రచన ప్రత్యెక సంచిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రచన ప్రత్యెక సంచిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మే 2010, ఆదివారం

రచన -దాసరి- ప్రత్యేక సంచిక : అపూర్వ స్పందనలు

పిల్లలను, పెద్దలను ‘చందమామ’ ద్వారా కొన్ని దశాబ్దాలపాటు అలరించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అద్భుత అజ్ఞాత రచయిత గురించి తెలుగు పాఠకలోకానికి ‘చాటి’ చెప్పాలన్న తపనతో సర్వశక్తులూ ఒడ్డి నభూతో అన్న చందంగా రచన శాయి గారు తీసుకువచ్చిన మే నెల రచన ప్రత్యేక సంచిక పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..

ప్రస్తుతానికి శాయి గారు ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ శేషు గారి అద్భుతమైన స్పందనను చందమామ బ్లాగుకోసం పంపారు.. ‘ఒక పత్రిక గురించి మరొక పత్రికలో ఊసే లేని (ఈసు తప్ప) తెలుగు పత్రికా లోకంలో ఇలాంటి ప్రయోగం జరగటం ఇదే మొదలనుకుంటాను.’ అంటున్న శేషుగారు మే నెల రచన ప్రత్యేక సంచిక తీసుకురావడంలో శాయి గారు పడ్డ కష్టం గురించి విచారం వ్యక్తం చేశారు.

రచన వంటి పత్రికలు వ్యాపార ఒడిదుడుకులను తట్టుకుని నిలబడాలని మనస్పూర్తిగా కాంక్షిస్తూ రచనకు త్వరలో చందా కడతానని కూడా చెప్పారు. సదాశయంతో, ఉత్తమాభిరుచితో లాభాపేక్ష అనే పదానికి అర్ధం ఏమిటో తెలియని తత్వంతో పత్రిక నడిపిస్తున్న వారికి పత్రిక విడివిడిగా కొనడం కాకుండా చందా రూపంలో తీసుకుంటే ఎంత ఊపిరి పోస్తుందో, మనకు తెలియని విషయం కాదు. అందుకే శేషుగారితో నూటికి నూరుపాళ్లూ ఏకీభవిస్తూ నేను కూడా ఈ నెల నుంచి రచనకు చందా పంపిస్తున్నాను.

నిజం చెప్పాలంటే మూడు నెలల క్రితం వరకు రచన శాయి గారి గురించి నాకు పెద్దగా పరిచయం లేదు. చందమామ వీరాభిమానుల్లో. అగ్రగణ్యుడిగా 8 నెలల క్రితం త్రివిక్రం గారు ఆయన గురించి చెప్పడం వరకే నాకు గుర్తుంది. ఎందుకో శాయిగారితో పరిచయం చాలా ఆలస్యంగా జరిగింది. కానీ గత మూడు నెలలుగా దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం మన రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల్లోని, ప్రపంచంలోని తెలుగు వాళ్లను, దాసరి గారి అభిమానులను సంప్రదించడంలో, దాసరి జ్ఞాపకాలు, అరుదైన అంశాలను పంపమని తాను ఎంత తీవ్రస్థాయిలో శ్రమించారో చందమామ -దాసరి- అభిమానులకు తెలుసు.

మొదట అనుకున్న పథకాన్ని మించి దాసరిగారిపై విశేష స్పందనలు రచన కార్యాలయానికి వెల్లువెత్తడంతో ఏప్రిల్ సంచిక ముద్రణను సైతం ఆపివేసి ప్రత్యేక సంచికకు ప్రాధాన్యత ఇవ్వడంలో శాయిగారు రచన ఉనికినే సవాలుగా పెట్టారు. సాహిత్య అధ్యయనాన్ని సీరియస్‌గా తీసుకునే వారికోసం, రచన కంట్రిబ్యూటర్లకోసం ఉత్తమ పుస్తకాలను బహుమతిగా ఉచితంగా అందిస్తున్న సత్సంప్రదాయం కూడా రచన శాయిగారికే సొంతమనుకుంటాను.

కాళీపట్నం రామారావు గారి సాహిత్య సంచికలను 150 కాపీలకు పైగా తాను స్వయంగా కొనుగోలు చేసి రచన కంట్రిబ్యూటర్లకు ఉచితంగా అందించడం, తన అబిరుచికి తగిన పుస్తకాలను ముందే కొనుగోలు చేసి తదనంతర కాలంలో వాటిని అవసరమైన వారికి అందించడం, ఏ పుస్తకం కావాలన్నా దానికి సోర్స్ చెప్పి సహకరించడం.

ఇవన్నీ ఒక ఎత్తైతే తెలుగు బాల సాహిత్యం మర్చిపోలేని గొప్ప పనులు మూడు శాయిగారి స్వంతమయ్యాయి. అవి చందమామ పత్రికకు ముందు ప్రారంబించబడి 1945 నుంచి 59 వరకు బాలసాహిత్యానికి ఊపిరులు పోసిన ‘బాల’ పత్రికలోని ముఖ్యమైన కథలు, తదితర అంశాలను 1300 పైజీలకు పైగా క్రోడీకరించి నాలుగు పుస్తకాలుగా -కావాలంటే హార్డ్ బౌండ్‌గా కూడా దొరుకుతోంది- ప్రచురించడం, తెలుగు బొమ్మల రేడు బాపూ బొమ్మల సర్వస్వాన్ని పుస్తకంగా అచ్చేసి బాపూగారికి శాశ్వత గౌరవం కల్పించడం, ఇప్పుడు ప్రపంచ చందమామ అభిమానులంతా గర్వించదగిన దాసరి గారి జీవిత, సాహిత్య విశేషాల మే నెల రచన ప్రత్యేక సంచికను నభూతో న భవిష్యతి లాగా అతి తక్కువ ధరకు అందించడం…

ఒక్క మాటలలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో ఏ పత్రికా ప్రచురణ సంస్థకూ సాధ్యంకాని, కాలేని మూడు గొప్పపనులు రచన పత్రిక మాత్రమే చేయగలిగింది. ఈ మూడు పుస్తకాల ప్రచురణ విషయంలో పైసా ఆదాయం ఆయనకు రాకపోవడం గమనార్హం. మే నెల రచన ప్రత్యేక సంచిక ఉత్పత్తి ఖర్చులే ఒక్కో పత్రికకు రూ.46లు అయ్యాయనే చేదునిజం ఇవ్వాళే ఆయన బయటపెట్టారు. ముద్రణా సంస్థ ఎంత తక్కువ వ్యయంతో ముద్రించినా విడి పత్రిక ఉత్పత్తి ధర రూ.46లకు చేరుకుందట. మార్కెట్‌లో మే నెల ప్రత్యేక సంచిక వెల రూ.50లు. ఈ వార్త వినగానే మనసంతా చేదయిపోయింది. ఈ విపత్కర పరిణామాలను రచన తట్టుకుని నిలబడుతుందా..

రచన బతకడం, మనగలగడం, మిగలడం…. కావాలిప్పుడు. ఇందుకు రచనకు చందాలు, ప్రకటనలు కావాలి. అవి మాత్రమే రచనను పది కాలాలపాటు బతికిస్తాయి. రచన పాఠకులు, చందమామ అభిమానులు, ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించగల సంస్థలు తమ వంతు సాయం ఈ విషయంలో అందించగలిగితే ఎంత బావుణ్ణు. రచన బతకాలి. శాయి గారు రచన పత్రికను పది కాలాల పాటు నడపగలగాలి. ఇప్పుడు రచనకు ఆపన్న హస్తాలు నిజంగా కావాలి. చందాల రూపంలో… ప్రకటనల రూపంలో.. ఇంకా వీలైతే పెద్ద పెద్ద సంస్థల, వ్యక్తుల ఆర్థిక ఔదార్యం రూపంలో….

యునెస్కో వారు ప్రపంచంలోని కొన్ని పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంటారు. పత్రికలకు సంబంధించి అలాంటి విధానమేదైనా ఉంటే, ‘చందమామకు’ ఆ గౌరవం దక్కాలి అంటూ రచన ప్రత్యేక సంచికపై మేడేపల్లి శేషు గారు పంపిన హృదయ స్పందనను ఇక్కడ చదవండి.

చందమామ ప్రపంచ వారసత్వ సంపద కావాలి!
రచన శాయి గారికి,
నమస్కారం (ఆంధ్రాలో ‘సాయి’ కాని ‘శాయి’ మీరొక్కరే అనుకుంటాను).

‘రచన’పత్రికకు నేను చాలాకాలంగా దూరమైనా, మళ్ళీ ‘చందమామ’ పత్రిక్కి సంబంధించిన ఒక గొప్ప రచయితను (ఆయన దాసరి సుబ్రహ్మణ్యం గారని ఇప్పుడే తెలిసింది) గురించి మీరేదో ప్రత్యేక సంచిక వేశారని తెలిసి (రామవరపు గణేశ్వర రావు గారు ఫార్వర్డ్ చేసిన మెయిల్ ద్వారా) మళ్ళీ మీ దగ్గరకొచ్చాను.

ఈ ‘రచన’ ప్రత్యేక సంచిక గురించి మీరు పడ్డ కష్టం బాగా తెలిసొచ్చింది. ఒక పత్రిక గురించి మరొక పత్రికలో ఊసే లేని (ఈసు తప్ప) తెలుగు పత్రికా లోకంలో ఇలాంటి ప్రయోగం జరగటం ఇదే మొదలనుకుంటాను. పిల్లలను, పెద్దలను ‘చందమామ’ ద్వారా కొన్ని దశాబ్దాలపాటు అలరించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అద్భుత అజ్ఞాత రచయిత గురించి తెలుగు పాఠకలోకానికి ‘చాటి’ చెప్పాలన్న మీ తపనకు జోహార్లు. తీగ లాగితే, డొంకంతా కదిలినట్లు (అలా కదిలించటం అంత తేలికపని కాదని తెలుసు), ‘చందమామ’ తో సంపర్కమున్న ఎంతోమందిని కదిలించి అచిరకాలంలో వారి దగ్గరనుంచి ఎన్నో అనుభవాలను పోగుచేసి, వాటిని ఏర్చి, కూర్చి ఒక ప్రత్యేక సంచిక రూపంలో మా ముందుంచిన మీ కృషి అభినందనీయం. యునెస్కో వారు ప్రపంచంలోని కొన్ని పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంటారు. పత్రికలకు సంబంధించి అలాంటి విధానమేదైనా ఉంటే, ‘చందమామకు’ ఆ గౌరవం దక్కాలి. ఇన్ని భాషల్లో ప్రచురింపబడే ‘చందమామ’ మన తెలుగువాళ్ళ సృష్టి అనుకున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది.

నేను ‘చందమామ’ లోని అన్ని సీరియళ్ళూ చదవకపోయినా, దాసరి వారి ‘భల్లూక మాంత్రికుడు’ మాత్రం చిన్నప్పుడు చదివాను. అది మొత్తం బైండు చేసిన కాపీ కూడా మా ఇంట్లో ఉండేది. వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఉండే మేము (నేను, మా చెల్లెలు) సెలవుల్లో ఖమ్మంలోని మా మేనత్తగారింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళమ్మాయి దగ్గర ‘చందమామ’ చూసేవాళ్ళం. రంగులతో తళతళలాడే కొత్త కాపీని ముట్టుకుంటేనే జన్మ ధన్యమైనట్టు ఉండేది. జానపద సీరియల్ కింద రచయిత పేరు స్థానంలో ‘చందమామ’ అని ఉండేది కనుక, అసలు రచయిత పేరు తెలిసేది కాదు. కొ.కు గారివంటి గొప్ప రచయిత కూడా ‘చందమామ’లో పనిచేశారని చాలాకాలానికి తెలిసి అలాంటి పత్రికను చదవగలిగినందుకు గర్వంగా అనిపించింది. నేను డిల్లీలో ఉద్యోగంలో చేరిన తర్వాత కన్నడ, తమిళ, మళయాళ చందమామలు కొని ఆ భాషలు కొంతవరకూ నేర్చుకున్నాను.

ఈ ‘రచన’ ప్రత్యేక సంచిక చదవకపోయి ఉంటే, దాసరి సుబ్రహ్మణ్యం గారివంటి గొప్ప రచయితగురించి నాకు తెలిసి ఉండేది కాదు. ఆయన గురించి ప్రముఖులందరూ రాసిన వ్యాసాలు ఎంతో అపురూపంగా ఉన్నాయి. ఆ కథలను ఎంతగానో మెచ్చుకుని ఆసక్తిగా చదివిన మేము ఆ రచయిత ఎవరో ఇంతకాలంగా తెలుసుకునేందుకు ప్రయత్నించనందుకు ఎంతో సిగ్గుగా కూడా ఉంది. ఇంతకాలంగా ‘రచన’కు దూరంగా ఉండటంవల్ల ఇంకా ఇటువంటి ఎంతెంత విలువైన సమాచారం కోల్పోయానో అని బాధపడుతున్నాను. చిన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సీరియళ్ళు ‘చందమామ’లో చదివినందువల్లనేమో, కొందరు రాసినట్టు, హారీ పాటర్ నవలలుగాని, ‘అవతార్’ వంటి సినిమాలుగాని పెద్ద అద్భుతాలని అనిపించలేదు. వీలైనంతవరకూ పాత చందమామలన్నీ కొనేసి ఇంట్లో ఒక ర్యాక్ లో పెట్టేస్తే, పిల్లలు టి.వి. వైపు కన్నెత్తి కూడా చూడరనుకుంటాను.

పిల్లలకు మెదడు ఒక్కటే కాదు, మనసూ ఉంటుందని గ్రహించకుండా వాళ్ళను ‘చదువుల యంత్రాలుగా’ మారుస్తున్న మన ప్రస్తుత విద్యవిధానమంటే నాకు మొదటినుంచీ అసహ్యమే. వాళ్ళను మరింత అసహ్యకరమైన వినోద (?) కార్యక్రమాలకు బలికావించే టి.వి. చానెల్సు అన్నా, ఇప్పటి సినిమాలన్నా నాకు మరింత అయిష్టం. నాకే కనుక విద్యావిధానాన్ని నిర్ణయించే అధికారమిస్తే, నెలకో రోజు ‘చందమామ’ చదివే పీరియడ్ పెడతాను. మార్కులతో పనిలేకుండా, వాళ్లకు కొన్ని పాఠ్య అంశాలు ప్రవేశాపెడతాను. మంచి పుస్తకాలు చదివిస్తాను. మంచి చలన చిత్రాలు చూపిస్తాను. పరీక్షలకు బదులు వాటిగురించి చర్చ పెడతాను. జ్ఞానంతోపాటు పిల్లల్లో మనసూ, బుద్ధీ కూడా వికసించాలి. అప్పుడే వాళ్లకు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఏ చదువు చదివితే ఎంత సంపాదించవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తోంది మన ప్రస్తుత విద్యావిధానం. ఇది ఎటు వెళ్లి ఎటు తేలుతుందో అర్థం కాకుండా ఉంది. భాష, సాహిత్యం, కళలు అనేవి ఉపయోగంలేని వ్యాపకాలు అనే ధోరణి బాగా ప్రబలుతోంది. ఇది ముందు తరాలకు చాలా ప్రమాదం.

ఎన్నో వ్యాపార ఒడిదుడుకులను తట్టుకుని ‘రచన’ వంటి ఉత్తమాభిరుచులుగల పత్రికను ఇంతకాలంగా నిర్వహిస్తున్నందుకు మీకెలా అభినందనలు తెలియజేయాలో తెలియటంలేదు (‘ఆహ్వానం’, ‘హాసం’ వంటి పత్రికలూ ఈ పోటీ ప్రపంచంలో అంతరించిపోయాయి). త్వరలో మళ్ళీ ‘రచన’కు చందా కడతాను. మరెందరో దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అజ్ఞాత రచయితలు తెలుగు సాహిత్య లోకంలో ఉండవచ్చు. అటువంటి వారిని కూడా వెలుగులోకి తెస్తారని ఆశిస్తాను.
- మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ

M. Seshu,

ఈ వ్యాసం రాజశేఖర రాజుగారి బ్లాగు చందమామ చరిత్ర నుండి పున:ముద్రణ

1, మే 2010, శనివారం

విశేష రచనల ‘రచన’ తాజా సంచిక!

‘రచన’ ఇంటింటి పత్రిక మే నెల సంచిక నిన్న మార్కెట్లో విడుదలైంది.

‘చందమామ’లో చిరస్మరణీయమైన జానపద ధారావాహికలను రాసిన దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృతి సంచిక ఇది.

సంపాదకుడు శాయి గారి మాటల్లో-


‘.... అభిమానుల ఆలోచనలన్నీ అక్షరరూపంలో వరదగోదారిలా కట్టలు తెంచుకుని ప్రవహించసాగేయి. వాటన్నింటినీ ఒక ‘మాయా సరోవరం’లోకి చేర్చే ప్రయత్నమే ఈ స‘చిత్ర’ ప్రత్యేక సంచిక’.



ఈ విశేషాలు విహంగ వీక్షణంగా ఓసారి...


ముఖచిత్రమే పాఠకుల్ని విహంగ వీక్షణం చేయించే ‘చిత్రా ’ గీసిన అద్భుత వర్ణ చిత్రం! దానికి ‘అవతార్’ బొమ్మను జోడించి ఆర్టిస్టు అన్వర్ రూపుదిద్దిన ‘దాసరి సుబ్రహ్మణ్యం గారి జ్వాలాద్వీపంలో హాలీవుడ్’!


దాసరి గారు రాసిన 12 జానపద ధారావాహికల పరిచయాలూ, విశ్లేషణా; మంత్రనగరి సరిహద్దులను దాటించి, అపూర్వ కథా వీధుల్లోకి ఉత్కంఠభరితంగా ప్రవేశపెట్టే చిత్రా బొమ్మలూ అన్నీ ఒకే చోటే కనిపిస్తాయి.


ఇవే కాదు...


* దాసరి గారి వ్యక్తిత్వంపై, ఆయన రచనలపై ప్రత్యేక వ్యాసాలూ, స్మృతులూ.

* డిసెంబరు 1964లో ‘యువ’లో దాసరి గారు రాసిన ‘అంతా కనికట్టు’ కథ.

* దాసరి సుబ్రహ్మణ్యం కథా సంపుటి ‘ఇంద్రాణి’కి 1955 ఏప్రిల్ లో కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన పీఠిక.

* చందమామ ప్రేరణతో శాయి-చంద్ర గార్లు 42 ఏళ్ళ క్రితం రాసి, గీసిన ‘రాతి కత్తి’ బొమ్మల కామిక్ కథ!

* దాసరి గారు మిత్రులకు రాసిన ఐదు లేఖల ఫొటో కాపీలు యథాతథంగా‘ప్రముఖుల ఉత్తరాలు’ శీర్షికలో!

* ‘చిత్రా’ కాంతులూ, శంకర్ జ్ఞాపకాలూ.


* గళ్ళ నుడికట్టు ని ఇష్టపడే వారికి రెట్టింపు సంతోషం కలిగించే అదనపు ప్రత్యేక పజిలింగ్ పజిల్-‘మంత్ర తంత్ర వీరోచిత మాయా మర్కట దాగుడుమూతలు’!
పూర్తి చేసి పంపినవారికి ఓ అద్భుత జానపద నవల బహుమతి !


ఇంకా... మరెన్నో!


సాహితీ అభిమానులూ, చందమామ ప్రియులూ తమ మిత్రులకు కానుకగా ఇవ్వదగ్గ ఈ ప్రత్యేక సంచిక

వెల- రూ.50.

చిరునామా-

RACHANA Telugu Monthly 1-9-286/2/P Vidyanagar

Hyderabad – 500 044

ఈ -మెయిల్ : rachanapatrika@gmail.com

ఫోన్ : 040 – 2707 1500

మొబైల్ : + 99485 77517

వెబ్ సైట్ : www.rachana.net

చందమామ రాజు గారి ఈ బ్లాగు పోస్టు కూడా చూడండి!

26, ఏప్రిల్ 2010, సోమవారం

రచన శాయి గారికి అభినందనలతో

*******************************************************************************************************************************************************
దాసరి వారి మీది వేయబోతున్న ప్రత్యెక సంచిక నుండి కొన్ని పుటలను "టీజర్స్ లాగ" రచన శాయి గారు, "మన తెలుగు చందమామ" రచయితలందరికి పంపారు. అలా పంపటానికి కారణం, మేమందరమూ, ఆ ప్రత్యెక సంచికలో కొద్దో గొప్పో మా వంతుగా కొన్ని సమీక్షా వ్యాసాలు వ్రాయటమే. అలా పంపిన "టీజర్" పుటలను చూసి, అందరమూ ఎంతగానో సంతోషించాము. మాలో అందరికన్నా ఎక్కువ సంతోషం చూపటమే కాక, మా అందరి హృదయాలలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని, అభినందనలను రాజశేఖర రాజుగారు అద్భుతంగా వ్యక్తపరిచారు. చదవండి ఆయన మాటలలోనే

*******************************************************************************************************************************************************

డియర్ శ్రీ శాయి గారూ,
మీరు పంపిన, దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన ప్రత్యేక సంచిక -మే, 2010- వివరాల పీడీఎఫ్ ఫైల్అందింది. నిన్న సాయంత్రం నుంచి సిస్టమ్ నాకు అందుబాటులో లేదు. దీంతో వెంటనే మీకు మెయిల్పంపలేకపోయాను. ఇది ప్రశంస అనుకోండి. కృతజ్ఞత అనుకోండి. మీతో కొన్ని మాటలు పంచుకోవాలనిఉంది.

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు జనవరి చివరలో పోయాక ఆయనపై రచనప్రత్యేక సంచిక తీసుకురావాలనే ఆలోచనే మీకు రాకుండా ఉండి ఉంటే.. బాలసాహిత్యానికిసంబంధించినంతవరకూ ఓ గొప్ప తెలుగు పుస్తకం చరిత్రలో రికార్డుకు కూడా లేకుండా పోయేది. అందుకుచందమామ అభిమానులందరూ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీ ప్రకటన అందించిన ప్రేరణతో దాసరి గారిఅభిమానులు ఓరకంగా వీరావేశంతోనే పనిచేసి, పోటీలు పడి మరీ ఆయన రచనలపై, జీవితంపై తమకుతెలిసిన సమస్త సమాచారాన్ని ప్రోది చేసి పంపారు.

చందమామ వైభవోజ్వల స్వర్ణయుగానికి కారణభూతులైన మహనీయులలో దాసరి గారు ఒకరు. ఆయననుంచి 1980 వరకు విరామం లేకుండా చందమామ చరిత్రలోనే అజరామరమైన 12 ధారావాహికలను రాశారన్న విషయం కూడా దశాబ్దాల పాటు మరుగునపడింది. పత్రికకు తప్ప సిబ్బందికి, ఇన్ హౌస్ రచయితలకు ప్రాముఖ్యత కల్పించరాదన్న సంప్రదాయం చందమామది. ఈ పాలసీచందమామకు మేలు చేసినప్పటికీ చందమామ ధారావాహికల రచయిత ఎవరో ప్రపంచానికి తెలియకుండాచేసింది. కుటుంబరావుగారే చందమామలో పేరులేని ఎడిటర్గా దశాబ్దాలపాటు పనిచేశారనే విషయం చాలాకొద్దిమందికి మాత్రమే తెలుసు. 1954 ‌

ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు, ఇన్ని దశాబ్దాలకు... చందమామలో 54 ఏళ్లపాటు నిరవధికంగా పనిచేసిన ఓ గొప్పమనిషి జీవిత, కథాసాహిత్య వివరాలు రచన పత్రిక ద్వారా, కేవలం మీ ద్వారా ప్రపంచం ముందుకువస్తున్నాయి. సమస్త చందమామ అభిమానుల తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలుతెలుపుతున్నాను.

ప్రత్యేక సంచిక నిడివి పెరగడం, ఊహించిన దానికంటే సమాచారం ఎక్కువగా పోగుపడటం వంటి కారణాలతోరచన ఏప్రిల్ సంచిక ముద్రణను పక్కనపెట్టి కూడా మీరు దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం తీవ్ర కృషిచేశారు. ఒక నెల పత్రిక ముద్రణ నిలిచిపోయినా ఫర్వాలేదనే తెగింపే ఓ సాహసోపేత నిర్ణయం. 1998లోచందమామ తాత్కాలిక అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు తగిలిన దెబ్బనుంచి చందమామ ఇప్పటికీకోలుకోలేదు.

అందుకే మీ నిర్ణయం సాహసోపేతమైనది. దశాబ్దాలుగా తెలుగు వారి సాంస్కృతిక రాయబారిగా పనిచేసిన, చేస్తున్నచందమామ పత్రికపై అబిమానం, మమకారం హృదయంలో నిలుపుకున్నారు కాబట్టే మీరు ఇంతతెగింపుకు సిద్ధపడ్డారు. చంపి -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రియులు- లలో ప్రధమస్థానం మీదే అని గతంలోత్రివిక్రమ్ గారు ఓ సందర్బంలో అన్నారు. ఈ రకంగా కూడా అది నిజమైంది.

చందమామ చరిత్రకు తన ధారావాహికల ద్వారా మెరుగులు దిద్దిన గొప్ప మనిషికి 'రచన' పత్రిక ప్రత్యేకసంచిక నీరాజనం పలుకుతోంది. బహుశా దాసరి గారికి ఇంతకు మించిన నివాళి మరొకటి ఉంటుందనినేననుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన మొత్తం ఘనత మీదే అని మనస్పూర్తిగా చెబుతున్నా.

ఈ హారీ పోటర్లూ, అవతార్‌ల గురించి ప్రపంచానికి తెలీని రోజుల్లో చందమామ ధారావాహికల ద్వారా కోట్లాది మంది భారతీయ పిల్లలను, పెద్దలను జానపద మంత్ర నగరి సరిహద్దుల్లో ఓలలాడించిన గొప్ప కథకులు దాసరిగారు. దశాబ్దాలుగా మరుగున పడిన ఈయన మేటి కృషిని, తెరవెనుక నేపధ్యాన్ని రచన ప్రత్యేక సంచిక -మే,2010- ద్వారా ప్రపంచం తెలుసుకోనుంది.
చందమామ రచయిత రాసిన అన్ని ధారావాహికల పరిచయాలను, ఇతర వివరాలను ఒకే చోట చదివే అవకాశాన్ని చందమామ అభిమానులకు, పాఠకులకు కల్పించడం రచన పత్రిక వల్లే సాధ్యపడింది. 'మాకూ ఓ ప్రపంచ స్థాయి కథా రచయిత ఉన్నాడు' అని జబ్బలు చరిచి మరీ తెలుగువాళ్లు చెప్పుకునేలా సాగించిన ఓ అద్బుత కృషికి గాను మీరు గత రెండు నెలలుగా అలుపెరుగకుండా శ్రమించారు.
మీ సంకల్పబలం విజయవంతం కావాలని, ప్రతి చందమామ అభిమాని, పాఠకులు, జానపద కథల ప్రేమికులు ఈ ప్రత్యేక సంచికను అపురూపంగా దాచుకుంటారని ఆశిస్తున్నాను.

ప్రత్యేక సంచిక పది కాపీలను నేను రిజర్వ్ చేసుకున్నాను. మీకు ఎంఓ కూడా పంపాను. మే 2న ప్రత్యేకసంచిక విడుదలకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము.

ప్రపంచంలోని చందమామ ప్రేమికులందరి అభిమానం మీపై కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
రాజశేఖర రాజు

చందమామ

*******************************************************************************************************************************************************

మీరు కూడా ఈ ప్రత్యెక సంచిక ట్రైలర్ చూడదలుచుకున్నారా!
వెంటనే రచన వెబ్ సైటును దర్శించండి
రచన పత్రిక




16, ఏప్రిల్ 2010, శుక్రవారం

దాసరి స్మృతి సంచిక

అనేక రోజుల క్రితం ఎదురు చూడండి దాసరి సుబ్రహ్మణ్యం గారిమీద ప్రత్యెక సంచిక అని ఊరించానే కాని అసలు విషయం చెప్పలేదుకదూ. ఇప్పుడు చెబుతున్నాను, వినండి.

మనకున్న ఏకైక సాహిత్య పత్రిక "రచన". ఈ పత్రికను నెలకొల్పి ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఒక ఉద్యమం లాగ ప్రచురిస్తున్న వారు వై, వి ఎస్ ఆర్ ఎస్ తల్ప శాయిగారు, సాహిత్య అభిమానులందరికీ "రచన" శాయిగా సుపరిచితులు.

రచన పత్రిక గురించి వివరాలు చూడాలంటే వారి వెబ్ సైటు చూడాల్సిందే. ఈ కింది లింకు నొక్కండి.

రచన పత్రిక

ఈయన కూడ మన "పాత" చందమామకు ఉన్న అనేకానేక వేల అభిమానులలో ఒకరని ఈ మధ్యనే తెలిసింది. ఆయన దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి ప్రత్యెక సంచిక వెయబోతున్నట్టుగా నాకు మన "సురేఖ" అప్పారావుగారు ( రేఖా చిత్రం బ్లాగ్) చెప్పారు. అప్పుడు మిమ్మల్ని అందరినీ "ఎదురు చూడండి" అని ఊరిస్తూ ఇదే బ్లాగులో దాసరి వారి బొమ్మాక్షరాలు కూడ జతపరుస్తూ ప్రకటించాను.

కాని
నేను కలలో కూడ అనుకోలేదు, ఆ ప్రత్యెక సంచికలో నా సమీక్షా వ్యాసం, మరికొన్ని "చిత్రాలూ" కూడ ప్రచురించబడతాయని.

"
మన తెలుగు చందమామ" రచయితలందరినీ పేరు పేరునా మైళ్ళు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద వ్రాయమని చెప్పారు. అంతకంటే ఆనందం ఏమున్నది, వేయబోతున్న ప్రత్యెక సంచిక మన అభిమాన జానపద కథా బ్రహ్మ, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి. వెనువెంటనే అందరం నడుం బిగించి, మాకు చేతనైనంత వరకూ వ్రాసి పంపాము. ఇలా ఈ బ్లాగు రచయితలే కాకుండా మొత్తం ౩౦ మంది అభిమానులు దాసరి వారి గురంచి వ్రాసారుట.

నాకు తెలిసి ఒక రచయితకు నివాళిగా ఒక ప్రత్యెక సంచిక ఆ రచయిత అభిమానులు వ్రాసిన రచనలతో నింపి వేయటం ఇదే ప్రధమం అనుకుంటాను.అందుకే ఈ ఆనందం. మీ అందరితో పంచుకోవాలని.
షరా మామూలే!! పైనున్న అక్షరాలను "క్లిక్" చేసి చూడండి గమ్మత్తుగా!!

కాబట్టి, ఇక వేచి చూడాల్సిన సమయం ఎంతో లేదు. మరో కొన్ని రోజులేనట , శాయిగారు ఈరోజే మెయిలు ఇచ్చి మరీ హెచ్చరించారు. కాబట్టి..........

త్వరలో ............... అతి త్వరలో..............

మన అభిమాన రచయిత దాసరి సుబ్రహ్మణ్యంగారి ప్రత్యెక సంచిక విడుదల మే రెండవ తారీకుకల్లా టపాలో వేస్తారుట.

అదే!! తగిన పైకం ముందుగా పంపినవారికి మాత్రమె.... మిగిలిన వారు కోట్లల్లో "దొరికితే" కొనుక్కోవలసిందే.... లేకపోతె మిగిలేది ఆశాభంగమే కదా మరి!!!!

వివరాలకు ఈ కింది బొమ్మ నొక్కి తెలుసుకోగలరు


11, మార్చి 2010, గురువారం

త్వరలో ............ త్వరలో......... వేచి చూడండి దాసరి గారి కోసం





వేచి చూడండి..................తప్పదు వేచి చూడాల్సిందే........................

అతి కొద్ది రోజులలో

జానపద కథా బ్రహ్మ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రత్యెక సంచిక

మనకున్న ఏకైక సాహిత్య పత్రిక

రచనలో


పైన దాసరి సుబ్రహమణ్యం గారి ఇంటి పేరును, అసలు పేరును విడి విడిగా క్లిక్ చేసి చూడండి.
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
***
*
చూశారా!! ధన్యవాదాలు






*








7, మార్చి 2010, ఆదివారం

దాసరి సుబ్రహ్మణ్యం రచన ప్రత్యెక సంచిక

దాసరి సుబ్రహ్మణ్యం గారి చందమామ సీరియల్స్ పై ‘రచన’ పత్రికలో విశ్లేష వ్యాసాలు రాసే అంశంపై తాజా సమాచారం…..

తోకచుక్క (Jan-54-June-55 ) -శ్రీ దాసరి వెంకటరమణ
మకరదేవత
(July-55-Decem 56) -శ్రీ కొడవటిగంటి రోహిణి ప్రసాద్
ముగ్గురు మాంత్రికులు
(Jan-57-June 58) శ్రీ చొక్కాపు వెంకట రమణ
కంచుకోట (July-58-Dec-59) -శ్రీ ఫణి (బ్లాగాగ్ని)
జ్వాలాద్వీపం
(Jan-60-June-61) -శ్రీ రచన శాయి
రాకాసిలోయ
(July-61-May-64) -శ్రీమతి లక్ష్మీగాయత్రి
పాతాళదుర్గం
(May-66 -Dec-67) -రాజశేఖర రాజు
శిథిలాలయం
(Jan-68 -Sept-70 -శ్రీ శివరామ ప్రసాద్ కప్పగంతు
రాతిరథం
(Oct-70 -April-72) -శ్రీ వేణు
యక్షపర్వతం
(May-72-June-74) -శ్రీ వేణు
మాయా సరోవరం
(Jan-76-June-78) -శ్రీమతి సుజాత
భల్లూక మాంత్రికుడు
(July-78-April-80)-
శ్రీ ఎం. వి. వి.సత్యనారాయణ

(వీటిలో శ్రీమతి లక్ష్మీగాయత్రి గారు ‘రాకాసిలోయ’ సీరియల్‌పై, శ్రీ రోహిణీ ప్రసాద్ గారు ‘మరకదేవత’పై రాసి పంపిన వ్యాసం ఇప్పటికే అందింది.)

సేరియల్స్ పై విశ్లేషణ రాసేముందు గమనించ వలసిన అంశాలు:

క్లుప్తంగా కథా,
శ్రీ సుబ్రహ్మణ్యం గారు సంఘటనలతో కథను నడిపించిన విధానం.
పాత్రలు- తీరు తెన్నులు ,
చదివింప చేసే అంశాలు ,
అంతర్లీనంగా అందచేసిన సందేశం
మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోగలరు.

మీ వ్యాసం నేరుగా శ్రీ రచన శాయి ( cell no 9948577517 ) rachanapatrika@gmail.com
గారికి ఈ నెల మార్చి పది లోగా పంపగలరు. సత్వరమైన మీ స్పందన గురించి ఎదురు చూస్తూ…….సెలవు .

PS; క్లుప్తత: చందమామ కథల విశిష్ట ప్రత్యేకత. దానిని దృష్టిలో వుంచుకొని మీ వ్యాసం అచ్చులో నాలుగైదు పేజీలు మించకుండా జాగ్రత్త పడగలరు. వ్యాసం యూనికోడ్ లోను మరియు పిడిఎఫ్ ఫైలు రెండింటి ద్వారా పంపగలరు.
–
Dasari Venkata Ramana
General Secretary,
Bala Sahitya Parishattu,
5-5-13/P4, Beside Sushma Theatre,
Vanasthalipuram, HYDERABAD – 500070.
04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

పాత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

‘రచన’లో దాసరి సుబ్రహ్మణ్యం గారి ధారావాహికలు


ఈ వివరాలు రాజశేఖర రాజుగారు బ్లాగునుండి ఇక్కడ ప్రచురించబడినాయి.

శివ చెబుతున్నది
ఈ వ్యాసాలు చూడాలంటే రచన ప్రత్యెక సంచిక వచ్చేదాకా ఆగాలి తప్పదు








6, ఫిబ్రవరి 2010, శనివారం

దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక సంచిక "రచన " మార్ఛి


"రచన" మార్ఛి '10
దాసరి సుబ్రహ్మణ్యం ప్రత్యేక సంచికగా హైదరాబాదు నుండి
వెలువడే "రచన" మాస పత్రిక మార్ఛి నెలలో తీసుకొని
వస్తున్నది.సుబ్రహ్మణ్యం గారి అభిమానులు కలకాలం
పదిలపర్ఛుకోవల్సిన పత్రిక.ఇదివరలో చక్రపాణి గారి పై
"రచన" ప్రత్యేక సంచిక చందమామలోని అమూల్య
చిత్రాలతో, చక్రపాణి గారి పై ప్రత్యేక రచనలతో వెలువరించింది.





ఈ సమాచారాన్ని ఇచ్చినవారు ప్రముఖ చందమామ అభిమాని, ప్రముఖ కార్టూనిస్టు సురేఖ (మట్టెగుంట అప్పారావు గారు, రాజమండ్రి)
వారికి మా ధన్యవాదములు