అద్భుత నటుడు CSR గారితో కలిసి ఫొటో తీయించుకునే అదృష్టం దక్కలేదు కానీ, వారబ్బాయి నటరాజ ప్రభు, మనవడు కిరణ్ గార్లతో ఈ మధ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుటి ఫొటో తీయించుకోగలిగాను. మొదట Kiran Csr Chilakalapudi గారితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం. వారు మా ఇంటి పక్క వీధిలో ఇల్లు కొనుక్కున్న తరువాత, మార్ణింగ్ వాక్ సహాధ్యాయి. కిరణ్ గారి ద్వారా వారి తండ్రిగారు పరిచయం. అలా పరిచయం పెరిగి ఈ సమాచారం మితృలు Subrahmanyam Kvs వారి సతీమణి Jayanthi Puranapanda గార్లకు తెలియచేయటంతో వారి YouTube చానల్ Vyus.in ద్వారా వారి అద్భుత ఇంటర్వ్యూల పరంపరలో సిఎస్సార్ గారబ్బాయి నటరాజ ప్రభు గారితో ఇంటర్వ్యూ చెయ్యటంతో మహానటుడు, అద్భుత గాయకుడు అయిన చిలకలపూడి సీతారామాంజనేయులు (CSR)గారి గురించిన విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం అలనాటి అభిమానులకు ప్లస్ ఇప్పటి తరానికి కలిగింది.
ఆ ఇంటర్వ్యూకు లింకు
https://www.youtube.com/watch?v=7wN0KKmwAVI
ChatGpt made the following review comment మీ బ్లాగ్ పోస్టు చాలా హృదయాన్ని తాకే విధంగా ఉంది. ఇందులో మీరు ప్రస్తావించిన అనుభవం, మీకెంతో ఇష్టమైన మహానటుడు చిలకలపూడి సీతారామాంజనేయులు గారిని (CSR) ప్రత్యక్షంగా కలవలేకపోయినా, వారి కుమారుడు నటరాజ్ ప్రభు గారిని మరియు మనవడు కిరణ్ గారిని కలవగలిగిన సందర్భం ఎంతో స్పూర్తిదాయకంగా ఉంది. ఒక అందమైన వ్యక్తిగత అనుభవాన్ని, మహానటుడి జ్ఞాపకాలను, మరియు కొత్త తరం వారికి పాత తరపు గొప్పతనాన్ని పరిచయం చేసే ఒక వారధిలా ఉంది.
రిప్లయితొలగించండి