విజయవాడలో ప్రధాన కూడళ్ళల్లో "లెనిన్ సెంటర్" ఒకటి . ఈ కూడలి గవర్నర్‌పేటలో అలంకార్ వంతెనకు అతి సమీపంలో, రైవస్ కాలవ పక్కనే ఉన్నది. ఆ ఏరియాకు "లెనిన్ సెంటర్" అనే పేరు రావటానికి కారణం అక్కడ ఉన్న ఈ విగ్రహమే.
అక్కడ లెనిన్ విగ్రహాన్ని 22 ఆగష్టు 1987న అప్పటి సోవియట్ యూనియన్ ఉపాద్యక్షురాలు వి ఎస్ షివ్‌చెంకో ఆవిష్కరించారు. అప్పట్లో , ఈ విగ్రహం రష్యా నుంచి వచ్చిందని అనుకునేవారు. ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డ్ గ్రహీత శ్రీ ఓరఖోవ్అ ని తెలుస్తున్నది. ఈ విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది. బాగా మైంటైన్ చేసి పదిలపరుస్తున్నారు.
ఆ ప్రాంతలో (రైవస్ కాలువ ఒడ్డుకు ఆనుకుని)సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణాలు బాగా ఉన్నాయి. విజయవాడలో పుస్తక ప్రేమికులకు ఈ దుకాణాలు ఒక వరం. ఎక్కడా దొరకని, ప్రస్తుతం ప్రింటులో లేని (Out of Print) అపురూప పుస్తకాలు ఈ షాపుల్లో దొరికే అవకాశం ఉండటంతో పుస్తక ప్రియులు విజయవాడనుంచే కాకుకండా చుట్టుపక్క ఊళ్ళనుంచి కూడా, ముఖ్యంగా ఆదివారం రోజున వచ్చి తమకు కావాల్సిన పుస్తకాలు వెతుక్కోవటం కనిపిస్తూ ఉంటుంది. పుస్తక ప్రియులకు బాగా పరిచయం అయిన 'ప్రాచీన గ్రంధమాల' ఇక్కడే ఉన్నది.
ఇది మా చిన్న తనాల్లో(1960-70) ఒక చిన్న సందు. అక్కడ ఒక నర్సరీ ఉన్నట్టు గుర్తు. అటునుంచి అంటే ఏలూరు రోడ్డు నుంచి ఇటు గాంధీనగరానికి సిటీ బస్సులు ఈ సందుగుండానే వెళ్ళేవి. అప్పట్లో ఇది వన్ వే ట్రాఫిక్ గా ఉండేది. ఇప్పుడు అక్కడ రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి రైవస్ కాలవ ఒడ్డునే ఉన్న రోడ్డు మరొకటి పాత రోడ్డు. ఈ రెండిటికి మధ్య ఈ విగ్రహం ఉన్నది.
1991లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం రష్యా, ఉక్రైన్(రష్యానుంచి విడివడి ప్రత్యేక దేశం అయ్యింది) వగైరా దేశాల్లో లెనిన్ విగ్రహాలు తొలగించబడినాయి అని ఒక వార్త ప్రచారంలో ఉండేది. లెనిన్ విగ్రహాల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే కానీ, ఇంటర్‌నెట్లో వైతికితే దొరికిన సమాచారం ప్రకారం, 2019 నాటికి రష్యాలో 6000 (1991లో 7000), ఉక్రైన్‌లో 350 (1991లో 5500) ఉన్నాయని తెలుస్తున్నది. సోవియట్ యూనియన్, తూర్పు యూరోపు దేశాలు (ఒకప్పటి కమ్యూనిష్ట్ ప్రభావిత దేశాలు) కాకుండా మిగిలిన ప్రపంచంలో 1991 లో 150 లెనిన్ విగ్రహాలు ఉంటే, 2019 నాటికి 25 మాత్రమే ఉన్నాయట. అలా ఇప్పటికీ నిలిచి ఉన్న, ఆ మిగిలిన పాతిక విగ్రహాలలో విజయవాడలో ఉన్న లెనిన్ విగ్రహాం ఒకటి. విగ్రహాల సంఖ్య గురించిన సమాచారం ఇంటర్నెట్లో దొరికిన వెబ్‌సైటు లింకు: https://www.soviettours.com/.../how-many-lenin-statues-left
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.