26, జూన్ 2009, శుక్రవారం

ప్రహ్లాద చరిత్ర చందమామ ధారావాహిక


ప్రహ్లాద చరిత్ర మనకందరకు తెలిసిన పురాణ గాధ. ఈ కథను చందమామ వారు 1964వ సంవత్సరంలో ధారావాహికగా నాలుగు భాగాలుగా ప్రచురించారు. ఈ ధారావాహికకు వెనుక అట్ట మీద బొమ్మలు ప్రముఖ చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు వేశారు. లోపల కథకు బొమ్మలు పురాణ గాధలకు బొమ్మలు వెయ్యటం లో పేరొందిన శ్రీ శంకర్ గారు వేసారు. అట్టమీద బొమ్మలు ఈ ధారావాహికకు ప్రముఖ ఆకర్షణ. ఈ ధారావాహికను, అట్టమీద బొమ్మలతో సహా మీ కందరికీ అందించటం చాలా సంతోషంగా ఉన్నది. ఈ ధారావాహికను మీ కంప్యూటర్ లోకి దింపుకోవటానికి ఈ కింది లంకెను ఉపయోగించండి.
http://rapidshare.com/files/248708347/PRHLADA_CHARITRA.pdf.html


ప్రహ్లాద చరిత్ర  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013
శివరామప్రసాదు కప్పగంతు బెంగుళూరు, భారత్

19, జూన్ 2009, శుక్రవారం

శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి అద్భుత వెబ్ సైటు



తెలుగులో మన భారత రామాయణ ఇతిహాసాలను ఇక చెప్పేవారెవరు అని ప్రజలు తరచి చూసుకుంటున్న తరుణంలో, శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు మనందరి భగవత్ ప్రార్ధనల ఫలితంగా ఈ పురాణేతిహాసాలను అనర్గళంగా మనందరికీ అర్ధమయ్యే విధంగా చక్కటి సరళమైన తెలుగులో చెప్పటానికి మనముందుకొచ్చారు. వారి పురాణ ప్రవచనాలు విని "ఆహా" అననివారు లేరు. అలా అనలేనివాడు మనిషేకాడు. నేను ముంబాయిలో ఉండగా రోజుకు రెండు గంటల రైలు ప్రయాణం పొద్దున్న మరియు సాయంత్రం కలిపి. అదృష్టవశాన అంధేరి నుంచి చర్చ్ గేటు స్టేషనుకు ప్రయాణం కావటాన వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు కూడ నాక్కావాలిసిన సీటు దొరికేది. అలా ప్రయాణించేప్పుడు, నాకెంతో ప్రియతమ నేస్తం, మన చాగంటివారు. వారి ప్రవచనాలు వింటో (నా మ్యూజిక్ ప్లెయర్ సహాయంతో) పరవశించి పోతో ప్రయాణ బడలిక పోగొట్టుకోవటం ఒక అతి చిన్న ఉపయోగమైతే, మనపురాణాలలోని ధర్మ సూక్ష్మాలు, మనకు తెలియని విశేషాలు తెలుసుకోవటం అసలైన ఆనందకరమైన అనుభవం. నెట్లో ఈరోజున చాగంటివారి వెబ్ సైటు చూడటం జరిగింది. ఆ వెబ్ సైటులో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి!



ఈ లంకె ద్వారా ఆ వెబ్ స్వర్గానికి వెళ్లి తెలుసుకోండి.

16, జూన్ 2009, మంగళవారం

వడ్డాది పాపయ్యగారి అద్భుత చిత్రాలు

వడ్డాది పాపయ్య గారు ఒక అద్భుతమైన చిత్రకారుడు. ఆయన వేసిన అనేక వందల చిత్రాలు చందమామ చదువరులను ఎంతగానో అలరించాయి. ఆ మహా చిత్రకారుడు అరణ్యపురాణం ధారావాహికకు వేసిన అట్టమీద బొమ్మలను కొన్నిటిని (దొరికినంతవరకు) ఒక ఆల్బంగా తయారు చెసాను. బొమ్మలన్నిటిని ఫొటో ఏడిటర్లో మరొక్కసారి డిజిటైజు చేసి రంగులు చాలావరకు పునరుధ్ధరించటం జరిగింది. చందమామ చదువుతున్న అనుభూతి కలగటానికి చక్కగా పుటలు తిప్పటానికి వీలున్నది. కుడిపక్కన కింద చివర మౌసె తో క్లిక్ చెయ్యగానే మనం మామూలుగా పేజీ తిప్పినట్టుగానే పుటలు తిరిగి అన్ని చిత్రాలు చూపబడతాయి . ఈ కింద ఇచ్చిన లంకెతో ఈ ఫైలును మీ కంప్యూటర్లోకి దింపుకొనవచ్చును. డౌన్లోడ్ అయినతరువాత ఆ ఫైలును డబుల్ క్లిక్ చెయ్యటమే తరువాయి కనువిందవుతుంది. ఆనందించండి.

http://rapidshare.com/files/258667425/ARANYAPURANAM_VAPA_BOMMALU.EXE

వడ్డాది పాపయ్య గారి బొమ్మల మీద  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామల అట్టలమీద వారు వేసిన బొమ్మలను చోడవచ్చు.  ఆశగా ఈ  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

సాంప్రదాయ మంగళ హారతులు

నా చిన్నతనంలో మంగళ హారతులు తరచూ వినేవాళ్ళం. ఇంట్లో ఎ కార్యక్రమం వచ్చినా పేరంటం జరిగినా చక్కగా పాటలు పాడే వాళ్లు. ప్రస్తుతం పేరంటాలు కనుమరుగయ్యాయి, మంగళ హారతులు పాడేవాళ్ళు పాడగలిగినవాళ్ళు తగ్గిపొయ్యారు. ఆ పాతకాలపు జ్ఞాపకాలకోసం ఈ కింద ఒక లంకె ఇస్తున్నాను . శ్రీమతి బి. సరోజినీ మూర్తి గారు పాడిన మంగళ హారతులు వినవచ్చు. మీ కప్యూటర్లో రియల్ ప్లేయర్ ఉంటేనే ఈ పాటలు వినగలరు.

http://mysite.verizon.net/res1wgre/sarojini.html

14, జూన్ 2009, ఆదివారం

అల్లాదిన్ అద్భుత దీపం




మనందరికీ తెలిసిన కథ అల్లాదిన్ అద్భుత దీపం. ఈ కథను చందమామలో ఎభైవ దశకంలో దారావాహిమకగా వేసారు . ఇది పది భాగాల ధారావాహికం.రచన బి ప్రసాద  రావు గారు . అల్లాదిన్ కథ చైనాకు చెందినదట అందుకని బొమ్మలన్నీ చైనా వాళ్ళతో నింపేశారు చిత్రా గారు.కథకి అనుగుణంగా బొమ్మలు వెయ్యటం చందమామ ప్రత్యేకత. ఈ కింది లంకె నుండి దింపుకుని ఆనందించండి.
http://rapidshare.com/files/261027480/ALLADIN___ADBHUTA_DEEPAM_KSRP.pdf

అల్లా ఉద్దీన్ అద్భుత దీపం  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

అలీ నూర్ ; అలీ బాబా; మాయా వర్తకుడు

చందమామలో అనేకానేక చిన్న చిన్న ధారవాహికలు వేశారు. అవన్నీ విడివిడిగా ఇవ్వటం అంత సులుగా అనిపించక, అలాంటి కొన్ని చిన్న ధారావాహికల్ను కొన్నిటిని కలిపి ఒకే పి డి ఎఫ్ కింద ఇద్దామని నిర్ణయించుకున్నాను. మొదటి విడతగా:
అలీ నూర్ రచన శ్రీ ఎస్ ధర్మా రావు
ఆలీబాబా రచన శ్రీ ఆర్ సూర్యనారాయణ
మాయా వర్తకుడు రచన శ్రీ ఎ నారాయన శర్మ
ఇస్తున్నాను. ఈ ధారావాహికలన్నీ కూడ 1957-58 లో ప్రచురితమైనవి . చందమామ అభిమానులు ఈ కింది లంకె నుండి మీ కంప్యూటర్లోకి దింపుకోవచ్చును.

http://rapidshare.com/files/260183111/ALINOOR_ALIBABA_MAYAVARTAKUDU_KSRP.pdf

ఆలీ నూర్, ఆలీ బాబా, మాయా వర్తకుడు ధారావాహికల  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013



ఆలీబాబా దారావాహికని మళ్ళి పందోమ్మేదవందల డెబ్బై లలో ప్రచురించటం జరిగింది.

12, జూన్ 2009, శుక్రవారం

ఆలీబాబా 40 దొంగలు

నా చిన్నతనంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన అరేబియా జానపద కథ ఆలీబాబా 40 దొంగలు. ఈ కథను చందమామ వారు 1970లలో ధారావాహికగా ప్రచురించారు. ఈ ధారావాహిక పి డి ఎఫ్ ఫైలును ఈ కింది లింకునుండి మీ కంప్యూటర్లోకి దింపుకోవచ్చును.

http://rapidshare.com/files/243796483/ALIBABA_40_DONGALU_KSRP.pdf

ఆలీబాబా 40 దొంగలు  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

శివరామప్రసాదు కప్పగంతు

మాయదారి ముసలిది





చందమామలో అనేక చిన్న చిన్న ధారావాహికలు ప్రచురించారు. వాటిలో శ్రీ ఆర్ నాగభూషణం గారు రచించిన మాయదారి ముసలిది ఆరు వారాలపాటు ప్రచురించబడి చదువరులను ఆకట్టుకుంది. ఈ ధారావాహికను మీకందరికీ అందించటం నాకెంతో సంతొషంగా ఉన్నది. ఈ కింద ఉన్న లింకులో ఈ ధారావాహికను మీ కంప్యూటర్ లోకి దింపుకోవచ్చు.

http://rapidshare.com/files/260630867/MAYADARI_MUSALIDI_KSRP.pdf

మాయదారి ముసలిది  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

10, జూన్ 2009, బుధవారం

అరణ్య పురాణం చందమామ ధారావాహిక

ప్రియమైన చందమామ అభిమానులారా!
నాకెంతో ఇష్టమైన చందమామ ధారావాహిక (శిధిలాలయం తరువాత) అరణ్య పురాణం. ఈ ధారావాహికను చందమామలో 1966-1969 సంవత్సరాల మధ్య ప్రచురించబడినది. ఈ ధారావాహికను ఒక్కటే పి డి ఎఫ్ ఫైలుగా చందమామ అభిమానులందరికీ అందిచగలిగిన అదృష్టం కలిగినందుకు సంతోషిస్తున్నాను ఈసారి, ధారావాహికకు ముఖచిత్రం కూడ ఏర్పరిచాను. ఈ ధారావాహికకు శ్రీ వడ్డాది పాపయ్య గారు అద్భుతంగా బొమ్మలు వేశారు. వారు వేసిన బొమ్మలన్నిటిని, ధారావాహిక చివర పొందుపరిచాను. మీరు ఈ ధారావాహికను ఈ కింద ఉదహరించిన లంకె నుండి మీ కప్యూటర్లోకి దింపుకోవచ్చును.
http://rapidshare.com/files/243078608/ARANYA_PURAANAM_KSRP.pdf

అరణ్యపురాణం   ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు భారత్

7, జూన్ 2009, ఆదివారం

సిందుబాదు యాత్రలు చందమామ ధారావాహిక

ప్రియ చందమామ అభిమానులారా!

ఫణికుమార్ (బ్లాగాగ్ని) చందమామ అభిమానులకు చేస్తున్న సేవ చూసి , నా వంతు కృషిగా సిందుబాదు యాత్రలు చందమామ ధారావాహికను ఒకే ఫైలుగా తయారు చేశాను. ఈ కింద ఇచ్చిన లంకె ద్వారా మీ కంప్యూటర్ లోకి దిమ్పుకోవచ్చును. ఇది తయారు చెయ్యటానికి సహకారం ఆడించిన బ్లాగాగ్నికి నా ధన్యవాదములు.

http://rapidshare.com/files/241774209/SINDBAD_YAATRALU.pdf.html

సిందుబాదు యాత్రలు ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

ఈ ధారావాహిక చందమామ పత్రికలో నవంబరు ౧౯౬౯న మొదలయ్యి మే ౧౯౭౦ లో అయిపోయింది. ఏడు భాగాలుగా ప్రచురించారు. ఇప్పుడు మీకు ఒకే భాగంగా అందిస్తున్నాను.

శివరామప్రసాడు కప్పగంతు
బెంగుళూరు, భారత్