అద్భుత నటుడు CSR గారితో కలిసి ఫొటో తీయించుకునే అదృష్టం దక్కలేదు కానీ, వారబ్బాయి నటరాజ ప్రభు, మనవడు కిరణ్ గార్లతో ఈ మధ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుటి ఫొటో తీయించుకోగలిగాను. మొదట Kiran Csr Chilakalapudi గారితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం. వారు మా ఇంటి పక్క వీధిలో ఇల్లు కొనుక్కున్న తరువాత, మార్ణింగ్ వాక్ సహాధ్యాయి. కిరణ్ గారి ద్వారా వారి తండ్రిగారు పరిచయం. అలా పరిచయం పెరిగి ఈ సమాచారం మితృలు Subrahmanyam Kvs వారి సతీమణి Jayanthi Puranapanda గార్లకు తెలియచేయటంతో వారి YouTube చానల్ Vyus.in ద్వారా వారి అద్భుత ఇంటర్వ్యూల పరంపరలో సిఎస్సార్ గారబ్బాయి నటరాజ ప్రభు గారితో ఇంటర్వ్యూ చెయ్యటంతో మహానటుడు, అద్భుత గాయకుడు అయిన చిలకలపూడి సీతారామాంజనేయులు (CSR)గారి గురించిన విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం అలనాటి అభిమానులకు ప్లస్ ఇప్పటి తరానికి కలిగింది.
ఆ ఇంటర్వ్యూకు లింకు
https://www.youtube.com/watch?v=7wN0KKmwAVI
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.