అవసరం ఉన్నా లేక పోయినా ప్రతి ఉత్పత్తిదారు, చివరకి మధ్య దళారులు కూడా ఎక్కడ పడితే అక్కడే ప్రకటనలను గుప్పించటం, ఒకటో రెండో గీతాలు గీసేసి వాటిని బ్రాండ్ అన్న పేరుతొ మనకు కలల్లో కూడా అవ్వే వచ్చేట్టుగా చెయ్యటం . ఏమన్నా అంటే "Top of Mind Awareness" ట, అంటే ఎల్లాప్పుడూ వాళ్ళ బ్రాండే మనకు గుర్తుకు రావాలని ప్రతివాడి తాపత్రయం.
చివరకు జరిగేది ఏమిటి. తామర తంపరలా పెరిగిపోయిన ఈ వ్యాపార ప్రకటనలు, రోడ్ల మీద, రేడియోలో, టి విల్లో సరే సరి, డివైడర్ల మీద, పత్రికల్లో , మాగాజైన్లల్లో, రైలు పెట్టెల మీద, ఇలా ఎందెందు వెదికిన అందే కలదు ఈ ప్రకటనా గరళం. మనల్ని తోచుకోనివ్వకుండా వెంటాడి వెంటాడి ఏమైనా సరే వాళ్ళు చెప్పిన వస్తువుల్ని కోనేట్టుగా ప్రేరేరింప చెయ్యటమే ఈ ప్రకటనల ముఖ్య ఉద్దేశ్యం.
మనచేత ఈ కాలుష్యాన్ని (శబ్ద, చిత్ర అంతకంటే ప్రమాదకరమైన మానసిక కాలుష్యం) మనకు తెలియకుండానే మన మస్తిష్కాల్లోకి మెల్లి మెల్లి గా (like slow poison) ఎక్కిస్తున్నది ఈ వ్యాపార ప్రకటనల మాఫియా.
ఈ మధ్య ఒక ప్రకటన టి విల్లో తెగ గుప్పిస్తున్నారు. అందులో ఒక బేవార్సు గాడు కార్లో దిగి పనికి రాని చెత్త డైలాగు వల్లిస్తూ, అక్కడే బస్ స్టాప్ లో ఉన్న అమ్మాయిని తన సెల్ ఫోన్ లో ఫోటో తియ్యబోతాడు. ఆ ఫోటో సరిగ్గా రాదు. అప్పుడు ఈ యాడ్ హీరో వచ్చి దీంట్లో తీసుకో అని తన దగ్గర ఉన్న సెల్ ఇవ్వబోతాడు. ఇది ఆ సెల్ ఫోన్ కొనమని చెప్పే వ్యాపార ప్రకటన తీరు. ఇటువంటి యాడ్ల వల్ల చిన్న పిల్లలకు ఏ విధమైన సందేశం వెళ్తున్నది అన్న జ్ఞానం అటు యాడ్ చేసినవాడికీ లేదు, ఇటు చూపించే టి వి వాళ్ళకూ లేదు . ఇది ప్రస్తుతం ఈ యాడ్ మాఫియా తీరు.
వెబ్ సైట్లల్లో "స్టంబ్లింగ్" చేస్తుంటే, విమియో వారి సైట్లో ఒక లఘు చిత్రం కనపడింది.16 నిమిషాల నిడివి ఉన్నఈ చిన్న కార్టూన్ చిత్రంలో కథలాంటిది ఉన్నది కాని, ఆ సినిమా తీసినవాళ్ళ ఉద్దేశ్యం, ఈ రోజున బ్రాండ్ పిచ్చిఎంత వేలంవెర్రి దశకు చేరిందో చూపటం లాగ ఉన్నది. ఈ వ్యాసం మొదట్లో ఉన్న బొమ్మ ఈ సినిమాలోదే. సినిమా జరుగుతున్నంతసేపూ రకరకాల బ్రాండ్స్ వాటిబొమ్మల మయం ఎక్కడా చూసినా. చివరకి ఈ ప్రకటనా కాలుష్యం వల్ల మానవ జాతి మానసిక ఆరోగ్యానికేప్రమాదం వాటిల్లేట్టుగా ఉన్నది.
పై సినిమా కాన్స్ సినిమా ఉత్సవంలో కూడ ప్రదర్శించారుట. ఈ సినిమా చూడాలంటే ఓపికగా బఫరింగ్ అయ్యేదాగా వేచి ఉండాలి.
ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనలను తప్పనిసరిగా నియంత్రించి కట్టడి చెయ్యకపోతే, మనం కొనుక్కునే వస్తు, సేవల ధరలు పెరగటమేకాక, మానసిక వైద్యులకు గిరాకీ కూడ పెరిగిపొయ్యేఅవకాశం బాగా ఉన్నది.
***
**
*
**
*
ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనలను తప్పనిసరిగా నియంత్రించి కట్టడి చెయ్యకపోతే, మనం కొనుక్కునే వస్తు, సేవల ధరలు పెరగటమేకాక, మానసిక వైద్యులకు గిరాకీ కూడ పెరిగిపొయ్యేఅవకాశం బాగా ఉన్నది------------not possible to any govt bcz they r the main source of party funds.
రిప్లయితొలగించండి@astrojoyd
రిప్లయితొలగించండిఅలా నిస్పృహ చెందితే ఎలాగండీ. మనకు కలిగిన బాధ గురించి చెప్పుకోవాలి. మనలాగా ఆలోచించే వారిని కూడగట్టుకోవాలి, ఇటువంటి సామాజిక జాడ్యానికి మందు పడేట్టుగా చూడాలి. ఏదైనా సమస్యగా ముందు మనం గుర్తిస్తే కదా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే ఆవకాశం ఉన్నది! అది సమస్యే కాదు అని (people with vested interests) ఎద్దేవా చెయ్యచ్చు కొంతమంది అవివేకులు, చేయ్యనీగాక. కాని మనకు నచ్చని వాటి గురించి మన నిరసన వ్యక్తం చెయ్యటానికి బ్లాగ్ బాగా పనికోస్తున్నది.