠాధిపతులు ఉన్నారు . కాని ఏమి లాభం, హిందూ సమాజాన్ని చైతన్యపరిచి, వారిని సవ్యమైన రీతిలో నడిచేట్టుగా చెయ్యటంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఇప్పటికైనా, రాబొయ్యే రోజులలో పూజలు, తీరు తెన్నులు, వీటి గురించి ప్రజలకు తెలియచెప్పి "బజారు పూజల" తంతు తగ్గించి మనుషుల్లో తంతు మీద కాకుండా భక్తిమీద మనసు పెట్టె విధంగా పాఠాలు నేర్ప గలరని ఆశిద్దాం

1 వ్యాఖ్య:

  1. @రాబొయ్యే రోజులలో ...తంతు మీద కాకుండా భక్తిమీద మనసు పెట్టె విధంగా పాఠాలు నేర్ప గలరని ఆశిద్దాం.
    నేననుకుంటాను - తంతు మీద, భక్తిమీదా కాకుండా బ్రతుకు తెరువు మీద, అదీ నైతిక విలువలు, సామాజిక బాధ్యతలూ పాటిస్తూ గౌరవంగా బ్రతకగలిగే నేర్పును పాఠాలు నేర్పాలేమో? ఎందుకంటే మన పీఠాలూ, మఠాలూ ఇప్పటివరకూ ఉన్నాడో లేడో తెలియని దేవుడి గురించీ, ఆయన్ను/ ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి చెయ్యాల్సిన వ్రతాలను/ పూజాధికాలనూ ఎక్కువగా ప్రచారం చేస్తూ వచ్చాయి గానీ మనిషి సాటి మనిషితో ఎలా సౌభ్రాతృత్వంతో సహజీవణం చెయ్యాలో (అంతగా/ తగురీతిలో) చెప్పలేదు/ చెప్పట్లేదు.
    ఒక చిన్న ఉదాహరణ: ఆకలితో అలమటించేవాడికి అప్పటికప్పుడు అన్నం దొరికెతే చాలనుకుంటాడు. అంత తేలికగా అది దొరకనప్పుడు దొంగిలించడానికైనా వెనకాడడు. అప్పుడు మనం వాణ్ణి పిలిచి ఒరేయ్ నాయనా అలా దొంగిలించడం తప్పు, దేవుడు శ్క్షిస్తాడు లాంటివి చెప్పేబదులు, ఆహారాన్ని కష్టపడి(పనిచేసి) సంపాదిస్తే అందులో ఉండే హాయి (ఎవరూ పట్టుకుని కొట్టే ప్రమాదం లేకపోవడం), మరియు డిగ్నిటీ (నా కష్టార్జితంతో నా కడుపు నింపుకున్నాననే తృప్తి) ల గురించి తెలియజెప్పగలిగితే వాడు మళ్ళీ ఇంకోసారికి ఆ పని చెయ్యడు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.