పాత చందమామలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాత చందమామలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జనవరి 2010, సోమవారం

చందమామలో మాయా బజార్


మాయా బజార్ సినిమా తెలియని వారెవరు. ఉంటే గింటే వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యి ఉండరని మన రాజశేఖర రాజుగారు తన బ్లాగులో (చందమామ చరిత్ర) బెదిరిస్తున్నారు! నిజమే మరి భారత కథను ఎంత హాస్యం పట్టించి సినిమాను తీసినా, భారతంలో లేని సంఘటనలను ఇందులో ఉన్నట్టుగా చూపించినా, కథా కథనం, దర్సకత్వం, నటీ నటుల ఎన్నిక, వారి అపూర్వ నటన, మీదుమిక్కిలి చక్కటి సంభాషణలు, కమ్మటి పాటలు, సినిమాను ఒక దృశ్య కావ్యంగా తీర్చి దిద్దాయి.

సినిమాను తీసినది విజయా వారు అంటే మన చక్రపాణి-నాగిరెడ్డి గార్లే. దీనివల్ల చందమామలో మాయా బజారు కథకూడా ప్రచురించారు. మార్చ్ 27, 1957 సినిమా మొదటిసారి విడుదల అయ్యింది. ఏప్రిల్ నెల 1957 చందమామలో మాయా బజారు కథను సంక్షిప్తంగా ప్రచురించారు. చందమామలో ప్రచురించబడిన కథను పి డి ఎఫ్ రూపంలో కింద లంకె నొక్కి చూడవచ్చు.

చందమామలో మాయా బజార్


ఇప్పుడు ఇదే సినిమా పూర్తీ రంగులలోకి మార్చబడి నెల అంటే జనవరి 29 2010 మళ్ళి విడుదల కాబోతున్నది . కొద్ది రోజులక్రితం నేను విజయవాడ వెళ్ళినప్పుడు మాయా బజార్ సినిమా రంగుల సినిమా విడుదల సందర్భంగా పోస్టరు చూసాను. పోస్టరు ఫొటోనే పైన ఇవ్వటం జరిగింది.

మొదట సారి నలుపు తెలుపులో విడుదలయ్యి ఇప్పటికి నలభై సంవత్సరాలు దాటిపోయినాయి. నాలుగు దశాబ్దాల కాలంలో అనేక మార్పులు. చందమామ విజయా పిక్చర్సు ఇప్పుడు ఒకరి చేతిలో లేవు. వేరు వేరు యాజమాన్యాలలో ఉన్నాయి. మరిప్పుడు మాయా బజార్ విడుదల సందర్భంగా చందమామలో పాత చుట్టరికం పురస్కరించుకుని మళ్ళి ఎమన్నా ప్రత్యెక శీర్షిక వేస్తారా? వేచి చూద్దాం.

ఈ సినిమాని రంగులద్దిన తరువాత డి.వి.డి. ని వేస్తారని అనుకుంటున్నాను. అలా వేయబడే డివిడిలో అలనాటి సినిమా విశేషాలు, అప్పటి సినిమాలో నటించిన వారి తో ఇంటర్వ్యూలు (నాగేశ్వర రావు గారు గుమ్మడిగారు) వేసి ప్రేక్షకులకు అందిస్తారని ఒక ఆశ. ఆ తరువాత ఆ డివిడిని సవ్యమైనధర పెట్టి ( సినిమా వాళ్ళు దురాశ కొద్దీ Rs.400/- Rs.500/- పెడితే అసలుకే మోసం వస్తుంది) పైరసీ పాల పడకుండా చెయ్యాలని ఒక విన్నపం.


21, జనవరి 2010, గురువారం

నచ్చిన చందమామ కథలు

చందమామ పాత సంచికలలో నాకు బాగా
నచ్చిన కధలు 1953,ఆగస్ట్ వరకు పేజీల
నెంబర్లతోఇస్తున్న్నాను.ప్రస్తుతానికి
వెబ్లో పాత సంచికలు చూసే చం.ప్రియులకు ఉపయోగిస్తుందేమో నని
ఇక్కడ
ఇస్తున్నాను.మనతెలుగు చందమామలో మీకు నచ్చితే ఉంచండి.

సంవత్సరం నెల కధ పేజీ
______ ___ __________________________ _____
1953 జనవరి శిక్షా? బహుమానమా? 27
మార్చి సఫలయాత్ర (జాతక కధ) 13
" కలసిరాని కెంపు 50
" ఆడ కోతి 42
మే చిత్రమైన సమస్య 33
" ధర్మయుద్ధం 45
జూన్ మూడు పరీక్షలు 44
జూలై కల్ల ముట్టడి 44
" విలువలేని పుణ్యం 50
ఆగస్టు భల్లూక తల్పం 26
" మాణిక్య వాచకర్ 33
" సమభావం 38
" పగ తీర్చిన పాగా 41
" గోడ మీద చిత్రం 50


=========================
పైన వ్రాసిన చందమామ కథల జాబితా ప్రముఖ కార్టూనిస్టు సురేఖ (మట్టెగుంట అప్పారావు) గారివి.

చందమామ ప్రియులు వారికి నచ్చిన పాత చందమామ కథలకు సమీక్ష వ్రాసి పంపగలరు, బ్లాగులో ప్రచురిస్తాము.

31, డిసెంబర్ 2009, గురువారం

పాత చందమామలు



“భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.”

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారి 12 అద్వితీయ ధారావాహికలు, (తోకచుక్క, శిధిలాలయం, రాకాసిలోయ, యక్షపర్వతం, పాతాళదుర్ఘం వగైరా) 55 ఏళ్లుగా చందమామలో నిరవధికంగా ప్రచురితమవుతున్న బేతాళకథలు, పరోపకారి పాపన్న, తాతయ్య చెప్పిన కథలు, గుండుభీమన్న, సాహసయాత్రలు, గ్రీకు పురాణ గాధలు చందమామ కథల చరిత్రలో మకుటాయమానంగా నిలిచి ఈనాటికీ పాఠకుల ఆదరణ పొందుతూ వస్తున్నాయి.

చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి. కాని, అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు. దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. అయితే, చందమామలోని కథలు అటువంటి కారణంలేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు. చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా, మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి. అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం అనిపించేది.

దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గానీ పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు. సామాన్యంగా దయ్యాల పాత్రలు రెండు రకాలుగా ఉండేవి – ఒకటి, మంచివారికి సాయం చేసే మంచి దయ్యాలు, రెండు, కేవలం సరదా కోసం తమాషాలు చేసే చిలిపి దయ్యాలు. తెలుగు నాట దెయ్యాల కథలకు విశేష గౌరవం కల్పించిన ఘనత చందమామది.

మనుషులకు సహాయం చేసే దెయ్యాలు, రాక్షసులు, మనిషి కష్టాలు సుఖాలలో తోడు వచ్చే దెయ్యాలు చందమామ కథల్లో తప్ప ఇంకెక్కడ ఉంటాయి. అందుకే అప్పటి దెయ్యాల కథలను చందమామ పాఠకులు ఈనాటికీ గుండెలకు హత్తుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

“దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.”

చందమామ చిత్రాలు

తెలుగు సాహిత్యం చదివిన వారిలో ” చందమామ “, ” యువ ” పత్రికలు కొంతవరకైనా చదవని వారు ఉండరు. కాలానుగుణముగా ఈ పత్రికలకు లక్షల అభిమానులను సంపాయించుకున్నాయి. అవి అంత జనాదరణ పొందడానికి కారణం చక్కటి కధలు, వాటితో ఉండే సందర్భోచిత కధా చిత్రాలు. ముఖ చిత్రం కూడ తనదైన శైలిలో ప్రత్యేకత ఉట్టిపడుతూంటుంది.

ఆ ఊహా చిత్రాలను తమ మనస్సులోంచి, కుంచెతో రూపుదిద్ది జీవం పోసిన చందమామ చిత్రకారులు చిత్రా, వడ్డాది పాపయ్య (వపా), ఎంటీవీ ఆచార్య, శంకర్ గార్లు. దాదాపు అరవై ఏళ్ళ పాటు – ” చందమామ ” పత్రిక ముఖ చిత్రాలు, కధా చిత్రాల ద్వారా వీరు తమ కుంచెతో చిత్రకళాద్భుతాలు సృస్టిస్తూ కధలను కళ్ళకి కడుతూ దేశంలో చదువరుల అభిమానాన్ని సంపాయించుకుంటూ వచ్చారు.

తెలుగు చదువరులు మరచిపోలేని ” చందమామ – ముఖ చిత్రాలు ” వీరి చిత్రకళా సృష్టే. చందమామ పత్రిక ముఖ చిత్రాలు, విభిన్న కధా చిత్రాలు రూపొందించి, చదువరులను, విశేషించి వారి అభిమానాన్ని ఆకట్టుకున్నారు. ఒకటా రెండా… ఏకంగా 63 సంవత్సరాలుగా వీరి చిత్రాలు చందమామను అలరిస్తూ వస్తున్నాయి. చందమామను పోలిన అనేక పత్రికలు చోటు చేసుకున్నా, చందమామ ప్రత్యేక దృక్పథాన్ని, పరంపరను సాధించలేక పోయాయి.

దివ్య పురుషులను, దేవతలను కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించిన వపా… మహాభారతం పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన ఆచార్య, రామాయణం తదితర పౌరాణిక గాధలకు అద్వితీయమైన చిత్రాలు గీయడమే కాక బేతాల కథల చిత్రకారుడిగా యావద్దేశాన్ని మురిపిస్తున్న శంకర్, జానపద చిత్రలేఖన శైలీ విన్యాసంతో చందమామ చిత్రకారులలోనే అద్వితీయుడిగా నిలిచిన చిత్రా… వీరితో పాటు రాజీ, జయ.. చందమామ కీర్తిప్రతిష్టల చరిత్రలో వీరు కలికితురాయిలు.

గత 57 ఏళ్లుగా చందమామలో కొనసాగుతూ సహచరుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్న శంకర్ గారు ఒకే పత్రికలో దాదాపు ఆరుదశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్న అరుదైన గౌరవాన్ని పొందుతున్నారు. చందమామ చిత్రకారుల చిత్రాలు కధలను కళ్ళకి కడతాయి. తెలియకుండానే చదువరుల హృదయం ఆకట్టుకుంటూ, మనసులను రంజింపజేస్తాయి.

ఆన్‌లైన్‌‍లో చందమామ భాండాగారం

భారతీయ కథా సాహిత్యంలో ఇంతటి ఘనతర చరిత్రను సాధించిన చందమామ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో పాఠకులు చదవడానికి వీలుగా రూపొందించిన చందమామ కథలు ఆనాటి, నేటి పాఠకులకు సమానంగా కనువిందు చేస్తూ భారతీయ పాఠకుల కథల దాహాన్ని తీరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

చందమామ పాతకాపీలు లేనివారు, అప్పట్లో తీసుకుని కూడా పోగొట్టుకున్నవారు. నేటి తరాలకు చెందిన పిల్లలు, పెద్దలు కూడా చందమామ పాత కథలకు ఆన్‌లైన్ చందమామ భాండాగారం -ఆర్కైవ్స్- లో చూడవచ్చు. ఈ మహత్తర కృషికి గత సంవత్సరం నాంది పలికిన తర్వాత నేటికి, ప్రారంభం సంచిక -1947- నుంచి 2000 సంవత్సరం చివరివరకు తెలుగు తదితర పది భారతీయ భాషల్లో చందమామలు ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్ విభాగంలో పాఠకులకు అందించడం జరిగింది. త్వరలో 2008 వరకు కూడా చందమామలను ఆన్‌లైన్‌లో అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చందమామ పాఠకులారా..! రండి మనదైన జాతి సంపదను ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచడానికి చందమామ చేసిన కృషిని స్వీకరించండి. ప్రపంచ ప్రచురణా రంగ చరిత్రలోనే తన పాఠకులకు 53 ఏళ్ల పాత సంచికలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన అరుదైన పత్రిక చందమామే అని ఈ సందర్భంగా సవినయంగా గుర్తు చేస్తున్నాం.

మీ చందమామను, మన చందమామను ఎప్పటిలాగే ఆదరిస్తారని, మీ పిల్లలకు, భవిష్యత్ తరాల పిల్లలకు చందమామ పత్రికను అరుదైన బహుమతిగా పంచిపెడుతూ వస్తారని మనసారా ఆశిస్తున్నాం

పది భారతీయ భాషల్లో -తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడం, మరాఠీ, మలయాళం, ఒరియా, బెంగాలీ, సంస్కృతం- చందమామలను ఆన్‌లైన్ భాండాగారంలో చూడడానికి కింది లింకుపై క్లిక్ చేయండి. మీ భాషను, సంవత్సరాన్ని, నెలను ఎంపిక చేసుకుని ఇష్టమైన చందమామ కథను ఆస్వాదించండి

పాత చందమామలు

సమస్త భారత పాఠక లోకానికి, చందమామ ప్రియులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

---------------------------------------------------------------------------------

చందమామ చరిత్ర బ్లాగులో శ్రీ రాజశేఖర రాజుగారు ప్రచురించిన వ్యాసం ఇది

---------------------------------------------------------------------------------

1, డిసెంబర్ 2009, మంగళవారం

ఇంటర్నెట్ - పుస్తకాలు

మొదట Downloader (updated-29-10-09) OR Downloader(30-11-09) (updated-30-11-09)ని డౌన్లోడ్ చేసుకోండి. Unzip చెయ్యండి.
runDM.bat file ని run చెయ్యండి.











'chandamama' option select చేయండి.














'Download Location' field లో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి like C:\
లేదా 'Browse' Button click చేసి location select చేసుకోండి.
'Year','Month' select చేసుకొని 'download' button click చెయ్యండి.
ఒక్కో పేజి download అయిన తర్వాత ఇది ఒకే pdf file గా కలుపుతుంది(with year-month name).


-------------------------------------------
1st Picture లో 'Digital Library ' select చేసుకుంటే Digital Library of India నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
















'http://www.new.dli.ernet.in/' లో పుస్తకం వెతికి URL తెచ్చుకొని(language-telugu), దాన్ని 'URL' field లో paste చేసి 'add to download ' button click చెయ్యండి.
తర్వాత 'download' button click చెయ్యండి.
http://dli.iiit.ac.in

-> ఈ సైటులో అనేకానేక తెలుగులు భాషలోని పుస్తకాలు ఉన్నాయి
-> They are providing the pages in PTIFF,PDF formats, with a file for each page.
-> To download in simpler way use the following download manager.

Procedure:
-> Open the URL -> search for a book -> click on the book link -> click on book reader
-> it will open a new URL -> copy the URL and paste it in the download manager URL: text field.
-> click addTodownload(you can give more than one URL) and click download.
-> if you want to download from page 20 to page 35, click advanced user and give page numbers and click on download.
-> it will provide log file at c:\ drive.

To download chandamama from the http://dli.iiit.ac.in/ site also you can use the same

24, నవంబర్ 2009, మంగళవారం

పాత చందమామలు ఏమైపోయ్యాయి

తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో చందమామ సంచికలన్నీ డిజిటైజు చెయ్యబోతున్నారన్న వార్త చదివిన చందమామ అభిమానులందరూ ఎంతగానో ఆనందించారు.

వారి కలలు నిజం చేస్తూ, కొంతకాలానికి తెలుగు చందమామలు మొదలు పెట్టినప్పటినుంచి (జులై 1947) డిజిటల్ ఫైళ్ళుగా పి డి ఎఫ్ రూపంలో ఉలిబ్.ఆర్గ్ వెబ్‌సైటులో దర్శనమిచ్చాయి. అలాగే చందమామ వారు కూడ తమ వెబ్‌సైటులో ఈ చందమామ ఫైళ్ళను ఉంచి డౌన్లోడ్ సౌకర్యంకూడ కలిగించారు.

రెండుచోట్ల చందమామల పాత సంచికలన్ని లభ్యం కావటం, చందమామవారు ఎటువంటి షరతులు లేకుండా డౌన్లోడ్ వారిసైటులోనే అనుమతించటం చందమామ అభిమానులకు ఆనందం కలిగించింది. ఎంతోమంది ఆ ఫైళ్ళను డౌన్లోడ్ చేసుకుని, తమ వద్ద భద్ర పరుచుకుని చదివి ఆనందిస్తున్నారు. తెలుగు పత్రికా ప్రపంచంలో పాత సంచికలన్ని తమ వెబ్ సైటులో ఉంచిన ఘనత చందమామవారిదే, మరే ఇతర పత్రిక ఇంతవరకు ఇటువంటి మంచి పని చెయ్యలేకపోయింది.

కొంతకాలానికి, చందమామ వారి వెబ్ సైటులో డౌన్లోడ్ సౌకర్యం తొలగించబడి, పి డి ఎఫ్ ఫైళ్ళ స్థానంలో ఫ్లాష్ ఫైళ్ళు దర్శనం ఇచ్చాయి. ఇవి కూడ బాగున్నాయి, చక్కగా పాత చందమామ చదువుతున్న అనుభూతి కలుగుతున్నది. కాకపొతే అవి చదవలంటే ఇంటర్ నెట్‌కు తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి.

ఉలిబ్.ఆర్గ్ లో డౌన్లోడ్ అవకాశం కొనసాగింది. కాని ఇప్పుడిప్పుడే అనేకమంది చందమామ అభిమానులు ఉలిబ్.ఆర్గ్ వెబ్సైటుకు వెళ్ళి పాత
చందమామలను చూద్దామని ప్రయత్నిస్తే అసలు కనపడటంలేదట. నేను కూడ్ ఈరోజు ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా వెదికినా చందమామలు కనపడలేదు.

ఏమయ్యింది?? చందమామలను నలుగురికీ కనపడే సైటునుంచి తొలగించారా మరిప్పుడు ఎక్కడ దొరుకుతాయి??

పాత చందమామల ప్రతులు ఇప్పుడు ఎలాగూ దొరకవు, ఒకవేళ ఎవరైనా పెద్దవారు అప్పటి ప్రతులను కాపాడి పదిలపరిచినా, అవి కాలవశాన సరైన స్థితిలో ఉంటాయా అని సందేహం. ఇటువంటి పరిస్తితులలో, డిజిటల్ రూపంలో ఉన్న పాత చందమామలు, చందమామ అభిమానులను ఎంతగానో అలరించాయి, ఇప్పుడున్న చందమామ సర్కులేషన్ పెరగటానికి బాగా దోహదపడ్డాయి. ఇప్పటి పిల్లలు, పాత చందమామలగురించి ఏమీ తెలియని 20-30సంవత్సరాల వయస్సువారు, ఈ డిజిటల్ చందమామలను చూసే, ప్రింటు చందమామ పట్ల ఆకర్షితులైనారన్న విషయం ఒక నిజం.

ఉలిబ్ వారు ఎందుకు ఈ డిజిటల్ ఫైళ్ళను తీసేశారో తెలియదు. చందమామ అభిమనులందరూ, కింద ఇచ్చిన లింకు నొక్కి ఉలిబ్ వారికి ఈ విషయంలో తమ తమ అభిప్రాయాలని తెలియచెయ్యటం వల్ల ఏమన్న ఉపయోగం ఉంటుందేమో!

అభిప్రాయం