17, సెప్టెంబర్ 2015, గురువారం

చదివి చూడండి :: నష్టమేమీ లేదుగా!

ఫోటో కర్టెసీ రాధే శ్యాం బ్లాగ్ "సొంత ఘోష"
సాంప్రదాయబద్దంగా, మట్టి వినాయకుడితో వినాయక చవితి చేసుకుంటున్న "భక్తులకు" శుభాకాంక్షలు

బజారు పూజలు చేసేవాళ్ళకు ........వద్దులెండి  చెబితే  బాధపడతారు. 

నా బ్లాగు 2009 లో మొదలు పెట్టినదగ్గర నుంచీ, ప్రతి వినాయక చవితికీ ఒక వ్యాసం వ్రాయటం అనావయితీగా ఉన్నది. కానీ ఐదేళ్ళు వ్రాసి విసుగెత్తి క్రితం సంవత్సరం వ్రాయలేదు. 

ఈ సంవత్సరమూ వ్రాయలేదు. కాని కొంతలో కొంత మార్పు, కనీసం ఇలా చెయ్యకూడదు అనుకునేవాళ్ల మాట విపడుతున్నందుకు సంతోషం. ఆ కారణంగా ఈ సంవత్సరం మునుపు వ్రాసిన వ్యాసాల సమాహారం మీకోసం. 

వినాయక చవితి  పేరుతొ ఈరోజున జరుగుతున్నా ఆకృత్యాల గురించి వినాయకునిచేతనే  చెప్పించిన  ఒక చక్కటి వీడియో. తెలుగు వన్ వారి సౌజన్యం.

5 కామెంట్‌లు:

  1. అంతే.... అంతే...... వినేదాకా చెప్పడమే! చెప్పగా చెప్పగా కొద్ది కొద్దిగా కొందరిలోనైనా మార్పు వస్తుంది. మీ ప్రయత్నంకు అభినందనలు ప్రసాద్ గారు.

    రిప్లయితొలగించండి
  2. ఈ సబ్జెక్ట్ మీద మీరిక్కడిచ్చిన మీ పాత టపాలు చదివాను. చదివినందువల్ల "నష్టమేమీ లేదు", పైపెచ్చు వివిధ ప్రాంతాల్లో ఈ వ్యవహారం ఎలా వెర్రితలలు వేస్తోందో తెలిసింది. ముఖ్యంగా ముంబయ్ లో వినాయకుడి విగ్రహాల్లో వెర్రిమొర్రి రకాలు. విగ్రహాల విషయం చాలా చోట్ల అలాగే తయారవుతోందిలెండి. ఒక ప్రాంతాన్ని చూసో, దాన్ని గురించి వినో - అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా - ఇతర ప్రాంతాలకు కూడా ఈ వెర్రి వ్యాపిస్తోంది / వ్యాపించింది. అన్నట్లు ఆ అరటిపిలకల హింసేమిటండీ బాబూ, ఎప్పుడూ వినలేదు (నా వరకు). మొత్తంమీద ఇదంతా చాలా హాస్యాస్పదంగా తయారవుతోంది. ఈ పూజల వేలంవెర్రి, కృతిమత్వం, హంగామా, బడాయి చూస్తుంటే వెంటనే గుర్తొచ్చేది - "దేఖ్ తెరీ దునియా కీ హాలత్ క్యా హొ గయి భగవాన్, కిత్నా బదల్ గయా ఇన్సాన్" - అనే పాత పాట. పాపం తిలక్ గారు, ఊహించని ఈ మార్పులు చూసి మీరన్నట్లు స్వర్గంలో దిగాలు పడుతూ కూర్చున్నారన్నమాట. ఇవన్నీ వ్యాపారులు, మార్కెట్ శక్తులు, గల్లీ రాజకీయాల చేతిలో ఇరుక్కుపోయాయి. ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, మంచి మార్పు వస్తుందనీ ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
  3. విన్నకోట నరసింహారావుగారికి నమస్తే. వ్యాసాలు అన్నీ ఓపికగా చదివి మీ అభిప్రాయం తెలియచెప్పినందుకు ధన్యన్వాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.